CAA: నిరసనకారుల రాళ్ల దాడి నుంచి పోలీసులను కాపాడిన ముస్లిం మహిళ

ఫొటో సోర్స్, Ani
భారత కొత్త పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా అహ్మదాబాద్ నగరంలో రోడ్లపై గుమిగూడిన జనం పోలీసులపై రాళ్లు రువ్వారు.
వ్యతిరేక ప్రదర్శనలు ఉద్రిక్తంగా మారినపుడు, అక్కడున్న పోలీసులు ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు తీశారు.
ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్న వీడియోలో జనం పోలీసులపై రాళ్లు రువ్వడం, ప్రాణాలు కాపాడుకోవడానికి పోలీసులు పారిపోతూ కనిపిస్తారు.
రాళ్ల నుంచి కాపాడుకోవడానికి పోలీసులు దుకాణాలు, చిన్న తోపుడుబండ్ల వెనక్కు వెళ్లి దాక్కున్నారు.
వందల మంది ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వుతున్నప్పుడు అక్కడే ఉన్న కొందరు వారిని కాపాడేందుకు ప్రయత్నించారు.

పోలీసులను మా ఇంట్లోకి తీసుకొచ్చాం: ఫరీన్
అదే ప్రాంతంలో ఉన్న కొంతమంది మహిళలు కూడా నిరసనకారుల దాడి నుంచి పోలీసులను కాపాడారు.
"జనం పోలీసులపై రాళ్లు రువ్వుతున్నారు. కొంతమంది పోలీసులు దగ్గరే ఉన్న ఒక షాపులో దాక్కోవడానికి వెళ్లారు. మా ఇంటి దగ్గరున్న కొంతమంది ఆ పోలీసులను లోపలికి తీసుకొచ్చారు" అని స్థానికురాలు ఫరీన్ బానో బీబీసీకి చెప్పారు.
"మేం పోలీసుల గాయాలకు ఐస్ పెట్టి చికిత్స చేశాం. వారికి కాస్త ఉపశమనం లభించింది. గాయపడ్డ వారిలో ఒక మహిళా కానిస్టేబుల్ ఉన్నారు. ఆమెను కూడా ఇంట్లోకి తీసుకొచ్చాం" అని ఫరీన్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
"ఆ మహిళా కానిస్టేబుల్ చాలా భయపడిపోయింది. ఆమె తలకు రాయి తగిలింది. ఏడుస్తోంది. మరో పోలీస్ అధికారి చేతికి రాయి తగిలింది. ఆయన కూడా బెదిరిపోయి ఉన్నారు. మేం వాళ్లను ఊరడించాం" అన్నారు.
మరో పోలీస్ అధికారి తన తలపై పెద్ద గాయమవడంతో రక్తం కారుతోందని చెప్పారు. మేం అక్కడ దూది పెట్టి రుమాలుతో కట్టుకట్టాం అని ఫరీన్ చెప్పారు.
"ఇద్దరు పోలీస్ అధికారులు, ఒక మహిళా కానిస్టేబుల్‌ను మేం మా ఇంట్లోనే ఉంచాం. ముగ్గురినీ ఇంట్లో వెనక ఉన్న గదిలోకి పంపించి వేశాం. ఎందుకంటే వాళ్లు చాలా భయపడిపోయి కనిపించారు. పరిస్థితి కుదుటపడ్డాక గాయపడ్డ పోలీసులు వారి ఇళ్లకు వెళ్లిపోయారు" అన్నారు.
మన ముందు ఎవరున్నారు అనేది తర్వాత, మనం మానవతా దృష్టితో వాళ్లకు సాయం చేయాలి అన్నారు ఫరీన్ బానో.
ఇవి కూడా చదవండి:
- CAA: కొనసాగుతున్న నిరసనలు, బిజనౌర్లో బుల్లెట్ తగిలి ఇద్దరు మృతి, ఫైరింగ్ చేయలేదన్న పోలీసులు
- పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనలు: దిల్లీ పోలీసుల లాఠీల నుంచి స్నేహితుడికి రక్షణ కవచంగా మారిన యువతులు
- విద్యార్థుల ఆందోళనలు భారతీయుల నాడి గురించి ఏం చెబుతున్నాయి?
- బండి నారాయణస్వామి 'శప్తభూమి'కి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
- Fake news: దిల్లీ జామియా యూనివర్సిటీ ఆందోళనల్లో పోలీసులే బస్సుకు నిప్పంటించారా...
- #BBCShe విశాఖ: 'పెద్ద మనిషి' అయితే అంత ఆర్భాటం అవసరమా?
- అత్యాచారం కేసులో జర్నలిస్టుకు రూ. 21.5 లక్షల పరిహారం
- గూఢచర్యం ఆరోపణలపై విశాఖలో ఏడుగురు నౌకాదళ సిబ్బంది అరెస్ట్
- హైదరాబాద్ నిజాం సొమ్ము కేసు: పాకిస్తాన్కు రూ.53.7 కోట్లు జరిమానా విధించిన బ్రిటన్ కోర్టు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








