మోదీ అమెరికా పర్యటన : ‘అఫీషియల్ స్టేట్ విజిట్’ అంటే ఏంటి, దాని ప్రోటోకాల్ ఎలా ఉంటుంది?

మోదీ, బైడెన్

ఫొటో సోర్స్, Getty Images

భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలో భాగంగా ఆయనకు వైట్‌హౌస్‌లోకి ఘనంగా ఆహ్వానించారు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, ఆయన సతీమణి జిల్ బైడెన్.

మోదీ అమెరికా వెళ్లడం ఇదే తొలిసారి కాదు. ఇంతకుముందు కూడా పలు సందర్భాల్లో అమెరికా వెళ్లారు. అయితే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నుంచి నేరుగా ఆహ్వానం అందిన ప్రధాని మోదీకి అమెరికా నుంచి ఇది తొలి 'అఫీషియల్ స్టేట్ విజిట్'. జూన్ 21 నుంచి 24 వరకు జరిగే ఈ పర్యటనలో జో బైడెన్ మోదీకి ఆతిథ్యం ఇవ్వనున్నారు.

అయితే 'అఫీషియల్ స్టేట్ విజిట్' అంటే అర్థం ఏమిటి? ఇతర సందర్శనల కంటే ఇది ఎందుకు ముఖ్యమైనదిగా పరిగణిస్తున్నారు?.

'అఫీషియల్ స్టేట్ విజిట్' అంటే ఏమిటి?

విదేశాల్లో 'అఫీషియల్ స్టేట్ విజిట్' అంటే దేశాధినేత ద్వారా మాత్రమే జరుగుతుంది.

ఇది ఒక వ్యక్తి లేదా నాయకుడి పర్యటన కంటే దాన్ని 'దేశ పర్యటన'గా వర్ణిస్తారు.

అమెరికాకు 'అఫీషియల్ స్టేట్ విజిట్' ఎప్పుడూ ఆ దేశ అధ్యక్షుడి ఆహ్వానంపై మాత్రమే నిర్వహిస్తారు. ఈసారి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత ప్రధాని నరేంద్రమోదీకి ఆహ్వానం పంపారు.

సాధారణంగా సందర్శించే దేశాధినేతను ఆతిథ్య దేశం అధికారికంగా స్వాగతిస్తుంది.

అతిథిని అధికారికంగా భోజనానికి ఆహ్వానిస్తారు.

అమెరికాలో ప్రధాని మోదీ పర్యటన షెడ్యూల్ పరిశీలిస్తే..

జూన్ 21న న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు.

జూన్ 22 న ప్రధాని వాషింగ్టన్ చేరుకుంటారు. అక్కడ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మోదీకి స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని మోదీకి 21 తుపాకుల గౌరవ వందనం సమర్పిస్తారు.

అదే రోజున అమెరికా పార్లమెంట్ సంయుక్త సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు.

2016 సంవత్సరంలో కూడా మోదీ యుఎస్ పార్లమెంట్‌లో ప్రసంగించారు.

తద్వారా యుఎస్ పార్లమెంట్‌లో రెండుసార్లు ప్రసంగించిన మొదటి భారత ప్రధానిగా ఆయన నిలుస్తారు.

దీని తర్వాత జూన్ 22 సాయంత్రం ప్రెసిడెంట్ బైడెన్, ఆయన భార్య జిల్ బైడెన్ ప్రధాని మోదీకి అధికారిక విందును ఇవ్వనున్నారు.

జూన్ 23న ప్రధాని మోదీ అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్, విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌లతో సమావేశమవుతారు. అక్కడ ప్రధాని మోదీకి భోజనం ఏర్పాటు చేస్తారు.

అదేరోజు మోదీ వాషింగ్టన్‌లో ఉన్న పలు కంపెనీల సీఈఓలు, ఇతర ముఖ్య వ్యక్తులతో కూడా సమావేశమవుతారు. అలాగే భారత సంతతికి చెందిన వారిని కూడా కలవనున్నారు.

మోదీ, బైడెన్ దంపతులు

ఫొటో సోర్స్, Getty Images

అధ్యక్షుడి అతిథి గృహంలో బస

ఈ పర్యటనలో ప్రధాని మోదీ వాషింగ్టన్‌లోని బ్లెయిర్ హౌస్‌లో బస చేస్తారు. ఇది అమెరికా అధ్యక్షుని అతిథి గృహం.

ఆ తర్వాత అధికారిక పర్యటన నిమిత్తం మోదీ ఈజిప్టు వెళ్లనున్నారు. జూన్ 24, 25 తేదీల్లో ఆయన అక్కడ ఉంటారు.

తొలిసారిగా ఈజిప్ట్‌లో పర్యటించనున్న మోదీ.. ఆ దేశ అధ్యక్షుడు అబ్దుల్ ఫతే అల్-సీసీని కూడా కలవనున్నారు.

ప్రధాని మోదీ కంటే ముందు 2009లో అప్పటి భారత ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా అమెరికాకు 'అఫీషియల్ స్టేట్ విజిట్' కోసం వెళ్లారు.

మోదీ, బైడెన్

ఫొటో సోర్స్, EPA-EFE/REX/SHUTTERSTOCK

విదేశీ దేశాధినేత ప్రతి సందర్శనను రాష్ట్ర పర్యటన అని పిలుస్తారా?

విదేశీ పర్యటనలలో 'స్టేట్ విజిట్'కు అత్యున్నత ర్యాంక్ ఇస్తారు.

ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు ఇది కీలకమని చెబుతారు.

అమెరికాలోని మిగిలిన పర్యటనలను వివిధ కేటగిరీలలో చూస్తే ర్యాంకింగ్ ప్రకారం అవి ఇలా ఉంటాయి.

1వ స్థానం - అఫీషియల్ స్టేట్ విజిట్

2 వ స్థానం - అఫీషియల్ విజిట్

3 వ స్థానం - అఫీషియల్ వర్కింగ్ విజిట్

4 వ స్థానం - వర్కింగ్ విజిట్

5వ స్థానం - గెస్ట్ ఆఫ్ గవర్నమెంట్ విజిట్

6 వ స్థానం - ప్రైవేట్ విజిట్

ఈ సందర్శనలన్నింటికీ వేర్వేరు ప్రోటోకాల్‌లు ఉంటాయి.

ఇవి కూడా చదవండి

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)