కేదార్‌నాథ్: పీఎం మోదీ ధ్యానం చేసింది గుహలోనా, 'హోటల్'లోనా?

ఫొటో సోర్స్, TWITTER/ JP NADDA
- రచయిత, భూమికా రాయ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి. ఇప్పుడు ఫలితాలు ఎప్పుడెప్పుడా అని అందరూ వేచిచూస్తున్నారు.
అయితే, ఆదివారం వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజం అవుతాయని బీజేపీ చెబుతుంటే, విపక్షాలు మాత్రం అవి ఊహలు మాత్రమే అంటున్నాయి.
ఇక, చివరి దశ ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత బుద్ధపూర్ణిమ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కేదార్‌నాథ్ వెళ్లారు. తర్వాత ఆయన ఫొటోలు కూడా వైరల్ అయ్యాయి.
ఈ ఫొటోలు వైరల్ కావడానికి చాలా కారణాలున్నాయి.
ఒకవైపు విపక్షాలు మాక్పం ఇది ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన అంటుంటే, అటు ప్రధాన మంత్రి 17 గంటల తర్వాత గుహ నుంచి బయటకు రాగానే, తనకు ఏకాంతంగా ధ్యానం చేసుకోడానికి సమయం ఇచ్చిన ఎన్నికల సంఘానికి ధన్యవాదాలు చెప్పారు.

ఫొటో సోర్స్, TWITTER/ MODI
నరేంద్ర మోదీ ఆ గుహ నుంచి బయటికి వచ్చేసినా, ఆ గుహ మాత్రం ఇప్పటికీ చర్చల్లో నిలుస్తోంది.
ప్రధాన మంత్రి ఈ గుహలో గడపడం వల్ల ఆ ప్రాంతం గురించి కచ్చితంగా చర్చ జరుగుతుంది అని గడ్వాల్ మండల్ వికాస్ నిగమ్ జనరల్ మేనేజర్ బీఎల్ రాణా అన్నారు. జనం ఆ ప్రాంతం గురించి వీలైనంత ఎక్కువ తెలుసుకోవాలని భావిస్తారని తెలిపారు.
గడ్వాల్ మండల్ వికాస్ నిగమ్ ప్రస్తుతానికి ఆ గుహ బుకింగ్స్ ఆపేసిందంటే.. ఆ గుహకు ఎంత పాపులారిటీ వచ్చిందో అంచనా వేయచ్చు. జూన్ మొదటి వారంలో మళ్లీ బుకింగ్స్ ప్రారంభం అవుతాయని భావిస్తున్నారు.
కానీ ఇది నిజంగానే గుహా లేక వేరే ఏదైనా...
గడ్వాల్ మండల్ వికాస్ నిగమ్ వెబ్‌సైట్‌లో ఈ గుహకు సంబంధించిన పూర్తి సమాచారం ఉంది. గుహలో గడపడానికి ఉన్న కొన్ని నియమాలు, షరతులు చదివితే, మనం ఏదో హోటల్ నియమాలు, షరతుల గురించి చదువుతున్నట్లు ఉంటుంది.
స్వయంగా ఈ వెబ్‌సైట్‌లోనే చాలా చోట్ల ఈ ప్రాంతం నియమ నిబంధనల గురించి చెప్పడానికి హోటల్ అనే మాటను ఉపయోగించారు.

ఫొటో సోర్స్, HTTP://GMVNL.IN
ఈ గుహ పేరు రుద్ర ధ్యాన గుహ
గడ్వాల్ మండల్ వికాస్ నిగమ్ పరిధిలోకి వచ్చే రుద్ర ధ్యాన గుహ కేదార్‌నాథ్ ధామ్ పర్వతాలకు సుమారు 1 కిలోమీటరు పైనుంది. (కేదార్‌నాథ్ ఆలయం సముద్రమట్టానికి దాదాపు 11500 అడుగుల ఎత్తులో ఉంది)
ఈ గుహ ప్రవేశ ద్వారం కేదార్‌నాథ్ మందిరం వైపు ఉంటుంది. ఈ సహజ గుహలో బయటి భాగాన్ని స్థానిక రాళ్లతో నిర్మించారు. గుహ ప్రధాన ద్వారం దగ్గర రక్షణ కోసం చెక్క తలుపు బిగించారు.

ఫొటో సోర్స్, HTTP://GMVNL.IN
ఈ గుహలో ఏయే సౌకర్యాలు ఉన్నాయి
- దీనిలోపల కరెంటు, తాగునీటి ఏర్పాట్లు ఉన్నాయి.
- ఉదయం టీ, టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టీ, రాత్రి భోజనం అందిస్తారు. అయితే ఇవన్నీ ఒక నిర్ణీత సమయంలోనే లభిస్తాయి. కానీ వారికి ముందే చెప్పి ఆ సమయం మార్చుకోవచ్చు.
- ఈ గుహలో పూర్తిగా ఏకాంతంగా గడిపేలా ఏర్పాట్లు చేశారు. కానీ అత్యవసర స్థితిలో గడ్వాల్ మండల్ వికాస్ నిగమ్ మేనేజర్‌ను సంప్రదించవచ్చు.
- ఈ గుహలో ఒక కాలింగ్ బెల్ కూడా ఉంది. దీనిని గుహ దగ్గరే ఉండే అటెండెంట్‌ను పిలవడానికి ఉపయోగించవచ్చు.
- నియమాలు ఏంటి
- ఎవరైనా ఒక వ్యక్తి ఈ గుహను 3 రోజులకు మాత్రమే బుక్ చేసుకోవచ్చు.
- దీన్ని బుక్ చేసుకున్న వ్యక్తి బుక్ చేసిన తేదీకి రెండు రోజుల ముందే గడ్వాల్ మండల్ వికాస్ నిగమ్, గుప్త్ కాశీలో రిపోర్ట్ చేయడం తప్పనిసరి. అతడికి మొదట గుప్తకాశీలో తర్వాత కేదార్‌నాథ్‌లో వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. మెడికల్లీ, ఫిజికల్లీ ఫిట్ అని నిర్ధారించిన తర్వాతే వారికి గుహలో ఉండడానికి అనుమతి లభిస్తుంది.
- ఒక సారి ఒకే వ్యక్తి మాత్రమే ఈ గుహలో ఉండచ్చు.
- ఒకసారి మీరు గుహను బుక్ చేసిన తర్వాత, మళ్లీ క్యాన్సిల్ చేస్తే కారణం ఏదైనా రీఫండ్ లభించదు.

ఫొటో సోర్స్, HTTP://GMVNL.IN
బుకింగ్ ఎలా చేయాలి
- కేవలం గడ్వాల్ మండల్ వికాస్ నిగమ్ వెబ్‌సైట్ నుంచి మాత్రమే ఈ గుహను బుక్ చేసుకోవాలి.
- నో అబ్జక్షన్ సర్టిఫికెట్ లేదా సెల్ఫ్ డిక్లరేషన్ ఫాం నింపడం తప్పనిసరి
ఈ గుహకు ఆన్‌లైన్‌లో బుకింగ్ సదుపాయం కూడా ఉందని బీఎల్ రాణా చెప్పారు. కానీ కేదార్‌నాథ్‌లో కూడా దీనికి బుకింగ్ చేసుకోవచ్చని, కానీ వైద్య పరీక్షలు పూర్తైన తర్వాత మాత్రమే అది వీలవుతుందని తెలిపారు.
గుహకు అద్దె ఎంత?
ప్రస్తుతం దీని ధర ఒక రాత్రికి 990 రూపాయలని బీఎల్ రాణా చెప్పారు. కానీ ముందు ముందు ఈ ధర పెరగవచ్చని చెప్పారు. అది పూర్తిగా జనం స్పందనపై ఆధారపడి ఉంటుందని తెలిపారు.
అయితే, ప్రారంభంలో దీని ధర 3000 రూపాయలు పెట్టారు. కానీ ఎక్కువ మందికి దీని గురించి సమాచారం తెలీకపోవడంతో ఆ ధరను 990 రూపాయలకు తగ్గించారు.
ఇక ముందు ముందు జనం ఈ గుహలో గడపడానికి ఆసక్తి చూపిస్తారని రాణా భావిస్తున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఏం చేయచ్చు, ఏం చేయకూడదు...
గుహకు సంబంధించిన సమాచారంలోని ఒక భాగంలో 'హోటల్' అనే మాట ఉపయోగించారు. ఆ భాగం చదివితే ఇవేవో ఫైవ్ స్టార్ హోటల్ నిబంధనలు, షరతుల్లా అనిపిస్తాయి.
ఉదాహరణకు...
- చెకిన్ సమయంలో ఫొటో ఐడీ తీసుకురావడం తప్పనిసరి. చెకవుట్ చేసే సమయం మధ్యాహ్నం 12 గంటలని చెప్పారు.
- గది నుంచి బయటికి రాగానే లైట్, ఫ్యాన్, గీజర్, హీటర్ ఆపేయాలని, తలుపు వేయాలని ఇక్కడ ఉండేవారికి చెప్పారు.
- దయచేసి మీ విలువైన సామాన్లు లోపల వదలకండి, ఎందుకంటే హోటల్ వాటికి బాధ్యత వహించదు.

ఫొటో సోర్స్, GMVNL WEBSITE
ఇలా ఆ వెబ్‌సైట్‌లోని Do's & Dont's సెక్షన్లో చాలా విషయాలు రాశారు.
గత ఏడాది వరకూ కేదార్‌నాథ్ లోయలో ఇలాంటి ఒకే ఒక గుహ ఉండేదని, కానీ ఈ ఏడాది మరో గుహ నిర్మించామని బీఎల్ రాణా చెప్పారు. ముందు ముందు ఇలాంటివే మరికొన్ని గుహలను నిర్మించాలని తాము భావిస్తున్నట్లు తెలిపారు.
ఈ గుహలను కేదార్‌నాథ్ డెవలప్‌మెంట్ వర్క్స్ తరఫున నిర్మించినట్లు ఆయన చెప్పారు. గుహలో వై-ఫై సౌకర్యం గురించి మాట్లాడిన రాణా, మొత్తే కేదార్‌పురి అంతా వై-ఫై సౌకర్యం ఉందని, గుహ ఆ రేంజిలో ఉందా, లేదా అనేది చెప్పడం కష్టం అని తెలిపారు.
ప్రధానమంత్రి గుహలో ధ్యానం చేయడంతో గుహ హెడ్‌లైన్స్‌లో నిలవడంతో, రాబోవు రోజుల్లో ఇక్కడకు వచ్చేవారి సంఖ్య పెరుగుతుందని రాణాకు కూడా తెలుసు.
ఇవి కూడా చదవండి:
- చైనాలో వ్యభిచార వ్యాపారం.. సెక్స్ బానిసత్వంలో మగ్గిపోతున్న ఉత్తర కొరియా బాలికలు
- ‘‘బీజేపీ, నరేంద్రమోదీల దగ్గర చాలా డబ్బు ఉంది.. మా దగ్గర నిజం ఉంది’’
- అమిత్ షా కోల్‌కతా రోడ్ షోలో ఘర్షణలకు బీజేపీ కార్యకర్త 'ప్రణాళిక' వెనుక నిజం
- అంబేడ్కర్ విగ్రహాన్ని బీజేపీ ఎమ్మెల్యే కూల్చారా
- కమల్ హాసన్ వ్యాఖ్యలపై చర్చ: గాడ్సే.. హంతకుడా లేక తీవ్రవాదా?
- మోదీ నిజంగానే మిరాజ్ విమానాలను మేఘాలతో పాక్ రాడార్ నుంచి కాపాడారా...
- వీర్ సావర్కర్: కొందరికి హీరో, మరికొందరికి విలన్...
- పెళ్లి ఊరేగింపులో గుర్రం ఎక్కినందుకు దళితుల సామాజిక బహిష్కరణ
- మెషీన్లు ఆటోమేటిగ్గా మిమ్మల్ని 'ఫైర్' చేస్తే ఎలా ఉంటుంది
- మొట్టమొదటి ఎన్నికల ప్రచారం ఎలా జరిగింది?
- వారణాసిలో ముస్లింల ఇళ్లు కూల్చేస్తే.. హిందూ ఆలయాలు బయటపడ్డాయా
- 'నా దేశభక్తిని బలవంతంగా పరీక్షించకండి'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








