IND Vs BAN: రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్, రెండో టీ20లో టీమిండియా విజయం

ఫొటో సోర్స్, Getty Images
రోహిత్ శర్మ తన 100వ టీ20 మ్యాచ్‌లో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడటంతో, టీమిండియా.. రెండో టీ20 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై సులభంగా విజయం సాధించింది.
రాజ్‌కోట్‌లో జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది.
సమాధానంగా భారత్, ఓపెనర్ల వికెట్లు మాత్రమే కోల్పోయి మరో 26 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని అందుకుంది.
43 బంతుల్లో ఆరు సిక్స్‌లు, ఆరు ఫోర్లతో 85 పరుగులు చేసిన రోహిత్ శర్మ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
హిట్ మ్యాన్ టీ20ల్లో మూడోసారి వేగంగా 50 అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన ఘనత సాధించాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
మొసద్దెక్ హొస్సేన్ వేసిన 10వ ఓవర్లో మూడు వరుస సిక్స్‌లు కొట్టిన రోహిత్ శర్మ అభిమానుల్లో జోష్ నింపాడు.
ఈ వరుస సిక్సర్లతో అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్లలో రోహిత్ మూడో స్థానంలో నిలిచాడు.
అన్ని ఫార్మాట్లలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్ 534 సిక్సర్లతో టాప్‌లో ఉండగా, పాకిస్తాన్ ఆటగాడు షాహిద్ అఫ్రిది 476 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు.
మొత్తం 354 ఇన్నింగ్స్‌ల్లో 398 సిక్సర్లు కొట్టిన రోహిత్ శర్మ, న్యూజీలాండ్ ఆటగాడు మెకల్లం(398) కంటే పైకి వచ్చాడు.
ఎం.ఎస్.ధోనీ ఈ జాబితాలో 359 సిక్సర్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఈ మ్యాచ్‌లో రిషబ్ పంత్ స్టంపింగ్‌ను థర్డ్ అంపైర్ నాటౌట్ ఇవ్వడంతో లిటన్ దాస్‌కు లైఫ్ వచ్చింది. ఈ నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఐదో ఓవర్ వేసిన చాహల్ బౌలింగ్‌లో క్రీజు వదిలి ముందుకొచ్చిన లిటన్‌ను రిషబ్ స్టంపింగ్ చేశాడు, కానీ రీప్లేలో రిషబ్ స్టంప్స్ కంటే ముందే బాల్ అందుకున్నట్లు భావించిన థర్డ్ అంపైర్ దాన్ని నాటౌట్ ఇచ్చాడు. ఆ బంతిని నోబాల్‌గా ప్రకటించాడు.
13వ ఓవర్లో సౌమ్యా సర్కార్‌ను రిషబ్ పంత్ స్టంపింగ్ చేసినపుడు కూడా అంపైర్లకు మళ్లీ అదే సందేహం వచ్చింది. కానీ, రీప్లేలో అవుట్ అని తేలింది. థర్డ్ అంపైర్ మాత్రం పొరపాటున నాటౌట్ ఇచ్చాడు. అందరూ షాక్ అవడంతో తప్పు సరిద్దుకుని మళ్లీ అవుట్‌గా ప్రకటించాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ ఓపెనర్లు ధాటిగా ఆడారు. లిటన్ దాస్(29), మొహమ్మద్ నయీమ్(36) 70 పరుగులు భాగస్వామ్యం అందించారు.
తర్వాత వచ్చిన వారిలో సౌమ్యా సర్కార్(30), మహ్మదుల్లా(30) మినహా మిగతావారు రాణించలేకపోయారు.
13 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 103 పరుగులతో బలంగా ఉన్న బంగ్లాదేశ్ భారీ స్కోరు చేస్తుందని భావించారు. కానీ భారత బౌలర్లు చివరి 7 ఓవర్లలో 49 పరుగులు మాత్రమే ఇచ్చారు.
దిల్లీ టీ20లో బౌలింగ్‌తో విమర్శలు ఎదుర్కున్న ఖలీల్ అహ్మద్, ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లలో 44 పరుగులు ఇచ్చాడు.
ఖలీల్ వేసిన చివరి రెండు ఓవర్లలో 22 పరుగులు వచ్చినా, మిగతా బౌలర్లు పొదుపుగా బంతులు వేయడంతో బంగ్లాదేశ్ 153 పరుగులే చేయగలిగింది.
స్పిన్నర్ యుజవేంద్ర చహల్ 2 వికెట్లు పడగొట్టగా, దీపక్ చాహర్, ఖలీల్ అహ్మద్, వాషింగ్టన్ సుందర్‌కు తలో వికెట్ లభించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
154 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ(85), శిఖర్ ధవన్(31) 118 పరుగులు భాగస్వామ్యం అందించారు.
శిఖర్ ధవన్ 11వ ఓవర్లో అవుటవగా, మొదటనుంచీ ధాటిగా ఆడి జట్టును విజయానికి దగ్గరగా తీసుకెళ్లిన రోహిత్ 13వ ఓవర్లో పెవిలియన్ చేరాడు.
కే.ఎల్.రాహుల్(8 నాటౌట్), శ్రేయస్ అయ్యర్(24 నాటౌట్) మరో వికెట్ కోల్పోకుండా మిగతా లాంఛనాన్ని పూర్తి చేశారు.
బంగ్లాదేశ్ బౌలర్లలో అమీనుల్ ఇస్లాంకు రెండు వికెట్లు లభించాయి.
భారత్ విజయంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ 1-1తో సమం అయ్యింది. దీంతో, నవంబర్ 10న నాగ్‌పూర్‌లో జరిగే చివరి మ్యాచ్ సిరీస్‌కు కీలకం అయ్యింది.
ఇవి కూడా చదవండి:
- తక్కువ ఖర్చుతో, స్మార్ట్‌ఫోన్ టెక్నాలజీతో కొండచరియ ప్రమాదాలు గుర్తిస్తున్న ఐఐటీ శాస్త్రవేత్తలు
- భారత నగరాలు ప్రపంచంలోనే అత్యంత కలుషితమైనవి ఎందుకయ్యాయి
- నేపాల్‌తో చైనా స్నేహం భారత్‌కు ప్రమాదమా
- ఈ అమ్మాయిలు మాట్లాడటానికే భయపడేవారు.. కానీ ఒలింపిక్స్‌కు ఎలా అర్హత సాధించారంటే..
- ఆర్సీఈపీలో చేరకూడదని ప్రధాని మోదీ ఎందుకు నిర్ణయం తీసుకున్నారు?
- ఆరాంకో: ప్రపంచంలో అత్యధిక లాభాలు సంపాదించే కంపెనీ షేర్ మార్కెట్లోకి ఎందుకొస్తోంది?
- భూపత్ డాకూ: భారత్‌లో ఎనభై హత్యలు చేసి పాకిస్తాన్ పారిపోయిన దోపిడీ దొంగ
- 'సచిన్ అందరికీ క్రికెట్ దేవుడు... కానీ, నాకు మాత్రం కొడుకులాంటి వాడు'
- తీవ్రవాద సంస్థలకు నిధులు అందకుండా పాకిస్తాన్ అడ్డుకోగలదా...
- పాకిస్తాన్లో ‘గాంధీ’ని కాపాడిన జిన్నా
- సౌరవ్ గంగూలీ: 'దాదాగిరీ' సెకండ్ ఇన్నింగ్స్ మొదలవుతుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)