జర్మనీ సహా చాలా యూరోపియన్ దేశాల్లో వరద విధ్వంసం, 120 మంది మృతి

యూరప్ విధ్వంసం

ఫొటో సోర్స్, EPA

జర్మనీ, బెల్జియం, నెదర్లాండ్స్ సహా పశ్చిమ యూరప్‌లోని చాలా దేశాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో వరదల వల్ల కనీసం 120 మంది చనిపోయారు. కొన్ని వందల మంది ఆచూకీ ఇంకా తెలీడం లేదు.

యూరప్‌లోని ఈ భాగంలో దశాబ్దాల తర్వాత మొదటిసారి ఇంత భయానక వరదలు వచ్చినట్లు చెబుతున్నారు.

రికార్డు వర్షపాతం వల్ల నదులు నిండిపోయి, గట్లు తెగిపోతున్నాయి. వర్షపు నీళ్లు వేగంగా పట్టణాలను ముంచెత్తుతున్నాయి.

గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు భారీగా ధ్వంసమయ్యాయి. చాలా ప్రాంతాల్లో మొబైల్ నెట్‌వర్క్ సేవలకు అంతరాయం ఏర్పడింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

వరదల వల్ల తమ దేశంలో చనిపోయిన వారి సంఖ్య వంద దాటిందని జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ చెప్పారు

మరోవైపు బెల్జియం మీడియాలో వస్తున్న వార్తలను బట్టి ఆ దేశంలో 22 మంది మృతిచెందారు. నెదర్లాండ్స్, లక్సంబర్గ్, స్విట్జర్లాండ్‌లో కూడా వరదల వల్ల వేలమంది ప్రభావితం అయ్యారు.

జర్మనీలో రాయిన్‌లాండ్-పలాటినెట్, నార్త్ రాయిన్-వెస్ట్‌ఫాలియా ప్రాంతాలు వరదలకు అత్యంత ప్రభావితం అయ్యారు.

దాదాపు 1300 మంది ఆచూకీ తెలీడం లేదని పశ్చిమ జర్మనీ ఆర్‌వెలర్ జిల్లా అధికారులు చెప్పారు. మొబైల్ నెట్‌వర్క్ పనిచేయకపోవడంతో జనం ఒకరినొకరు సంప్రదించలేకపోతున్నారని స్థానిక ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు.

యూరప్ విధ్వంసం

ఫొటో సోర్స్, Twitter/JennyHillBBC

దాదాపు 700 మంది జనాభా ఉండే షోల్డ్ గ్రామం పూర్తిగా జలమయం అయ్యింది. కోలోన్ పట్టణం దగ్గర ఒక కాలనీని వరదలు ముంచెత్తడంతో చాలా ఇళ్లు ధ్వంసమయ్యాయి.

ఆగకుండా కురుస్తున్న వర్షంతో నీటిలో చిక్కుకుపోయిన వారి నుంచి అత్యవసర కాల్స్ వస్తున్నాయని, కానీ, చాలా చోట్ల సహాయ కార్యక్రమాలు కొనసాగించడం వీలు కావడం లేదని స్థానిక అధికారులు చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

సిన్‌జిన్ పట్టణంలో వికలాంగుల కోసం నిర్వహించే ఒక కేర్ హోమ్‌లో అందరూ నిద్రపోతున్నప్పుడు వరద నీరు ముంచెత్తడంతో లోపలున్న 35 మందిలో 12 మంది చనిపోయారు.

బెల్జియం సరిహద్దుల్లోని ఒక పెద్ద ఆనకట్టలో నీళ్లు ప్రమాదకర స్థాయికి చేరాయి.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

వాతావరణం మార్పుల వల్ల ఇప్పుడు వచ్చిన ఈ వరదల్లాగే భారీ వర్షాల ఘటనలు మరింత పెరుగుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)