చంద్రయాన్-2: ‘ల్యాండర్ విక్రమ్ ఆచూకీ దొరికింది’ - ఇస్రో ఛైర్మన్ కె శివన్

ఫొటో సోర్స్, isro
చంద్రయాన్-2 ప్రయోగం విషయంలో ఇస్రో శాస్త్రవేత్తల్లో మళ్లీ ఆశలు చిగురించాయి.
చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ ఉన్న ప్రాంతాన్ని గుర్తించినట్లు ఇస్రో చైర్మన్ కే శివన్ వెల్లడించారని ఏఎన్ఐ వార్తాసంస్థ తెలిపింది.
థర్మల్ ఇమేజింగ్ ద్వారా ఆర్బిటార్.. విక్రమ్ ల్యాండర్ ఫొటోలను తీసినట్లు ఆయన పేర్కొన్నట్లు వివరించింది.
''ల్యాండర్‌తో ఇంకా కమ్యునికేషన్ సాధ్యపడలేదు. అందుకోసం ప్రయత్నాలు చేస్తున్నాం'' అని శివన్ తెలిపినట్లు ఏఎన్ఐ పేర్కొంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
చంద్రయాన్-2 ప్రయోగాన్ని భారత్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సంగతి తెలిసిందే. ఆర్బిటార్, ల్యాండర్, రోవర్‌లతో కూడిన వ్యోమనౌక దాదాపు 47 రోజులు ప్రయాణించి చంద్రుడి వద్దకు చేరుకుంది.
శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ల్యాండర్ చంద్రుడిపై దిగాల్సి ఉంది. ఈ చరిత్రాత్మక ఘట్టాన్ని ఇస్రో శాస్త్రవేత్తలతో కలిసి వీక్షించేందుకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా బెంగళూరులోని ఇస్రో కేంద్రానికి వెళ్లారు.
అయితే, మరో 2.1 కి.మీ.లు కిందకు వెళ్తే చంద్రుడిపై ల్యాండర్ దిగుతుందనగా.. దానితో ఇస్రో కమ్యునికేషన్ కోల్పోయింది.
ప్రణాళిక ప్రకారం చంద్రుడిపై రెండు భారీ బిలాల మధ్యన ఉన్న రెండు ప్రాంతాల్లో ఒక దానిని సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ల్యాండర్ ఎంచుకొని దిగాలి. ఆ తర్వాత అందులో నుంచి రోవర్ ప్రజ్ఞాన్ బయటకువచ్చి చంద్రుడి ఉపరితలంపై తిరుగుతుంది. అక్కడున్న నీటి స్ఫటికాలు, ఖనిజ లవణాల ఆధారాలు సేకరిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
కమ్యునికేషన్ ఎందుకు తెగిపోయింది
ల్యాండర్‌తో కమ్యునికేషన్ తెగిపోవడానికి అందులోని సెంట్రల్ ఇంజిన్‌లో తలెత్తిన లోపం కారణమై ఉండొచ్చని ఇస్రోకు చెందిన మాజీ శాస్త్రవేత్త ప్రొఫెసర్ రొడ్డం నరసింహా అభిప్రాయపడ్డారు.
''సెంట్రల్ ఇంజిన్‌లో ఏదైనా పొరపాటు జరిగి ఉండొచ్చు. అవసరమైన థ్రస్ట్‌ను అది అందించలేకపోయినట్లుగా ఉంది. అందుకే, వేగాన్ని తగ్గించే ప్రక్రియ అనుకున్నట్లుగా జరగలేదు. ఫలితంగానే కమ్యునికేషన్ తెగిపోయి ఉంటుంది'' అని ఆయన బీబీసీతో చెప్పారు.
''ల్యాండర్ గమనాన్ని చూపించే రేఖ నిర్ణీత పరిమితుల్లో ఉంటే అంతా సవ్యంగా ఉన్నట్లు. మూడింట రెండొంతుల సమయం అది అలాగే సాగింది. కానీ, మరింత కిందకు వెళ్లగానే ఆ రేఖ పరిమితులను దాటింది. ఆ తర్వాత కొద్ది సేపు నేరుగా సాగి, పరిమితుల బయట దిశగా వెళ్లింది'' అని నరసింహా చెప్పారు.
''మెల్లగా కిందకు పోవాల్సింది పోయి, వేగంగా పడటం ప్రారంభించింది. నిజానికి ల్యాండర్ సెకన్‌కు 2 మీటర్ల వేగంతో చంద్రుడి ఉపరితలంపై దిగాలి. లేకపోతే, చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి ల్యాండర్‌ను వేగంగా కిందకు పడేలా చేసి ఉండొచ్చు'' అని ఆయన వివరించారు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
మొదటి రెండు దశల్లో రఫ్ బ్రేకింగ్, ఫైన్ బ్రేకింగ్ ఆపరేషన్స్ పూర్తైన తర్వాత ల్యాండర్ బాగానే ఉంది. హోవరింగ్ దశలోనే ల్యాండర్ గమనాన్ని సూచించే రేఖ పరిమితులు దాటినట్లు స్క్రీన్లపై కనిపించింది.
చంద్రయాన్-2 ప్రయోగంలో వైఫల్యం వెనుక సెంట్రల్ ఇంజిన్ లోపం ఉండొచ్చన్న నరసింహా అభిప్రాయంతో అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్‌లో న్యూక్లియన్ అండ్ స్పేస్ పాలసీ ఇనిషియేటివ్ హెడ్‌గా పనిచేస్తున్న డాక్టర్ రాజేశ్వరి రాజగోపాలన్ ఏకీభవించారు.
ల్యాండర్ నాలుగు మూలల్లో ఒక్కోటి చొప్పున నాలుగు ఇంజిన్లు ఉంటాయని, వాటిలో ఒకటి విఫలమై కూడా ఈ పరిణామం తలెత్తి ఉండొచ్చని ఆమె సందేహం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి:
- ఇస్రో చైర్మన్ కె శివన్ కథ: ఒకేసారి 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపిన నిరుపేద రైతు కొడుకు
- తెలంగాణ క్యాబినెట్ విస్తరణ: హరీష్‌రావు, కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డిలకు చోటు.. అభినందనలు చెబుతున్న అనుచరులు
- శ్రీహరి కోట నుంచి అంతరిక్షంలోకి మనిషిని పంపడానికి భారత్ సిద్ధంగా ఉందా?
- ఇస్రో: 'మానవ సహిత వ్యోమనౌక' ప్రాజెక్ట్ సారథి లలితాంబిక
- రాకెట్లను శ్రీహరి కోట నుంచే ఎందుకు ప్రయోగిస్తారు?
- అంతరిక్షం నుంచి సంపూర్ణ సూర్య గ్రహణం ఇలా ఉంటుంది
- భారత్ సున్నాను ఎలా ఆవిష్కరించింది?
- చంద్రయాన్-2: చంద్రుడి మీద దిగబోయే భారతదేశ అంతరిక్షనౌక ఇదే
- వ్యోమగాములను సురక్షితంగా కిందకు తెచ్చే శక్తి భారత్ సొంతం
- ఇస్రో చైర్మన్ శివన్ కన్నీటి పర్యంతం.. హత్తుకుని ఓదార్చిన ప్రధాని
- రియల్ లైఫ్ అపరిచితురాలు: ఒక్క మహిళలో 2500 మంది
- అనుష్కతో హానీమూన్‌కు సంబంధించి కోహ్లీ బయటపెట్టిన ఆసక్తికర విషయం ఏమిటి?
- యూరప్‌లో వందల సంఖ్యలో ఆడవాళ్లు ఎందుకు హత్యకు గురవుతున్నారు
- ఇందిరాగాంధీ హత్య: అంగరక్షకులే ఆమెను చంపేశారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








