భారతి: కూలి పనులు చేస్తూ కెమిస్ట్రీలో పీహెచ్‌డీ

వీడియో క్యాప్షన్, భారతి: కూలి పనులు చేస్తూ కెమిస్ట్రీలో పిహెచ్‌డీ

అనంతపురం జిల్లా శింగనమల మండలంలోని మారుమూలన ఉండే పల్లె నాగుల గుడ్డంలోని ఇరుకైన గదిలోనే కింద మట్టిపై కూర్చుని ఇన్నాళ్లూ చదువుకుంటూ వచ్చారు భారతి.

ఇప్పుడు పీహెచ్‌డీ అందుకుని తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు. స్లిప్పర్స్ వేసుకుని వెళ్లి గవర్నర్ చేతులమీదుగా పీహెచ్‌డీ అందుకున్నారు భారతి.

ఇన్నాళ్లూ ఎవరూ పట్టించుకోని ఆమె కుటుంబం ఇప్పుడు ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. సాకే భారతి గురించి మీడియాలో వార్తలు రావడంతో స్థానికులు, ఇతర నాయకులు వారికి అండగా ఉంటామని, ఆర్థిక సాయం అందిస్తామని వస్తున్నారు. పార్టీల నాయకులు, ప్రజాసంఘాలు ఆమెను అభినందిస్తున్నారు.

భారతి

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)