పాకిస్తాన్ వ్యతిరేక ప్రచారానికి దిల్లీ కేంద్రంగా నకిలీ మీడియా సంస్థలు నడుస్తున్నాయా? - ఫ్యాక్ట్ చెక్

ఫొటో సోర్స్, DisinfoEU
- రచయిత, కీర్తి దూబే
- హోదా, బీబీసీ, ఫ్యాక్ట్ చెక్ టీం
ప్రపంచవ్యాప్తంగా 65 దేశాల్లో ఓ భారతీయ నెట్‌వర్క్ పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తోందని, ఇందుకోసం 265 'నకిలీ మీడియా సంస్థలు' నడుస్తున్నాయని యూరప్‌కు చెందిన ఫ్యాక్ట్ చెక్ ఎన్జీఓ డిస్‌ఇన్ఫో ల్యాబ్ అంటోంది.
ఈ నకిలీ సంస్థలన్నింటికీ దిల్లీ కేంద్రంగా పనిచేసే 'శ్రీవాస్తవ గ్రూప్'తో సంబంధాలున్నట్లు డిస్‌ఇన్ఫో తెలిపింది.
ఇటీవల 23 మంది ఈయూ ఎంపీలు కశ్మీర్‌లో వ్యక్తిగత హోదాలో పర్యటించిన సంగతి తెలిసిందే. భారత ప్రధాని నరేంద్ర మోదీతో కూడా వారు సమావేశమయ్యారు. ఈ పర్యటనకు ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ నాన్-అలైడ్ స్టడీస్ (ఐఐఎన్ఎస్) ఏర్పాట్లు చేసింది. ఈ సంస్థ కూడా శ్రీవాస్తవ గ్రూప్‌కు చెందిందే.
రష్యా నుంచి వ్యాపించే నకిలీ వార్తలను అరికట్టేందుకు యూరోపియన్ యూనియన్ ఒక స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేసింది. ఆ సంస్థ పరిశోధనలోనే ఈ 265 నకిలీ మీడియా సంస్థలు వెలుగుచూశాయి. వీటిలో ఎక్కువగా పాకిస్తాన్ వ్యతిరేక వార్తలే ఉన్నాయి.
ఈ నకిలీ సంస్థలకు దిల్లీకి చెందిన శ్రీవాస్తవ గ్రూప్‌తో సంబంధం ఉన్నట్లు డిస్‌ఇన్ఫో ల్యాబ్ చెబుతోంది.
రష్యా నుంచి ఈపీటుడే (eptoday.com ) అనే వెబ్‌సైట్ ద్వారా వ్యాపిస్తున్న నకిలీ వార్తలను చాలా మంది పంచుకుంటున్నట్లు డిస్‌ఇన్ఫో ల్యాబ్ గుర్తించింది.
ఆ తర్వాత దీనిపై లోతుగా పరిశోధించినప్పుడు, భారత్‌లోని శ్రీవాస్తవ గ్రూప్‌తో సంబంధాలు వెలుగుచూశాయి. దానితో అనుసంధానమై ఉన్న మరిన్ని వెబ్‌సైట్లు బయటపడ్డాయి.
ఈ వ్యవహారంపై శ్రీవాస్తవ గ్రూప్ స్పందన తెలుసుకోవడానికి, ఆ గ్రూప్ అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొన్న చిరునామా (A-2/59 సఫ్దర్‌జంగ్ ఎన్‌క్లేవ్)కు బీబీసీ వెళ్లింది. ఆ చిరునామాతో ఉన్న ఇల్లు గేట్ వద్ద ఉన్న సెక్యూరిటీ గార్డు బీబీసీ ప్రతినిధులను లోపలికి వెళ్ళకుండా ఆపారు. అక్కడ కార్యాలయం ఏదీ లేదని చెప్పారు.
ఆ వెబ్‌సైట్‌లో ఇ-మెయిల్ అడ్రస్ ఏదీ ఇవ్వలేదు. ఫోన్ నెంబర్‌ను సంప్రదిస్తే, ''సర్, మీకు తిరిగి కాల్ చేస్తారు'' అన్ని సమాధానం వచ్చింది.
'ఈ నకిలీ వెబ్‌సైట్ల గురించిన సమాచారం మీ వద్ద ఉందా? వీటికి ప్రభుత్వంతో ఏదైనా సంబంధం ఉందా? ' అని భారత విదేశాంగ శాఖను బీబీసీ ఇ-మెయిల్ ద్వారా అడిగింది. అయితే, ఈ కథనం రాసే సమయానికి, ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు.
శ్రీవాస్తవ గ్రూప్‌తో సంబంధాలను ఎలా గుర్తించారు?
నకిలీ వెబ్‌సైట్లకు శ్రీవాస్తవ గ్రూప్‌తో సంబంధం గురించి డిస్‌ఇన్ఫో ల్యాబ్ ట్విటర్‌లో అక్టోబర్ 9న వివరించింది.
ఈపీటుడే అధికారిక వెబ్‌సైట్ పేర్కొన్న చిరునామా, శ్రీవాస్తవ గ్రూప్ బెల్జియం కార్యాలయం చిరునామా ఒకటే.

- ఈపీటుడే ఐపీ అడ్రెస్‌ను వెతికినప్పుడు ఆ వెబ్‌సైట్‌ను, శ్రీవాస్తవ గ్రూప్ వెబ్‌సైట్‌ను హోస్ట్ చేస్తున్న సర్వర్ ఒకటేనని తేలింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
- ఈపీటుడే ఒరిజినల్ రిజిస్ట్రేషన్ http://UIWNET.COM తో అనుసంధానమై ఉంది.

ఫొటో సోర్స్, DisinfoEU/twitter
- ఈపీటుడే ఫేస్‌బుక్ ఖాతాను దిల్లీలోని నలుగురు వ్యక్తులు నడిపిస్తున్నట్లు గత అక్టోబర్‌లో ఓ కథనం వచ్చింది. బీబీసీ దర్యాప్తులో ఈ ఖాతా సస్పెండ్ అయినట్లు గుర్తించాం.
- శ్రీవాస్తవ గ్రూప్ జెనీవాలోనూ పనిచేస్తోంది. జెనీవాలో ఐరాస శరణార్థుల ఏజెన్సీ ఉంది. టైమ్స్ ఆఫ్ జెనీవా (timesofgeneva.com) పేరుతో ఒక ఆన్‌లైన్ వార్తాపత్రిక నడుస్తోంది. 35 ఏళ్లుగా తమ కార్యకలాపాలు నడుస్తున్నట్లు ఆ వెబ్‌సైట్ పేర్కొంది.
- ఈపీటుడేలో ఉన్న కథనాలే టైమ్స్ ఆఫ్ జెనీవాలో ఉంటున్నాయి. పాకిస్తాన్‌లోని మైనార్టీల పరిస్థితి గురించి, గిల్గిత్-బాల్టిస్తాన్‌లోని పరిస్థితుల గురించి చర్చించే వీడియోలు కూడా ఈ వెబ్‌సైట్‌లో ఉన్నాయి. పాకిస్తానీ మైనార్టీల నిరసన ప్రదర్శనల గురించి విస్తృతంగా వార్తలు ఉన్నాయి.

ఫొటో సోర్స్, Alamy
- టైమ్స్ ఆఫ్ జెనీవా సర్వర్ నుంచి పాకిస్తానీవుమెన్.ఓఆర్‌జీ (pakistaniwomen.org) అనే ఎన్జీఓ వెబ్‌సైట్ కూడా నడుస్తోందని డిస్‌ఇన్ఫో ల్యాబ్ తెలిపింది. యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ పాకిస్తానీ మైనార్టీ (ఈఓపీఎం) అనే ట్విటర్ ఖాతా గురించి కూడా డిస్‌ఇన్ఫో ల్యాబ్ దర్యాప్తు చేసింది. ఈపీటుడే, శ్రీవాస్తవ గ్రూప్ బెల్జియం కార్యాలయం చిరునామాతోనే ఈ సంస్థ కూడా ఉందని గుర్తించింది.

ఫొటో సోర్స్, DisinfoEU/twitter
- ఫోర్ న్యూస్ ఏజెన్సీ (4NewsAgency) అనే మరో వెబ్‌సైట్ గురించి డిస్‌ఇన్ఫో ల్యాబ్ ప్రస్తావించింది. బెల్జియం, స్విట్జర్లాండ్, థాయిలాండ్, అబూదాబీలకు చెందిన నాలుగు వార్తాసంస్థల బృందం తమ సంస్థ అని ఫోర్ న్యూస్ ఏజెన్సీ పేర్కొందని, అయితే ఆ సంస్థలు ఏవన్నది వెల్లడించలేదని తెలిపింది.
- 100 దేశాల్లో 4 న్యూస్ ఏజెన్సీ పనిచేస్తున్నట్లు చెప్పుకొంది. దాని వెబ్‌సైట్‌లో మాత్రం జెనీవా, బెల్జియంకు చెందిన చిరునామాలు మాత్రమే ఉన్నాయి. ఈపీటుడే, టైమ్స్ ఆఫ్ జెనీవా, 4 న్యూస్ ఏజెన్సీ, శ్రీవాస్తవ గ్రూప్.. వీటన్నింటిలో పేర్కొన్న చిరునామాలు బెల్జియం, జెనీవాల్లోనే ఉన్నాయి.
- ఈపీటుడే, టైమ్స్ ఆఫ్ జెనీవా, 4 న్యూస్ ఏజెన్సీ, శ్రీవాస్తవ గ్రూప్‌ల మధ్య లోతైన వివరాల కోసం బీబీసీ డిస్‌ఇన్ఫో ల్యాబ్‌ను ఇ-మెయిల్ ద్వారా సంప్రదించింది. ఈ నాలుగు వెబ్‌సైట్లలో ఒక రకమైన సమాచారం ఉన్నట్లు డిస్‌ఇన్ఫో ఇచ్చిన సమాచారం ద్వారా గుర్తించాం.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఈ తరహా 21 వెబ్‌సైట్లు ఒకే సర్వర్ నుంచి నడుస్తున్నాయని, వాటిలో శ్రీవాస్తవ గ్రూప్ కూడా ఉందని డిస్‌ఇన్ఫో ల్యాబ్ తెలిపింది.
- డిస్ఇన్ఫో ల్యాబ్‌కు 2018లో రాసిన ఓ లేఖ దొరికింది. పాకిస్తానీ మైనార్టీల గురించి ఈపీటుడేలో రాసిన సంపాదకీయానికి మద్దతు ఇవ్వాలని.. మాడీ శర్మకు చెందిన WESTT అనే ఎన్జీఓ సంస్థ అధికారికంగా ఈయూ పార్లమెంటు మాజీ అధ్యక్షుడు ఆంటోనియా తాజానీకి లేఖ రాసింది.
- 23 మంది ఈయూ ఎంపీల కశ్మీర్ పర్యటనకు ఏర్పాట్లు చేసిన సంస్థ వెనుక కూడా ఈ మాడీ శర్మనే ఉన్నారు.
- ఈపీటుడే కోసం మాడీ శర్మ సంపాదకీయాలు రాస్తున్నట్లు బీబీసీ దర్యాప్తులో వెలుగుచూసింది. WESTT కోసం పనిచేస్తున్న మరో వ్యక్తి కూడా ఈపీటుడేలో సంపాదకీయాలు రాస్తున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
ఈ వెబ్‌సైట్లు ఏం చేస్తాయి?
ఈ 265 నకిలీ స్థానిక వార్తా సంస్థలు అంతర్జాతీయ సంస్థలను ప్రభావితం చేయడానికి పనిచేస్తాయని డిస్ఇన్ఫో ల్యాబ్ పేర్కొంది.
విశ్వసనీయతను పెంచుకోడానికి స్వచ్ఛంద సంస్థలతో కలసి పత్రికా ప్రకటనలను ఇస్తాయి.
ఈ మీడియా సంస్థలన్నీ ఒకదానికొకటి కోట్ చేస్తాయి, అదే నివేదికను వారి ప్లాట్‌ఫామ్‌లపై ప్రచురిస్తాయి. వార్తలను తారుమారు చేసే ప్రక్రియ పాఠకుడికి అర్థంకాని రీతిలో జరుగుతుంది. భారతదేశానికి అంతర్జాతీయ మద్దతు పెంచడం.. వార్తలు, సంపాదకీయాల ద్వారా ప్రజల్లో పాకిస్తాన్ ప్రతిష్టను దెబ్బతీయడం వీటి పని.

ఫొటో సోర్స్, PIB
శ్రీవాస్తవ గ్రూప్ ఎవరిది?
ఈ ఏడాది అక్టోబర్‌లో 23 మంది యూరోపియన్ ఎంపీలు అనధికార పర్యటనలో భాగంగా భారత్‌లో పర్యటించినప్పుడు శ్రీవాస్తవ గ్రూప్ వెలుగులోకి వచ్చింది.
మాడీ శర్మకు చెందిన ఎన్జీవో ఉమెన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ థింక్ ట్యాంక్ (వెస్ట్) యూరోపియన్ ఎంపీలను భారత్‌కు తీసుకువచ్చింది. ఎంపీల పర్యటన ఖర్చు భారత్‌కు చెందిన ఇంటర్నేషనల్ ఇన్స్‌ట్యూట్ ఆఫ్ నాన్-అలైన్డ్ స్టడీస్ (ఐఐఎన్ఎస్) భరిస్తుందని చెప్పారు.
ఐఐఎన్ఎస్ 1980లో స్థాపించిన ఒక ప్రభుత్వేతర సంస్థ. శ్రీవాస్తవ గ్రూప్ తన వెబ్‌సైట్‌లో ఐఐఎన్ఎస్ తమ సంస్థ అని పేర్కొంది. ఇది కాకుండా, దిల్లీ టైమ్స్ (ఇంగ్లిష్), న్యూ దిల్లీ టైమ్స్ (హిందీ) పత్రికలు కూడా తమకు ఉన్నాయని తెలిపింది. అయితే, ఈ పేపర్ల సర్క్యులేషన్ ఎంత ఉందో వెబ్‌సైట్‌లో సమాచారం ఇవ్వలేదు.
'ది వైర్' వెబ్‌సైట్‌లో ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం, శ్రీవాస్తవ గ్రూప్‌కు అనేక కంపెనీలు ఉన్నాయి. కానీ, రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌కు దాఖలైన పత్రాల ద్వారా ఆ కంపెనీల్లో చాలావరకు వ్యాపారాలేవీ చేయడం లేదని వెల్లడైంది.
ఈ గ్రూప్‌లో మొత్తం ఏడు కంపెనీలు నడుస్తున్నాయి. ఈ కంపెనీలన్నింటి బోర్డు సభ్యుల జాబితాల్లో నేహా శ్రీవాస్తవ, అంకిత్ శ్రీవాస్తవ అనే పేర్లు ఉన్నాయి.

వారు ఇచ్చిన నివేదిక ప్రకారం, ఏ2ఎన్ బ్రాడ్‌కాస్టింగ్ గత ఏడాది రూ. 2000 నష్టాన్ని చవిచూసింది. ఈ సంస్థకు ఆదాయం లేదు. దీనికి సిటీ బ్యాంక్‌లో రూ. 10 వేలు, ఓరియంటల్ బ్యాంకులో మరో రూ. 10 వేలు నగదు ఉంది.
ఈ సంస్థకు పెద్ద లాభదాయకమైన వ్యాపారం ఏదీ లేదు.
మేం సఫ్దర్‌జంగ్ ఎన్‌క్లేవ్‌లోని A2 / 59 చిరునామాను వెతకడం ప్రారంభించినప్పుడు 2018 నాటి ఇండియన్ ఇస్లామిక్ కల్చర్ సెంటర్ ఎలక్టోరల్ జాబితా దొరికింది. దాని ప్రకారం అంకిత్ శ్రీవాస్తవ, నేహా శ్రీవాస్తవ ఇదే అడ్రస్‌లో నివసిస్తున్నారు.
వీరిద్దరికీ శ్రీవాస్తవ గ్రూప్‌తో సంబంధం ఉంది. ఈ గ్రూప్‌కు డాక్టర్ అంకిత్ శ్రీవాస్తవ వైస్ చైర్మన్, నేహా శ్రీవాస్తవ వైస్ చైర్‌పర్సన్‌గా ఉన్నారు.
వారి సోషల్ మీడియా ఖాతాలను కూడా పరిశీలించాం. అంకిత్ శ్రీవాస్తవ ట్విటర్ ఖాతాకు 10వేల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. తనను తాను ఆయన న్యూ దిల్లీ టైమ్స్ ఎడిటర్ ఇన్ చీఫ్‌గా పేర్కొన్నారు. అంకిత్ శ్రీవాస్తవ లింకెడ్‌ఇన్ ఖాతాలోనూ ఇదే సమాచారం ఉంది.
శ్రీవాస్తవ గ్రూప్ ప్రతినిధితో మాట్లాడటానికి మేం చాలా చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ సాధ్యం కాలేదు.
ఇవి కూడా చదవండి
- అయోధ్య-రామ మందిర ఉద్యమంలో ముఖ్య పాత్రధారులు వీరే..
- సచిన్ రికార్డును బ్రేక్ చేసిన అమ్మాయి మళ్లీ అదరగొట్టింది
- విజయవాడలో స్విగ్గీ సర్వీస్ ఎందుకు ఆగిపోయింది...
- ఈ మొక్కలు కార్చిచ్చుతో మళ్లీ పుడతాయి.. అంగారకుడిపై పెరుగుతాయి... 32000 సంవత్సరాలు బతుకుతాయి
- అసలైన సూపర్ మ్యాన్, థోర్, వండర్ ఉమన్ ఎవరు.. ఆ సూపర్ హీరోలు ఎక్కడుండేవారు
- అవెంజర్స్ ఎండ్‌గేమ్ ఆల్‌టైమ్ రికార్డ్.. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రం ఇదే
- రక్తం చిందినట్టు ఎరుపు రంగులోకి మారిపోయిన ఆకాశం.. ‘ఇది అంగారక గ్రహం కాదు.. మా ఊరే’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








