ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా, ఆమోదించిన గవర్నర్

ఫొటో సోర్స్, Getty Images
తెలంగాణ ముఖ్యమంత్రి పదవికి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాజీనామా చేశారు.
ఆదివారం సాయంత్రం ఓఎస్డీ ద్వారా గవర్నర్ తమిళిసైకి రాజీనామా పత్రం పంపించారు కేసీఆర్.
ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ దిశగా కాంగ్రెస్ పయనిస్తున్న తరుణంలో ఆయన రాజీనామా చేశారు.
కేసీఆర్ రాజీనామాను గవర్నర్ తమిళిసై ఆమోదించారని గవర్నర్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.
కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కేసీఆర్‌కు గవర్నర్ సూచించినట్లు తెలిపింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1

ఫొటో సోర్స్, PCC
రాజ్‌భవన్‌కు కాంగ్రెస్ నాయకులు
టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్‌చార్జీ మాణిక్‌రావు ఠాక్రే, డీకే శివకుమార్ సహా పలువురు కాంగ్రెస్ నాయకులు రాజ్‌భవన్ వెళ్లి గవర్నర్ తమిళిసైని కలిశారు.
ప్రభుత్వ ఏర్పాటు కోసం ఆహ్వానించాల్సిందిగా గవర్నర్‌కు లేఖ అందించారు.

ఫొటో సోర్స్, PCC
గచ్చిబౌలిలోని ఎల్లా హోటెల్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేరుకుంటున్నారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్, ఏఐసీసీ పరిశీలకులు ఇప్పటికే హోటెల్ చేరుకున్నారు.
నేడు జరిగే సీఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకునే అవకాశాలున్నాయి.

కొత్త డీజీపీగా రవిగుప్తా
తెలంగాణ కొత్త డీజీపీగా రవిగుప్తాను నియమిస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీచేశారు.
ప్రస్తుతం రవిగుప్తా ఏసీబీ డీజీగా పనిచేస్తున్నారు.
ఎన్నికల కోడ్ ఉల్లంఘించడంతో డీజీపీ అంజనీకుమార్‌పై సస్పెన్షన్ విధించింది ఎన్నికల సంఘం. దీంతో రవిగుప్తాను డీజీపీగా నియమించారు.
ఓటమి నిరుత్సాహపరిచింది: ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కొంత నిరాశ కలిగించినా ఎన్నో గుణపాఠాలు నేర్చుకున్నామని తెలంగాణ బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
పార్టీకి ఎదురైన ఒడిదుడుకులను చక్కదిద్దుకుని రానున్న పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతామని పేర్కొన్నారు.
మహనీయుల ఆశయాల కోసం రాత్రింబవళ్లు శ్రమించిన బీఎస్పీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణలో చారిత్రాత్మక విజయం సాధించేందుకు కాంగ్రెస్ పార్టీని ముందుండి నడిపించిన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డికి అభినందనలు తెలుపుతూ సిర్పూరు ఎమ్మెల్యేగా ఎన్నికైన డా. హరీష్ బాబు గారికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2

ఫొటో సోర్స్, FACEBOOK/KTR
ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా చేపడతాం: కేటీఆర్
బీఆర్ఎస్ కోసం అహర్నిశలు శ్రమించిన వారందరికీ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసింగ్ కేటీఆర్ ధన్యవాదాలు తెలియజేశారు.
గత పదేళ్లు ప్రభుత్వాన్ని ఎలా అయితే సమర్థవంతంగా నడిపామో, ప్రస్తుతం ప్రజలిచ్చిన ప్రతిపక్ష పాత్రను కూడా అంతే సమర్థంగా చేపడతామన్నారు.
తెలంగాణ సాధించిన పోరాటస్ఫూర్తితో ముందుకెళ్తామని తెలిపారు కేటీఆర్.
ఫలితాలు కొంత నిరాశపరిచినా బాధేం లేదని, రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమన్నారు.
గెలుపునైనా, ఓటమినైనా ఒకే రకంగా తీసుకునే ధీరోదాత్తను తమ నేత కేసీఆర్ నేర్పించారని కేటీఆర్ తెలిపారు. ప్రజల ఆదరణ, మన్ననలు తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. గతంలో కంటే రెట్టింపు కష్టపడతామన్నారు.
కాంగ్రెస్‌కు ప్రజలు అవకాశం ఇచ్చారని, ప్రభుత్వాన్ని బాగా నడపాలని కోరుకుంటూ ఆ పార్టీకి అభినందనలు తెలియజేశారు.
ఎక్కడ కోల్పోయిన దాన్ని అక్కడే తెచ్చుకుందామని పార్టీ కార్యకర్తలకు ఆయన సూచించారు.
గెలుపొందిన బీఆర్ఎస్ శాసనసభ సభ్యులందరికీ కేటీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఫొటో సోర్స్, Twitter/TelanganaDGP
డీజీపీ అంజనీకుమార్ సస్పెన్షన్
ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించినందుకు తెలంగాణ డీజీపీ అంజనీకుమార్‌పై ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేటు వేసిందని పీటీఐ తెలిపింది.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అధికారికంగా వెలువడకముందే డీజీపీ అంజనీ కుమార్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి, శుభాకాంక్షలు తెలియజేశారు.
రేవంత్ ఇంటికి వెళ్లిన వారిలో అంజనీ కుమార్‌తో పాటు మరో ఇద్దరు అధికారులు స్టేట్ పోలీసు నోడల్ ఆఫీసర్ సంజయ్ జైన్, నోడల్ (ఎక్స్‌పెండిచర్) మహేశ్ భగవత్ కూడా ఉన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3

కామారెడ్డిలో కేసీఆర్ ఓటమి, బీజేపీ అభ్యర్థి విజయం
కామారెడ్డిలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కేసీఆర్ ఓటమి పాలయ్యారు.
కేసీఆర్‌పై బీజేపీ అభ్యర్థి కేవీ వెంకట రమణా రెడ్డి విజయం సాధించారు.
19వ రౌండ్ తర్వాత బీజేపీ అభ్యర్థికి 65,198 ఓట్లు పోలవ్వగా.. కేసీఆర్‌కు 59,388 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి కూడా కామారెడ్డిలో పోటీ చేశారు.
కానీ, ఈ ఇద్దర్ని కాదని కామారెడ్డి ప్రజలు బీజేపీ అభ్యర్థిని గెలిపించారు. రేవంత్ రెడ్డికి కామారెడ్డిలో 54,296 ఓట్లు వచ్చాయి.
ఈ గెలుపుతో కేసీఆర్‌ను ఓడించిన రెండో వ్యక్తిగా కేవీ నిలిచారు. 1983 అసెంబ్లీ ఎన్నికల్లో సిద్ధిపేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి అనంతుల మదన్ మోహన్, టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కేసీఆర్‌ను 887 ఓట్ల తేడాతో ఓడించారు.
కేసీఆర్ పోటీ చేసిన మరో నియోజకవర్గం గజ్వేల్‌లో విజయం సాధించారు. రేవంత్ రెడ్డి ఇప్పటికే కొడంగల్‌లో గెలిచారు.
మధిరలో భట్టి విక్రమార్క విజయం
మధిర నియోజక వర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్క విజయం సాధించారు.
భట్టి విక్రమార్క 35,452 ఓట్ల మెజార్టీతో సమీప పత్యర్థి అయిన బీఆర్ఎస్ అభ్యర్థి కమల్ రాజు లింగాలపై గెలుపొందారు.
కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి కేవీ రమణా రెడ్డి 4,273 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
18 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యేప్పటికి ఆయన 61,037 ఓట్లు సాధించారు.
బీఆర్ఎస్ అభ్యర్థి కేసీఆర్ 56,764 ఓట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నారు.
కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి 52,750 ఓట్లతో మూడో స్థానంలో ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు: కేటీఆర్
బీఆర్‌ఎస్‌కి వరుసగా రెండుసార్లు అధికారమిచ్చిన తెలంగాణ ప్రజలకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.
ఇవాళ వచ్చిన ఫలితాలను చూసి బాధపడాల్సిన అవసరం లేదని, అయితే తాము ఊహించిన ఫలితాలు రాకపోవడం కాస్త నిరుత్సాహానికి గురిచేసిందని ఆయన సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
కామారెడ్డి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠగా సాగుతున్నాయి. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని వెనక్కి నెట్టారు బీజేపీ అభ్యర్థి వెంకటరమణా రెడ్డి.
పదమూడు రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యేప్పటికి 41,668 ఓట్లతో బీజేపీ అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీజేపీ 625 ఓట్ల ముందంజలో ఉంది.
కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి 41,043 ఓట్లతో రెండో స్థానంలో, 40,262 ఓట్లతో కేసీఆర్ మూడో స్థానంలో ఉన్నారు.

ఫొటో సోర్స్, Ponguleti Srinivas Reddy/FB
పాలేరులో పొంగులేటి విజయం, ఖమ్మంలో ఆధిక్యంలో తుమ్మల
ఉమ్మడి ఖమ్మం జిల్లా పాలేరులో కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస రెడ్డి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థి అయిన కందాళ ఉపేందర్ రెడ్డిపై దాదాపు 55 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో పొంగులేటి గెలుపొందారు.
ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్‌పై సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 20 వేలకు పైగా ఆధిక్యంలో ఉన్నారు తుమ్మల.
రెండుచోట్ల వెనుకంజలో ఈటల రాజేందర్

ఫొటో సోర్స్, FACEBOOK
బీజేపీ నేత ఈటల రాజేందర్ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ వెనుకంజలో ఉన్నారు.
గజ్వేల్‌లో కేసీఆర్ 9,766 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఏడు రౌండ్లు ముగిసేనాటికి కేసీఆర్‌కు 31,631 ఓట్లు రాగా, ఈటల రాజేందర్ 21,865 ఓట్లతో రెండో స్థానంలో ఉన్నారు.
హుజూరాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి 13 వేల ఓట్లకు పైగా మెజార్టీతో కొనసాగుతున్నారు. కౌశిక్ రెడ్డికి 41,415 ఓట్లు రాగా, ఈటల రాజేందర్ 27,658 ఓట్లతో రెండో స్థానంలో ఉన్నారు.

ఫొటో సోర్స్, facebook
కొడంగల్‌లో రేవంత్ రెడ్డి, హుజూర్‌నగర్‌లో ఉత్తమ్ కుమార్ రెడ్డి, మెదక్‌లో మైనంపల్లి రోహిత్ విజయం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి పట్నం నరేందర్ రెడ్డిపై ఆయన గెలుపొందారు.
మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్‌నగర్ నుంచి విజయం సాధించారు.
మెదక్ అసెంబ్లీ స్థానం నుంచి మైనంపల్లి రోహిత్ గెలుపొందారు.
ఈసీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో దూసుకుపోతుండడంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భారీ ర్యాలీగా గాంధీ భవన్‌కు బయలుదేరారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5

ఫొటో సోర్స్, ANI
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిని డీజీపీ అంజనీ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్న నేపథ్యంలో డీజీపీ రేవంత్ రెడ్డిని కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
మొత్తం 119 అసెంబ్లీ స్థానాలున్న తెలంగాణలో కాంగ్రెస్ 65 స్థానాలు, బీఆర్‌ఎస్ 38 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.

ఫొటో సోర్స్, UGC

ఫొటో సోర్స్, UGC
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 6

ఫొటో సోర్స్, Facebbok
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బోణీ కొట్టింది. ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జారె ఆదినారాయణ విజయం సాధించారు.
బీఆర్ఎస్ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు ఓటమి చెందారు. ఈసీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

ఫొటో సోర్స్, facebook
ఇల్లందులో కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్య గెలుపు
ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇల్లందులో కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్య విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి బానోత్ హరిప్రియపై దాదాపు 18 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు.
ఈసీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
ఆధిక్యంలో కోమటిరెడ్డి సోదరులు
11:40
నల్గొండలో నాలుగు రౌండ్ల లెక్కింపు పూర్తయ్యే నాటికి కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి 10,280 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. వెంకట్ రెడ్డికి 20,653 ఓట్లు రాగా, బీఆర్‌ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి 10,373 ఓట్లతో రెండో స్థానంలో ఉన్నారు.
మునుగోడులో ఏడు రౌండ్లు పూర్తయ్యేనాటికి కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 8,796 ఓట్ల ముందంజలో ఉన్నారు. రాజగోపాల్ రెడ్డికి 31,939 ఓట్లు పోల్ కాగా, బీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి 23,143 ఓట్లతో రెండో స్థానంలో ఉన్నారు.

ఫొటో సోర్స్, Facebook
11:39
కామారెడ్డిలో మూడు రౌండ్లు ముగిసేనాటికి సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి 2,585 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. రేవంత్‌కు 10,886 ఓట్లు పోల్ కాగా, కేసీఆర్‌కి 8,301 ఓట్లు పోలయ్యాయి.
గజ్వేల్‌లో సీఎం కేసీఆర్ 827 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మొదటి రౌండ్‌లో కేసీఆర్‌కి 3,881 ఓట్లు రాగా, సమీప ప్రత్యర్థి అయిన బీజేపీ నేత ఈటల రాజేందర్‌కు 3,054 ఓట్లు పోలయ్యాయి.
కొడంగల్‌లో రెండు రౌండ్లు ముగిసేప్పటికి రేవంత్ రెడ్డి 2,513 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. రేవంత్2కు 10,351 ఓట్లు రాగా, బీఆర్‌ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డికి 7,838 ఓట్లు వచ్చాయి.
హుజూరాబాద్‌లో మొదటి రౌండ్ ఫలితాల్లో ఈటల రాజేందర్ మూడో స్థానంలో ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి 1,061 ఓట్ల ఆధిక్యం సాధించారు. బీఆర్‌ఎస్‌కు 3,907 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి వొడితల ప్రణవ్‌కు 2,846 ఓట్లు, ఈటల రాజేందర్‌కు 2,548 ఓట్లు వచ్చాయి.
సిరిసిల్లలో లీడ్‌లో కేటీఆర్, కరీంనగర్‌లో బండి సంజయ్ వెనకంజ
11:39
సిరిసిల్లలో నాలుగో రౌండ్ ముగిసేనాటికి, కేటీఆర్ 3,749 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కేటీఆర్‌కు 14,225 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి 10,476 ఓట్లతో రెండో స్థానంలో ఉన్నారు.
సిద్దిపేటలో రెండు రౌండ్లు ముగిసేనాటికి హరీశ్ రావు 10,531 ఓట్ల మెజార్టీతో కొనసాగుతున్నారు. హరీశ్‌కు 12,561 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి పూజల హరికృష్ణకు 2,030 ఓట్లు వచ్చాయి.
కరీంనగర్‌లో రెండు రౌండ్లు ముగిసేనాటికి బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌పై బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ 1523 ఓట్ల లీడ్‌లో ఉన్నారు. కమలాకర్‌కు 8,646 ఓట్లు రాగా, బండి సంజయ్‌కి 7,123 ఓట్లు పోలయ్యాయి.
కోరుట్లలో మూడో రౌండ్ ముగిసేనాటికి బీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్ 1866 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. సంజయ్‌కు 11,049 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ 9,183 ఓట్లతో రెండో స్థానంలో ఉన్నారు.
11:12
సీతక్క, యశస్విని రెడ్డి ముందంజ, బర్రెలక్కకు 735 ఓట్లు
పాలకుర్తి నియోజకవర్గంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై కాంగ్రెస్ అభ్యర్థి మామిడాల యశస్విని రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రెండో రౌండ్ ముగిసేనాటికి యశస్విని 746 ఓట్లతో ముందంజలో ఉన్నారు.
ములుగులో కాంగ్రెస్ నేత సీతక్క 4,715 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి బడే నాగజ్యోతి రెండో స్ధానంలో కొనసాగుతున్నారు.
కొల్లాపూర్‌లో రెండు రౌండ్ల లెక్కింపు పూర్తయ్యేనాటికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జూపల్లి కృష్టారావు ఆధిక్యంలో ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి బీరం హర్షవర్ధన్ రెడ్డిపై 2,832 ఓట్ల ముందంజలో ఉన్నారు.
స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన బర్రెలక్క (శిరీష)కు 735 ఓట్లు పోలయ్యాయి.
కొడంగల్‌లో రేవంత్ రెడ్డి 2,513 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి వెనకంజలో ఉన్నారు.
నిర్మల్‌లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి వెనకబడ్డారు. బీజేపీ అభ్యర్థి ఏలేటి మహేశ్వర్ రెడ్డి 10,150 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ రావు 4,932 ఓట్ల లీడ్‌లో కొనసాగుతున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి పద్మ దేవేందర్ రెడ్డి వెనకంజలో ఉన్నారు.

ఫొటో సోర్స్, FACEBOOK
10:57
మేడ్చల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నాలుగు రౌండ్‌ల ఓట్ల లెక్కింపు ముగిసేనాటికి బీఆర్ఎస్ అభ్యర్థి చామకూర మల్లారెడ్డి 10,133 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
మల్కాజ్‌గిరిలో కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి హనుమంత్ రావు వెనకంజలో ఉన్నారు. మొదటి రౌండ్ అనంతరం బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి 2,687 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
10:25
పాలేరులో ముందంజలో పొంగులేటి
ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ నియోజకవర్గ ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
మూడు రౌండ్లలోనూ సమీప ప్రత్యర్థి కందాళ ఉపేందర్ రెడ్డిపై ఆధిక్యం సాధించారు. బీఆర్‌ఎస్‌పై కాంగ్రెస్ 6,988 ఓట్ల ఆధిక్యంలో ఉంది.
మొదటి రౌండ్:
బీఆర్ఎస్: 3847
కాంగ్రెస్ : 6005
కాంగ్రెస్ లీడ్ - 2158
రెండో రౌండ్:
బీఆర్ఎస్: 2948
కాంగ్రెస్ : 6129
కాంగ్రెస్ లీడ్ - 3181
మూడో రౌండ్:
బీఆర్ఎస్: 3416
కాంగ్రెస్: 5065
కాంగ్రెస్ లీడ్ - 1649

ఫొటో సోర్స్, results.eci.gov.in
10:00
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. 31 స్థానాల్లో కాంగ్రెస్, 20 స్థానాల్లో బీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. బీజేపీ ఒక అసెంబ్లీ స్థానంలో ముందంజలో ఉంది.

ఫొటో సోర్స్, FACEBOOK
9.56
కామారెడ్డి: రెండో రౌండ్‌లోనూ లీడ్‌లో రేవంత్ రెడ్డి, కేసీఆర్ వెనుకంజ
రెండో రౌండ్ ముగిసేప్పటికి రేవంత్ రెడ్డి 7,658 ఓట్లతో లీడ్‌లో కొనసాగుతున్నారు. కేసీఆర్ 5,938 ఓట్లతో రెండో స్థానంలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి వెంకట రమణా రెడ్డి మూడో స్థానంలో ఉన్నారు.
సిద్దిపేటలో హరీశ్ రావు లీడ్‌లో ఉన్నారు.
సిద్దిపేట నియోజకవర్గం మొదటి రౌండ్‌లో బీఆర్‌ఎస్ 6,924 ఓట్ల ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 666 ఓట్లతో రెండో స్థానంలో ఉండగా, బీజేపీ 615 ఓట్లతో మూడో స్థానంలో ఉంది.
బీఆర్ఎస్ అభ్యర్థి హరీశ్ రావు 6,258 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
సీఎం కేసీఆర్ పోటీ చేసిన కామారెడ్డి అసెంబ్లీ నియోజవర్గ ఎన్నికల ఫలితాల తొలి రౌండ్‌లో కాంగ్రెస్ ముందంజలో ఉంది.
కామారెడ్డి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బరిలో ఉన్నారు. తొలి రౌండ్ ముగిసేప్పటికి రేవంత్ రెడ్డికి 3,607 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి 2,717 ఓట్లతో రెండో స్థానంలో ఉన్నారు.
సీఎం కేసీఆర్ 2,695 ఓట్లతో మూడో స్థానంలో ఉన్నారు.
తెలంగాణలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. మొత్తం 119 నియోజకవర్గాలలో లెక్కింపు ప్రారంభమైంది.
మొదట పోస్టల్ ఓట్లు, సర్వీస్ ఓట్లు లెక్కించనున్నారు.
హ్యాట్రిక్ విజయం ఖాయమని అధికార బీఆర్‌ఎస్ ధీమా వ్యక్తం చేస్తోంది.
ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, మెజార్టీ సీట్లు గెలవబోతున్నామని కాంగ్రెస్ చెబుతోంది.
చెప్పుకోదగ్గ సీట్లు సాధించడం ద్వారా హంగ్ అసెంబ్లీ ఏర్పడితే తాము కీలక పాత్ర పోషిస్తామంటోంది బీజేపీ.

ఫొటో సోర్స్, KTR X account
ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీచేస్తున్న కామారెడ్డి, గజ్వేల్ నియోజకవర్గాలపైన అందరి దృష్టి పడింది.
కామారెడ్డిలో కాంగ్రెస్ నుంచి రేవంత్‌రెడ్డి కూడా పోటీచేస్తున్నారు.
మరోపక్క రేవంత్ కొడంగల్ నుంచి కూడా బరిలో ఉన్నారు.
ఇక గజ్వేల్‌లో కేసీఆర్‌పై బీజేపీ నుంచి ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నారు. దీంతో కామారెడ్డి, గజ్వేల్ ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఓట్ల లెక్కింపు ప్రక్రియపై కూడా రాజకీయపార్టీలు అప్రమత్తంగా ఉన్నాయి.
పోలింగ్ ఏజెంట్లతో ప్రత్యేకంగా సమావేశమై కౌంటింగ్ కేంద్రంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశాయి.
స్వల్పంగా ఓట్ల తేడా వచ్చిన చోట రీకౌంటింగ్ కోరాలని ఏజెంట్లకు ఆయా పార్టీలు సూచించాయి.
ఇవి కూడా చదవండి:
- బర్రెలక్క: తెలంగాణ ఎన్నికల్లో నిరుద్యోగ సమస్యకు ప్రతినిధి ఈమేనా...
- తెలంగాణ ఎన్నికలు: బీఆర్ఎస్ ఒక్కసారీ గెలవని 17 నియోజకవర్గాలు
- తెలంగాణ ఎన్నికలలో జనాన్ని ఉర్రూతలూగిస్తున్న మూడు పాటలు
- నిజామాబాద్ అర్బన్: పోలింగ్‌కు ముందు అభ్యర్థి మరణిస్తే ఎన్నికలు వాయిదా పడతాయా? చట్టం ఏం చెబుతోంది?
- ‘బర్రెలక్క’, యశస్విని రెడ్డి, కేసీఆర్, రేవంత్, ఈటల.. అందరిదీ ఒకటే లక్ష్యం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














