ఈ రాజధాని నగరాలు... ఇటీవలి దశాబ్దాలలో వెలిసిన సరికొత్త అద్భుతాలు

ఫొటో సోర్స్, Getty Images
జకార్తా నుంచి రాజధానిని మార్చాలన్న ఇండోనేసియా నిర్ణయం, చాలా దేశాలు చారిత్రక రాజధాని నగరాలను ఎలా విడిచిపెడుతున్నాయనేది చెబుతోంది.
మరో తొమ్మిది రాజధాని నగరాలు దీనికి చెప్పుకోదగిన ఉదాహరణలుగా నిలిచాయి.
ఇండోనేసియా ఈ వారం తమ రాజధానిని జకార్తాకు దూరంగా తరలిస్తున్నట్లు ప్రకటించింది. అక్కడ ట్రాఫిక్ విపరీతంగా పెరగడంతోపాటు ప్రపంచంలో అత్యంత వేగంగా మునిగిపోతున్న నగరాల్లో జకార్తా ఒకటి కావడం అందుకు ప్రధాన కారణం.
రాజధానిని ఎక్కడకు మార్చాలనే దానిపై ఆ దేశ నేతలు ఇప్పటికీ చర్చలు జరుపుతున్నారు. కానీ ఆ దేశంలో ఏప్రిల్ మొదట్లో జరిగిన సాధారణ ఎన్నికల్లో విజయం సాధించిన ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడో మాత్రం కొత్త రాజధానిని బోర్నియో ద్వీపంలో నిర్మించడానికి ఉవ్విళ్లూరుతున్నారు.
ఆ ద్వీపంలోని బంజరు భూములను రాజధానిగా మార్చడానికి ఇండోనేసియా అందరూ వెళ్లిన ఒక దారినే అనుసరించాల్సి ఉంటుందనేది కచ్చితం. అలా రాజధానులు మార్చుకున్న కొన్ని దేశాలేవో, వాటి ప్రత్యేకతలేమిటో చూద్దాం.

ఫొటో సోర్స్, Getty Images
నైప్యిడావ్, మయన్మార్(2005)
పాత రాజధాని యాంగాన్ నుంచి మార్చడానికి కారణం అక్కడ జనాభా ఎక్కువై, నగరం ఇరుకుగా మారిపోవడమేనని ఆ దేశం అధికారికంగా వివరణ ఇచ్చింది. కానీ, దీనికి ఇంకా చాలా కారణాలు ఉన్నాయి.
నైప్యిడావ్ దేశానికి సరిగ్గా మధ్యలో ఉంటుంది. దాంతో దేశంలో దూరప్రాంతాల్లో ఎక్కడ తిరుగుబాట్లు జరిగినా ప్రబుత్వం వాటిని సమర్థంగా అణచివేయడానికి వీలుగా ఉంటుంది.
మయన్మార్‌లోని చాలా మంది రాజధాని మార్పునకు అసలు కారణం మిలిటరీ జుంటానే అని భావిస్తున్నారు.
1962 నుంచి దేశాన్ని పాలించిన అది కొత్తరాజధాని చుట్టూ ఉన్న నివసించడానికి వీల్లేని భూభాగం ఉండడంతో, ఇక్కడ తిరుగుబాట్లు, విదేశీ జోక్యం లేకుండా సురక్షితంగా ఉండవచ్చని భావిస్తున్నట్లు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
పుత్రజయ, మలేసియా(2002)
పక్కా ప్రణాళిక ప్రకారం నిర్మించిన ఈ నగరం ఇప్పుడు మలేసియా ప్రభుత్వ పరిపాలనా కేంద్రంగా ఉంది. కానీ కౌలాలంపూర్ కూడా అధికారిక రాజధానిగా కొనసాగుతోంది.
తరచూ ఆర్కిటెక్చర్ అద్భుతంగా వర్ణించే పుత్రజయ తన వైపు అడుగులు వేయకుండా మలేసియా అధికారులను ఆపలేకపోయింది.

ఫొటో సోర్స్, Getty Images
ఆస్తానా(నూర్-సుల్తాన్), కజకిస్తాన్(1997)
రాజధాని అనే అర్థం వచ్చే కజక్ పదంతో తగిన పేరు పెట్టుకున్న అస్తానా నగరాన్ని 1997లో అధ్యక్షుడు నూర్ సుల్తాన్ నజర్బయేవ్ ఆదేశాలతో నిర్మించారు.
ఆకాశాన్నంటే అత్యాధునిక భవనాలున్న ఇది చాలా వేగంగా మధ్య ఆసియాలోని అత్యంత ఆధునిక నగరాల్లో ఒకటిగా నిలిచింది.
ఈ ఏడాది ప్రారంభంలో నజర్బయేవ్ రాజీనామాతో కజక్ అధికారులు తర్వాత దీనికి నూర్-సుల్తాన్ అని పేరు మార్చారు.

ఫొటో సోర్స్, Getty Images
అబుజా, నైజీరియా(1991)
నైజీరియా రాజధానిని 1991లో లాగోస్ నుంచి అబూజాకు మార్చారు. దేశంలోని మూడు ప్రధాన జాతుల బృందాలు యోరుబా, ఇగ్బో, హౌసా-ఫులానికి స్వతంత్ర నగరంగా సృష్టించే ప్రయత్నాల్లో భాగంగా దీనిని నూతన రాజధానిగా చేశారు.
కానీ లాగోస్ నగర జనాభా 1970లో 14 లక్షల నుంచి గత ఏడాదికి 2 కోట్లకు పైగా పెరగడం, మౌలిక సదుపాయాల సమస్యలు కూడా తలెత్తడంతో ఈ మార్పు అనివార్యమైంది.

ఫొటో సోర్స్, Getty Images
ఇస్లామాబాద్, పాకిస్తాన్(1967)
పాకిస్తాన్ రాజధానిని దేశాన్ని ఏకీకృతం చేసే ప్రయత్నాల్లో భాగంగా కూడా నిర్మించారు.
1947 ఆగస్టులో భారత్ నుంచి విడిపోయి పాకిస్తాన్ ఏర్పడినప్పటి నుంచి కరాచీ దాని పాలనా కేంద్రంగా ఉంది.
కానీ, చుట్టూ ఎడారి ఉండడం, నీటి కొరత తీవ్రంగా ఉండండతో ఇది రాజధాని పాత్ర పోషించడం అసాధ్యంగా మారింది.

ఫొటో సోర్స్, Getty Images
బ్రెజిలియా, బ్రెజిల్(1960)
రియో డి జెనీరో బ్రెజిల్ ప్రముఖ నగరం. ఇది 17వ శతాబ్దం నుంచీ ఆ దేశానికి రాజధానిగా ఉంది.
కానీ 1960లో ఆ హోదా బ్రెజిలియా సొంతమైంది. దీని వెనుక ఒక ఆసక్తికరమైన విషయం ఉంది.
సముద్ర వైపు నుంచి జరిగే దాడులకు రియో బలహీనంగా ఉందని చారిత్రకంగా నిరూపితం కావడంతో అక్కడి నుంచి రాజధానిని మార్చాలని 1891లోనే నిర్ణయించారు.
దేశాన్ని ఏకం చేయడానికి, శత్రువుల నుంచి అప్రమత్తంగా ఉండడానికి బ్రెజిలియాను దేశంలో పశ్చిమంగా పర్వత ప్రాంతాల్లో నిర్మించారు.

ఫొటో సోర్స్, Getty Images
క్యూజన్ సిటీ, ఫిలిప్పీన్స్(1948)
క్యూజన్ సిటీ ఫిలిప్పీన్స్‌కు రాజధానిగా ఉండే గౌరవాన్ని గెలుచుకుంది. 1940లో అధ్యక్షుడు మాన్యూల్ క్యూజాన్ కనుగొనడంతో దీనికి ఆయన పేరే పెట్టారు.
కానీ ప్రభుత్వానికి సంబంధించిన చాలా కార్యకలాపాలు 1976లో ప్రాక్టికల్ కారణాలతో రాజధాని హోదాను దక్కించుకున్న మనీలాలోనే ఉండిపోయాయి.

ఫొటో సోర్స్, Getty Images
కాన్‌బెర్రా, ఆస్ట్రేలియా(1927)
ఆస్ట్రేలియా రాజధానిని దేశంలోని రెండు అధికార కేంద్రాలైన సిడ్నీ, మెల్‌బోర్న్ మధ్య రాజీ కుదిరేలా నిర్మించారు.
ఈ గౌరవాన్ని మొదట ఆ రెండు నగరాలూ పొందాలనుకున్నాయి.
కానీ, రాజధాని నిర్ణయాన్ని 1908లోనే తీసుకున్నారు. పార్లమెంటును కాన్‌బెర్రాకు తరలించింది మాత్రం 1927లోనే.

ఫొటో సోర్స్, Getty Images
న్యూ దిల్లీ, భారత్(1911)
భారతదేశం బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు శతాబ్దానికి పైగా కోల్‌కతా రాజధానిగా ఉండింది.
కానీ, కోల్‌కతా చుట్టుపక్కల, బెంగాల్ ప్రాంతంలో బ్రిటిష్ పాలనపై వ్యతిరేకత వెల్లువెత్తడంతో 1911లో రాజధానిని దిల్లీకి మార్చారు.
1648 నుంచి 1857 వరకూ మొఘలు సామ్రాజ్యానికి రాజధానిగా ఉన్న దిల్లీ పాత నగరానికి సమీపంలో కొత్త రాజధానిని నిర్మించారు.
ఇవి కూడా చదవండి:
- గయానా ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశం కానుందా....
- అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం: ‘చైనా వస్తువులపై సుంకాలు పెంచుతాం’.. ‘పెంచితే ప్రతిచర్యలతో తిప్పికొడతాం’
- నీలి రంగును వదిలించుకుంటున్న ఫేస్‌బుక్
- ‘పని ఒత్తిడితో ప్రాణాలు పోతున్నా మనం ఇంకా కళ్ళు తెరవడం లేదు’
- ముఖంపై ముసుగు ధరించడం ఏయే దేశాల్లో నిషిద్ధం?
- అంతరిక్షంలో అత్యధికంగా చెత్త నింపే దేశం ఏదో తెలుసా...
- రాత్రిపూట మద్యం తాగితే నిద్ర బాగా పడుతుందా?
- తల్లితండ్రుల వలసలు... దాడులకు బలవుతున్న పిల్లలు
- అత్యంత భారీ ఎయిర్పోర్ట్.. అంతా ఒక్క బిల్డింగ్‌లోనే
- ఫ్రిజ్‌లో ఉంచిన ఆహారాన్ని మీరు చాలా రోజులు తింటారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









