IND vs Ban: 'రోహిత్ కావాలనే మ్యాచ్ ఓడిపోయాడు', 'ఖలీల్ అహ్మద్ ఏం అద్భుతాలు చేశాడు' :ట్విటర్‌లో ఫ్యాన్స్

ఫొటో సోర్స్, Getty Images
ముష్ఫికర్ రహీమ్ అద్భుత ప్రదర్శనతో బంగ్లాదేశ్ క్రికెట్ టీమ్ సిరీస్ తొలి టీ20లో భారత జట్టుపై సులభంగా విజయం సాధించింది.
బంగ్లాదేశ్ టీ20 మ్యాచ్‌లో భారత జట్టును ఓడించడం ఇదే మొదటిసారి.
ఆదివారం రాజధాని దిల్లీలో జరిగిన మ్యాచ్‌లో భారత బౌలర్ల చెత్త ప్రదర్శన కనిపించింది.
అయితే భారత బ్యాట్స్‌మెన్లు కూడా తమ ప్రతిభకు తగిన ఆటతీరు చూపించలేకపోయారు.
మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా బంగ్లాదేశ్ జట్టు ముందు 149 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
బంగ్లాదేశ్ మరో మూడు బంతులు మిగిలుండగానే ఈ మ్యాచ్‌లో విజయం సాధించింది.

ఫొటో సోర్స్, TWITTER/@BCCI
పసలేని బ్యాటింగ్
భారత్ ఆటగాళ్లలో శిఖర్ ధవన్ అత్యధికంగా 41 పరుగులు చేశాడు. కానీ విరాట్ కోహ్లీ గైర్హాజరుతో మిడిల్ ఆర్డర్లో వచ్చిన బ్యాట్స్‌మెన్లు ఎవరూ నిలదొక్కుకోలేకపోయాడు.
శ్రేయస్ అయ్యర్ 22, రిషబ్ పంత్ 27 పరుగులు చేశాడు. చివర్లో కృణాల్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్ వేగంగా పరుగులు చేయడంతో భారత్ 148 పరుగులు చేయగలిగింది.
కానీ భారత టీ20 యువ బౌలర్లు అద్భుతాలు చేయలేకపోయారు. మ్యాచ్ హీరోగా నిలిచిన బంగ్లాదేశ్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ ముష్ఫికర్ రహీమ్ 43 బంతుల్లో 60 పరుగులు చేసి జట్టు విజయాన్ని పక్కా చేశాడు.
సౌమ్యా సర్కార్ 39, మొహమ్మద్ నయీమ్ 26 పరుగులు చేసి జట్టు విజయంలో భాగస్వామ్యం అయ్యారు.

ఫొటో సోర్స్, TWITTER/@BCCI
పర్యావరణవాది రోహిత్ శర్మ గెలిచాడు
సోషల్ మీడియాలో భారత బౌలర్ ఖలీల్ అహ్మద్‌పై అభిమానులు ఆగ్రహం వెళ్లగక్కారు. మ్యాచ్ ముగిసిన తర్వాత భారత్ ట్విటర్‌లో #IndvsBan మొదటి స్థానంలో, #Khaleel రెండో స్థానంలో ట్రెండ్ అయ్యాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
పుష్పదీప్ బహ్డే అనే యూజర్ తన ట్విటర్‌లో "శార్దూల్ ఠాకూర్, మొహమ్మద్ షమీ, నవదీప్ శైనీని పక్కనపెట్టి జట్టులో చోటు కల్పించడానికి ఖలీల్ అహ్మద్ ఏం అద్భుతాలు చేశాడు. తను చేసిందల్లా ధారాళంగా పరుగులివ్వడమే" అని కామెంట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
"ఏ ఉపాధి పథకం తరఫున ఖలీల్‌కు జట్టులో చోటు లభించింది. ఆయన దగ్గర సెలక్టర్ల రహస్యాలు ఏమైనా ఉన్నాయా" అని విజయ్ కోల్హే ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
ప్రతీక్ జైన్ అనే అభిమాని "కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, ఖలీల్, కృణాల్ పాండ్యా లాంటి వారిలో పరిపక్వత లేదు. ఇలాంటి జట్టుతో భారత్ టీ20 వరల్డ్ కప్ గెలవలేదు" అన్నాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
క్రికెట్ గురించి ట్వీట్ చేసే 'బ్రోకన్ క్రికెట్' అనే హ్యాండిల్‌లో "ఖలీల్ అహ్మద్ 11 టీ-20 మ్యాచుల్లో బౌలింగ్ చేశాడు. ఏడుసార్లు అతడు 35 కంటే ఎక్కువ పరుగులు ఇచ్చాడు" అని పెట్టారు.
అయితే భారత జట్టు ఓటమిపై కూడా యూజర్స్ వ్యంగ్యంగా ట్వీట్లు చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
@MajorNeel అనే అభిమాని "మ్యాచ్ గెలిస్తే, జనం దీపావళికి మిగిలిన టపాసులు కాలుస్తారని, రోహిత్ కావాలనే మ్యాచ్ ఓడిపోయాడు. దానివల్ల కాలుష్యం మరింత ఎక్కువవుతుంది. క్రికెటర్ రోహిత్ శర్మ ఓడిపోయినా, పర్యావరణవాది రోహిత్ శర్మ గెలిచాడు, ఆయనకు సెల్యూట్" అన్నాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 6
అటు, 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్'గా నిలిచిన ముష్ఫికర్ రహీమ్‌ను ప్రశంసించిన క్రికెట్ విశ్లేషకులు మోహన్ దాస్ మేనన్ తన ట్విటర్‌లో "ముష్ఫికర్ ఐపీఎల్‌లో ఏ జట్టులోనూ ఎందుకు ఆడడు, అని నేను ఎప్పుడూ ఆలోచిస్తాను. అతడు ఆ ఫార్మాట్‌కు సరిగ్గా సరిపోతాడు" అని పెట్టాడు
రెండు దేశాల మధ్య ఇప్పటివరకూ 9 టీ20 మ్యాచ్‌లు జరిగాయి. ఇప్పుడు మొదటిసారి బంగ్లాదేశ్ విజయం సాధించింది.
18 ఓవర్ల వరకూ మ్యాచ్ ఏ వైపు అయినా వెళ్లుండేది. కానీ ఖలీల్ అహ్మద్ వేసిన 19వ ఓవర్లో నాలుగు బంతుల్లో నాలుగు ఫోర్లు కొట్టిన ముష్ఫికర్ రహీమ్, బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలోని డాషింగ్ బ్యాట్స్‌మెన్లలో ఒకడుగా ఎందుకు నిలిచాడో నిరూపించుకున్నాడు.
రెండు జట్లు తమ కీలక ఆటగాళ్లు లేకుండానే ఈ టీ20 సిరీస్ ఆడుతున్నాయి. విరాట్ కోహ్లీ గైర్హాజరీతో రోహిత్ శర్మ టీమిండియాను లీడ్ చేస్తుంటే. అటు బంగ్లాదేశ్ టీమ్ కూడా షాకిబ్ అల్ హసన్, తమీమ్ ఇక్బాల్ లాంటి ఆటగాళ్లు లేకుండానే ఆడుతోంది.
ఇవి కూడా చదవండి:
- 'సచిన్ అందరికీ క్రికెట్ దేవుడు... కానీ, నాకు మాత్రం కొడుకులాంటి వాడు'
- వాట్సాప్ మెసేజెస్ మూలాలను తెలుసుకోవాలని భారతదేశం ఎందుకు భావిస్తోంది...
- ‘అమరావతిపై మీ వైఖరేంటి...హైకోర్టులో కప్పు టీ కూడా దొరకడం లేదు’
- తీవ్రవాద సంస్థలకు నిధులు అందకుండా పాకిస్తాన్ అడ్డుకోగలదా...
- పాకిస్తాన్లో ‘గాంధీ’ని కాపాడిన జిన్నా
- అయోధ్య కేసు: అసలు వివాదం ఏమిటి? సుప్రీం కోర్టు తీర్పు ఎప్పుడు వెలువడుతుంది...
- సౌరవ్ గంగూలీ: 'దాదాగిరీ' సెకండ్ ఇన్నింగ్స్ మొదలవుతుందా?
- వెంటనే చర్చలు ప్రారంభించండి - ప్రభుత్వానికి, కార్మిక సంఘాలకు తెలంగాణ హైకోర్టు ఆదేశం
- పశ్చిమ బెంగాల్: ముగ్గురు కుటుంబ సభ్యుల హత్య కేసులో ఆర్ఎస్ఎస్ కోణం
- ‘కడుపు కాలే రోడ్ల మీదకు వచ్చాం... తెలంగాణ పునర్నిర్మాణ ఉద్యమానికి ఆర్టీసీ సమ్మె నాంది కావాలి’
- టాకింగ్ బాక్స్: కెన్యాలో బాలికలపై వేధింపులకు ఇవి ఎలా పరిష్కారం చూపిస్తున్నాయి...
- అభిజిత్ బెనర్జీకి ఆర్థిక శాస్త్రంలో నోబెల్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)