రాహుల్ గాంధీ: ‘‘బీజేపీ, నరేంద్రమోదీల దగ్గర చాలా డబ్బు ఉంది.. మా దగ్గర నిజం ఉంది’’

ఫొటో సోర్స్, @RahulGandhi
‘‘ఈ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ పాత్ర పక్షపాతపూరితంగా ఉంది’’ అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు.
‘‘మోదీ తను ఏదనుకుంటే అది మాట్లాడవచ్చు. కానీ అదే మాట మాట్లాడకుండా మమ్మల్ని ఆపుతున్నారు. ఎన్నికల షెడ్యూలును మోదీ ప్రచారం కోసం రూపొందించినట్లు కనిపిస్తోంది. బీజేపీ, నరేంద్రమోదీల దగ్గర చాలా డబ్బు ఉంది.. మా దగ్గర నిజం ఉంది’’ అని ఆయన విమర్శించారు.
రాహుల్‌గాంధీ శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడారు.
''ఉత్తర్ ప్రదేశ్‌లో బీఎస్‌పీ, ఎస్‌పీలు కలిసి ఎన్నికల్లో పోరాటం చేయాలని నిర్ణయించుకున్న వాస్తవాన్ని నేను గౌరవిస్తాను. కాంగ్రెస్ పార్టీ దృష్టిలో కాంగ్రెస్ సిద్ధాంతాన్ని నేను యూపీలో ముందుకు తీసుకెళ్లాల్సి ఉంది. బీజేపీ ఓడిపోయేలా చూడటమే మొట్టమొదటి ప్రాధాన్యంగా ఉండాలని జ్యోతిరాదిత్య, ప్రియాంకలకు నేను స్పష్టంగా చెప్పాను'' అని పేర్కొన్నారు.
''రెండో ప్రాధాన్యం.. కాంగ్రెస్ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లటం. మూడో ప్రాధాన్యం విధాన సభ ఎన్నికల్లో గెలవటం. కానీ సైద్ధాంతికంగా వాళ్లూ మా స్థానంలోనే ఉన్నారు. మాయావతి, ములాయంసింగ్, మమతా, చంద్రబాబులు నరేంద్రమోదీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తారని నేను అనుకోవటం లేదు'' అన్నారు.
ప్రతిపక్ష కూటమి గురించి మాట్లాడుతూ ‘‘నేను చాలా స్పష్టంగా చెప్పాను. జనం మే 23వ తేదీన నిర్ణయిస్తారు.. దాని ప్రాతిపదికగానే మేం పనిచేస్తాం’’ అని చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
‘‘మోదీ ప్రెస్ మీట్ అనూహ్యం.. అద్భుతం...’’
''ఎన్నికలు ముగియటానికి కేవలం నాలుగైదు రోజుల ముందు ప్రధానమంత్రి నరేంద్రమోదీ విలేకరుల సమావేశం నిర్వహిస్తున్నారు. ఇది అనూహ్యం.. భారత ప్రధానమంత్రి మొట్టమొదటిసారిగా విలేకరుల సమావేశం నిర్వహిస్తున్నారు'' అని రాహుల్ ఎద్దేవా చేశారు.
''ప్రధానమంత్రి ఇప్పుడు ప్రత్యక్ష విలేకరుల సమావేశం నిర్వహిస్తున్నారు. 'రఫేల్ అంశం మీద మీరు నాతో చర్చకు ఎందుకు రాలేదు?' అని ఆయనను అడుగుతున్నా. మిమ్మల్ని చర్చకు సవాల్ చేశాను. ఎందుకు చర్చకు రాలేదో మీడియాకు చెప్పండి'' అని ఆయన వ్యాఖ్యానించారు.
మోదీ మొదటి విలేకరుల సమావేశం మీద ట్విటర్ వేదికగా కూడా రాహుల్ విమర్శలు సంధించారు.
‘‘శుభాకాంక్షలు మోదీ గారూ.. అద్భుతమైన విలేకరుల సమావేశం.. తర్వాత (విలేకరుల సమావేశంలో) మీరు ఓ రెండు ప్రశ్నలకు సమాధానం ఇవ్వటానికి కూడా అమిత్ షా అనుమతించవచ్చు. బాగా చేశారు’’ అని ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి.
- నరేంద్రమోదీ: 'మళ్లీ పూర్తి మెజారిటీతో అధికారంలోకి వస్తాం'
- ఎడిటర్స్ కామెంట్: ఆంధ్రలో ఏ పార్టీది పైచేయి?
- మగాళ్ల ఆత్మహత్యకు ఈ ఐదు విషయాలే కారణమా
- సోనాగచ్చి మహిళా సెక్స్ వర్కర్లు: ‘ఈసారి మా ఓటు నోటాకే.. ఎందుకంటే..’
- విరాట్ కోహ్లీ వరల్డ్ కప్ అందించగలడా?
- వాట్సాప్‌లో సమస్య: మొబైల్ ఫోన్లపై హ్యాకర్ల దాడి.. రహస్యంగా నిఘా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








