దిల్లీ జామియా యూనివర్సిటీ ఆందోళనల్లో పోలీసులే బస్సుకు నిప్పంటించారా?- Fact check..

- రచయిత, ఫ్యాక్ట్ చెక్ బృందం
- హోదా, బీబీసీ న్యూస్
పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం దగ్గర ఆదివారం జరిగిన హింసాత్మక ఆందోళనకు సంబంధించిన ఒక వీడియో వైరల్ అయ్యింది.
ఒక ద్విచక్ర వాహనం కాలిపోతుంటే, మంటలు ఆర్పేందుకు ఓ వ్యక్తి ప్రయత్నిస్తుండటం ఆ వీడియోలో కనిపిస్తుంది. దాని పక్కనే దిల్లీ రవాణా సంస్థకు చెందిన బస్సు నిలిచిపోయి ఉంది. కొందరు పోలీసులు ప్లాస్టిక్ క్యాన్లలో ఏదో తీసుకొచ్చి ఆ బస్సులో చల్లుతున్న దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి.
20 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోను దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ట్విటర్‌లో షేర్ చేశారు. దిల్లీ పోలీసులే ఆ బస్సుకు నిప్పు అంటించారని ఆరోపించారు.
ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో బీజేపీ దిల్లీలో చిచ్చు పెడుతోంది. హింసాత్మక చర్యలను ఆమ్‌ఆద్మీ పార్టీ వ్యతిరేకిస్తుంది. ఇది బీజేపీ చేస్తున్న చిల్లర రాజకీయం. పోలీసుల సమక్షంలోనే బస్సుకు ఎలా నిప్పంటుకుందో ఈ వీడియోలో చూడండి" అంటూ ఆయన ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
"పసుపు, తెలుపు రంగు క్యాన్లతో ఆ వ్యక్తులు బస్సులో ఏం చల్లుతున్నారన్న విషయం తెలుసుకునేందుకు తక్షణమే విచారణ జరపాలి. అది ఎవరి ఆదేశాలతో ఆ పని చేశారు? బీజేపీ చిల్లర రాజకీయాలు మొదలు పెట్టిందని, పోలీసులతో ఇలాంటి పనులు చేయిస్తోందని ఆ ఫొటోలో స్పష్టంగా అర్థమవుతోంది" అంటూ సిసోడియా మరో ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
దానిని 10 వేల మందికి పైగా రీట్వీట్ చేశారు. ఆ బస్సుకు ఎవరు నిప్పింటించారు? పోలీసులా? ఆందోళనకారులా? అన్న చర్చ సోషల్ మీడియాలో పెద్దఎత్తున జరుగుతోంది.
ఇంతకీ వాస్తవంగా అక్కడ ఏం జరిగింది? ఆ వీడియోలోని నిజానిజాలను తెలుసుకునేందుకు బీబీసీ ఫ్యాక్ట్‌చెక్ బృందం ప్రయత్నించింది.
"ఆ వీడియోతో కొందరు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు. వాస్తవానికి బస్సులో మంటలను ఆర్పేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు" అని దిల్లీ పోలీసు విభాగం పీఆర్‌వో రంధావా చెప్పారు.
"బస్సుకు పోలీసులు నిప్పంటించారంటూ పుకార్లు వ్యాప్తి చెందుతున్నాయి. ఆ వీడియోలో కనిపిస్తున్న బస్సు నంబర్ DL1PD-0299. నిజానికి కాలిపోయిన బస్సు అది కాదు. అందులో కొద్దిగా నిప్పు కనిపించగానే వెంటనే పోలీసులు వెళ్లి ఆర్పివేశారు. దయచేసి ఎవరూ అలాంటి పుకార్లను నమ్మవద్దు" అని రంధావా మీడియా సమావేశంలో చెప్పారు.
అనంతరం, ఆ సంఘటన జరిగిన న్యూ ఫ్రెండ్స్ కాలనీ పోలీసు స్టేషన్‌కు బీబీసీ బృందం వెళ్లింది. స్టేషన్ అదనపు ఇన్‌చార్జి మనోజ్ వర్మకు ఆ వీడియో క్లిప్‌ను చూపించాం.
"ఆ వీడియో మా ప్రాంతంలో తీసినదే. కానీ, ఆ వీడియోలో కనిపిస్తున్న బస్సు కాలిపోలేదు. దానిని మీరు కూడా చూడొచ్చు. దాని మీద రాళ్ల దాడి జరిగింది. మా బైకులను కాల్చివేశారు. ఆ మంటలను ఆర్పేందుకు మేము ప్రయత్నిస్తున్నాం. తర్వాత ఆ బస్సు అక్కడ లేదు. దానిని డిపోకు పంపించాం" అని మనోజ్ వర్మ వివరించారు.

అదే సమయంలో ఎన్‌డీటీవీ జర్నలిస్టు అరవింద్ గుణశేఖర్ అక్కడే ఉన్నారు.
"ఆ వీడియోను నేను ఫోన్‌తో చిత్రీకరించాను. సాయంత్రం 5.01 గంటలప్పుడు దానిని తీశాను. 5.06 గంటలకు మరో వీడియో తీశాను. ఆ రెండు వీడియోలలోనూ మీరు స్పష్టంగా చూడొచ్చు, ఏ బస్సుకూ మంటలు అంటుకోలేదు. ద్విచక్ర వాహనానికి అంటుకున్న మంటలను ఆర్పేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు" అని అరవింద్ బీబీసీతో చెప్పారు.
ఆ రెండు వీడియోలను ఆయన బీబీసీకి పంపించారు. అక్కడ ఉన్న బస్సుకు మంటలు అంటుకోలేదు.
ప్రత్యక్ష సాక్షిగా ఉన్న సెక్యూరిటీ గార్డు రాహుల్ కుమార్ కూడా అదే విషయాన్ని చెప్పారు. సాయంత్రం అయిదు గంటల సమయంలో అనేక మంది ఆందోళనకారులు వచ్చి బస్సుకు నిప్పంటించడం ప్రారంభించారని ఆయన చెప్పారు. అయితే, ఆయన కెమెరా ముందు మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు.
చివరికి, పోలీసులే బస్సుకు నిప్పంటించారంటూ కొందరు చేస్తున్న ఆరోపణలు అవాస్తవం అని బీబీసీ పరిశోధనలో వెల్లడైంది.
ఇవి కూడా చదవండి:
- పౌరసత్వ సవరణ చట్టం: బీజేపీ తొందరపడిందా.. ఈ స్థాయి వ్యతిరేకతను ఊహించలేదా
- మహిళలు మద్యం తాగితే సంతానోత్పత్తి సామర్థ్యం దెబ్బ తింటుందా...
- రష్యా: ‘ఐదేళ్లలో 80 శాతం తగ్గిన ఆల్కహాల్ విక్రయాలు’.. నిజమెంత?
- ‘దేశంలో ఎక్కువగా తాగేది తెలుగువాళ్లే’
- మద్యం అతిగా తాగితే... డీఎన్ఏ డామేజ్ అవుతుందా...
- పది నిమిషాల్లో ఆనందాన్ని పెంచుకోవడం ఎలా?
- అభిప్రాయం: ఇది విలీనం కాదు టోకు ఫిరాయింపు
- మహేంద్ర సింగ్ ధోని ఆ కీపింగ్ గ్లవ్స్ వాడకూడదన్న ఐసీసీ.. అవే కొనసాగిస్తాడన్న బీసీసీఐ
- ఎడిటర్స్ కామెంట్: ఇంటర్మీడియట్ పిల్లల చావులకు బాధ్యులెవరు?
- మహిళలకు భావప్రాప్తి కలిగిందో లేదో పట్టించుకోనవసరం లేదా - అభిప్రాయం
- నా కార్టూన్లే నా ప్రాణాలు కాపాడాయి.. కొత్త జీవితాన్ని ఇచ్చాయి.. ఇదీ నా కథ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








