అంబేడ్కర్ విగ్రహాన్ని బీజేపీ ఎమ్మెల్యే కూల్చారనే వైరల్ వీడియోలో నిజమెంత? - Fact Check

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని కూల్చివేశారనే ఒక వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది.
"బీజేపీ నాయకుడు, ఎమ్మెల్యే కర్ణి సింగ్ అంబేడ్కర్ విగ్రహాన్ని కూల్చివేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ దీనికి ఏం సమాధానం చెబుతారు. దేశమంతా చూసేలా ఈ వీడియోను వైరల్ చేయండి" అనే క్యాప్షన్ దీనికి పెట్టారు.
ఫేస్‌బుక్‌లో ఈ వీడియోను షేర్ చేసినవారిలో రత్నాకర్ సేన అనే యూజర్ ఒకరు. "వినాశకాలే విపరీత బుద్ధి" అనే క్యాప్షన్ పెట్టి ఆయన దీనిని షేర్ చేశారు.

ఫొటో సోర్స్, Facebook
సోషల్ మీడియాలో ఈ వీడియోను వేలసార్లు షేర్ చేశారు.
వాట్సప్ గ్రూపుల్లోనూ ఇది ఫార్వర్డ్ అవుతోంది.

ఈ వీడియో నిడివి 40 సెకన్లు.
ఎక్స్‌కవేటర్‌తో ఒక విగ్రహాన్ని తొలగిస్తుండగా, అక్కడున్నవారు "భారత్ మాతాకీ జై" అనే నినాదాలు చేస్తున్నట్లు ఇందులో ఉంది.
తప్పుడు భాష్యంతో ఈ వీడియోను షేర్ చేసినట్లు బీబీసీ ఫ్యాక్ట్ చెక్ బృందం పరిశీలనలో వెల్లడైంది.

ఫొటో సోర్స్, Facebook
2018 మేలో త్రిపురలోని బెలోనియా పట్టణంలో రష్యా విప్లవ నాయకుడు లెనిన్ విగ్రహాన్ని కూల్చివేశారు. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో నిజానికి ఈ ఘటనది. వీడియోలో చెప్పినట్లు అది అంబేడ్కర్ విగ్రహం కాదు.

త్రిపురలో పాతికేళ్లుగా అధికారంలో ఉన్న సీపీఎంను 2018 ఎన్నికల్లో బీజేపీ ఓడించిన తర్వాత బెలోనియాలో ఐదేళ్ల నుంచి ఉంటున్న లెనిన్ విగ్రహాన్ని కూల్చివేశారు.
లెనిన్ విగ్రహం ఏర్పాటుపై స్థానికుల్లో వ్యతిరేకత ఉందని, వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకోవడమే విగ్రహం కూల్చివేతకు కారణమని బీజేపీ స్థానిక నేత రాజు నాథ్ ఒక వార్తాపత్రికతో అన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

ఫొటో సోర్స్, Facebook
బీబీసీ పరిశీలనలో మరో ముఖ్యమైన అంశం వెల్లడైంది.
త్రిపుర అసెంబ్లీలో కర్ణి సింగ్ అనే పేరుతో ఏ శాసనసభ్యుడూ లేరు.
త్రిపుర ఎమ్మెల్యేల జాబితా పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది.
(ఇలాంటి అనుమానాస్పద వార్తలు, ఫొటోలు, వీడియోలు లేదా సమాచారం ఏదైనా మీ దృష్టికి వస్తే, వాటి ప్రామాణికతను పరిశీలించడానికి బీబీసీ న్యూస్ వాట్సాప్ నెంబర్ +919811520111 కు పంపించండి లేదా ఇక్కడ క్లిక్ చేయండి.)
ఇవి కూడా చదవండి:
- వాట్సాప్ సాఫ్ట్‌వేర్‌లో సమస్య: మొబైల్ ఫోన్లపై హ్యాకర్ల దాడి.. రహస్యంగా నిఘా.. లేటెస్ట్ వెర్షన్ అప్డేట్ చేసుకున్నారా?
- గాడ్సే.. హంతకుడా లేక తీవ్రవాదా? కమల్ హాసన్ వ్యాఖ్యలపై చర్చ
- షోరూంలో వస్తువులు కొని, క్యారీ బ్యాగ్ కోసం డబ్బులిస్తున్నారా, ఇకపై ఇవ్వొద్దు
- జలియన్‌వాలా బాగ్ మారణహోమం: ‘క్షమాపణ" నిరర్థకమన్న అలనాటి బాధితుడి వారసుడు
- జలియన్‌వాలా బాగ్: భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో రక్తసిక్త అధ్యాయానికి 100 ఏళ్ళు
- వాట్సాప్ సాఫ్ట్‌వేర్‌లో సమస్య: మొబైల్ ఫోన్లపై హ్యాకర్ల దాడి.. రహస్యంగా నిఘా.. లేటెస్ట్ వెర్షన్ అప్డేట్ చేసుకున్నారా?
- మోదీ నిజంగానే మిరాజ్ విమానాలను మేఘాలతో పాక్ రాడార్ నుంచి కాపాడారా...
- అమెరికా: 'ఈ శిలువను బహిరంగ ప్రదేశం నుంచి తొలగించండి'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








