కేరళ దారిలో పంజాబ్... పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానం

ఫొటో సోర్స్, CAPT.AMARINDER SINGH @TWITTER
పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా పంజాబ్ అసెంబ్లీ ఒక తీర్మానం ఆమోదించింది. ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది.
కేరళ తర్వాత ఇప్పుడు పంజాబ్ ఈ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానం చేసిన రెండో రాష్ట్రం అయ్యింది.
రెండు రోజుల అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో రెండో రోజు పంజాబ్ ప్రభుత్వ మంత్రి బ్రహ్మ్ మొహింద్ర ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం ప్రవేశ పెట్టారు.
"ఈ చట్టానికి వ్యతిరేకంగా దేశంలోని చాలా ప్రాంతాల్లో జనం వీధుల్లోకి వచ్చారు" అని ఆయన తీర్మానం ప్రతిపాదిస్తూ అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
"కేంద్ర ప్రభుత్వం తమ వివక్షపూరిత చట్టాలను రాష్ట్రాలపై అమలు చేయలేదని" పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ అసెంబ్లీలో అన్నారు.
పొరుగు దేశాలతో సరిహద్దులు ఉన్న పంజాబ్ లాంటి రాష్ట్రాలకు ఈ చట్టం చాలా ప్రమాదకరం కాగలదంటూ అమరీందర్ సింగ్ అంతకు ముందు కూడా దీనిని వ్యతిరేకించారు.
"పౌరసత్వ సవరణ చట్టం గురించి నాకు ఆందోళనగా ఉంది. ఎందుకంటే, చొరబాటుదారులు దేశంలోకి రావడానికి దాన్ని దుర్వినియోగం చేస్తారు. సరిహద్దు రాష్ట్రాలకు ఈ చట్టం వల్ల చాలా ప్రమాదం ఉంది. కేంద్ర ప్రభుత్వానికి అసలు తాము ఏం చేస్తున్నామో అర్థమవుతోందా?" అన్నారు.
కర్ణాటక అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా సీఏఏపై కాంగ్రెస్ తీర్మానాన్ని సమర్థించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
కాంగ్రెస్ నేత చిదంబరం కూడా ఈ చట్టాన్ని వ్యతిరేకించిన పంజాబ్ ప్రభుత్వాన్ని ప్రశంసించారు.

ఫొటో సోర్స్, FB/PINARAYI VIJAYAN
మొదటి రాష్ట్రం కేరళ
ఇంతకు ముందు కేరళ ప్రభుత్వం డిసెంబర్ 31న అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ఆమోదిస్తూ కేంద్రం ఈ చట్టాన్ని ఉపసంహరించాలని డిమాండ్ చేసింది.
సీఏఏ చట్టాన్ని వ్యతిరేకంగా తీర్మానం పాస్ చేయాలని కోరుతూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ 11 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు కూడా రాశారు.
పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
కేరళ సీఏఏను వ్యతిరేకిస్తూ తీర్మానం ఆమోదించిన మొదటి రాష్ట్రంగా నిలిచింది.
అంతకు ముందు పశ్చిమ బెంగాల్ లాంటి కొన్ని బీజేపీయేతర రాష్ట్రాలు తాము సీఏఏను అమలు చేయబోమని ప్రకటించాయి.
"లౌకికవాదానికి, దేశ ఐక్యతకు సీఏఏ వ్యతిరేకం, ఈ చట్టంతో పౌరసత్వం అందించడం వల్ల మతపరంగా వివక్ష చూపడమే అవుతుంది" అని కేరళ ముఖ్యమంత్రి విజయన్ అన్నారు.
రాజ్యాంగ ప్రాథమిక విలువలను, సిద్ధాంతాలకు ఈ చట్టం విరుద్ధం. ప్రజల ఆందోళనలు చూసి కేంద్రం సీఏఏను ఉపసంహరించుకోవాలి. రాజ్యాంగంలోని లౌకిక దృష్టి కొనసాగేలా చూడాలి.
కేరళలో ఒక్క డిటెన్షన్ సెంటర్ కూడా నిర్మించనివ్వమని ఆయన ఆ సమయంలో మరోసారి స్పష్టం చేశారు.
అయితే ముఖ్యమంత్రి ఈ తీర్మానాన్ని బీజేపీ ఒకే ఒక ఎమ్మెల్యే అడ్డుకున్నారు. సీఏఏను రద్దు చేయాలనే డిమాండ్ చట్టవిరుద్ధం అన్నారు.

అస్సాంలో రాజుకున్న వ్యతిరేకత
ఈ చట్టంపై వ్యతిరేకతలు అస్సాం నుంచి మొదలయ్యాయి.
అస్సాంలో ప్రస్తుత ప్రభుత్వం హిందూ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రవాస హిందువుల కోసం భారత్ పౌరసత్వం అందించి, రాష్ట్రంలో నివసించడం సులభంగా చేస్తోందంటూ ఆరోపిస్తున్నారు.
అస్సాంలో 2019లో పౌరులు ఒక రిజిస్టర్ జారీ చేసినపుడు అందులో 1971 మార్చికి ముందు ఉన్న వారికి చోటు లభించింది. ఆ తర్వాత వచ్చిన వారి పౌరసత్వం సదేహంలో పడింది.
అయితే పౌరసత్వ సవరణ బిల్లుతో 2014 డిసెంబర్ ముందు భారత్ వచ్చిన హిందూ, సిక్, బౌద్ధ, జైన, పార్శీ, క్రైస్తవులకు పౌరసత్వం అందించే నిబంధన ఉంది.
ఇవి కూడా చదవండి:
- మోదీ సర్కారులో 36 మంది మంత్రులు కశ్మీర్‌కు వెళ్ళడానికి కారణమేంటి...
- జేఎన్‌యూ విద్యార్థులతో దీపిక ఏం మాట్లాడారు?
- భారతదేశంలో విద్యార్థి ఉద్యమాల చరిత్ర ఏమిటి... వాటి ప్రభావం ఎలాంటిది?
- JNU విద్యార్థులపై హింసాత్మక దాడి వెనుక... వాట్సాప్ గ్రూప్స్ సీక్రెట్ చాటింగ్
- JNUSU అధ్యక్షురాలు ఐషీ ఘోష్: ‘ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ గూండాలే దాడి చేశారు.. నాలుగైదు రోజుల్నుంచీ హింసను ప్రోత్సహించారు’
- "జేఎన్‌యూ వీసీని వెంటనే తొలగించాలి": బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి
- JNUలో దాడి జరిగినప్పుడు వీసీ ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? :వైస్ చాన్స్‌లర్‌తో ఇంటర్వ్యూ
- జేఎన్‌యూలో దాడి నిందితుల్లో విద్యార్థి సంఘం అధ్యక్షురాలు ఆయిషీ ఘోష్
- ఇరాన్: ఉక్రెయిన్ విమానం కూల్చివేతపై 'అబద్ధాలు' చెబుతారా అంటూ ఆగ్రహించిన ప్రజలు
- ‘రోజుకు 4 గంటలే చదువు.. మిగతా సమయంలో వ్యవసాయం, ఆటలు, కమ్యూనిటీ పనులు’
- కేరళలో రెండు ఎత్తయిన భవనాలు క్షణాల్లో నేలమట్టం
- గూగుల్ కన్నా వందేళ్ల ముందే డేటాతో సంపన్నుడైన ఘనుడు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








