నిచ్చెనలో తల ఇరుక్కుపోయి అయిదు రోజులపాటు నరకయాతన

ఫొటో సోర్స్, Getty Images
కుక్కలు, పిల్లులు, మేకలు వంటి పెంపుడు జంతువులు నీరు తాగే ప్రయత్నంలో వాటి తల బిందెలో ఇరుక్కుపోయిన ఘటనలు అప్పుడప్పుడు చూస్తుంటాం.
కొన్నిసార్లు ఎవరో ఒకరు పట్టించుకుని వాటిని ఆ కష్టం నుంచి తప్పిస్తారు. ఎవరూ రక్షించకపోతే అలానే నాలుగైదు రోజులు తిరుగుతూ తిండీ నీరు లేక శుష్కించిపోతాయి.
ఫ్రాన్స్‌లో ఓ వృద్ధుడికి ఇలాంటి కష్టమే ఎదురైంది. అయితే, ఆయన తల ఇరుక్కున్నది బిందెలో కాదు, నిచ్చెనలో.
సమయానికి ఎవరూ లేకపోవడంతో ఎటూ కదల్లేక అయిదు రోజుల పాటు అలాగే ఉండిపోయారు.
సోదరి రావడంతో..
ఫ్రాన్స్‌లోని ఎపినాల్ ప్రాంతానికి చెందిన అరవయ్యేళ్ల వృద్ధుడు నిచ్చెన వేసి బాత్రూం గోడలకు ఏదో అలంకరించబోతున్న సమయంలో జారిపడ్డారు. ఆయన తల నిచ్చెన మెట్ల మధ్య ఇరుక్కుపోయింది.
ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు.. ఆయన కూడా కదల్లేకపోయారు. కనీసం ఫోన్ కూడా అందుకోలేకపోయారు.
అలా ఇంట్లోనే అయిదు రోజుల పాటు ఉండిపోయారాయన.
అయిదు రోజుల తరువాత సోదరి ఆయన ఇంటికి రావడంతో నిచ్చెనలో ఇరుక్కుపోయిన సంగతి తెలిసింది. వెంటనే ఆమె ఆసుపత్రిలో చేర్పించడంతో ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు.
మెడ ఇరుక్కుపోవడంతో రక్త నాళాలు నొక్కుకుపోయి తలలోకి రక్తప్రసరణ కూడా తగ్గిపోయింది.
అయిదు రోజుల పాటు ఆహారం, నీరు లేకుండా గడపడంతో డీహైడ్రేషన్‌కు గురయ్యారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- సన్నీ లియోని ఇంటర్వ్యూ: 'రోడ్డు మీద నుంచున్న వేశ్యకు - పోర్న్ స్టార్‌కి తేడా ఏమిటి?'
- సన్నీ లియోని సినిమా పేరుపై వివాదం
- అమెరికాలో భారత ఎంబసీ పేరిట భారీ మోసాలు
- పంటకు దిష్టిబొమ్మగా సన్నీ లియోని ఫొటో
- పోర్న్ స్టార్ మియా మాల్కోవా సన్నీ లియోనిని మించి పోతారా!
- అరటి పళ్లపై జీఎస్టీ ఎంత? రెస్టారెంట్లలో తింటే దేనికి పన్ను కట్టాలి? దేనికి అక్కర్లేదు?
- పాకిస్తాన్‌లోని వేలాది హిందూ ఆలయాలకు మోక్షం ఎప్పుడు?’
- BODMAS: 8÷2(2+2) = ?.. ఈ ప్రశ్నకు మీ జవాబు ఏంటి?
- చార్లెస్ డార్విన్‌కూ అంతుచిక్కని మిస్టరీ: జీవపరిణామ సిద్ధాంతానికే ముప్పుగా పరిణమించిన 'విసుగుపుట్టించే రహస్యం'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








