నరేంద్ర మోదీ: కంటతడిపెట్టిన ఇస్రో చైర్మన్.. హత్తుకుని ఓదార్చిన ప్రధాని

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ కె.శివన్ ప్రధానమంత్రి మోదీ ఎదుట కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయనను మోదీ హత్తుకుని ఓదార్చారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం ఉదయం బెంగళూరులోని ఇస్రో కేంద్రంలో శాస్త్రవేత్తలనుద్దేశించి ప్రసంగించారు.
చంద్రయాన్-2 మిషన్ చివరి క్షణంలో విఫలమైనప్పటికీ ఉదాసీనం చెందవద్దని ధైర్యవచనాలు పలికారు.
మళ్లీ అద్భుత విజయాలు సాధిస్తామని ఉత్సాహం నింపేందుకు ప్రయత్నించారు.
అయితే.. మోదీ ప్రసంగం ముగిసిన తర్వాత ఇస్రో చీఫ్ కె.శివన్ ఉద్వేగంతో కన్నీళ్లుపెట్టుకున్నారు. ఆయనను మోదీ కౌగలించుకుని తల మీద చేతితో తడుతూ ఓదార్చారు.
కంటెంట్ అందుబాటులో లేదు
మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.పోస్ట్ of Facebook ముగిసింది
కొంతసేపటికి శివన్ స్థిమితపడ్డారు. ఆయనతో మోదీ మళ్లీ హితవచనాలు పలికారు.
ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 మిషన్‌లో.. విక్రమ్ మాడ్యూల్‌ను చంద్రుడి మీద దింపటానికి ఇస్రో చేపట్టిన ప్రయోగం అనుకున్న విధంగా సఫలం కాకపోవటంతో ఇస్రో శాస్త్రవేత్తలు కొంత నిస్పృహ చెందారు.
అయితే.. శాస్త్రసాంకేతికతలో వైఫల్యాలు ఉండవని.. అన్నీ ప్రయోగాలు, ప్రయాణాలే ఉంటాయని ప్రధాని మోదీ వారికి ధైర్యం చెప్పారు. వారు ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో, ఎంత శ్రమించారో దేశానికి తెలుసంటూ.. తాను, దేశం వారి వెంట ఉన్నామంటూ భరోసా ఇచ్చారు.
ఇవి కూడా చదవండి:
- సైన్స్‌లో వైఫల్యాలు ఉండవు... అన్నీ ప్రయోగాలు, ప్రయత్నాలే: మోదీ
- చంద్రయాన్-2: విక్రమ్ ల్యాండర్‌తో కమ్యూనికేషన్ తెగిపోయింది.. డేటా విశ్లేషిస్తున్నాం: ఇస్రో
- చంద్రయాన్-2 సామాన్య ప్రజలకు కూడా ఎందుకంత కీలకం
- వ్యోమగాములను సురక్షితంగా కిందకు తెచ్చే శక్తి భారత్ సొంతం
- శ్రీహరి కోట నుంచి అంతరిక్షంలోకి మనిషిని పంపడానికి భారత్ సిద్ధంగా ఉందా?
- ఇస్రో: 'మానవ సహిత వ్యోమనౌక' ప్రాజెక్ట్ సారథి లలితాంబిక
- రాకెట్లను శ్రీహరి కోట నుంచే ఎందుకు ప్రయోగిస్తారు?
- సంపూర్ణ సూర్య గ్రహణం అంతరిక్షం నుంచి చూస్తే ఎలా కనిపిస్తుందో తెలుసా...
- చంద్రయాన్-2: చంద్రుడి మీద దిగబోయే భారతదేశ అంతరిక్షనౌక ఇదే
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








