టెలిగ్రాం యాప్ భారత్‌దేనా?

ఫొటో సోర్స్, Telegram.org
సాయంత్రం 7:00 గంటలు. దిల్లీ మెట్రో రైలులో విపరీతమైన రద్దీ.
మరో కాలు కింద పెట్టడానికి చోటు దొరక్క కొంగ జపం చేస్తూ, పక్కనోడి సెల్ ఫోన్‌లో మూకీ సినిమా చూస్తుండగా.. ఇంతలో నా ప్యాంటు జేబులోని సెల్, ఎవరో పీక పిసికినట్లుగా కేక వేసింది.
అతి కష్టం మీద దాన్ని బయటకు తీసి చూస్తే అదొక వాట్సప్ సందేశం.

ఫొటో సోర్స్, Ramakrishna/whatsapp
దాని సారాంశం సంక్షిప్తంగా ఏమిటంటే.. ''భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ దేశీయ ఉత్పత్తులను వినియోగించమని పిలుపునిచ్చారు. వాట్సప్ అనేది అమెరికా కంపెనీ కనుక భారతీయులు రూపొందించిన టెలిగ్రాం అనే యాప్‌ను వాడమని చెప్పారు. వాట్సప్‌ను ఒకరు ఒక ఏడాది పాటు వాడితే అమెరికాకు రూ.56 ఆదాయం వస్తుంది. ఆ లెక్కన 20 కోట్ల మంది వాడితే రూ.1,120 కోట్ల భారతదేశ సొమ్ము అమెరికాకు వెళ్లిపోతుంది. కాబట్టి స్వదేశీ ఉత్పత్తులు అందరూ వాడేలా చూడండి.''

ఫొటో సోర్స్, Facebook/pavel durov
ఇటువంటి సందేశం బహుశా మీకు కూడా వచ్చి ఉండొచ్చు. మరి టెలిగ్రాం నిజంగానే భారతీయ కంపెనీనా?
టెలిగ్రాం యాప్‌ను పావెల్ దురోవ్, నికోలాయ్ దురోవ్ అనే అన్నదమ్ముళ్లు రూపొందించారు. వీరు రష్యన్లు. అయితే ఈ యాప్ రష్యా ఐటీ చట్టాలకు విరుద్ధంగా ఉన్నందు వల్ల ప్రస్తుతం ఆ సంస్థ దుబాయి కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 2013లో ఈ యాప్‌ను విడుదల చేశారు. వాట్సప్ మాదిరే ఇది కూడా మెసేంజర్ యాప్.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




