'రైల్వేలో మూడు లక్షల పోస్టులు ఖాళీ.. ఎందుకు భర్తీ చేయలేదు': ప్రధాని మోదీకి మల్లికార్జున్ ఖర్గే లేఖ

1990ల్లో రైల్వేలో పనిచేసే ఉద్యోగుల సంఖ్య 18 లక్షలుగా ఉంటే, ఈ సంఖ్య ప్రస్తుతం 12 లక్షలకు తగ్గిపోయిందని మల్లికార్జున్ ఖర్గే చెప్పారు. వీరిలో 3.18 లక్షల మంది వర్కర్లు కాంట్రాక్ట్‌ విధానంలోనే పనిచేస్తున్నారని చెప్పారు.

లైవ్ కవరేజీ

  1. రైలు ప్రమాదాల్లో చనిపోయినా, గాయపడినా ఇన్సూరెన్స్ పొందడం ఎలా? 10 ప్రశ్నలు - సమాధానాలు

  2. లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

    ధన్యవాదాలు.

  3. ఒడిశా రైలు ప్రమాదం: ‘ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ సిస్టమ్‌’ లోపమే కారణమన్న రైల్వే మంత్రి.. ఇంతకూ ఏమిటీ ఈ వ్యవస్థ?

  4. కశ్మీర్: డ్రగ్స్ మత్తులో తేలుతున్న టీనేజర్లు.. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి?

  5. ప్రపంచ పర్యావరణ దినోత్సవం: సోలార్ ప్యానెళ్లు సరికొత్త ముప్పు కాబోతున్నాయా? పరిష్కారం ఇదేనా?

  6. న్యాయం పొందడంలో అడ్డు వస్తే ఉద్యోగాన్నే వదిలిపెడతాం: బజరంగ్ పునియా

    బజరంగ్ పునియా

    ఫొటో సోర్స్, Getty Images

    ఉద్యోగం కంటే కూడా తమకు న్యాయం పొందడమే ముఖ్యమని రెజ్లర్ బజరంగ్ పునియా అన్నారు. ఒకవేళ న్యాయానికి ఆటంకంగా మారితే ఉద్యోగాన్నే వదిలిపెడతామని తెలిపారు.

    ‘‘మా పతకాలు 15-15 రూపాయలని చెప్పినవారు, ఇప్పుడు మా ఉద్యోగాల వెనుక పడ్డారు. మా జీవితమే ప్రమాదంలో పడింది. దాని ముందు ఉద్యోగం చాలా చిన్న విషయం. ఒకవేళ ఉద్యోగమనేది న్యాయం పొందడానికి అడ్డంకిగా మారితే దాన్ని వదిలి పెట్టేందుకు మేం 10 సెకన్లు కూడా ఆలోచించం. ఉద్యోగ భయాన్ని చూపించొద్దు’’ అని బజరంగ్ పునియా ట్వీట్ చేశారు.

    రెజ్లర్లు ఆందోళనను విరమించుకుని, తమ రైల్వే ఉద్యోగాల్లో చేరారని వస్తున్న వార్తలను సాక్షి మలిక్, బజరంగ్ పునియా కొట్టివేశారు.

    ‘‘ఆందోళనలు విరమించుకున్నట్లు వస్తున్న వార్తలు కేవలం రూమర్లు మాత్రమే. మాకు హాని చేసేందుకే ఈ రూమర్లను సృష్టిస్తున్నారు. మేం నిరసనలను విరమించుకోవట్లేదు. న్యాయం దక్కే వరకు మా పోరాటం కొనసాగుతుంది’’ అని బజరంగ్ పునియా తెలిపారు.

    రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా జరుపుతున్న ఆందోళనలను విరమించుకున్నట్లు వస్తున్న వార్తలను రెజ్లర్ సాక్షి మలిక్ కూడా ఖండించారు.

    రైల్వేశాఖలో తన విధులు నిర్వహిస్తున్నానని, అలాగే న్యాయం కోసం పోరాటం కొనసాగిస్తానని సాక్షి మలిక్ ట్వీట్ చేశారు. తాను ఆందోళన నుంచి తప్పుకుంటున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలను ఆమె ఖండించారు.

    తానేకాదు, ఆందోళనకు దిగిన ఏ ఒక్క రెజ్లర్ కూడా నిరసన కార్యక్రమాల నుంచి వెనక్కి తగ్గరని ఆమె తన ట్వీట్లో స్పష్టం చేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  7. రైల్వేలో 3 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.. ప్రధానికి లేఖ రాసిన కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే

    మల్లిఖార్జున ఖర్గే

    ఫొటో సోర్స్, ANI

    బాలాసోర్ రైలు ప్రమాదానికి సంబంధించి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు.

    ఈ లేఖలో రైల్వేలో ఖాళీగా ఉన్న పోస్టులు, లోకో పైలట్లపై పడుతున్న పని భారం, ట్రాక్‌ల నిర్వహణ, కవచ్ వ్యవస్థపై పలు సీరియస్ ప్రశ్నలను లేవనెత్తారు.

    ప్రస్తుతం భారతీయ రైల్వేలో 3 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని మల్లికార్జున్ ఖర్గే రాసిన లేఖలో చెప్పారు.

    ప్రమాదం జరిగిన ఈస్ట్ కోస్ట్ రైల్వేలో 8,278 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. 1990ల్లో రైల్వేలో పనిచేసే ఉద్యోగుల సంఖ్య 18 లక్షలుగా ఉంటే, ఈ సంఖ్య ప్రస్తుతం 12 లక్షలకు తగ్గిపోయిందన్నారు. వీరిలో 3.18 లక్షల మంది వర్కర్లు కాంట్రాక్ట్‌ విధానంలోనే పనిచేస్తున్నారని చెప్పారు.

    ఖాళీగా ఉన్న ఈ పోస్టులను ఎందుకు తొమ్మిదేళ్లుగా భర్తీ చేయలేదని ప్రశ్నించారు.

    ‘‘2017-18 నుంచి 2020-21 మధ్యలో జరిగిన 10 రైలు ప్రమాదాల్లో ఏడు ప్రమాదాలు కూడా పట్టాలు తప్పడం వల్లే జరిగాయని తాజా కాగ్ రిపోర్ట్ చెబుతోంది. కానీ, ఈ ఘోర ప్రమాదాలను విస్మరిస్తున్నారు’’ అని ఖర్గే తెలిపారు. 2017 నుంచి 2021 మధ్యలో ఈస్ట్ కోస్ట్ రైల్వేలో కనీసం ఒక్క రైల్వే ట్రాక్‌ను కూడా పరీక్షించలేదన్నారు. ఎందుకు ఈ ప్రమాదాలను విస్మరిస్తున్నారని ప్రశ్నించారు.

    ‘‘దురదృష్టవశాత్తు రైల్వేలో సమస్యలున్నట్లు మీరు, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ లాంటి బాధ్యతాయుత పదవుల్లో ఉన్న వ్యక్తులు అంగీకరించడానికి సిద్ధంగా లేరు. రైల్వే మంత్రి ఈ సమస్యకు అసలు కారణాన్ని కనుగొన్నామన్నారు. కానీ, దీనిపై మేం సీబీఐ విచారణ చేపట్టాలని కోరుతున్నాం’’ అని ఖర్గే రాసిన లేఖలో చెప్పారు.

    ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదం మనందరం కళ్లు తెరిచేలా చేసిందన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  8. సాక్షి మలిక్: రైల్వే ఉద్యోగంలో తిరిగి చేరా, లైంగిక వేధింపులపై పోరాటం కొనసాగిస్తా

  9. గుంటూరు జిల్లా: పంట కాలువలోకి దూసుకెళ్లిన ట్రాక్టర్, ఏడుగురు మృతి

    గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు సమీపంలో ట్రాక్టర్ బోల్తా పడింది. ఘటనా స్థలంలో ఏడుగురు మరణించారు. మరో 12మందికి గాయాలయ్యాయి. బాధితులను గుంటూరు ఆస్పత్రికి తరలించారు.

    ప్రత్తిపాడు మండలం కొండేపాడు గ్రామానికి చెందిన మహిళలు పొన్నూరు మండలం జూపూడిలో ఓ విందు కార్యక్రమానికి ట్రాక్టర్ లో బయలుదేరారు.

    మార్గం మధ్యలో స్టీరింగ్ పట్టేయడంతో ట్రాక్టర్ పంట కాలువలోకి దూసుకెళ్లిందని వట్టి చెరుకూరు పోలీసులు బీబీసీ కి తెలిపారు.

  10. తలనొప్పి: ఎన్ని రకాలు? ప్రమాదాన్ని సూచించే లక్షణాలు ఏవి?

  11. ఒడిశా రైలు ప్రమాదం: ఆత్మీయుల ఆచూకీ దొరకక తల్లడిల్లుతున్న కుటుంబాలు

  12. ప్రపంచ పర్యావరణ దినోత్సవం-2023: వాతావరణ మార్పుల ప్రమాదాలను మనం నివారించగలమా?

  13. ఒడిశా: బార్‌ఘర్‌ జిల్లాలో పట్టాలు తప్పిన ప్రైవేట్ గూడ్స్ రైలు

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    ఒడిశాలోని బార్‌ఘర్ జిల్లా మెంధపలి సమీపంలోని ఒక సిమెంట్ ఫ్యాక్టరీ ఆవరణలో గూడ్సు రైలు పట్టాలు తప్పినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

    ఒక ప్రైవేట్ సిమెంట్ కంపెనీ నడుపుతున్న ఈ రైలులో కొన్ని వ్యాగన్ లు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు ఇంత వరకు సమాచారం రాలేదు.

    ఈ ఘటనతో భారతీయ రైల్వేలకు ఎలాంటి సంబంధం లేదని, ఇది కేవలం ఒక ప్రైవేట్ సిమెంట్ కంపెనీకి చెందిన ప్రమాదమని ఈస్ట్ కోస్ట్ రైల్వే వెల్లడించింది.

    ఇది పూర్తిగా న్యారోగేజ్ లైన్ అని, ప్రైవేటు వ్యక్తులు నడుపుకునే మార్గమని, ఇందులో జరిగిన ప్రమాదాల వల్ల జరిగే ఏ విధమైన నష్టమైనా అది కంపెనీకే వర్తిస్తుందని ఈస్ట్ కోస్ట్ రైల్వే తెలిపింది.

  14. ప్రపంచ పర్యావరణ దినోత్సవం: ఆవు తేన్పుల మీద పన్ను... ఎక్కడ, ఎందుకు?

  15. ఆంధ్రప్రదేశ్: మెట్రో రైలు ప్రాజెక్టు ఎక్కడ... ఎనిమిదేళ్ళ కింద ఏర్పాటైన ఆఫీసులో ఎవరైనా ఉన్నారా?

  16. ఒడిశా రైలు ప్రమాద బాధితుల పిల్లల చదువులకు సాయం చేస్తాం: వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ అదాని

    వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ అదాని

    ఫొటో సోర్స్, Getty Images/VirenderSehwag

    ఒడిశా రైలు ప్రమాద బాధితులను ఆదుకునేందుకు మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్, వ్యాపారవేత్త గౌతమ్ అదానీలు ముందుకొచ్చారు.

    ప్రమాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి పిల్లల చదువుల కోసం తాను సహాయం చేస్తానని మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. సెహ్వాగ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లోని బోర్డింగ్ ఫెసిలిటీలో బాధితుల పిల్లలకు విద్యను అందిస్తామని ఆయన వెల్లడించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    ఒడిశా రైలు ప్రమాదం తనను కలిచివేసిందని వ్యాపార వేత్త గౌతమ్ అదానీ ట్వీట్ చేశారు.

    ఈ ఘటనను చూసి తీవ్ర మనోవేదనకు గురయ్యామని, ఈ ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు స్కూల్ ఎడ్యుకేషన్ అందించే బాధ్యతను అదానీ గ్రూప్ తీసుకుంటుందని ఆయన ట్వీట్ చేశారు.

    "బాధితులకు, వారి కుటుంబాలకు మనోబలాన్ని అందించడం, వారి పిల్లలకు భవిష్యత్తును అందించడం మనందరి ఉమ్మడి బాధ్యత" అని ఆయన తన ట్వీట్ లో పేర్కొన్నారు

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

  17. ఒడిశా రైలు ప్రమాదం: బాలాసోర్‌లో రైళ్ల రాకపోకలు తిరిగి ప్రారంభం

    ఒడిశాలోని బాలాసోర్‌

    ఫొటో సోర్స్, ANI

    ఒడిశాలోని బాలాసోర్‌లో రైలు ప్రమాదం జరిగిన చోట ట్రాక్ బాగు చేశారు. రైళ్ల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయని ఏఎన్ఐ వెల్లడించింది.

    ప్రమాదం జరిగిన 51 గంటల్లోనే రైలు రవాణా సేవలను పునరుద్ధరించినట్టు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు.

    "ప్రధాని మోదీ సూచనలు అందుకున్న వెంటనే దెబ్బతిన్న ట్రాక్‌ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. పట్టాలను సరిచేయడానికి బృందం మొత్తం శ్రద్ధగా పనిచేశారు. సర్వీసులు తిరిగి ప్రారంభించే ముందు రెండు లైన్లను పరీక్షించాం" అని ఆయన మీడియాకు తెలిపారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    "మా బాధ్యతలు ఇంతటితో అయిపోలేదు. ప్రమాదంలో చిక్కుకున్న కొందరి ఆచూకీ తెలియక కుటుంబసభ్యులు కలవరపడుతున్నారు. వీలైనంత త్వరగా వారి వివరాలు కనుగొనడం మా లక్ష్యం" అని రైల్వే మంత్రి అన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

  18. నమస్కారం

    బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు జాతీయ, అంతర్జాతీయ వార్తలను ఎప్పటికప్పుడు అందించే బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    నిన్నటి లైవ్‌పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.