బ్రోకలీ క్యాన్సర్‌ను అడ్డుకుంటుందా, అధ్యయనాలు ఏం చెబుతున్నాయి?

ఫొటో సోర్స్, Getty Images
కాయగూరలు, ఆకుకూరలతో తీసుకునే ఆహారం ఆరోగ్యానికి ఎంతో అవసరం. వీటిలో కొన్ని ఆహారాలు క్యాన్సర్ రాకుండా కాపాడుతుంటాయని మీకు తెలుసా?
క్యాన్సర్ రాకుండా అడ్డుకునే ఆకుకూర బ్రోకలీ గురించి తెలుసుకుందాం..


ఫొటో సోర్స్, Getty Images
బ్రోకలీలో ఏమున్నాయి?
క్యాబేజ్, కాలిఫ్లవర్ మాదిరి బ్రోకలీ కూడా క్రూసిఫరస్ ఆకుకూర. ఆకుపచ్చని కాలిఫ్లవర్ మాదిరి, దీనిలో కూడా క్యాన్సర్‌ను తగ్గించే పదార్థాలు ఉన్నాయని తాజా అధ్యయనం ఒకటి చెబుతోంది.
ఒరెగాన్ యూనివర్సిటీ నిర్వహించిన అధ్యయనంలో, మన రోజువారీ ఆహారంలో కొంచెం బ్రోకలీ తీసుకున్నా, క్యాన్సర్‌ను అరికట్టేందుకు సాయపడుతుంది.
బ్రోకలీ మొలకల్లో ఉండే సల్ఫోరాఫేన్ అనే పదార్థం యాంటీ-క్యాన్సర్ కారకమని ఈ అధ్యయనం తెలిపింది.
అంతేకాక, బ్రోకలీలో బ్రెస్ట్ క్యాన్సర్‌ను తగ్గించే పదార్థాలు కూడా ఉన్నట్లు నార్ఫోక్ శాస్త్రవేత్తల అధ్యయన ఫలితాల్లో తేలింది.
బ్రెస్ట్ ఎక్స్-రేలలో అసాధారణ సంకేతాలు కనిపించిన మహిళలు... రోజూ ఒక కప్పు బ్రోకలీ మొలకలు తిన్న తర్వాత అసాధారణ కణాల పెరుగుదల నియంత్రణలోకి వచ్చినట్లు ఈ అధ్యయనం పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
క్యాన్సర్‌ను బ్రోకలీ ఎలా అడ్డుకుంటుంది?
సల్ఫోరాఫేన్ అనే పదార్థం బ్రోకలీ వంటి ఆకుకూరల్లో ఎక్కువగా ఉంటుంది. డీఎన్‌ఏలో మ్యూటేషన్స్‌ను ఇది నియంత్రించడం ద్వారా క్యాన్సర్‌కు అడ్డుకట్ట వేస్తుంది.
బ్రోకలీపై అధ్యయనం చేసిన పలు విశ్లేషణలను పరిశీలించిన ఒక బృందం.. బ్రోకలీ అసలు లేదా తక్కువగా తినేవారితో పోలిస్తే ఎక్కువగా బ్రోకలీ తినే వారిలో చాలా వరకు క్యాన్సర్లు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని గుర్తించింది.
కానీ, దీన్ని ధ్రువీకరించేందుకు మరిన్ని అధ్యయనాలు అవసరమని పరిశోధకులు చెప్పారు.
బ్రోకలీలో విటమిన్ సీ, యాంటి ఆక్సిడెంట్స్, కెరొటెనాయిడ్స్‌గా పిలిచే పిగ్‌మెంట్స్ ఉంటాయి.
ఈ ఆకుకూరను తినే వారిలో, జన్యుపరమైన వ్యాధులు, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు తగ్గుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
ప్రొస్టేట్ క్యాన్సర్‌నూ తగ్గిస్తుంది
క్యాన్సర్‌ను బ్రోకలీ నివారిస్తుందని నార్ఫోక్ యూనివర్సిటీ పరిశోధకులు 2010లో కనుగొన్నారు. ప్రొస్టేట్ క్యాన్సర్‌పై పరిశోధన చేసే సమయంలో, బ్రోకలీలో సల్ఫోరాఫేన్ పదార్థం ఉన్నట్లు గుర్తించారు.
ఫాస్పెటేస్, టెన్సిన్ హోమోలాగ్(పీటీఈఎన్) జన్యువు లోపించడం వల్ల పెరిగే కణాల వృద్ధిని సల్ఫోరాఫేన్ అడ్డుకుంటుందని ఈ అధ్యయనం గుర్తించింది.
పీటీఈఎన్ జన్యువు తక్కువగా లేదా క్రియాశీలకంగా లేనప్పుడు, ప్రొస్టేట్ క్యాన్సర్ విస్తరిస్తుంది. మానవుల ప్రొస్టేట్ కండరాలపైనా, ఎలుకలపైనా చేసిన అధ్యయనంలో, క్యాన్సర్ కణాలుగా మారే అవకాశం ఉన్న కణాల వృద్ధిని సల్ఫోరాఫేన్ అడ్డుకుంటుందని గుర్తించింది.
పీటీఈఎన్ అనేది క్యాన్సర్‌ను అధిగమించే జన్యువు. ఇది పాడైనా లేదా చురుకుగా లేకపోయినా ప్రొస్టేట్ క్యాన్సర్‌కు దారితీస్తుందని నార్విచ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుడు రిచర్డ్ మిట్టెన్ బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
బ్రోకలీ వల్ల ఇంకేం లాభాలున్నాయి?
బ్రోకలీలో ఉండే సల్ఫోరాఫేన్ అనే పదార్థం ఆర్థరైటిస్‌ను నివారించేందుకు కూడా సాయపడుతుందని ఈస్ట్ యాంగ్లియా యూనివర్సిటీలోని పరిశోధకులు గుర్తించారు.
అలాగే, పొట్ట, జీర్ణవ్యవస్థలో ఉన్న సమస్యలను నియంత్రించేందుకు కూడా బ్రోకలీ సాయపడుతుందని యూనివర్సిటీ ఆఫ్ లివర్‌పూల్ నిర్వహించిన అధ్యయనం గుర్తించింది.
బ్రోకలీ, అరటిపండులో ఉన్న ఫైబర్, మన పేగుల్లోని హానికరమైన బ్యాక్టీరియాను అరికడుతుందని గుర్తించారు.
బీబీసీలో ప్రచురితమైన పలు వార్తా కథనాల నుంచి ఈ సమాచారాన్ని సేకరించాం.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














