పత్రికా స్వేచ్ఛను అణచివేసే నేతల జాబితాలో మోదీ, పుతిన్, షేక్ హసీనా - Newsreel

పత్రికా స్వేచ్ఛను నరేంద్రమోదీ, ఆయన ప్రభుత్వం అణచివేస్తున్నారని ప్రతిపక్షాలు, జర్నలిస్టులు విమర్శిస్తున్నారు.

ఫొటో సోర్స్, BIJU BORO

ఫొటో క్యాప్షన్, పత్రికా స్వేచ్ఛను నరేంద్రమోదీ, ఆయన సారథ్యంలోని ప్రభుత్వం అణచివేస్తోందని ప్రతిపక్షాలు, జర్నలిస్టులు విమర్శిస్తున్నారు.

భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ సహా ప్రపంచవ్యాప్తంగా 37 మంది ప్రభుత్వ, దేశాధినేతలు పత్రికా స్వేచ్ఛను అణచి వేయడంలో ముందున్నారని ‘రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్’ అనే సంస్థ వెల్లడించింది.

'గ్యాలరీ ఆఫ్ గ్రిమ్ పోర్ట్రెయిట్' పేరుతో ఆ సంస్థ ఒక జాబితాను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా పత్రికా స్వేచ్ఛ, జర్నలిస్టుల కోసం ‘రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్’ సంస్థ పని చేస్తుంది.

అయిదేళ్ల తర్వాత రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ సంస్థ విడుదల చేసిన ఈ జాబితాలో ఈసారి 17 మంది కొత్త పేర్లు కనిపించాయి. ఈ జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఆసియాకు చెందిన ఇద్దరు మహిళా నేతలు, యూరప్‌కు చెందిన ఒక నాయకుడి పేరు కూడా చేరింది.

బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, హాంగ్‌‌కాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్యారీ లామ్ ఇందులోని ఇద్దరు మహిళలు కాగా, సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, బెలారుస్ అధినేత అలెగ్జాండర్ లుకషెంకో, ఇరాన్ సుప్రీం లీడర్ ఖొమేని, సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ తదితరుల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.

రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ సంస్థ ప్రతియేటా ప్రెస్ ప్రీడమ్ ఇండెక్స్‌ను ప్రకటిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మీడియాకు స్వేచ్ఛ కల్పించే ప్రాతిపదికన రూపొందించిన 180 దేశాల జాబితాలో భారత్ ర్యాంక్ ఏటేటా కిందికి పడిపోతోంది.

2016లో 136వ స్థానంలో ఉన్న భారత్, గత సంవత్సరం 142వ స్థానానికి దిగజారింది. నార్వే, ఫిన్లాండ్, డెన్మార్క్, న్యూజీలాండ్ వంటి దేశాలు ఈ సూచికలో అగ్రభాగంలో ఉండగా, ప్రజాస్వామ్య వ్యవస్థలు లేని కొన్ని ఆఫ్రికన్ దేశాలు అట్టడుగున ఉన్నాయి.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేరు కూడా ఈ జాబితాలో ఉంది.

ఫొటో సోర్స్, SERGEI SAVOSTYANOV

ఫొటో క్యాప్షన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేరు కూడా ఈ జాబితాలో ఉంది.

‘పక్షపాత పూరితం’

రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ ప్రచురించిన నివేదికను బీజేపీ నేతలు, మంత్రులు పక్షపాతంతో తయారు చేసిన జాబితా అని విమర్శిస్తున్నారు. భారతదేశం ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమని, ఇక్కడ ప్రభుత్వాలను విమర్శించడానికి పత్రికలకు పూర్తి స్వేచ్ఛ ఉందని వారు అంటున్నారు. మోదీ ప్రభుత్వం మీడియాను అదుపులో పెట్టేందుకు ప్రయత్నిస్తోందని, నిబంధనలతో కఠినంగా వ్యవహరించేందుకు ప్రయత్నిస్తోందని జర్నలిస్టులతోపాటు, ప్రతిపక్షాలు కూడా విమర్శలు చేస్తున్నాయి. రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ సంస్థ విడుదల చేసిన రిపోర్టుపై ప్రభుత్వం అధికారికంగా స్పందించ లేదు.

కంభంపాటి హరిబాబు

ఫొటో సోర్స్, Facebook/K Haribabu

ఫొటో క్యాప్షన్, కంభంపాటి హరిబాబు

మిజోరం గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు, దత్తాత్రేయ హరియాణాకు..

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీనియర్ బీజేపీ నాయకుడు కంభంపాటి హరిబాబుకు గవర్నర్ పదవి దక్కింది.

కంభంపాటి హరిబాబును మిజోరం గవర్నర్‌గా నియమిస్తూ భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మంగళవారం ఆదేశాలు జారీచేశారు.

మరోవైపు బండారు దత్తాత్రేయను హిమాచల్ ప్రదేశ్ నుంచి హరియాణాకు గవర్నర్‌గా మార్చారు.

మోదీ ప్రభుత్వంలో దత్తాత్రేయ కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

బండారు దత్తాత్రేయ

ఫొటో సోర్స్, Facebook/ B Dattatreya

ఫొటో క్యాప్షన్, బండారు దత్తాత్రేయ

మరికొంత మంది సీనియర్ నాయకులకు కూడా తాజాగా గవర్నర్ పదవులు దక్కాయి.

కర్నాటక గవర్నర్‌గా థావర్‌చంద్ గహ్లోత్‌, మధ్యప్రదేశ్ గవర్నర్‌గా మంగూభాయ్ ఛగన్‌భాయ్ పటేల్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌ నియమితులయ్యారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

మిజోరం గవర్నర్‌గా పనిచేస్తున్న పీఎస్ శ్రీధరన్ పిళ్లైకు గోవా బాధ్యతలను అప్పగించారు. హరియాణా గవర్నర్ సత్యదేశ్ నారాయణ్ ఆర్యను త్రిపురకు మార్చారు.

త్రిపుర గవర్నర్ రమేశ్ బియాస్‌కు జార్ఖండ్‌ బాధ్యతలు అప్పగించారు.

నైజీరియా

ఫొటో సోర్స్, Getty Images

నైజీరియా: 140 మంది విద్యార్థుల్ని కిడ్నాప్ చేసిన సాయుధులు

నైజీరియాలో 140 మంది పాఠశాల విద్యార్థుల్ని సాయుధులు కిడ్నాప్ చేశారు.

వాయువ్య రాష్ట్రమైన కాడ్డునాలో బెథేల్ బాప్టిస్ట్ స్కూల్‌లో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు ధ్రువీకరించారు.

‘‘సాయుధులు మోటార్ సైకిళ్లపై వచ్చారు. వారి దగ్గర తుపాకులున్నాయి. భద్రతా సిబ్బందిని దాటుకుంటూ వచ్చి వారు పిల్లల్ని ఎత్తుకెళ్లారు’’అని కిడ్నాప్‌కు గురైన 15ఏళ్ల బాలిక తల్లి బీబీసీకి చెప్పారు.

‘‘పాఠశాల భద్రతా సిబ్బందిని కూడా సాయుధులు తీసుకెళ్లిపోయారు. అందరినీ అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లారు’’అని పోలీసులు తెలిపారు.

సాయుధుల చెర నుంచి ఓ మహిళా టీచర్ సహా 26 మందిని రక్షించగలిగామని పోలీసులు చెప్పారు.

శనివారం కూడా ఎనిమిది మంది పిల్లల్ని ఇక్కడ సాయుధులు కిడ్నాప్ చేసినట్లు వార్తలు వచ్చాయి. వీరిని నేషనల్ ట్యూబర్‌కులోసిస్ అండ్ లెప్రసీ సెంటర్‌ నుంచి సాయుధులు అపహరించుకుపోయారు.

అపహరణకు గురైనవారిలో ఏడాది పాప కూడా ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

ఇటీవల కాలంలో ఇక్కడి స్కూళ్లు, యూనివర్సిటీల నుంచి పిల్లల్ని ఎత్తుకెళ్తున్న ఘటనలు పెరుగుతున్నాయి.

గత డిసెంబరు నుంచి ఇప్పటివరకు ఇక్కడ వెయ్యి మంది పిల్లల్ని సాయుధులు అపహరించుకుపోయారు. వీరిలో 200 మంది ఇప్పటికీ కనిపించడం లేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)