Northern Lights: ఆకాశంలో ఈ రంగుల తుపాను మీకెప్పుడైనా కనిపించిందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నటాషా ప్రెస్కీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాలలో ఆకాశం సప్తవర్ణమయంగా మారింది.
ప్రశాంతంగా ఉన్నఆకాశంలో ఒక్కసారిగా రంగు రంగుల వెలుగులు కనిపించాయి.
నార్తర్న్ లైట్స్ అని పిలిచే ఈ రంగుల వెలుగులను అరోరా బోరియాలిస్ అని కూడా అంటారు.

ఫొటో సోర్స్, JOSH WALET/EPA-EFE/REX/Shutterstock
అందమైన రంగుల రిబ్బన్న మాదిరిగా కనిపించే ఈ వెలుగులు వాస్తవానికి ఒక భీకరమైన జియోమాగ్నటిక్ తుపాను.
2003లో ఇలాంటి భీకరమైన పరిణామం కనిపించింది. అయితే, భూమి మీద జీవించే వారికి దీనితో ఎలాంటి ప్రమాదం ఉండదు.

ఫొటో సోర్స్, Getty Images
సూర్యుడి నుంచి వెలువడే ధూళికణాలు అంతరిక్షంలో భూమి ఉపరితల వాతావరణాన్ని గంటకు 7 కోట్ల కిలోమీటర్ల వేగంతో తాకినప్పుడు ఈ పరిణామం జరుగుతుంది.

ఫొటో సోర్స్, PA Media

ఫొటో సోర్స్, LAURENT GILLIERON/EPA-EFE/REX/Shutterstock
స్విట్జర్లాండ్‌లోని డైలెన్స్ గ్రామంలోనిది ఈ అందమైన దృశ్యం

ఫొటో సోర్స్, PA Media
స్కాట్లాండ్‌లోని క్వీన్స్‌ఫెర్రీ బ్రిడ్జి మీద ఊదా, ఆకుపచ్చ రంగులతో ఆకాశం అందంగా కనిపించింది

ఫొటో సోర్స్, Reuters
రష్యాలోని తారా పట్టణంలో గులాబీ రంగు ఆకాశం ఏర్పడింది.
ముందుభాగంలో వ్లాదిమిర్ లెనిన్ విగ్రహం కనిపించేలా నలుపు, గులాబీ వర్ణాల మిశ్రమంగా ఉన్న ఆకాశాన్ని ఫోటో తీశారు.

ఫొటో సోర్స్, Getty Images
కాలిఫోర్నియాలోని శాన్‌ఫ్రాన్సిస్కోకు ఉత్తరాన ఉన్న మిడిల్‌టన్‌లో ప్రకాశవంతమైన గులాబీ, ఊదా రంగులతో కూడిన ఆకాశం.

ఫొటో సోర్స్, PROFESSORMILLER/ WATCHERS
వేల్స్‌లోని ఫ్లింట్‌షైర్‌లో ఆకాశంలో ఆకుపచ్చ రంగు పరుచుకున్న దృశ్యాన్ని బీబీసీ వాతావరణ విభాగం కెమెరాలో బంధించింది.

ఫొటో సోర్స్, BBC Weather Watchers/StormChaserLiam
నార్తర్న్ లైట్స్ ఎలా ఏర్పడతాయి?
నార్తర్న్ లైట్స్ లేదా అరోరా బోరియాలిస్ అనేవి రాత్రిపూట ఆకాశంలో ప్రకాశవంతమైన రంగుల్లో కనిపిస్తాయి. ఇవి ఆకుపచ్చ, గులాబీ, సింధూరం వంటి పలు రంగుల్లో ఏర్పడతాయి.
సూర్యుని నుంచి వెలువడిన చార్జ్‌డ్ కణాలు భూ వాతావరణంలోకి వాయువులతో ఢీకొన్నప్పుడు నార్తర్న్ లైట్స్ ఏర్పడతాయి.
సూర్యుని నుంచి వచ్చిన చార్జ్‌డ్ కణాలతో భూమి వాతావరణంలోని వాయువులు శక్తిమంతం కావడంతో ఆకాశంలో వివిధ రంగులు ఏర్పడతాయి.
భూమి వాతావరణంలో అత్యంత సాధారణ వాయువులు నైట్రోజన్, ఆక్సీజన్. ఆక్సీజన్ వాయువు శక్తిమంతంగా మారినప్పుడు అందులోని పరమాణువులు ఆకుపచ్చ రంగులో మెరుస్తాయి. నార్తర్న్ లైట్స్‌లో తరచుగా ఆకుపచ్చ రంగు కనిపిస్తుంది. నైట్రోజన్ పరమాణులు ఊదా రంగు, నీలం రంగు, గులాబీ రంగుల్లో మెరుపును సంతరించుకుంటాయి.
కరోనల్ మాస్ ఎజెక్షన్స్’’ అనే భారీ కణాలను సూర్యుడు ఉద్గారం చేసినప్పుడు అత్యంత ఆకర్షణీయమైన అరోరాలు ఏర్పడతాయి.
ఇవి కూడా చదవండి:
- హెచ్డి దేవేగౌడ: అన్నం లేక పస్తులున్న రోజుల నుంచి ప్రధానమంత్రి పదవి దాకా.
- దక్షిణ కొరియా: ప్రెప్పర్లు ఎవరు, ఉత్తర కొరియాతో యుద్ధం భయంతో ఎందుకు అన్నీ సర్దుకుంటున్నారు?
- లోక్‌సభ ఎన్నికలు: ఒకనాడు 400కు పైగా స్థానాలలో గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 300 స్థానాలలో మాత్రమే ఎందుకు పోటీ చేస్తోంది?
- 4.7 కోట్ల ఏళ్లనాటి వాసుకి పాము అవశేషాలు వెలుగులోకి.. అసలేంటి ఈ పాము కథ?
- అడాల్ఫ్ హిట్లర్ కోసం ఆ మహిళలు కన్న వేలమంది ‘ఆర్య పుత్రులు’ ఏమయ్యారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















