లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.
ధన్యవాదాలు.
చనిపోయిన 288 మందిలో, ఇప్పటి వరకు 205 మంది మృతదేహాలను గుర్తించారు. 83 మంది మృతదేహాలను ఇంకా గుర్తించలేదు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.
ధన్యవాదాలు.

ఫొటో సోర్స్, Getty Images
బాలాసోర్ రైలు ప్రమాదంలో మరణించిన వారి సంఖ్యను ఒడిశా ప్రభుత్వం మళ్లీ మార్చింది. ఈ ప్రమాదంలో 288 మంది మృతి చెందినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ జెనా మీడియా సమావేశంలో చెప్పారు.
ఇంతకుముందు ప్రదీప్ జెనా మరణాల సంఖ్య 288 కాదని, 275 అని చెప్పారు. కానీ, ప్రస్తుతం మరోసారి అధికారిక మరణాల సంఖ్యను ఒడిశా ప్రభుత్వం 288కి పెంచింది.
చనిపోయిన 288 మందిలో, ఇప్పటి వరకు 205 మంది మృతదేహాలను గుర్తించారు. 83 మంది మృతదేహాలను ఇంకా గుర్తించలేదు.
ప్రమాదం జరిగిన ప్రాంతంలో పర్యటిస్తున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమ రాష్ట్రానికి చెందిన 31 మంది వివరాలు ఇంకా తెలియలేదన్నారు. ఈ ప్రమాదంలో కచ్చితంగా ఎంత మంది చనిపోయారన్న విషయాన్ని దాచిపెడుతున్నారని ఆమె ఆరోపించారు.
ఎయిమ్స్ భువనేశ్వర్‌లో మాత్రమే కాక, బంధువులు తమ వారిని గుర్తించేందుకు ఇతర ఆస్పత్రుల్లో కూడా మృతదేహాలను ఉంచారు. కుళ్లిపోయిన మృతదేహాలను గుర్తించేందుకు ప్రస్తుతం డీఎన్ఏ పరీక్షలు చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
గత నెల రోజుల్లో పాకిస్తాన్ అప్పుల్లో రూ.1476 బిలియన్లు( రూ. 147,600 కోట్లు ) పెరుగుదల నమోదైంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ ఇటీవల విడుదల చేసిన డేటా ప్రకారం, ఏప్రిల్ చివరి నాటికి, ఆ దేశపు మొత్తం రుణం సంవత్సరానికి 34.1 శాతం పెరిగింది. ఇప్పుడు 58.6 ట్రిలియన్లకు (రూ. 1476 బిలియన్లు) పెరిగింది.
ఇంతకు ముందు మార్చి 31 వరకు ఈ అప్పు 57 వేల 123 వేలకోట్ల రూపాయలు ఉండేది. ఏప్రిల్ నాటికి, పాకిస్తాన్ మొత్తం ప్రభుత్వ రుణంలో 62.3 శాతం అంటే 36.5 ట్రిలియన్లు దేశీయంగా ఉండగా, 37.6 శాతం అంటే 22 ట్రిలియన్లు విదేశీ రుణం.
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పాకిస్తాన్ గత ఏడాది కాలంలో విదేశీ అప్పుల్లో 49.1 శాతం పెరుగుదల నమోదు కాగా, దేశీయ రుణంలో 26.4 శాతం పెరుగుదల నమోదైందని గణాంకాలు చెబుతున్నాయి.
ఆర్థిక వ్యవస్థను తిరిగి ట్రాక్‌లోకి తీసుకురావడానికి, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నుంచి బెయిలౌట్ ప్యాకేజీ కోసం పాకిస్తాన్ అభ్యర్ధిస్తోంది. కానీ కొన్ని నెలలుగా చేస్తున్న ఈ ప్రయత్నాలు ఇంకా ఫలించలేదు.
ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) నివేదిక ప్రకారం గతేడాది ఏప్రిల్‌లో ఇమ్రాన్ ఖాన్ అధికారం నుంచి వైదొలిగే వరకు జీడీపీ 6 శాతంగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ వృద్ధి రేటు 0.6 శాతానికి తగ్గుతుందని అంచనా.

ఫొటో సోర్స్, UGC
ఆంధ్రప్రదేశ్‌లో ఓ అంగన్ వాడీ కార్యకర్త హత్యకు గురయ్యారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం రాయవారిపాలెంలో సోమవారం జరిగిన ఘటనలో అంగన్ వాడీ కార్యకర్త సవలం హనుమాయమ్మ (52) మరణించారు. ఆమె సమీపబంధువు, రాజకీయంగా ప్రత్యర్థి వర్గానికి చెందిన సవలం కొండలరావు ట్రాక్టర్‌తో గుద్ది ఈ హత్యకు పాల్పడినట్టు పోలీసులు చెబుతున్నారు.
టంగుటూరు పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఖాదర్ బాషా బీబీసీకి తెలిపిన సమాచారం ప్రకారం, రాయవారిపాలెం గ్రామంలో హనుమాయమ్మ అంగన్‌వాడీ కార్యకర్తగా పని చేస్తున్నారు. ఆమె భర్త సుధాకర్ తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకుడు. వారికి సమీప బంధువు, వైసీపీకి చెందిన కొండలరావుతో సుధాకర్ కుటుంబానికి ఆస్తి, కుటుంబ తగాదాలు ఉన్నాయి.
సోమవారం కొండపిలో జరిగిన తెలుగుదేశం పార్టీ కార్యక్రమానికి సుధాకర్ హాజరయ్యారు. ఆ సమయంలో ఇంటికి సమీపంలోని బోరు నుంచి నీరు తెచ్చుకుంటుండగా హనుమాయమ్మని కొండలరావు ట్రాక్టర్‌తో ఢీకొట్టారు. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మరణించారు.
నిందితుడు పరారీలో ఉండగా, పోలీసులు ఆయన సోదరుడిని అదుపులోకి తీసుకున్నారు.
హనుమాయమ్మ కుటుంబాన్ని మాజీ మంత్రి దేవినేని ఉమా, కొండెపి ఎమ్మెల్యే బాలవీరాంజనేయ స్వామి పరామర్శించగా, హనుమయమ్మను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని అంగన్‌వాడీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు బేబీరాణి డిమాండ్ చేశారు.

రుతుపవనాలు కేరళను తాకడం కొంత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే, అవి ఎప్పుడు కేరళను తాకుతాయనే అంశంలో కొత్త తేదీని మాత్రం వాతావరణ విభాగం చెప్పలేదు.
పశ్చిమం నుంచి వీస్తున్న గాలులు, ఆగ్నేయ అరేబియా సముద్రంలో తుపాను ఈ రుతుపవనాలను అడ్డుకుంటున్నాయని, అందువల్ల అవి కేరళలో ప్రవేశించడం కొంత ఆలస్యమవుతుందని వాతావరణ శాఖ తెలిపింది.
"ఆగ్నేయ అరేబియా సముద్రంలో గోవాకు పశ్చిమ-నైరుతి దిశలో 920 కి.మీ, ముంబైకి నైరుతి-నైరుతి దిశలో 1120 కి.మీ, పోర్‌బందర్‌కు 1160 కి.మీ దూరంలో దక్షిణంగా అల్పపీడనం ఏర్పడింది. ఇది రానున్న 24 గంటల్లో తూర్పు అరేబియా సముద్రాన్ని ఆనుకుని ఉన్న ఆగ్నేయ అరేబియా సముద్రం మీదుగా ఉత్తరం వైపు కదులుతూ తుపానుగా మారే అవకాశం ఉంది’’ అని వాతావరణ శాఖ తెలిపింది.
భారతదేశంలో నాలుగు నెలల పాటు కొనసాగే రుతుపవనాలు సాధారణంగా ప్రతి సంవత్సరం జూన్ 1 నాటికి నైరుతి ప్రాంతానికి చేరుకుంటాయి. దీని వలన సెప్టెంబర్ వరకు వర్షాలు కురుస్తాయి.

ఫొటో సోర్స్, UGC
కర్ణాటకలోకి యాద్గిరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది. వీరిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు.
వ్యాన్‌లో ప్రయాణిస్తున్న వారు ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా వెలగోడు గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. కలబురుగిలో జరుగుతున్న దర్గా ఉరుసు జాతరకు వెళుతున్న సమయంలో ప్రమాదానికి గురయ్యారు.
బలిచక్ర క్రాస్ వద్ద ఆగివున్న లారీని వ్యాన్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు జిల్లా పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఇంకా 13 మంది తీవ్రంగా గాయపడినట్లు కూడా వారు తెలిపారు. వాహనంలో 18మంది ప్రయాణిస్తున్నారు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు కలసి సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదం పై సీబీఐ విచారణ ప్రారంభించిందని ఈస్ట్ కోస్ట్ రైల్వే డివిజనల్ మేనేజర్ రింకేశ్ రాయ్ వెల్లడించినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.
‘‘ఘటనా స్థలానికి సీబీఐ అధికారులు చేరుకున్నారు. విచారణ ప్రారంభమైంది’’ అని ఆయన వెల్లడించారు.
ఈ ఘటనలలో మొత్తం 1100 మంది గాయపడ్డారని, వారిలో 900మందికి చికిత్స చేసి డిశ్చార్జ్ చేశామని, 200 మందికి ప్రస్తుతం వివిధ ఆసుపత్రులలో చికిత్స జరుగుతోందని రింకేశ్ రాయ్ తెలిపారు.
మరణించిన 278మందిలో 101మంది మృతదేహాలను ఇంకా గుర్తించాల్సి ఉందని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, ANI
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు జాతీయ, అంతర్జాతీయ వార్తలను ఎప్పటికప్పుడు అందించే బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
నిన్నటి లైవ్‌పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి