చంద్రయాన్-2: చంద్రుడి మీద దిగబోయే భారతదేశ అంతరిక్షనౌక ఇదే

ఫొటో సోర్స్, PRESS INFORMATION BUREAU, INDIA
చంద్రుడిపై దిగటం కోసం రూపొందించిన అంతరిక్ష నౌకను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఆవిష్కరించింది.
ఈ ఏడాది సెప్టెంబర్‌లో చంద్రుడిపైకి ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ను పంపించాలన్నది ఇస్రో ప్రణాళిక.
ఇది విజయవంతమైతే.. చంద్రుడి మీద అంతరిక్ష నౌకను క్షేమంగా దింపిన నాలుగో దేశంగా భారత్ అవతరిస్తుంది.
ఇంతకుముందు అమెరికా, అప్పటి సోవియట్ యూనియన్, చైనాలు మాత్రమే ఈ ఘనతను సాధించాయి.
చంద్రుడి మీద భారతదేశం చేపడుతున్న రెండో పరిశోధన కార్యక్రమం చంద్రయాన్-2.
మొదటి మిషన్ చంద్రయాన్-1ను 2008లో ఇస్రో ప్రయోగించింది. అది చంద్రుడి చుట్టూ పరిభ్రమించింది కానీ చంద్రుడి ఉపరితలం మీద దిగలేదు.

ఫొటో సోర్స్, PRESS INFORMATION BUREAU, INDIA
ఇప్పుడు చేపట్టిన చంద్రయాన్-2 మిషన్‌లో అంతరిక్ష నౌక చంద్రుడి మీద దిగుతుంది. ఉపరితలం మీద పరిశోధన చేస్తుంది. నీరు, ఖనిజాలు, రాతి నిర్మాణాల సమాచారాన్ని సేకరిస్తుంది.
ఈ కొత్త అంతరిక్ష నౌకలో ఒక ల్యాండర్, ఒక ఆర్బిటర్, ఒక రోవర్ ఉంటాయి. దీనిని ఇస్రో పరిశోధన కేంద్రంలో శాస్త్రవేత్తలు సిద్ధం చేస్తున్నారు.
అంతా ప్రణాళిక ప్రకారం జరిగితే.. ఈ నౌకలోని ల్యాండర్, రోవర్‌లు సెప్టెంబర్‌లో చంద్రుడి ఉత్తర ధృవం మీద దిగుతాయి. అది విజయవంతమైతే.. ఆ ప్రాంతంలో దిగిన తొలి అంతరిక్ష నౌకగా రికార్డు సృష్టిస్తుంది.
ఈ రోవర్ చంద్రుడి మీద 14 రోజులు పనిచేసేలా ప్రణాళిక రూపొందించినట్లు ఇస్రో చైర్‌పర్సన్ కె.శివన్ టైమ్స్ ఆఫ్ ఇండియా దినపత్రికకు చెప్పారు.
''చంద్రుడి ఉపరితలం మీద ఉన్న పదార్థాలను ఈ రోవర్ విశ్లేషిస్తుంది. ఆ సమాచారాన్ని, చిత్రాలను భూమికి పంపిస్తుంది'' అని ఆయన వివరించారు.
ఇవి కూడా చదవండి:
- వ్యోమగాములను సురక్షితంగా కిందకు తెచ్చే శక్తి భారత్ సొంతం
- భారత్ సున్నాను ఎలా ఆవిష్కరించింది?
- ఫోర్బ్స్ టాప్ 100 మంది ధనిక క్రీడాకారుల్లో విరాట్ కోహ్లీ
- ఆంధ్రా సరిహద్దులో అరుదైన ఆదివాసీ తెగ 'రీనో'
- శృంగారం సాంకేతికాభివృద్ధికి ఎలా దోహదపడింది
- ఆస్ట్రేలియాలో విరాట్ కోహ్లీ చెప్పిన మర్యాద కథ
- అల్యూమినియం బ్యాట్: క్రికెట్ చరిత్రలో వివాదాస్పదమైన, క్రికెట్ నిబంధనలు తిరగరాసిన ఒక బ్యాట్ కథ
- అమెరికా - ఇరాన్ ఘర్షణ: హోర్ముజ్ జలసంధిలో సంక్షోభం మీ మీద, ప్రపంచం మీద చూపే ప్రభావం ఏమిటి?
- ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నియామకం ఎందుకంత వైరల్ అయింది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









