కరోనావైరస్: ట్విటర్‌లో #ShameOnBCCI ట్రెండింగ్, ఎందుకు?

ఫొటో సోర్స్, GETTY IMAGES
ప్రపంచంలోని చాలా దేశాలతోపాటూ భారత్‌లో కూడా కరోనావైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ దాదాపు 900 కరోనావైరస్ పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఈ వైరస్ వల్ల 25 మంది మృతిచెందారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీని వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశంలో 21 రోజుల లాక్‌డౌన్ ప్రకటించారు.
లాక్‌డౌన్ సమయంలో ప్రజలు తమ ఇళ్ల నుంచి బయటికి రావద్దని సూచించారు.
కానీ దేశంలో ఇంట్లో ఉండి తలుపులు వేసుకునే అవకాశమే లేని ఇళ్లులేని నిరుపేదలు, కూలీలు భారీ సంఖ్యలో ఉన్నారు.
పొట్టచేతబట్టుకుని మహానగరాలకు వచ్చిన వారంతా, ఇప్పుడు చాలా ప్రమాదకరమైన ఈ పరిస్థితిలో తిరిగి తమ సొంత ఊళ్లకు వెళ్లాల్సి వస్తోంది.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ప్రమాదకరంగా పరిస్థితి
మొత్తంగా చూస్తే, ప్రస్తుత పరిస్థితి చాలా సున్నితంగా, ప్రమాదకరంగా ఉంది. ఈ పరిస్థితిలో కరోనాతో పోరాటం కోసం దేశానికి చేతనైనంత సాయం చేయాలని కేంద్ర ప్రభుత్వం అందరికీ పిలుపునిచ్చింది.
కొందరు పారిశ్రామికవేత్తలు, బాలీవుడ్ నటుల నుంచి ఆర్థికసాయం అందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే, వీటన్నిటి మధ్యా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్(బీసీసీఐ) ప్రజల ఆగ్రహానికి, విమర్శలకు గురవుతోంది.
ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెట్ సంస్థగా భావించే బీసీసీఐ ఆర్థిక సాయం అందించడానికి ఎలాంటి చర్యలూ తీసుకోలేదని సోషల్ మీడియాలో జనం ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీనిపై ఫేస్‌బుక్, ట్విటర్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ లో తీవ్రంగా చర్చ జరిగింది. ట్విటర్‌లో #ShameOnBCCI ట్రెండ్ అవుతోంది.

ఫొటో సోర్స్, Twitter
సోషల్ మీడియాలో ఆగ్రహం
విపిన్ త్రిపాఠీ అనే ట్విటర్ యూజర్ చాలామంది క్రికెటర్లను ట్యాగ్ చేస్తూ “కోట్లు సంపాదించే ఆ క్రికెటర్లంతా ఇప్పుడు ఎక్కడున్నారు. ఇళ్లలో కూచుని ఎంజాయ్ చేస్తున్న ఈ సంపన్నుల కంటే, పేదలు మేలు. తమ సామర్థ్యానికి తగ్గట్టు విరాళాలు అందిస్తున్నారు. మీకు కాస్తైనా సిగ్గు అనేది ఉంటే, ముందుకు రండి” అని పోస్ట్ చేశారు.
అయితే, ఆ తర్వాత బీసీసీఐ కార్యదర్శి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనయుడు జయ్ షా ట్విటర్‌లో కరోనాపై పోరాటం కోసం బీసీసీఐ 51 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నట్టు ప్రకటించారు. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఈ నిర్ణయం తీసుకోవడంలో బీసీసీఐ ఇంత జాప్యం ఎందుకు చేసిందని కూడా ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమైంది.
కొంతమంది 51 కోట్ల రూపాయలు చాలా తక్కువ మొత్తం అంటున్నారు. అది బీసీసీఐ స్థాయికి తగ్గట్టు లేదని అంటున్నారు.

ఫొటో సోర్స్, Twitter
ఆనంద్ దవే అయితే ఒక మీమ్ ద్వారా బీసీసీఐపై సెటైర్ వేశారు.

ఫొటో సోర్స్, Twitter
@A Logical Indian పేరుతో ఉన్న ట్విటర్ హ్యాండిల్ “సిగ్గుండాలి బీసీసీఐ. వీరికి బుద్ధి చెప్పాలంటే, క్రికెట్‌ను, క్రికెటర్లకు బహిష్కరించాలని నేను భారతీయులందరికీ అపీల్ చేస్తున్నాను. వారు ప్రచారం చేసే వస్తువులను ఉపయోగించడం కూడా ఆపేయండి. మానవత్వం అన్నిటికంటే మించింది అని వారికి తెలిసేలా చేయాలి” అని పెట్టారు.

ఫొటో సోర్స్, Twitter
మహమ్మద్ సాబిర్ తన ట్విటర్ ఖాతాలో “ప్రపంచంలో అత్యంత సంపన్న క్రికెట్ సంస్థ కరోనా సంక్షోభంతో పోరాడ్డానికి ఎలాంటి సాయం చేయడం లేదు. క్రికెట్ పనికిమాలినది.. క్రికెట్ చూడడం ఆపేయండి” అన్నారు.
Sorry, your browser cannot display this map


- కరోనావైరస్ లైవ్ పేజీ: అంతర్జాతీయ, జాతీయ, స్థానిక సమాచారం
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ మీకు సోకిందని అనుమానంగా ఉందా? ఈ వ్యాధి లక్షణాలను ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
- కరోనావైరస్: సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్: ఈ మహమ్మారి ఎప్పుడు ఆగుతుంది? జనజీవనం మళ్లీ మామూలుగా ఎప్పుడు మారుతుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- కరోనావైరస్: చైనా వస్తువులు ముట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా
- కరోనావైరస్ సోకిన తొలి వ్యక్తి ఎవరు... జీరో పేషెంట్ అంటే ఏంటి?
- కరోనావైరస్: రైళ్లు, బస్సుల్లో ప్రయాణిస్తే ప్రమాదమా?
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- కరోనావైరస్: ఇంక్యుబేషన్ పీరియడ్ ఏమిటి? వైరస్ - ఫ్లూ మధ్య తేడా ఏమిటి?
- సెక్స్ ద్వారా కరోనావైరస్ సోకుతుందా? కీలకమైన 8 ప్రశ్నలు, సమాధానాలు

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104


ఇవికూడా చదవండి:
- కరోనావైరస్ కొత్త పేరు కోవిడ్-19.. దీన్ని ఎలా పెట్టారంటే..
- 'దాదాగిరీ' సెకండ్ ఇన్నింగ్స్ మొదలవుతుందా?
- కరోనావైరస్: తొలి మేడిన్ ఇండియా టెస్టింగ్ కిట్‌ను అందించిన భారత శాస్త్రవేత్త ఈమే.. కిట్ ఇచ్చిన గంటకే బిడ్డకు జన్మనిచ్చిన మీనల్
- ఆంథొనీ ఫాచీ: ఆరుగురు అమెరికా అధ్యక్షులకు సలహాలు ఇచ్చిన వైద్యుడు.. ఒకప్పుడు ఎయిడ్స్‌తో, ఇప్పుడు కరోనాతో యుద్ధానికి దిగిన సైనికుడు
- కరోనావైరస్ కన్నా వేగంగా వ్యాపిస్తున్న వదంతులు... వాటిలో నిజమెంత?
- కరోనావైరస్: ఇంక్యుబేషన్ పీరియడ్ ఏమిటి? వైరస్ - ఫ్లూ మధ్య తేడా ఏమిటి? - 10 కీలక ప్రశ్నలు... నిపుణుల సమాధానాలు
- కరోనావైరస్: ఏ వయసు వారిపై ఎక్కువ ప్రభావం చూపుతుంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









