ఇస్రో చైర్మన్ కె శివన్ కథ: ఒకేసారి 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపిన నిరుపేద రైతు కొడుకు

ఫొటో సోర్స్, Getty Images
సెప్టెంబర్ 7 ఉదయం బెంగళూరు ఇస్రో స్పేస్ రీసెర్చ్ సెంటర్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ తిరిగి వెళ్తున్నప్పుడు ఇస్రో చీఫ్ కె.శివన్ భావోద్వేగానికి గురయ్యారు.
దానికి కేవలం కొన్ని గంటల ముందు ఇస్రో చంద్రయాన్-2 సిగ్నల్ అందడం ఆగిపోయింది. విక్రమ్ రోవర్ చంద్రుడిపై దిగిందా లేదా, అసలు దానికి ఏమైంది అనే ప్రశ్నలకు సమాధానాలే లేకుండా పోయాయి.
చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ ఉన్న ప్రాంతాన్ని గుర్తించినట్లు కె శివన్ ఆదివారం వెల్లడించారు.
ప్రధానమంత్రి మోదీ ఎదుట భావోద్వేగానికి గురైన శివన్ ఫొటోలు, వీడియో టీవీ, ఆన్‌లైన్, సోషల్ మీడియాలో వచ్చిన వెంటనే ఆయన గురించి చర్చ మొదలైంది.
చంద్రయాన్-2 యాత్ర పూర్తి కాకపోవడంపై భావోద్వేగానికి గురైనా శివన్ మానసికంగా చాలా బలంగా ఉంటారు.
తక్కువ ఖర్చుతో ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపే అంశంలో భారత్ ఇప్పుడు ఎన్నో దేశాలకు ఒక గమ్యంగా మారిందంటే అది ఆయన కృషి వల్లే సాధ్యమైంది.
మంగళ్ మిషన్ కోసం తక్కువ ఖర్చుతో పీఎస్ఎల్వీ ప్రయోగ వ్యూహాన్ని అభివృద్ధి చేయడంలో కూడా శివన్ కీలక పాత్ర పోషించారు.
2017 ఫిబ్రవరి 15న పీఎస్ఎల్వీ ద్వారా ఒకేసారి 104 ఉపగ్రహాలను(బాహుబలి) విజయవంతంగా అంతరిక్షంలో ప్రయోగించడంలో విజయవంతం కావడం వెనుక ఉన్న ఆ చీఫ్ మిషన్ ఆర్కిటెక్ట్ డాక్టర్ కె శివన్.
శివన్ ఒక టీవీ ఇంటర్వ్యూలో బేబీ ఉపగ్రహం గురించి చెప్పారు. ఇది ఇస్రోకు చాలా పెద్ద విజయం అని, భారత్ ఒకేసారి వంద కంటే ఎక్కువ ఉపగ్రహాలను పంపించిన తొలి దేశంగా నిలిచిందని అన్నారు.

ఫొటో సోర్స్, TWITTER @ISRO
సామాన్యుల జీవితాల్లో అంతరిక్ష శాస్త్రం
శివన్ నేతృత్వంలో లిథియం బ్యాటరీని కూడా తయారు చేశారు. దీనిని ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉపయోగిస్తారు.
సామాన్యుల జీవితాల్లో అంతరిక్ష విజ్ఞానం ఉపయోగించడమే ఇస్రో ముఖ్య ఉద్దేశం అని శివన్ స్వయంగా చెబుతారు. రాకెట్‌ను అంతరిక్షంలోకి పంపించే టెక్నాలజీని పరిశ్రమలకు అనుసంధానం చేసే దిశగా కూడా ఇస్రో పనిచేస్తోంది.
ఇస్రో ఇప్పటివరకూ 300 నుంచి 400 టెక్నాలజీ పరిశ్రమలకు దీనిని ట్రాన్స్‌ఫర్ చేసిందని ఆయన చెప్పారు.
వైద్య ఉపకరణాల అభివృద్ధి రంగంలో కూడా ఆయన ఎంతో కృషి చేశారు. మైక్రోప్రాసెసర్ నియంత్రిత కృత్రిమ అవయవాలు, కృత్రిమ గుండె పంప్ దీనేనే వామ్ వెంట్రికల్ అసిస్ట్ డివైస్‌ను ఫీల్డ్ ట్రయల్ కోసం సిద్ధం చేశారు.
సిక్స్ డీ సిమ్యులేషన్ సాఫ్ట్‌వేర్ 'సితార' తయారు చేసిన టీమ్‌కు శివన్ చీఫ్‌గా ఉన్నారు.
వాతావరణ సూచనలు, గాలి గతి, స్థితిని గమనిస్తూ ఏడాదిలో ఏ రోజైనా రాకెట్‌ను లాంచ్ చేయడం సాధ్యం అయయేలా శివన్ ఒక వ్యూహం రూపొందించారు.

ఫొటో సోర్స్, iSro
పీఎస్ఎల్వీని బలోపేతం చేశారు
1982లో శివన్ ఇస్రోకు వచ్చినపుడు మొదట ఆయన పీఎస్ఎల్వీ ప్రాజెక్ట్ కోసం పనిచేశారు.
తర్వాత ఆయన ఎండ్ టు ఎండ్ మిషన్ ప్లానింగ్, మిషన్ డిజైన్, మిషన్ ఇంటిగ్రేషన్ అండ్ అనాలసిస్‌కు చాలా భాగస్వామ్యం అందించారు.
ప్రస్తుతం శివన్‌కు ఏరోస్పేస్ ఇంజనీరింగ్, స్పేస్ ట్రాన్స్‌పోర్టేషన్ సిస్టమ్ ఇంజనీరింగ్, లాంచ్ వెహికల్ అండ్ మిషన్ డిజైన్, కంట్రోల్ అండ్ గైడెన్స్ డిజైన్, మిషన్ సాఫ్ట్‌వేర్ డిజైన్, మిషన్ వివిధ పరీక్షా ఫలితాల సమన్వయం, ఏరోస్పేస్‌కు సంబంధించిన ఏ ప్రయోగం అయినా మొత్తం ప్రక్రియను రూపొందించడం, దాని విశ్లేషణ, ఫ్లైట్ సిస్టమ్స్ ధ్రువీకరణలో ప్రత్యేకత ఉంది.
పీఎస్ఎల్వీని బలోపేతం చేసే వ్యూహాలకు ఆయన కీలక భాగస్వామ్యం అందించారు.
ఇస్రోలోని ఆర్ఎల్వీ-టీడీ సహా జీఎస్ఎల్వీ ఎంకే 2, ఎంకే 3 లాంటి మిగతా లాంచ్ వెహికల్స్‌కు ఆయన ఒక ఆధారంగా నిలిచారు.

ఫొటో సోర్స్, iSro
కష్టాల్లో గడిచిన బాల్యం
శివన్ ఆయన కుటుంబంలో మొదటి గ్రాడ్యుయేట్. తర్వాత ఇంజనీర్, ఇస్రో చీఫ్ కూడా అయిన శివన్ 1957 ఏప్రిల్ 14న తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో ఒక రైతు కుటుంబంలో పుట్టారు.
ఇంగ్లిష్ వార్తాపత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియాలోని ఒక ఇంటర్వ్యూ ప్రకారం కుటుంబ ఆర్థిక పరిస్థితి దీనంగా ఉండడంతో శివన్ తమ్ముడు, చెల్లెలు ఉన్నత చదువులు చదవలేకపోయారు.
జర్నలిస్ట్ పల్లవ్ బాగ్లాకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన శివన్ తన ప్రాథమిక విద్య మేలా సరాకలావిల్లై గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో తమిళ మీడియంలో జరిగిందని చెప్పారు. ఆయన హైస్కూల్ చదువు కూడా తమిళ మీడియంలోనే సాగింది. స్కూల్లో చదువుకునేటప్పుడు ఆయన తండ్రికి వ్యవసాయంలో సాయం చేసేవారు.
తర్వాత శివన్ 1977లో మదురై యూనివర్సిటీ నుంచి గణితంలో గ్రాడ్యుయేట్ అయ్యారు. ఈ పరీక్షల్లో వంద శాతం మార్కులు తెచ్చుకోవడం వల్లే తండ్రి ఆయన్ను ఉన్నత చదువులకు అనుమతించారు.

ఫొటో సోర్స్, Pib
శాస్త్రవేత్తగా ప్రయాణం
ఆ తర్వాత శివన్ 1980లో మద్రాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఏరోనాటిక్స్ ఇంజనీరింగ్ చేశారు. ఆ తర్వాత రెండేళ్లకు బెంగళూరు భారత విజ్ఞాన సంస్థ(ఐఐఎస్‌సి) నుంచి ఆయన ఏరోస్పేస్‌లో పీజీ చేశారు. అదే ఏడాది శివన్ ఇస్రోతోనూ కలిశారు. తర్వాత ఆయన 2007లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో ఐఐటీ బాంబే నుంచి పీహెచ్‌డీ కూడా పూర్తి చేశారు.
డాక్టర్ కలాం అవార్డు సహా ఎన్నో పురస్కారాలు
డాక్టర్ శివన్‌కు 2007లో ఇస్రో మెరిట్ అవార్డ్, 2011లో డాక్టర్ బిరేన్ రాయ్ స్పేస్ సైన్స్ అండ్ డిజైన్ అవార్డ్, 2016లో ఇస్రో అవార్డ్ ఫర్ అవుట్‌స్టాండింగ్ అచీవ్‌మెంట్ సహా ఎన్నో పురస్కారాలు లభించాయి. చాలా యూనివర్సిటీలు ఆయనకు డాక్టరేట్ ఇచ్చాయి. శివన్ 2014 ఏప్రిల్‌లో డాక్టర్ ఆఫ్ సైన్స్, 1999లో డాక్టర్ విక్రమ్ సారాభాయ్ రీసెర్చ్ అవార్డ్ కూడా అందుకున్నారు.
అంతరిక్ష రవాణా వ్యవస్థ డిజైన్, నిర్మాణంలోని అన్ని రంగాల్లో తనకు ఉన్న అనుభవంతో శివన్ 'ఇంటిగ్రేటెడ్ డిజైన్ ఫర్ స్పేస్ ట్రాన్స్‌పోర్టేషన్ సిస్టమ్' పేరుతో ఒక పుస్తకం రాశారు. 2015లో ఈ పుస్తకం ప్రచురితమైంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో డాక్టర్ కె శివన్ అందించిన భాగస్వామ్యానికి గత నెల తమిళనాడు ప్రభుత్వం ఆయనను డాక్టర్ కలాం పురస్కారంతో గౌరవించింది.
వైజ్ఞానిక అభివృద్ధి, హ్యుమానిటీస్, విద్యార్థి సంక్షేమాలను ప్రోత్సహించినందుకు ఈ అవార్డు ప్రదానం చేస్తారు.
జులై 15న చంద్రయాన్-2 ప్రొజెక్షన్ ముందు జీఎస్ఎల్వీ ఎంకే-3లో కొన్ని సమస్యలు వచ్చాయి. దాంతో శివన్ తన శాస్త్రవేత్తల టీంతో దాన్ని కేవలం 24 గంటల్లో సరిచేశారు. దాంతో చంద్రయాన్-2ను నిర్ధారిత సమయానికే పంపించగలిగారు.
ఇవి కూడా చదవండి:
- తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా మంత్రి సబిత ఇంద్రారెడ్డి.. క్యాబినెట్లోకి తిరిగొచ్చిన కేటీఆర్, హరీశ్ రావు
- యూరప్‌లో వందల సంఖ్యలో ఆడవాళ్లను చంపేస్తున్నారు.. ఎందుకు?
- 6174: ఒక భారతీయ ఉపాధ్యాయుడు కనిపెట్టాడు.. డెబ్బై ఏళ్లుగా గణిత శాస్త్రజ్ఞులు ఆశ్చర్యపోతున్నారు
- ప్రపంచానికి భారత్ ఇచ్చిన గిఫ్ట్స్!
- టెలిగ్రాం యాప్ భారత్‌దేనా?
- చైనా ఆట కట్టించాలంటే భారత్ ఏం చేయాలి
- భూమిని సూర్యుడే కబళిస్తాడా?
- సూర్యుడు చేసే శబ్దం ఇది.. మీరెప్పుడైనా విన్నారా!!
- మనకు వెలుగిచ్చే సూర్యుడికే మరణం వస్తే? ప్రపంచం అంతమైపోతుందా?
- 'గాజులు పంపించమంటారా' అని పాకిస్తాన్ రెచ్చగొడుతోంది: అజిత్ డోభాల్
- నిచ్చెనలో తల ఇరుక్కుపోయి అయిదు రోజులు అలాగే ఉన్నాడు...
- ఈ దేశాలు రాజధాని నగరాలను ఎందుకు మార్చాయి?
- అంతరిక్షం నుంచి అందరికీ ఇంటర్నెట్.. కొత్త ఉద్యోగాలు వస్తాయ్
- మీ చేతిలోని స్మార్ట్ ఫోనే మీకు శత్రువుగా మారితే...
- "డబ్బులిచ్చి ఉద్యోగులతో అబద్ధాలు చెప్పిస్తున్నారు" - అమెజాన్‌పై ట్విటర్‌లో విమర్శలు
- చంద్రుడిపై దిగడానికి అపోలో మిషన్‌కు 4 రోజులు పడితే, చంద్రయాన్-2కు 48 రోజులెందుకు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)










