తెలంగాణలో భారీ వర్షాలు: నిర్మల్‌లో రోడ్ల మీదే చేపల వేట

వరద

ఫొటో సోర్స్, ugc

ఫొటో క్యాప్షన్, భారీ వర్షాలకు ఇంటి చుట్టూ చేరిన నీళ్లు
    • రచయిత, ప్రవీణ్ కుమార్
    • హోదా, బీబీసీ కోసం

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో అత్యధికంగా వర్షాలు పడుతున్నాయి.

గడిచిన 24 గంటల్లో తెలంగాణలో అత్యధికంగా నిర్మల్ జిల్లా దిలవార్‌పూర్‌లో 24.7 సెం.మీ, నర్సాపూర్(జి)లో 24.5 సెం.మీ వర్షపాతం నమోదయ్యింది.

మరో రెండు రోజుల పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కొనసాగవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

వరదలు

ఫొటో సోర్స్, ugc

ఫొటో క్యాప్షన్, జీఎన్ఆర్ కాలనీలో వరదనీటిలో చిక్కుకున్న బాలింతను ఆమె 11 రోజుల వయసు బాబును రక్షించారు.

భారీ వర్షాలకు నిర్మల్ జిల్లా కేంద్రంలో పలు కాలనీలు జలమయం అయ్యాయి.

జీఎన్ఆర్ కాలనీలో వరదనీటిలో చిక్కుకున్న బాలింత, 11 రోజుల వయసు బాబును రక్షించారు.

ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో సహాయకచర్యలను చేపట్టారు.

వరద

ఫొటో సోర్స్, ugc

ఫొటో క్యాప్షన్, రాజన్న-సిరిసిల్ల జిల్లా నూతన కలెక్టరేట్‌ పరిసరాల్లో నిలిచిన వరద నీరు

మరోవైపు రాజన్న-సిరిసిల్ల జిల్లా నూతన కలెక్టరేట్ వర్షంతో జలమయం అయ్యింది. పంటచేలు నీట మునిగాయి.

పలుప్రాంతాల్లో వాగులు ఉప్పొంగడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

వరదలు

ఫొటో సోర్స్, ugc

ఫొటో క్యాప్షన్, వరదతో నిలిచిపోయిన రాకపోకలు

మరోవైపు, భారీ వర్షాలతో వరదలు రావడంతో నిర్మల్ టౌన్‌లో జనం రోడ్డుపైనే చేపలు పడుతున్నారు.

నిర్మల్ శివారులో ఉండే భాగ్యనగర్ చెరువు పూర్తిగా నిండి, పొంగి పొర్లుతోంది.

దాంతో అందులోని చేపలు రోడ్డు మీదకు వస్తున్నాయి.

వాటిని స్థానికులు వలల సాయంతో పట్టుకుంటున్నారు.

ఒక్కో చేప కిలోకు పైగానే ఉందని స్థానికులు చెబుతున్నారు.

వరదలు

ఫొటో సోర్స్, Ani

ఫొటో క్యాప్షన్, నిర్మల్‌ జిల్లాలో వీధుల్లో చేపలు పడుతున్న వ్యక్తులు

మరోవైపు, నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలకు తోడు ఎగువన మహారాష్ట్ర నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో గోదావరి పరివాహక ప్రాంతంలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.

పలు ప్రాజెక్టులకు భారీ వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో గేట్లను ఎత్తి దిగువ ప్రాంతాలకు నీటిని వదులుతున్నారు.

ఎగువ ప్రాంతాల్లో వర్షాలతో ఎస్సారెస్పీ ప్రాజెక్టులోకి 2.90 లక్షల క్యూసెక్కుల భారీ వరద ప్రవాహం వచ్చి చేరుతోంది.

8 గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు.

ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 90 టీఎంసీలకు ప్రస్తుతం 89 టీఎంసీల నీరు చేరింది.

వరదలు

ఫొటో సోర్స్, ugc

ఫొటో క్యాప్షన్, పలు ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

ఎల్లంపల్లి ప్రాజెక్టులో 20 టీఎంసీల పూర్తి సామర్థ్యానికిగాను 19 టీఎంసీలకు చేరడంతో 10 గేట్లను ఎత్తారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కడెం, సాత్నాల, స్వర్ణ, కొమురంభీమ్, గడ్డెన్న వాగు ప్రాజెక్టుల గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు వదులుతున్నారు.

హైదరాబాద్ శివార్లలో భారీ వర్షాలతో హిమాయత్ సాగర్, ఉస్మాన్‌సాగర్, మూసీలకు భారీ వరద నీరు చేరుతోంది.

వరద

ఫొటో సోర్స్, ugc

ఫొటో క్యాప్షన్, పలు ప్రాజెక్టులకు వరద నీరు భారీగా వస్తోంది

భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.

యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అధికారులు, ప్రజాప్రతినిధులను ఆదేశించారు.

నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలతో పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. దీంతో క్షేత్రస్థాయిలో పరిస్థితులను స్వయంగా సమీక్షించి తగు చర్యలు చేపట్టాలని మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డిలను ఆదేశించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

గోదావరి పరివాహక ప్రాంతంలోని 16 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

ప్రాణనష్టం లేకుండా చూడాలని, అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి ముంపు ప్రాంతాల్లో పునరావాస చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

ఏపీ అంతటా ఎడతెరిపిలేని వర్షాలు

రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్ అంతటా ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం అన్ని చోట్లా కనిపిస్తోంది.

పలు చోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరుతోంది.

వరదలు

ఫొటో సోర్స్, ugc

ఫొటో క్యాప్షన్, నిర్మల్ జిల్లాలో పరిస్థితి ఇది

మరోవైపు నదుల్లో వరద ప్రవాహం పెరుగుతోంది. కృష్ణా, గోదావరి నదుల్లో పెరుగుతున్న నీటి మట్టం కారణంగా మిగులు జలాలు సముద్రంలోకి వదులుతున్నారు.

విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద గేట్లు ఎత్తి 10వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు.

గోదావరిలో వరద ప్రవాహం పెరుగుతోంది.

మహారాష్ట్ర, తెలంగాణాలో కురుస్తున్న భారీ వర్షాలతో వరద ప్రవాహం మరింత పెరగవచ్చని భావిస్తున్నారు.

వీడియో క్యాప్షన్, గోదావరి ఉగ్రరూపం... కరోనా కాలంలో వరద కష్టాలు

ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యామ్ కారణంగా ముంపు గ్రామాల్లో వరద నీరు చేరడంతో నిర్వాసితుల సమస్యలు రెట్టింపవుతున్నాయి.

దీంతో ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. ఇప్పటికే ఎస్డీఆర్ఎఫ్ బృందాలను వివిధ జిల్లాలకు తరలించారు. వర్షాల కారణంగా ఎదురయ్యే సమస్యలను గుర్తించి, తక్షణమే స్పందించాలని ఏపీ సీఎం ఆదేశాలు ఇచ్చారు. జిల్లా కలెక్టర్లంతా పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించాలని సూచించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)