చంద్రయాన్-2 ల్యాండింగ్: విక్రమ్ ల్యాండర్‌తో కమ్యూనికేషన్ తెగిపోయింది.. డేటా విశ్లేషిస్తున్నాం: ఇస్రో

ఫొటో సోర్స్, iSro
చంద్రయాన్-2 ల్యాండర్ విక్రమ్‌తో కమ్యూనికేషన్ తెగిపోయిందని ఇస్రో ప్రకటించింది. చంద్రుడి ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల దూరం వరకు సవ్యంగా ప్రయాణించిన ల్యాండర్‌తో ఆ తరువాత సంబంధాలు తెగిపోయాయని ఇస్రో చైర్మన్ కె.శివన్ ప్రకటించారు. దీనికి కారణాలను విశ్లేషిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
చంద్రయాన్ 2 ల్యాండింగ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ బెంగళూరులోని ఇస్రో మిషన్ కంట్రోల్ కాంప్లెక్స్ నుంచి వీక్షించారు. ల్యాండర్ నుంచి సిగ్నల్స్ తెగిపోయిన తర్వాత శాస్త్రవేత్తలకు ఆయన ధైర్యం చెప్పారు. శాస్త్రవేత్తలు సాధించిన విజయం చిన్నది కాదని, ఆశాభావంతో ఉండాలని ప్రధాని సూచించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఇస్రో శాస్త్రవేత్తలను చూసి గర్వపడుతున్నానని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. వాళ్లు తమ శక్తివంచన లేకుండా ప్రయత్నం చేశారని అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియ ఇలా మొదలైంది..
శనివారం తెల్లవారుజామున 1:38 గంటలకు ల్యాండర్ విక్రమ్ సేఫ్ ల్యాండింగ్ ప్రక్రియ మొదలైంది. ఇందులో భాగంగా రఫ్ బ్రేకింగ్ ప్రారంభమైంది. అంటే కక్ష్య నుంచి చంద్రుడిపై దిగే ప్రక్రియ మొదలైంది. ఆ తర్వాత 1:48 గంటలకు ల్యాండర్ వేగం తగ్గుతూ ఫైన్ బ్రేకింగ్ ప్రారంభమైంది. రెండు నిమిషాల తర్వాత అంటే 1:50 గంటలకు లోకల్ నావిగేషన్ మొదలైంది.
అంతా సవ్యంగా సాగితే 1:52 గంటలకు ల్యాండర్ చంద్రుడి తొలి చిత్రాన్ని భూమికి పంపించాల్సి ఉంది. అలాగే, 1:53కి ల్యాండర్ చంద్రుడిపై సురక్షితంగా దిగాలి. కానీ, చివరి నిమిషంలో సంకేతాలు తెగిపోయాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
ల్యాండర్ దిగాల్సిన చోటు నుంచి 2.1 కిలోమీటర్ల దూరంలో ఉండగా సిగ్నల్స్ కట్ అయ్యాయి. ల్యాండర్ దిశ కొద్దిగా మారినట్లు స్క్రీన్‌పై గుర్తించారు.
ఇస్రో శాస్త్రవేత్తల ముఖాల్లో టెన్షన్ స్పష్టంగా కనిపించింది. ఏం జరిగిందో కాసేపు అర్థం కాలేదు. ఆ తర్వాత కాసేపటికి ల్యాండర్‌తో సంబంధాలు తెగిపోయాయని ఇస్రో చైర్మన్ ప్రకటించారు. డేటాను విశ్లేషిస్తున్నామని వివరించారు.
షెడ్యూల్ ప్రకారం 1:53 గంటలకు ల్యాండర్ చంద్రుడిపై సేఫ్ ల్యాండింగ్ కావాల్సి ఉంది. ఆ తర్వాత 3:53 గంటలకు రోవర్ ప్రజ్ఞాన్ ప్రక్రియ ప్రారంభమై, 4: 23 గంటలకు పని ప్రారంభించాల్సి ఉంది. 5:19 గంటలకు ల్యాండర్ నుంచి ప్రజ్ఞాన్ బయటకు వచ్చి, 5:29కి చంద్రుడి ఉపరితలంపై దిగాల్సి ఉంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
రెండు అగ్ని పర్వతాల మధ్యలోనున్న ఎత్తైన ప్రాంతంలో సాఫ్ట్ ల్యాండింగ్
చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలోని మాంజినస్-సీ, సింపెలియస్-ఎన్ అనే రెండు అగ్ని పర్వతాల మధ్యలోనున్న ఎత్తైన ప్రాంతంలో ల్యాండర్ దిగాల్సి ఉంది.
చంద్రుడి ఉపరితలంపైన, లోపల ఒక రోజు (ఇది భూమిపై 14 రోజులకు సమానం) పాటు పరిశోధనలు, ప్రయోగాలను నిర్వహించేలా రోవర్‌ను రూపొందించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 6
అంతకుముందు, చంద్రయాన్ 2 అరుదైన క్షణాలను వీక్షించాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు పిలుపు ఇచ్చారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 7
చంద్రుడిపై ఎవ్వరూ దిగని చోట ఇస్రో ఎందుకు అడుగు పెట్టాలనుకుంది
ఇప్పటివరకూ చంద్రుడి మీద దిగిన వ్యోమనౌకలకు భిన్నంగా ఇది చంద్రుడి దక్షిణ ధ్రువం మీద దిగాలనుకుంది.
ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువం దగ్గరే ఎందుకు దిగాలనుకుందన్న ఈ ప్రశ్న చాలామందికే వచ్చి ఉండొచ్చు. ఇక్కడ దిగడం క్లిష్టమైన ప్రక్రియ అని భావిస్తున్నప్పుడు చంద్రుడిపై పరిశోధనకు ఆ ప్రదేశాన్నే ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది?
చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని ఇంతవరకూ ఎవరూ చేరుకోలేదు. దీనిపై ఎవరూ పరిశోధన చేయలేదు. అందుకే ఇది ప్రత్యేకం, ఇక్కడ దిగడం ద్వారా ఏదైనా కొత్త విషయాన్ని కనిపెట్టేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
దక్షిణ ధ్రువం బిలియన్ల సంవత్సరాలుగా సూర్యుడి నీడలోనే ఉంది. ఇక్కడ సూర్యరశ్మి చేరకపోవడం వల్ల ఇక్కడ అసాధారణ శీతల వాతావరణం ఉంటుంది.
శాశ్వతంగా సూర్యుడి ఛాయ కింద ఉండే ఈ ప్రాంతాల్లో దాదాపు వంద మిలియన్ టన్నుల నీరు, ఖనిజాలు ఉండే అవకాశాలున్నాయన్నది శాస్త్రవేత్తల భావన.
ఇటీవల చేపట్టిన కొన్ని ఆర్బిటింగ్ మిషన్ల ద్వారా ఈ విషయం స్పష్టమైంది. నీరు లభించే అవకాశముండటంతో చందమామ దక్షిణ ధృవం భవిష్యత్‌లో మానవ మనుగడకు అనువైన ప్రాంతం కావచ్చని శాస్త్రవేత్తల ఆలోచన.

ఫొటో సోర్స్, iSro
చంద్రుడి ఉపరితల పొరలో హైడ్రోజన్, అమ్మోనియా, మీథేన్, సోడియం, మెర్క్యూరీ, వెండి లాంటి మూలకాల ఆనవాళ్లు ఉన్నట్లు అంచనా.
సౌరవ్యవస్థలోని ఐట్కెన్ బేసిన్ అంచుల్లో చంద్రుడి దక్షిణ ధృవ ప్రాంతం ఉంది. ఇక్కడి ఉపరితలభాగమంతా చంద్రుడి పైభాగం (క్రస్ట్), ఉపరితలం నుంచి లోపలి భాగం (మ్యాంటిల్)లో లభ్యమయ్యే పదార్థాలతో నిండి ఉంటుంది.
ఈ పదార్థాలపై పరిశోధనలు నిర్వహిస్తే... అసలు చంద్రమామ ఎలా ఏర్పడిందో, భవిష్యత్ మిషన్లకు ఇది ఓ వనరుగా ఉపయోగపడేందుకు అవకాశం ఉందో లేదో వంటి విషయాలన్నీ స్పష్టమయ్యే అవకాశం ఉంది.

ఫొటో సోర్స్, iSro
చంద్రయాన్ లక్ష్యం ఏమిటి
భూమి పుట్టుక గురించి తెలుసుకోవడం కోసం దశాబ్దాలుగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ సువిశాల విశ్వంలో భూమి పుట్టుక గురించిన పూర్తి ఖగోళ చరిత్ర తెలుసుకోడానికి చంద్రుడే అత్యంత కీలకమైన సమాచారం అందించే వేదిక.
సౌర కుటుంబంలో భూమి పుట్టుక గురించిన స్పష్టమైన, నిర్ధిష్టమైన సమాచారం దొరికేది చంద్రుడి దగ్గర నుంచే. దీంతో పాటు చంద్రుడి పుట్టుక గురించి అన్వేషించాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి.
చంద్రయాన్ 1 చంద్రుడి మీద నీటి జాడల్ని కనుగొంది. చంద్రయాన్ 2 అక్కడి మట్టిని విశ్లేషించడం ద్వారా.. ఆ నీరు ఎలా వచ్చిందో కనుక్కునే లక్ష్యంతో వెళ్లింది.
2022లో చంద్రుడిపైకి ఇండియన్
భారత్ చంద్రుడి ఉపరితలంపై దిగేందుకు చేస్తున్న తొలి ప్రయత్నం చంద్రయాన్-2. ఇంతకు ముందు రష్యా, అమెరికా, చైనా ఈ ప్రయోగాలు చేశాయి. నాలుగు టన్నుల బరువున్న ఈ అంతరిక్షయాత్రలో ఒక లూనార్ ఆర్బిటర్, ఒక ల్యాండర్, ఒక రోవర్ ఉన్నాయి.
చంద్రుడిపై ప్రపంచవ్యాప్తంగా అన్వేషణలు కొనసాగుతున్నాయి. చంద్రయాన్-2 తర్వాత భారత్ 2022లో చంద్రుడిపై వ్యోమగామిని పంపించేందుకు ప్రణాళికలు సిద్ధంచేస్తోంది.
"మేం చంద్రుడిపై ఉన్న బండరాళ్లను పరిశీలించి, వాటిలో మెగ్నీషియం, కాల్షియం, లోహాలు లాంటివి ఉన్నాయేమో అన్వేషించడానికి ప్రయత్నిస్తాం. దానితోపాటు అక్కడ నీళ్లున్నాయా అనే సంకేతాలు కూడా వెతుకుతాం. చంద్రుడి బయటి ఉపరితలాన్ని కూడా పరిశీలిస్తాం" అని ఇస్రో చెప్పింది.
ఇవి కూడా చదవండి:
- చంద్రుడిపై దిగడానికి అపోలో మిషన్‌కు 4 రోజులు పడితే, చంద్రయాన్-2కు 48 రోజులెందుకు
- శ్రీహరి కోట నుంచి అంతరిక్షంలోకి మనిషిని పంపడానికి భారత్ సిద్ధంగా ఉందా?
- ఇస్రో: 'మానవ సహిత వ్యోమనౌక' ప్రాజెక్ట్ సారథి లలితాంబిక
- రాకెట్లను శ్రీహరి కోట నుంచే ఎందుకు ప్రయోగిస్తారు?
- అంతరిక్షం నుంచి సంపూర్ణ సూర్య గ్రహణం ఇలా ఉంటుంది
- భారత్ సున్నాను ఎలా ఆవిష్కరించింది?
- చంద్రయాన్-2: చంద్రుడి మీద దిగబోయే భారతదేశ అంతరిక్షనౌక ఇదే
- వ్యోమగాములను సురక్షితంగా కిందకు తెచ్చే శక్తి భారత్ సొంతం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)