మగాళ్ల ఆత్మహత్యకు ఈ ఐదు విషయాలే కారణమా

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచంలో ఏదో ఒక మూల 40 సెకన్లకు ఒకరు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. అందులో ఎక్కువ మంది మగవాళ్లే.
తమ సమస్య గురించి మాట్లాడలేనివారు, ఇతరుల సహాయం తీసుకోనివారే ఇలా బలవన్మరణాలకు సిద్ధమవుతున్నారు. ఇంతకీ పురుషులు ఏ విషయంలో ఇంకా బహిరంగంగా మాట్లాడాల్సి ఉంది?
సోషల్ మీడియా వర్సెస్ రియాలిటీ
సోషల్ మీడియా వినియోగం మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
సోషల్ మీడియాలో అధికంగా గడిపేవారు ఎక్కువగా ఒంటరితనానికి, కుంగుబాటుకు గురవుతారని యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా అధ్యయనంలో తేలింది.
''సోషల్ మీడియా వినియోగం తగ్గితే కుంగుబాటు, ఒంటరిగా ఉన్నామనే భావన తగ్గి సాధారణ స్థితికి చేరుకుంటారు'' అని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన సైకాలజిస్టు మెలిస్సా హంట్ తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
''ముఖ్యంగా చదువుకునే సమయంలో ఇది యువతపై ఎక్కువ ప్రభావం చూపుతుంది'' అని పేర్కొన్నారు.
''సోషల్ మీడియాలో జరిగేది అరుదుగా నిజజీవితంలో ప్రతిబింబిస్తుంది. అయినప్పటికీ మనం వారికి సాయం చేయలేం. కానీ, రెండింటి మధ్య వ్యత్యాసాలను గమనించవచ్చు'' అని అస్కార్ యబ్రా అన్నారు.
ఈయన యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్‌లో సైకాలజీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
''సోషల్ మీడియాలో అనేక సంఘటనలు చూస్తుంటారు. ఎక్కువ సమయం అదే వేదిక మీద ఉంటే సామాజికంగా పోల్చుకోవడం ఎక్కువ అవుతుంది. అది చివరకు ఆత్మనూన్యతకు దారితీస్తుంది'' అని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఒంటరితనం
పిల్లల్లో ఒంటరితనం ప్రభావంపై వెల్‌కమ్ కలెక్షన్‌తో కలసి బీబీసీ చేసిన అతిపెద్ద సర్వేలో అనేక విషయాలు వెలుగు చూశాయి.
ముఖ్యంగా 16 నుంచి 24 ఏళ్ల మధ్య ఉన్నవారు ఎక్కువగా ఒంటరితనంతో బాధపడుతున్నట్లు తేలింది.
మరీ ముఖ్యంగా పురుషులు ఒంటరితనంతో ఎక్కువగా బాధపడుతున్నారని 2017లో ఆక్స్‌ఫర్డ్ అధ్యయనంలో తేలింది.
ఒంటరితనం సమస్య దీర్ఘకాలికంగా ఉంటే మనిషిపై దాని ప్రభావం మానసికంగా, శారీరకంగా తీవ్రంగా ఉంటుంది. డిమెన్షియాలాంటి రోగాల బారిన పడే అవకాశం ఉందని కొన్ని అధ్యయనాలు తెలుపుతున్నాయి.
ఏడుపు
ఏడవటం వల్ల స్వీయఓదార్పును పొందడమే కాకుండా, తాదాత్మ్యం చెందడానికి, సామాజిక బంధాల పెరుగుదలకు సహాయపడుతుందని అనేక అధ్యయనాలు తెలుపుతున్నాయి.
18 నుంచి 24 ఏళ్ల మధ్యనున్న 55 శాతం పురుషులు... ఏడిస్తే తాము మగవాళ్లం కాదేమోనని భావిస్తున్నారని యూకే సర్వే తెలిపింది.
''యుక్త వయసులో ఉన్న పురుషులు తమ భావోద్వేగాలను బయటపెట్టడం లేదు. భావోద్వేగాలను బయటపెట్టడం బలహీనత అని భావిస్తున్నారు'' అని ఆస్ట్రేలియాకు చెందిన లైఫ్‌లైన్ అనే చారిటీ సంస్థ మాజీ ఉద్యోగి కోల్మెన్ ఓడ్రిస్కోల్ తెలిపారు.

ఫొటో సోర్స్, BBC Sport
కుటుంబ పెద్దగా ఉండాలని..
తమ భాగస్వామికంటే ఎక్కువ సంపాదించాలని 42 శాతం మంది మగవాళ్లు భావిస్తున్నారని యూకే సర్వే వెల్లడించింది. ఒల్మిడ్ డరోజయి అందులో ఒకరు.
''మా నాన్న ఇంటిపెద్దగా ఉండటం చూశాను. రాత్రింపగళ్లు కష్టపడేవాడు. దేశమంతా తిరిగేవాడు. నేనూ అలానే ఉండాలనుకుంటున్నా'' అని ఒల్మిడ్ అన్నారు.
''నా భాగస్వామి కోరుకుంటుందని భావిస్తున్న 'కుటుంబ పెద్ద' పాత్ర పోషించాలనుకుంటున్నా. ఇంకా డబ్బు సంపాదించాల్సిన అవసరం ఉంది'' అని పేర్కొన్నారు.
ఇంటి పోషకుడిగా డబ్బు సంపాదించే బాధ్యతలు తీసుకోవడం అనేది ఎవరికైనా మానసిక సమస్యలు సృష్టిస్తుంది.
నిరుద్యోగం 1 శాతం పెరిగితే ఆత్మహత్యల రేటు 0.79 శాతం పెరుగుతోందని 2015లో వచ్చిన ఒక అధ్యయనం తెలిపింది.
''మన జీవితం మొత్తం డబ్బు సంపాదన విషయంలో ఇతరులతో పోల్చుకుంటూ గడిపేస్తున్నాం'' అని కామ్ ( క్యాంపెయిన్ అగెనెస్ట్ లివింగ్ మిసెరబ్లీ) సీఈవో సిమన్ గన్నింగ్ అన్నారు.
''ఆర్థిక సమస్యలు కారణంగా ఉంటే వాటిని మనం అదుపు చేయలేం. అది చాలా కష్టమవుతుంది కూడా'' అని పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, BBC Sport
బాడీ ఇమేజ్
గతేడాది నిర్వహించిన లవ్ ఐస్‌లాండ్ అనే టీవీ షోలో మూడో స్థానంలో వచ్చిన జోష్ అక్కడ ఇప్పుడు చిన్నస్థాయి సెలబ్రెటీ.
''టీవీలో కనిపించడాని కన్నా ముందు అందంగా తయారయ్యేందుకు నేను జిమ్‌లోనే గడిపేవాడ్ని. అయినప్పటికీ నేను చూడటానికి సన్నగా, చిన్నపిల్లాడిగానే కనిపించాను. ఇకపై నేను టీవీషోలకు వెళ్లను'' అని చెప్పారు.
ఇవి కూడా చదవండి
- ఆంధ్రప్రదేశ్: ఏజెన్సీల్లో తాగునీటి కొరత.. చెలమలో నీళ్ల కోసం కిలోమీటర్ల నడుస్తున్న గిరిజన మహిళలు
- భారత లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై పాకిస్తాన్లో ఉత్కంఠ ఎందుకు
- చంద్రగిరి రీపోలింగ్: పోలింగ్‌కి, రీపోలింగ్‌కి ఇంత వ్యవధి ఇదే తొలిసారి
- లోక్-సభ ఎన్నికలు 2019- 'మోదీ భారత్'లో హామీలు నెరవేరాయా
- ఒసామా బిన్ లాడెన్: ప్రపంచాన్ని వణికించిన అల్ ఖైదా ఇప్పుడు ఏ స్థితిలో ఉంది
- మన్ను తిన్న చిన్నారి మట్టిలో కలిసిపోయింది.. ఆ పాపం ఎవరిది
- ఈ రాజధాని నగరాలు... ఇటీవలి దశాబ్దాలలో వెలిసిన సరికొత్త అద్భుతాలు
- ప్రధాని మోదీ మేకప్ కోసం నెలకు రూ. 80 లక్షలు ఖర్చు చేస్తారనే వార్తల్లో నిజమెంత
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








