బ్రిజ్ భూషణ్ సింగ్‌: కేసు విచారణను జూన్ 15లోగా పూర్తి చేస్తామన్న అనురాగ్ ఠాకూర్

''కేసు విచారణ అనంతరం చార్జిషీట్ దాఖలు చేయడంపై చర్చించాం. విచారణ పూర్తయిన వెంటనే చార్జిషీట్ వేస్తాం'' అని రెజ్లర్లు, రైతు సంఘాల నాయకులతో సమావేశం అనంతరం కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ రాకూర్ చెప్పారు.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

    రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.

  2. ఒడిశా: గూడ్స్ రైలు కదలడంతో రైలు కింద కూర్చున్న ఆరుగురు కార్మికుల మృతి, సుబ్రత్ కుమార్ పతి, భువనేశ్వర్ నుంచి బీబీసీ కోసం

    ఒడిశా రైలు ప్రమాదం

    ఒడిశాలోని జాజ్‌పుర్‌ రోడ్ రైల్వే స్టేషన్‌ సమీపంలో బుధవారం మధ్యాహ్నం జరిగిన ప్రమాదంలో ఆరుగురు కార్మికులు చనిపోయారు.

    రైల్వే స్టేషన్ సమీపంలో ఆగి ఉన్న ఇంజిన్ లేని గూడ్స్ రైలు ఆకస్మికంగా కదలడంతో రైలు కింద కూర్చున్న కార్మికులు మృత్యువాత పడ్డారు.

    ఈ ఘటన జరిగిన సమయంలో భారీ వర్షం కురుస్తోంది. వర్షం నుంచి తప్పించుకోవడానికి వీరంతా రైలు కింద కూర్చున్నారు.

    ఇంజిన్ లేని రైలు సేఫ్టీ ట్రాక్‌పై నిలిచి ఉంది. బలమైన గాలి, వాన కారణంగా గూడ్సు రైలు కదలడం మొదలైందని రైల్వే శాఖ తెలిపింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  3. ఎవరెస్టు దారిలోని డెత్ జోన్‌లో నేపాలీ గైడ్ సాహసం

  4. పాంబన్-ధనుష్కోడి: 130 మంది ప్రయాణిస్తున్న రైలు సముద్రంలో ఎలా మునిగిపోయింది?

  5. బ్రిజ్ భూషణ్ సింగ్‌: కేసు విచారణను జూన్ 15లోగా పూర్తి చేస్తామన్న అనురాగ్ ఠాకూర్

    అనురాగ్ ఠాకూర్

    ఫొటో సోర్స్, ANI

    ఫొటో క్యాప్షన్, అనురాగ్ ఠాకూర్

    బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్‌ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ కేసు విచారణను జూన్ 15లోగా పూర్తి చేస్తామని కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు.

    బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టిన రెజ్లర్లు, రైతు సంఘాల నాయకులతో సమావేశం అనంతరం మంత్రి మాట్లాడారు. '' కేసు విచారణ అనంతరం చార్జిషీట్ దాఖలు చేయడంపై చర్చించాం. విచారణ పూర్తయిన వెంటనే చార్జిషీట్ వేస్తాం'' అని మంత్రి తెలిపారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    రెజ్లర్లు చర్చలకు రావాలని కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించడంతో రెజ్లర్లు బజ్‌రంగ్ పునియా, సాక్షి మలిక్, రైతు నేత రాకేష్ టికాయత్ ఈ రోజు క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ నివాసానికి వచ్చారు.

    రెజ్లర్లతో సానుకూల చర్చలు జరిగాయని మంత్రి ఠాకూర్ చెప్పారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

    చర్చల్లో రెజ్లర్లు లేవనెత్తిన డిమాండ్లు:

    విచారణ పూర్తి చేసి, జూన్ 15లోగా చార్జిషీట్ వేయాలి.

    జూన్ 30లోగా రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కార్యవర్గాన్ని ఎన్నుకోవాలి.

    రెజ్లింగ్ ఫెడరేషన్‌లో అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేయాలి.

    ఆ కమిటీకి ఒక మహిళను అధ్యక్షురాలిగా నియమించాలి.

    ఫెడరేషన్ ఎన్నికలు జరిగే వరకూ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ) అడ్‌హక్ కమిటీలో ఇద్దరు కోచ్‌లకు స్థానం కల్పించాలి.

    ఇద్దరు కోచ్‌లను ఐఓఏ అడ్‌హక్ కమిటీలో కొనసాగించాలి.

    రెజ్లింగ్ ఫెడరేషన్‌ను సక్రమంగా నిర్వహించాలి. క్రీడాకారుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలి.

    ఎన్నికల తర్వాత బ్రిజ్ భూషణ్, ఆయన అనుచరులు ఫెడరేషన్‌లో జోక్యం చేసుకోకూడదు.

    మహిళా రెజ్లర్లకు భద్రత కల్పించాలి. అఖాడా నిర్వాహకులు, కోచ్‌లు, క్రీడాకారులపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలి.

    ''రెజ్లర్లతో అన్ని విషయాలపై చర్చించి ఏకాభిప్రాయానికి వచ్చాం'' అని క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు.

    ''జూన్ 15లోగా పోలీసు విచారణ పూర్తి చేయాలని కోరాం. అప్పటి వరకూ నిరసనలు చేయొద్దని మంత్రి కోరారు. మహిళా రెజ్లర్లకు భద్రత కల్పిస్తామని మంత్రి చెప్పారు. క్రీడాకారులపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లను వెనక్కి తీసుకోవాలని కోరాం. అందుకు మంత్రి ఒప్పుకున్నారు'' అని రెజ్లర్ బజ్‌రంగ్ పునియా చెప్పారు.

  6. కర్ణాటక: గేదెలను చంపుతున్నారు, గోవులను వధిస్తే ఇబ్బంది ఏమిటన్న మంత్రి.. ఇరకాటంలో పడ్డ కాంగ్రెస్

  7. భారత సైన్యం బలాన్ని ప్రశ్నించిన చైనా.. ఆ వాదనలో నిజమెంత?

  8. నేటి నుంచి మళ్లీ కోరమండల్ ఎక్స్‌ప్రెస్ సేవలు

    కోరమండల్ ఎక్స్‌ప్రెస్

    ఫొటో సోర్స్, Ani

    భారీ ప్రమాదం తర్వాత మళ్లీ బుధవారం నుంచి కోరమండల్ ఎక్స్‌ప్రెస్ సేవలు ప్రారంభం అవుతున్నాయి.

    ‘‘మళ్లీ సేవలు మొదలుపెట్టేందుకు అంతా సిద్ధమైంది’’ అని రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఆదిత్య కుమార్ చౌధరి ఏఎన్ఐ వార్తా సంస్థతో చెప్పారు.

    పశ్చిమ బెంగాల్‌లోని షాలీమార్, చెన్నైల మధ్య నడిచే కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌కు జూన్ 2న బాలాసోర్‌లో భారీ ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 275 మంది ప్రాణాలు కోల్పోయారు.

    ఆ ప్రమాదంలో గూడ్స్‌ను ఢీకొట్టడంతో కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. అదే సమయంలో పక్క లైనులో వెళ్తున్న యశ్వంత్‌పుర్ హావ్‌డా ఎక్స్‌ప్రెస్‌ పైకి కూడా కోరమండల్ బోగీలు వెళ్లడంతో భారీ విధ్వంసం జరిగింది.

  9. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకుర్ నివాసానికి చేరుకున్న రెజ్లర్లు

    రెజ్లర్ల నిరసన

    ఫొటో సోర్స్, Getty Images

    ఒలింపిక్ పతక విజేత బజ్‌రంగ్ పునియా, రైతు నాయకుడు రాకేశ్ టికైత్ తదితరులు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకుర్‌ను కలిసేందుకు బుధవారం ఆయన నివాసానికి వచ్చారు.

    ఒలింపిక్ పతక విజేత సాక్షి మలిక్ కూడా కేంద్ర మంత్రి నివాసానికి వచ్చిన వారిలో ఉన్నారు.

    నెలల నుంచీ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్టు చేయాలనే డిమాండ్‌తో రెజ్లర్లు నిరసన తెలిజేస్తున్న సంగతి తెలిసిందే.

    ఈ విషయంలో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు తమ నివాసానికి రావాలని కేంద్ర మంత్రి రెజ్లర్లను ఆహ్వానించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  10. భారత పార్లమెంటులో అఖండ భారత్ ఫొటోపై అధికారిక వివరణ కోరిన బంగ్లాదేశ్

    అఖండ భారత్ పెయంటింగ్‌

    ఫొటో సోర్స్, Pralhad Joshi/TWITTER

    దిల్లీలోని కొత్త పార్లమెంటు భవనంలో గోడపై ఉన్న 'అఖండ భారత్' పెయంటింగ్‌పై బంగ్లాదేశ్ వివరణ కోరినట్లు ది వైర్ పత్రిక ఎడిటర్ సిద్ధార్థ వరదరాజన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

    అయితే, అది అశోకుడి కాలం నాటి పటమని, భారత సరిహద్దులు విస్తరించాలనే ఉద్దేశంతో పెట్టినది కాదని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అంతకుముందు వివరణ ఇచ్చారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    అయినప్పటికీ, దిల్లీలోని బంగ్లాదేశ్ రాయబార కార్యాలయం "ఈ విషయంపై భారత్ నుంచి అధికారిక వివరణ" కోసం భారత విదేశాంగ శాఖను సంప్రదించాలని సూచించినట్లు బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి షహరియార్ ఆలం తెలిపినట్టు ఢాకా ట్రిబ్యూన్ కథనం పేర్కొంది.

    "అంతకుముందు ఈ పెయింటింగ్‌పై నేపాల్ లేవనెత్తిన వివాదానికి భారత్ విదేశాంగ శాఖ ఇచ్చిన వివరణపై ఎలాంటి సందేహాలు లేవు. కానీ, భారత ప్రభుత్వం నుంచి అదనపు వివరణను అధికారికంగా కోరుతున్నట్టు" ఆలం వివరించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

    మే 28న దిల్లీలో కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రారంభించిన తరువాత, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రల్హద్ జోషి "సంకల్పం స్పష్టంగా ఉంది - అఖండ భారత్" అనే శీర్షికతో మురల్ పెయింటింగ్ (కుడ్య చిత్రం) ఫొటోను ట్వీట్ చేశారు.

    ఈ పటంలో నేపాల్‌లోని లుంబిని, కపిలవస్తు కూడా భారత్‌లో ఉన్నట్తు కనిపిస్తోంది. దాంతో, నేపాల్‌లో ఆగ్రహం వ్యక్తమైంది.

  11. ఆదిపురుష్ - ప్రభాస్: ప్రతి థియేటర్‌లోనూ హనుమంతుడికి ఒక సీటు.. సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎందుకు?

  12. ఉత్తరప్రదేశ్: 10 మందిని చంపిన నిందితుడికి 42 ఏళ్ల తరువాత శిక్ష... తీర్పులు ఎందుకు ఆలస్యమవుతాయి?

  13. అమెరికాలో స్కూల్ గ్రాడ్యుయేషన్‌డేలో కాల్పులు, ఇద్దరి మృతి

    కాల్పులు

    ఫొటో సోర్స్, Getty Images

    అమెరికా వర్జీనియాలోని ఓ హైస్కూల్ గ్రాడ్యుయేషన్ డేలో కాల్పులు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మరణించారు. మరో ఏడుగురికి గాయాలయ్యాయి.

    రిచ్‌మండ్ హ్యూగెనాట్ స్కూల్‌లో మంగళవారం కాల్పుల అనంతరం గ్రాడ్యుయేషన్ గౌన్‌లు వేసుకున్న విద్యార్థులు పరుగులు తీస్తున్న దృశ్యాలు మీడియాలో కనిపించాయి.

    కాల్పుల్లో మరణించిన వారిని 18 ఏళ్ల విద్యార్థి, ఆయన తండ్రిగా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు.

    కాల్పులు జరిపినట్లుగా అనుమానిస్తున్న 19 ఏళ్ల యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాల్పుల్లో మరణించిన వారిలో కొందరితో అతడికి పరిచయమున్నట్లు తెలిపారు.

    మరోవైపు స్కూల్ ఆవరణలో హ్యాండ్‌గన్‌తో మరో వ్యక్తి కూడా కనిపించారు. అతడిని కూడా మొదట అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఈ దాడితో అతడికి సంబంధంలేదని ప్రాథమిక విచారణలో తేలింది.

  14. నమస్కారం

    ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు జాతీయ, అంతర్జాతీయ వార్తలను ఎప్పటికప్పుడు అందించే బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    నిన్నటి లైవ్‌పేజీ కోసంఇక్కడక్లిక్ చేయండి

  15. క్రికెట్: మొదటి భారత క్రికెట్ జట్టును ఎలా తయారు చేశారు... అందులో ఎవరెవరు ఉన్నారు?