లోక్‌సభ ఎన్నికలు 2019: మోదీ, షా సొంత బరి వేదికగా కాంగ్రెస్ ఎన్నికల వ్యూహరచన... సవాళ్లను అధిగమించగలదా? రాహుల్ గాంధీ రాణించగలరా?

ఫొటో సోర్స్, Congress/Twitter
- రచయిత, కళ్యాణి శంకర్
- హోదా, బీబీసీ కోసం
అహ్మదాబాద్‌లో మంగళవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణాయక విభాగమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం.. రానున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో చాలా ప్రాధాన్యం సంతరించుకుంది.
అది కూడా ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన రెండు రోజుల్లోనే ఈ కీలక సమావేశం జరగటం విశేషం.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాల సొంత బరి నుంచి కాంగ్రెస్ ఎన్నికల భేరీ మోగించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మోదీ రెండో విడత లోక్‌సభ ఎన్నికల్లో గెలిచే అవకాశాలు నెల రోజుల కిందటి వరకూ కష్టంగా ఉన్నట్లు కనిపించాయి.
కానీ కశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఆత్మాహుతి దాడి, తదనంతరం పాకిస్తాన్‌తో సైనిక ఉద్రిక్తతల తర్వాత.. మోదీ నిర్ణయాత్మక నాయకుడినని నిరూపించుకున్నారని, కాబట్టి ఆయన మళ్లీ అధికారంలోకి వస్తారని.. ఆయనను అత్యంత తీవ్రంగా విమర్శించే వారు కూడా అంగీకరిస్తున్నారు.
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం అనంతరం గుజరాత్ రాజధాని గాంధీనగర్‌కు 20 కిలోమీటర్ల దూరంలోని అదాలాజ్ వద్ద ఆ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆయన సోదరి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ప్రియాంక గాంధీ, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ సహా సీనియర్ నాయకులు ఈ సభలో ప్రసంగించారు.
తూర్పు ఉత్తరప్రదేశ్ ప్రాంతానికి ఏఐసీసీ ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్న ప్రియాంక.. యూపీ వెలుపల పాల్గొన్న మొదటి బహిరంగ సభ ఇది.
పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపటంతో పాటు.. బలప్రదర్శనగా కూడా ఈ బహిరంగ సభను నిర్వహించినట్లు భావిస్తున్నారు.
మహాత్మా గాంధీ వారసత్వాన్ని పునరుద్ఘాటిస్తూ.. సబర్మతి ఆశ్రమం వద్ద ప్రార్థనల అనంతరం సమావేశాన్ని ప్రారంభించటం ద్వారా సీడబ్ల్యూసీ దేశవ్యాప్తంగా అనేక రాజకీయ సందేశాలను పంపించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
మహాత్మా గాంధీ 1930లో మార్చి 12వ తేదీనే దండి యాత్ర ప్రారంభించటం ఈ సందర్భంగా గమనార్హం.
అంతేకాదు.. ఈ సమావేశాన్ని సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జాతీయ స్మారకం దగ్గరే నిర్వహించటం ద్వారా పటేల్ తన కాలంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడని దేశానికి గుర్తుచేశారు.
ఇక బహిరంగ సభకు 'జై జవాన్ - జై కిసాన్' సభగా పేరు పెట్టటం మూడో సందేశం. జవాన్లు, సైనికుల ప్రాధాన్యత గురించి గట్టి సందేశం ఇవ్వటం దీని లక్ష్యం.
పటీదార్ నాయకుడు హార్దిక్ పటేల్ ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో చేరటం.. గుజరాత్‌లో కాంగ్రెస్ బలపడుతోందని చెప్తున్న మరో సందేశం.

ఫొటో సోర్స్, Congress/Twitter
అన్నిటికీ మించి.. మోదీ, షా ద్వయాన్ని వారి సొంత బరి నుంచే సవాల్ చేయటానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉందన్నది ఈ సమావేశం, సభల సంకేతం.
గుజరాత్‌లో 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి గట్టి పోటీ ఇచ్చిన కాంగ్రెస్.. పార్లమెంటు ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో మెరుగైన ఫలితాలు సాధిస్తామని ఆశిస్తోంది.
ముఖ్యంగా.. పార్టీ ఎన్నికల వ్యూహానికి ఈ సీడబ్ల్యూసీ సమావేశం తుది రూపమిచ్చింది. అలాగే పార్టీ ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి కూడా చర్చించింది.

ఫొటో సోర్స్, Youth Congress/Twitter
అయితే.. ఆ సవాళ్లు నిజానికి చాలానే ఉన్నాయి. ఇంకా పూర్తిగా వేగం పుంజుకోని పార్టీని ఎన్నికలకు సంసిద్ధం చేయటం మొదటి సవాలు.
బూత్ కమిటీలను క్రియాశీలం చేయాల్సి ఉంది. సరైన అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది.
ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ తదితర నాయకులు పార్టీ సభలు, ప్రచారానికి ప్రజలను పెద్ద సంఖ్యలోనే ఆకర్షించవచ్చు. అయితే అలా వచ్చిన వారిని ఓట్లుగా మలచాల్సి ఉంటుంది. ఇక్కడే కాంగ్రెస్ పార్టీ వెనుకబడింది.
కాంగ్రెస్ తన బలాలు ఏమిటో, బలహీనతలు ఏమిటో గుర్తించింది. నియోజకవర్గం వారీగా వ్యూహరచన మీద దృష్టి కేంద్రీకరిస్తోంది.

ఫొటో సోర్స్, Indian National Congress/Facebook
ఇక.. రాజకీయ చర్చను.. మందగిస్తున్న ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగాలు, వ్యవసాయ సంక్షోభం, రఫేల్ కుంభకోణం, మైనారిటీ సమూహాలపై పెరుగుతున్న విద్వేష నేరాలు వంటి దేశంలోని అంతర్గత అంశాల మీదకు తిరిగి మళ్లించటం ఎలా అనేది రెండో సవాలు.
ప్రస్తుతమైతే.. పుల్వామా ఆత్మాహుతి దాడి, దానికి ప్రతిగా బాలాకోట్‌లో వైమానిక దాడుల అనంతరం ఉగ్రవాదం, జాతీయవాదం అంశం మీద మోదీ ముందుకు దూసుకెళుతున్నారు. ఈ అంశం నుంచి పూర్తి స్థాయిలో లబ్ధి పొందాలని బీజేపీ నిర్ణయించుకుంది.
కాంగ్రెస్ పార్టీ.. ఉద్యోగాలు, వ్యవసాయ సంక్షోభం, రఫేల్ కుంభకోణం, నోట్ల రద్దు, జీఎస్‌టీ, మోదీ ప్రభుత్వం చెప్పుకుంటున్న బూటకపు విజయాలు, 2014 ఎన్నికల హామీల అమలులో ఆయన వైఫల్యం తదితర అంశాల మీద దృష్టి కేంద్రీకరిస్తోంది.
అయితే.. పుల్వామా ఘటన ఈ ఇతర అంశాలన్నిటినీ ప్రస్తుతానికి వెనక్కు నెట్టేసింది. వీటిని మళ్లీ ప్రధాన చర్చలోకి తీసుకురావటం కోసం కాంగ్రెస్ పార్టీ మల్లగుల్లాలు పడుతోంది.

ఫొటో సోర్స్, Congress/Twitter
అదీగాక.. కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకూ వ్యతిరేక ప్రచారానికే ప్రాధాన్యమిచ్చింది. కానీ ప్రజలకు వ్యతిరేక ధోరణి నచ్చదు. ఈ అంశాలన్నిటినీ సీడబ్ల్యూసీ చర్చించింది.
ఇతర పార్టీలతో పొత్తులు, కూటమి ఏర్పాటు కాంగ్రెస్ ముందున్న మూడో సవాలు. పార్టీ ఇంకా పొత్తులను బలోపేతం చేసుకునే ప్రక్రియలోనే ఉంది. డీఎంకే వంటి కొన్ని పార్టీలతో ఆ పని పూర్తి చేసింది.
అయితే.. జేడీ(ఎస్), ఆర్‌జేడీ, సీపీఎం, ఇతర ప్రాంతీయ పార్టీలతో సీట్ల పంపకాన్ని ఇంకా ఖరారు చేయాల్సి ఉంది.
ఉత్తరప్రదేశ్‌లో ఎస్‌పీ - బీఎస్‌పీ కూటమితో చర్చలు ఇంకా ముగియలేదు. దీంతో ఈ రాష్ట్రం అంశం ప్రత్యేకంగా ప్రస్తావనకు వచ్చింది.

ఫొటో సోర్స్, Indian National Congress/Facebook
ఒంటరిగా ఎన్నికలకు వెళ్లే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదని.. రాష్ట్రాల వారీగా స్థానిక పొత్తులు అవసరమని సీడబ్ల్యూసీకి తెలుసు.
ఎన్నికల్లో కెమిస్ట్రీ (భావసారూప్యం) కన్నా అర్థమెటిక్స్ (సీట్ల లెక్కలు) చాలా ముఖ్యం మరి.
పార్టీ ముందున్న నాలుగో సవాలు ఎన్నికలకు అవసరమైన నిధులు సమీకరించటం. అపరిమితంగా నిధులు ఖర్చుచేయగల బీజేపీ శక్తితో పోలిస్తే.. కేంద్రంతో పాటు, చాలా రాష్ట్రాల్లో అధికారంలో లేనందువల్ల కాంగ్రెస్ పార్టీ భారీ ఎన్నికల ఖర్చుకు అవసరమైన నిధుల కోసం కష్టాలు పడుతోంది.
బీజేపీ 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ. 1,027 కోట్ల ఆదాయం లభించినట్లు ప్రకటించింది.

ఫొటో సోర్స్, Indian National Congress/Facebook
అన్నిటికన్నా ముఖ్యంగా.. రాహుల్ గాంధీ చాలా కష్టపడి పనిచేస్తుండవచ్చు.. కానీ ఆయన బలం సరిపోదన్న భావన ఇంకా కొనసాగుతూనే ఉంది.
''మోదీ కాకపోతే.. ఎవరు?'' అన్నది జనం అడుగుతున్న ప్రశ్న.
రాహుల్ తన ఇమేజీని మార్చుకునే ప్రక్రియ కొంత కాలం కిందట ప్రారంభించారు. గత ఏడాది కాలంగా సరైన అడుగులే వేశారు. అయినా ఆయన ఇంకా తన లక్ష్యాన్ని సాధించాల్సి ఉంది.
కాబట్టి రాహుల్ ఇమేజీని భారీగా పెంచుకోవటం చాలా ముఖ్యం. అందుకోసం ఓటర్లతో అనుసంధానం అవ్వాల్సిన అవసరముంది.
రాజకీయాల్లో సందేశం ఇవ్వటం చాలా కీలకం. సీడబ్ల్యూసీ సమావేశం గాంధీనగర్ నుంచి దేశానికి బహుళ సందేశాలిచ్చింది.
ఇది ఎంతవరకూ సఫలమవుతుందనేది ఎన్నికలు ముగిసిన తర్వాత ఓట్ల లెక్కింపు జరిగే మే 23వ తేదీన చూడాలి.
ఇవి కూడా చదవండి.
- ప్రియాంకా గాంధీ: ‘మౌనంగా పనిచేస్తున్నారు’
- ప్రియాంకా గాంధీని 'భయ్యాజీ' అని ఎందుకంటారు
- ఫేస్బుక్లో ప్రకటనలకు టీడీపీ, వైసీపీ ఎంత ఖర్చు చేస్తున్నాయి?
- డేటా చోరీ వివాదం: #TSGovtStealsData హ్యాష్‌ట్యాగ్‌ను డబ్బులిచ్చి ట్రెండ్ చేయించారా...
- పల్లెపల్లెకూ బ్రాడ్‌బ్యాండ్: మోదీ ప్రభుత్వం ఏంచెప్పింది? ఏం సాధించింది?
- దేశంలో అత్యంత సుదీర్ఘ ఎన్నికలు ఇవేనా.. ఇది బీజేపీకి లాభిస్తుందా?
- ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో, లేదో చూసుకోండి.. 15వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోండి
- "మోదీ బ్రహ్మాస్త్రాలు వేస్తుంటే, ప్రతిపక్షాలు మౌనంగా ఉంటున్నాయి"
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








