న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబిర్ పుర్కాయస్థ అరెస్ట్ చట్ట వ్యతిరేకమన్న సుప్రీం కోర్టు

ప్రబిర్ పుర్కాయస్థ

ఫొటో సోర్స్, GETTY IMAGES

న్యూస్‌క్లిక్ వెబ్‌సైట్ వ్యవస్థాపకుడు ప్రబిర్ పుర్కాయస్థను విడుదల చేయాలని బుధవారం సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఆదేశించింది.

జస్టిస్ బీఆర్ గవాయ్‌తో కూడిన ధర్మాసనం పుర్కాయస్థ అరెస్ట్, ఆయన నిర్బంధం చట్టవిరుద్ధమని వ్యాఖ్యానించింది.

పుర్కాయస్థ అరెస్ట్ సమయంలో , అరెస్ట్‌కు కారణమేమిటో చెప్పలేదని, అందుకే ఈ అరెస్ట్‌ను రద్దుచేస్తున్నట్టు కోర్టు చెప్పింది.

దిగువ కోర్టు నిర్ణయించిన మొత్తాన్ని డిపాజిట్ చేశాకా ప్రబిర్ పుర్కాయస్థను విడుదల చేయవచ్చని తెలిపింది.

చైనా నుంచి అక్రమంగా నిధులు పొందుతున్నారనే అభియోగాలపై కిందటేడాది అక్టోబరులో పుర్కాయస్థను ‘యూఏపీఏ’ (ఉపా) చట్టం కింద అరెస్ట్ చేశారు.

మీడియా స్వేచ్ఛ పోటో

ఫొటో సోర్స్, ANI

ప్రబీర్ న్యాయవాది ఏం చెప్పారు?

పుర్కాయస్థను అదుపులోకి తీసుకున్నప్పుడు, ఆయన అరెస్ట్‌కు గల కారణాలను వివరించలేదని, కారణాలను లిఖిత పూర్వకంగా ఇవ్వలేదని, పుర్కాయస్థ న్యాయవాది కపిల్ సిబాల్ వాదించారు.

అయితే అరెస్ట్ కారణాలను పుర్కాయస్థకు వివరించినట్టు దిల్లీ పోలీసుల తరపున వాదించిన అడిషనల్ సాలిసిటర్ జనరల్ ఎస్వీరాజు కోర్టుకు చెప్పారు.

ఉపా చట్టం కింద లిఖిత పూర్వక సమాచారం ఇవ్వడం తప్పనిసరి కాదని చెప్పారు.

పుర్కాయస్థను అరెస్ట్ చేసిన తీరు, రిమాండ్‌ను సుప్రీంకోర్టు చట్టవిరుద్ధంగా పరిగణించిందని, పుర్కాయస్థ విడుదలకు ఆదేశాలు జారీచేసిందని న్యాయవాది అర్షదీప్ ఖురానా చెప్పారు.

‘‘ట్రైల్ కోర్టు ముందు ష్యూరిటీ బాండ్స్ సమర్పించాల్సిందిగా మమ్మల్ని ఆదేశించారు. ఇది మాకు చాలా పెద్ద ఊరట. పుర్కాయస్థకు వ్యతిరేకంగా సాగించిన ప్రక్రియ, అరెస్ట్ అంతా చట్టవిరుద్దమని మేం మొదటి నుంచి చెబుతూనే ఉన్నాం. సుప్రీం కోర్టు కూడా ఇదంతా చట్టవిరుద్దమని చెప్పింది’’ అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

ఇప్పుడేమవుతుంది?

ప్రబిర్ పుర్కాయస్థ ట్రైల్ కోర్టు ముందు హాజరుకావాల్సి ఉంది. అక్కడ కొన్ని షరతులు విధిస్తారు. సుప్రీం కోర్టు కూడా ఎటువంటి షరతులు లేకుండా ఆయనను విడుదల చేయాలని చెప్పింది. కాకపోతే ఆయనపై చార్జిషీటు దాఖలైంది.

మరోసారి అరెస్ట్ అవుతారా?

ఒకసారి అరెస్ట్ రద్దయిన తరువాత నిందితుడిని మరోసారి అరెస్ట్ చేయలేరు.

పుర్కాయస్థను తిరిగి అరెస్ట్ చేస్తారేమో అని ఆయన న్యాయవాది కపిల్ సిబల్ సందేహం వ్యక్తం చేసినప్పుడు షరతలును నిర్ణయించేటప్పుడు ఆ సందేహాన్ని దృష్టిలో పెట్టుకోవాలని సుప్రీం కోర్టు మౌఖికంగా తెలిపింది. పూచీకత్తు బాండ్ నింపాలనే ఆదేశాలున్న చోట ఆ సందేహాన్ని దృష్టిలో ఉంచుకోవాలని కోర్టు పేర్కొంది.

ఉపా కేసులలో బెయిల్ ఎలా?

అక్రమ కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద బెయిల్ పొందడం చాలా కష్టమైనదిగా భావిస్తారు. కానీ పుర్కాయస్థ కేసులో ఎలా సాధ్యమైంది?

నిజానికి ఈ కేసులో అరెస్ట్ చేసిన విధానం, అరెస్ట్‌కు కారణాలు , నిందితుడికి న్యాయవాదిని కలుసుకోవడానికి అవకాశం ఇవ్వడమనే ప్రక్రియను అమలు చేయలేదని సుప్రీం కోర్టు గుర్తించింది.

దిల్లీ పోలీసుల ఫోటో

ఫొటో సోర్స్, GETTY IMAGES

అసలేం జరిగింది?

న్యూస్‌క్లిక్ వెబ్‌సైట్‌కు సంబంధించిన అనేకమంది జర్నలిస్టుల ఇళ్ళపై కిందటేడాది అక్టోబర్‌లో దిల్లీ పోలీసులు దాడులు చేశారు.

చైనా ప్రాపగాండ( ప్రచారాన్ని) నిర్వహించేందుకు ఓ అమెరికన్ కోటీశ్వరుడి నుంచి న్యూస్‌క్లిక్ వెబ్‌సైట్ నిధులు తీసుకున్నట్టు న్యూయార్క్ టైమ్స్ ఆగస్టు 2023లో ఓ కథనం రాసిన తరువాత దిల్లీ పోలీసులు ఈ దాడులు చేశారు.

దీని తరువాత న్యూస్‌క్లిక్ వెబ్‌సైట్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ ఆరోపణలను న్యూస్‌క్లిక్‌ ఖండించింది.

దిల్లీ పోలీసులు వెబ్‌సైట్ వ్యవస్థాపకుడు ప్రబిర్ పుర్కాయస్థ, జర్నలిస్టులు అభిసఃర్ శర్మ, అనింద్య చక్రవర్తి, బాషా సింగ్, వ్యంగ్యరచయిత సంజయ్ రజౌరీ, చరిత్రకారుడు సోహైల్ హష్మీ ఉన్నారు.

దాడుల సందర్భంగా పోలీసులు మొబైళ్ళు, లాప్‌టాప్స్, కంప్యూటర్లను సీజ్ చేశారు. ఉపా చట్టం కింద న్యూస్‌క్లిక్ ప్రధాన సంపాదకుడు ప్రబిర్ పుర్కాయస్థ, హెచ్‌ఆర్ హెడ్ అమిత్ చక్రవర్తిపై కేసు నమోదు చేశారు.

అంతకుముందు 2021లో ఈ వెబ్‌సైట్‌కు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయనే విషయంపై విచారణ ప్రారంభించారు. ఆ సమయంలో దిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం ఈ వెబ్‌సైట్‌పై కేసు నమోదు చేసింది. దీని తరువాత ఈడీ కూడా ఇదే విషయమై కేసు నమోదు చేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)