దైనిక్ భాస్కర్ కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ దాడులు, కేంద్రంపై ప్రతిపక్షాల విమర్శలు

ఫొటో సోర్స్, SUREH NIAZI
- రచయిత, దిల్‌నవాజ్ పాషా
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆదాయపన్ను శాఖ గురువారం ఉదయం భారత ప్రముఖ మీడియా గ్రూప్ దైనిక్ భాస్కర్‌కు చెందిన చాలా కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. హిందీ ప్రముఖ హిందీ వార్తా పత్రికల్లో దైనిక్ భాస్కర్ ఒకటి.
దైనిక్ భాస్కర్ కార్యాలయాలపై ఆదాయపన్ను శాఖ దాడులు చేసిందని సీబీడీటీ(సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టరేట్ టాక్స్) ప్రతినిధి సురభి అహ్లువాలియా బీబీసీకి ధ్రువీకరించారు.
అయితే, భాస్కర్ కార్యాలయాలపై ఎందుకు ఈ చర్యలు చేపట్టారో ఆయన చెప్పలేదు. ఏజెన్సీలు తమ పనిచేస్తున్నాయని, ప్రభుత్వం ఇందులో ఎలాంటి జోక్యం చేసుకోదని ఈ దాడులపై మాట్లాడిన కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.
ఆదాయపన్ను శాఖకు చెందిన పలు బృందాలు వేరు వేరు రాష్ట్రాల్లోని దైనిక్ భాస్కర్ కార్యాలయాలపై ఒకేసారి ఈ చర్యలు చేపట్టాయి.
భోపాల్‌లోని దైనిక్ భాస్కర్ ప్రధాన కార్యాలయం, మేనేజర్ ఇళ్లకు కూడా టీమ్స్ చేరుకున్నాయి.
దైనిక్ భాస్కర్ సిబ్బంది వివరాల ప్రకారం "ఆ సమయంలో ఆఫీసుల్లో ఉన్న ఉద్యోగుల మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వారిని ఆఫీసు నుంచి బయటకు వెళ్లనివ్వలేదు"
దైనిక్ భాస్కర్ నేషనల్ ఎడిటర్ లక్ష్మీ ప్రసాద్ పంత్ దీనిపై బీబీసీతో మాట్లాడారు.
"నేను స్వయంగా మూడు సార్లు అధికారులను ఈ సోదాలు ఎందుకు చేస్తున్నారని అడిగాను, కానీ, వాళ్లు ఏ సమాచారం ఇవ్వలేదు" అని తెలిపారు.
దీనిపై దైనిక్ భాస్కర్ తమ వెబ్‌సైట్‌లో ఒక కథనం ప్రచురించింది.
"నిఖార్సయిన జర్నలిజానికి ప్రభుత్వం భయపడింది, గంగానదిలో శవాల గురించి, కరోనా మరణాల గురించి సరైన లెక్కలను దేశం ముందు పెట్టిన దైనిక్ భాస్కర్ గ్రూప్‌పై ప్రభుత్వం అణచివేత చర్యలకు పాల్పడుతోంది" అని ఆ కథనంలో తెలిపింది.
దైనిక్ భాస్కర్‌ను దాని జర్నలిజం కోసమే లక్ష్యంగా మార్చుకున్నారా? అనే ప్రశ్నకు "మేం రాష్ట్రాల్లో వాస్తవాలను ప్రచురించాం. దానికి ప్రభుత్వాలు ఇబ్బంది పడ్డాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, బీహార్ ఇలా రాష్ట్రం ఏదైనా, మేం అక్కడ ఏ ప్రభుత్వం ఉందనేది చూడలేదు. దైనిక్ భాస్కర్ ఏ పనిచేస్తోందో, దానిని కొనసాగిస్తుంది" అని పంత్ చెప్పారు.

ఫొటో సోర్స్, DAINIK BHASKAR
కొన్ని రిపోర్టుల ప్రకారం దైనిక్ భాస్కర్ గ్రూప్ కార్యాలయాల్లో సోదాలు చేసిన బృందాల్లో ఈడీ టీమ్స్ కూడా ఉన్నాయి.
"వారిలో ఈడీ టీమ్స్ కూడా ఉండచ్చు. మాకు అలా అనిపించింది. కానీ, దాని గురించి ఇంకా అధికారిక సమాచారం ఏదీ ఇవ్వలేదు" అని దైనిక్ భాస్కర్ ఉద్యోగి ఒకరు బీబీసీతో అన్నారు.
"సెకండ్ వేవ్ సమయంలో ఆరు నెలల వరకూ దేశంలో కరోనాకు ప్రభావితమైన రాష్ట్రాల్లో వాస్తవ పరిస్థితిని భాస్కర్ ధైర్యంగా దేశం ముందుకు తెచ్చింది. గంగానదిలో శవాలు ప్రవహించడమైనా, లేక కరోనా వల్ల సంభవించిన మరణాలనైనా దాచిపెట్టకుండా నిర్భయంగా జర్నలిజం చూపించి సత్యాన్ని ప్రజల ముందు వాస్తవాలను ఉంచింది" అని దైనిక్ భాస్కర్ తన రిపోర్టులో చెప్పింది.
మరోవైపు, ఉత్తర్‌ప్రదేశ్ నుంచి నడిచే న్యూస్ చానల్ 'భారత్ సమాచార్' ఆఫీసులు, దాని ఎడిటర్ బ్రజేష్ మిశ్రా ఇళ్లలో కూడా ఆదాయ పన్ను శాఖ సోదాలు జరిగినట్లు రిపోర్టులు వచ్చాయి. దీనికి సంబంధించి ఆదాయ పన్ను శాఖ ఎలాంటి అధికారిక సమాచారం జారీ చేయలేదు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
కానీ, ఆదాయపన్ను శాఖకు సంబంధించిన చాలా బృందాలు సంస్థ, దాని సిబ్బందికి సంబంధించిన కార్యాలయాలు, ఇళ్లలో సోదాలు చేశారని భారత్ సమాచార్ చెప్పింది.
మీడియా గ్రూప్ కార్యాలయాల్లో సోదాలకు నిరసనగా పార్లమెంటులో విపక్షాలు హడావుడి చేశాయి. దాంతో పార్లమెంట్ కార్యకలాపాలు కూడా ప్రభావితమయ్యాయి.

ఫొటో సోర్స్, SUREH NIAZI
పత్రికా స్వేచ్ఛపై దాడి
మరోవైపు వివిధ పార్టీల నేతలు దీనిని పత్రికా స్వేచ్ఛపై జరిగిన దాడిగా వర్ణించారు.
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద కేజ్రీవాల్ దీనిపై ఒక ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
"దైనిక్ భాస్కర్, భారత్ సమాచార్ మీద ఆదాయ పన్ను శాఖ దాడులు మీడియాను భయపెట్టే ప్రయత్నమే. దీని సందేశం స్పష్టంగా తెలుస్తోంది. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, వారిని వదిలిపెట్టం. ఇలాంటి ఆలోచన చాలా ప్రమాదకరం. దీనిపై అందరూ గళమెత్తాలి. ఈ దాడులను వెంటనే ఆపివేయాలి. మీడియాను స్వతంత్రంగా పనిచేసుకోనివ్వాలి" అన్నారు.
ఆదాయ పన్ను శాఖ దాడులపై దైనిక్ భాస్కర్ ఒక ట్వీట్ చేసింది.
నేను స్వతంత్రుడిని, ఎందుకంటే నేను భాస్కర్‌ను, భాస్కర్‌లో కేవలం పాఠకులది ఇష్టమే నడుస్తుంది. అని రాశారు. అరవింద కేజ్రీవాల్ ఆ ట్వీట్‌ను రీట్వీట్ చేశారు.
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ కూడా దీనిపై ఒక ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
"దేశవ్యాప్తంగా సత్యాన్ని నిర్భయంగా బయటపెడుతున్న దైనిక్ భాస్కర్ మీడియా గ్రూప్‌ను అణచివేసే పని మొదలైందా. తమ శత్రువులను అణచివేయడానికి, నిజాన్ని ముందుకు తీసుకురాకుండా అడ్డుకోడానికి ప్రభుత్వం ఈడీ, ఐటీ, ఇతర ఏజెన్సీలను ఇలా ముందు నుంచే దుర్వినియోగం చేస్తోంది. అది ఇప్పుడు కూడా కొనసాగుతోంది" అన్నారు.

ఫొటో సోర్స్, TWITTER
అటు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ట్విటర్‌లో ఆదాయ పన్ను శాఖ చర్యలను మీడియాను అణచివేత యత్నంగా చెప్పారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా దీనిని ట్విటర్‌లో విమర్శించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
జర్నలిస్టులు, మీడియా సంస్థలపై దాడి ప్రజాస్వామ్యాన్నిఅణచివేసే మరో క్రూర ప్రయత్నం. మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యం ఫలితంగా కరోనా సమయంలో దేశం ఎంత భయంకరమైన రోజులను చూడాల్సి వచ్చిందో దైనిక్ భాస్కర్ ధైర్యంగా రిపోర్ట్ చేసింది అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఆక్సిజన్ కొరతతో ఎవరూ చనిపోలేదన్న కేంద్రం, మరి రుయా ఆస్పత్రిలో మరణాలెలా సంభవించాయి?
- మొన్న చైనాలో మంకీ బీ వైరస్, ఇప్పుడు అమెరికాలో మంకీపాక్స్ కలకలం
- 1971 యుద్ధంలో భారత్ ముందు లొంగిపోయిన పాక్ ఫొటోను అఫ్గానిస్తాన్ ఉపాధ్యక్షుడు ఇప్పుడెందుకు షేర్ చేశారు?
- తెలంగాణలో భారీ వర్షాలు: నిర్మల్‌లో రోడ్ల మీదే చేపల వేట
- పెగాసస్ స్పైవేర్: ఇప్పటికీ సమాధానాలు దొరకని కీలక ప్రశ్నలు
- ఒకప్పటి భారతదేశానికి ఇప్పటి ఇండియాకు తేడా ఇదే
- తెలంగాణ: ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఇంకా ఎన్ని ఇస్తారు?
- టోక్యో ఒలింపిక్స్: ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా ఉత్సవం ప్రత్యేకతలేంటి? భారత్ నుంచి ఎవరెవరు వెళ్తున్నారు?
- ప్రమాదం అని తెలిసినా చైనాలో ప్లాస్టిక్ సర్జరీల సంఖ్య ఎందుకు పెరుగుతోంది
- దానిష్ సిద్దిఖీ: పులిట్జర్ ప్రైజ్ అందుకున్న భారత ఫొటో జర్నలిస్ట్ తీసిన మరపురాని ఛాయా చిత్రాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








