ఒడిశా రైలు ప్రమాదంపై సీబీఐ విచారణకు రైల్వే బోర్డు సిఫారసు: రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్

ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదపు మూల కారణాన్ని గుర్తించామని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. ప్రాథమిక రిపోర్టులో ప్రమాదానికి కారణాలు వివరించారు.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    బీబీసీ తెలుగు లైవ్ పేజ్‌ ఇంతటితో సమాప్తం.

    మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం...గుడ్ నైట్

  2. కోరమండల్ ఎక్స్‌ప్రెస్ డ్రైవర్, గూడ్స్‌ గార్డు ప్రాణాలతో ఎలా బయటపడ్డారు, ప్రమాదంపై ఏం చెప్పారు?

  3. ఒడిశా రైలు ప్రమాదంపై సీబీఐ విచారణకు రైల్వే బోర్డు సిఫారసు: రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్

    అశ్వినీ వైష్ణవ్

    ఫొటో సోర్స్, @AshwiniVaishnaw

    ఒడిశా రైలు ప్రమాదంపై సీబీఐ విచారణకు రైల్వే బోర్డు సిఫారసు చేసిందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ వెల్లడించారు. “ప్రమాదం జరిగిన తీరును బట్టి, అధికారుల నుంచి అందిన సమాచారంతో సీబీఐతో దర్యాప్తు చేయాలని రైల్వే బోర్డు సిఫారసు చేసింది’’ అని మంత్రి వెల్లడించారు. బాలాసోర్‌లో సహాయక చర్యలు పూర్తవుతున్నాయని, రైళ్ల రాకపోకలను సాధారణ స్థితికి తీసుకొచ్చే పని జరుగుతోంది మంత్రి తెలిపారు. ట్రాక్‌కు సంబంధించిన పనులు పూర్తయ్యాయి, విద్యుత్ తీగల మరమ్మతు పనులు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు.

  4. బిహార్: కూలిన నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    బిహార్‌ భాగల్‌పూర్‌లో నిర్మాణంలో ఉన్న సుల్తాన్‌గంజ్-అగువాని ఘాట్ గంగా బ్రిడ్జ్ కూలిపోయింది.

    ఇలా వంతెన కూలిన ఘటనలు జరగడం ఏడాది కాలంలో ఇది రెండోసారి.

    గత ఏడాది బుర్హి-గండక్ నదిపై నిర్మిస్తున్న బ్రిడ్జ్ కూడా ఇలాగే కూలిపోయింది.

    206 మీటర్ల పొడవైన ఈ బ్రిడ్జ్ కు మొదట పగుళ్లు కనిపించాయని, తాజా ఘటనలో 2,3 నంబర్ పిల్లర్లు కూలిపోయినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

    బ్రిడ్జ్ కూలిపోతుండగా స్థానికులు తీసిన వీడియోలో అది రికార్డయింది. గంగా నదిపై నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక వంతెనల్లో ఇది ఒకటిగా చెబుతారు.

  5. మేకప్ కిట్‌లో కండోమ్‌లు, గర్భ నిరోధక మాత్రలు, పెళ్లికి ముందు ప్రెగ్నెన్సీ టెస్టులు - ఏంటీ వివాదం?

  6. ఒడిశా రైలు ప్రమాదం: మార్చురీ నుంచి తమకు పిలువు రావద్దని అక్కడున్న వారంతా ప్రార్ధిస్తున్నారు, కానీ....

  7. ఒడిశా రైలు ప్రమాదంపై ప్రాథమిక రిపోర్టులో ఏముంది?

    రైలు ప్రమాదాలు

    ఫొటో సోర్స్, ANI

    శుక్రవారం ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదంపై ప్రాథమిక విచారణ అనంతరం రైల్వేశాఖ అందుకు గల కారణాలను వెల్లడించింది.

    రైల్వే బోర్డు ఆపరేషన్ అండ్ బిజినెస్ డెవలప్‌మెంట్ సభ్యురాలు జయ వర్మ సిన్హా ఆదివారం న్యూదిల్లీలో జరిగిన విలేఖరుల సమావేశంలో, ప్రమాదానికి గల కారణాలను వివరించారు.

    సిగ్నల్ లోపం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమిక విచారణలో తెలుస్తోందన్నారు. ప్రమాదం ఎలా జరిగిందన్న వివరాలను కూడా సిన్హా తెలిపారు.

    ‘‘బహానగాలోని స్టేషన్‌లో 4 లైన్లు ఉన్నాయి. వీటిలో రెండు ప్రధాన లైన్లు. లూప్ లైన్‌లో గూడ్స్ రైలు ఉంది. స్టేషన్‌లో డ్రైవర్ గ్రీన్ సిగ్నల్ వచ్చింది. కాగా రెండు రైళ్లు శరవేగంగా నడుస్తున్నాయి’’ అని వివరించారు.

    మొదట కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌ ఒక్కదానికే ప్రమాదం జరిగిందని భావించారని, ప్రమాదం జరిగినప్పుడు కోరమండల్ గంటకు 126 కి.మీ. వేగంతో ప్రయాణిస్తున్నట్లు ఆమె వెల్లడించారు.

    ‘‘ఎదురుగా ఉన్న గూడ్స్ మీద ఇనుప ఖనిజం లోడ్‌ ఉండటం వల్ల గూడ్స్ రైలు పట్టాలు తప్పలేదు. పట్టాలు తప్పిన కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లోని చివరి రెండు కోచ్‌లు యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొన్నాయి’’ అని ఆమె వివరించారు.

    అంతకుముందు, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ బాలాసోర్‌లో మాట్లాడుతూ ప్రమాదానికి గల కారణాలను నిర్ధారించామని చెప్పారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  8. ఒడిశా రైలు ప్రమాదం: నాలుగు లైన్లు , మూడు రైళ్లు.. నిమిషాల్లోనే విధ్వంసం ఎలా జరిగింది?

  9. రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 275.. 288 కాదని చెప్పిన ఒడిశా సీఎస్

    ప్రదీప్ జేనా

    ఫొటో సోర్స్, ANI

    బాలాసోర్ రైలు ప్రమాదంలో చనిపోయిన వారు 288 మంది కాదని, 275 మందేనని ఒడిశా ప్రధాన కార్యదర్శి ప్రదీప్ జేనా చెప్పారు.

    ‘‘శనివారం వరకు ఈ రైలు ప్రమాదంలో మరణించిన వారు 288 మందిగా భారతీయ రైల్వే తెలిపింది. మేం కూడా ఈ సమాచారాన్నే అందించాం. కానీ జిల్లా మెజిస్ట్రేట్, ఆయన టీమ్ సభ్యులు సంఘటన స్థలంలో ప్రతి మృతదేహాన్ని పరిశీలించారు. ఆస్పత్రులు, తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కేంద్రాల వద్దనున్న మృతదేహాలను లెక్కించారు.

    ఈ లెక్కల్లో కొన్ని మృతదేహాలను రెండు సార్లు లెక్కించినట్లు తెలిసింది. ఆ తర్వాత మరణాల సంఖ్యకు సంబంధించి ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ లేఖ ప్రకారం, ఇవాళ ఉదయం వరకు ఈ రైలు ప్రమాదంలో మరణించిన వారు 275 మంది.’’ అని జేనా తెలిపారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    88 మంది మృతదేహాలు గుర్తింపు

    275 మందిలో 88 మంది మృతదేహాలను మాత్రమే గుర్తించినట్లు చెప్పారు.

    గుర్తించిన 78 మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలిపారు.

    మరో 10 మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అందించే ప్రక్రియను ప్రారంభించినట్లు చెప్పారు.

    మిగిలిన 187 మృతదేహాల్లో 170 భువనేశ్వర్‌కు తరలించినట్లు తెలిపారు.

  10. తెలుగు ప్రజలతో కోరమండల్ ఎక్స్‌ప్రెస్ అనుబంధమిది..

  11. కోరమండల్ ఎక్స్‌ప్రెస్: ఈ ఘోర ప్రమాదం ఎలా జరిగింది?

  12. ఏపీకి చెందిన బాలాసోర్‌ ప్రమాద బాధితులకు పరిహారం: సీఎం జగన్ మోహన్ రెడ్డి

    ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

    ఫొటో సోర్స్, FACEBOOK/YSJAGAN

    ఒడిశాలోని బాలోసోర్‌ సమీపంలో రైలు ప్రమాద దుర్ఘటన, అధికారులు తీసుకుంటున్న చర్యలపై ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.

    రాష్ట్రం నుంచి ఒడిశాకు వెళ్లిన మంత్రి అమర్‌నాథ్‌ నేతృత్వంలోని ప్రత్యేక బృందం తీసుకుంటున్న చర్యలను అధికారులు సీఎంకు వివరించారు.

    విశాఖపట్నంలో మరో మంత్రి బొత్స సత్యన్నారాయణ నేతృత్వంలో పర్యవేక్షణ కార్యకలాపాలను కూడా అధికారులు సీఎంకు తెలిపారు.

    ఈ ఘటనలో రాష్ట్రానికి చెందిన వారు ఎవరైనా మరణిస్తే వారి కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, తీవ్రంగా గాపడ్డవారికి రూ.5 లక్షలు ఇవ్వాలని, స్వల్పంగా గాయపడ్డవారికి రూ.1 లక్ష చొప్పున ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు.

    కేంద్ర ప్రభుత్వం తరఫున అందిస్తున్న సహాయానికి అదనంగా ఇది ఇవ్వాలని సీఎం స్పష్టంచేశారు.

    బాలాసోర్‌లో నివాసం ఉంటున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తి ఒకరు మరణించారని అధికారులు సీఎంకు తెలిపారు.

    గాయపడ్డ వారికి మెరుగైన వైద్యసదుపాయాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

  13. అశ్విని వైష్ణవ్: ఐఏఎస్ అధికారి నుంచి రైల్వే మంత్రిగా ఎలా ఎదిగారు? ఆయన రాజీనామా చేయాలని విపక్షాలు ఎందుకు పట్టుపడుతున్నాయి

  14. బాలాసోర్ రైలు ప్రమాదం: క్లయిమ్స్ నిబంధనలను సరళతరం చేసిన ఎల్ఐసీ

    ఎల్ఐసీ

    ఫొటో సోర్స్, Getty Images

    బాలాసోర్ రైలు ప్రమాదానికి చెందిన బాధితుల క్లయిమ్ సెటిల్‌మెంట్ నిబంధనలను సరళీకరిస్తున్నట్లు భారత జీవిత బీమా సంస్థ(ఎల్ఐసీ) ప్రకటించింది.

    ఎల్ఐసీ చైర్మన్ సిద్ధార్థ మొహంతి ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.

    ‘‘శుక్రవారం ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదంపై మేం తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాం. బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేందుకు క్లయిమ్స్ సెటిల్‌మెంట్ వేగవంతంగా చేపడతాం. వీలైనంత త్వరగా క్లయిమ్‌లను పరిష్కరిస్తాం’’ అని తెలిపారు.

    ఎల్ఐసీ పాలసీ, ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన క్లయింట్లు ఎదుర్కొనే ఇబ్బందులను తొలగించేందుకు అనేక రాయితీలను అందించనున్నట్లు ఎల్ఐసీ తెలిపింది.

    క్లయిమ్ సంబంధిత సమస్యలను పరిష్కరించి, వారికి సాయం చేసేందుకు డివిజనల్, బ్రాంచ్ స్థాయిలో ప్రత్యేక హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఎల్ఐసీ తన ప్రకటనలో పేర్కొంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  15. మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కటకం సుదర్శన్ మృతి

    మావోయిస్ట్ నేత కటకం సుదర్శన్ కన్నుమూత

    ఫొటో సోర్స్, Getty Images

    మావోయిస్ట్‌ల కేంద్ర కమిటీ సభ్యుడు కటకం సుదర్శన్ గుండె పోటుతో మరణించినట్లు మావోయిస్ట్‌ పార్టీ సెంట్రల్ కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఒక ప్రకటనలో తెలిపారు.

    కటకం సుదర్శన్‌పై రూ.1.55 కోట్ల రివార్డు ఉంది.

    సీపీఐ మావోయిస్ట్‌‌లో కటకం సుదర్శన్ ప్రస్తుతం నంబర్ 2 స్థానంలో ఉన్నారు. 66 ఏళ్ల సుదర్శన్ తెలంగాణలోని మంచిర్యాల జిల్లాకు చెందినవారు.

    దేశంలో పలు ప్రాంతాల్లో జరిగిన మావోయిస్ట్‌ల దాడుల్లో సుదర్శన్‌కు ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలున్నాయి.

    1974 నుంచి మావోయిస్ట్ ఉద్యమంలో సుదర్శన్ క్రియాశీలకంగా ఉన్నట్లు పోలీసులు చెప్పారు.

    చత్తీస్‌గఢ్‌లో బీజేపీ ఎమ్మెల్యే భీమా మాండవి హత్యలో ఆయన ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలున్నాయి.

    కేవలం ఈ కేసులోనే కటకం సుదర్శన్‌పై రూ.10 లక్షల రివార్డును ఎన్ఐఏ ప్రకటించింది.

  16. బాలాసోర్ రైలు ప్రమాదానికి గల అసలు కారణం గుర్తించాం: అశ్విని వైష్ణవ్

    కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం

    ఫొటో సోర్స్, ANI

    ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదంపై ప్రాథమిక దర్యాప్తు పూర్తి చేసినట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.

    ఈ ప్రమాదానికి గల అసలు కారణాన్ని, బాధ్యులను గుర్తించినట్లు చెప్పారు.

    సంబంధిత అధికారులు సమగ్రంగా దర్యాప్తు చేసిన తరువాత చర్యలు ఉంటాయన్నారు.

    ప్రమాదం జరిగిన ప్రాంతంలో రాత్రంతా బోగీల తొలగింపు, ట్రాక్‌ల పునరుద్ధరణ పనులను రైల్వే మంత్రి సమీక్షించారు.

    అర్ధరాత్రే ఒక ట్రాక్ పునరుద్ధరణ పనిని పూర్తి చేశామని మంత్రి చెప్పారు. బుధవారం ఉదయం సరికి పూర్తిగా ఈ ట్రాక్‌లపై రైళ్ల రాకపోకలను పునరుద్ధరిస్తామని తెలిపారు.

    ‘‘విచారణ పూర్తయింది. రైల్వే సేఫ్టీ కమిషనర్ వీలైనంత త్వరగా విచారణ రిపోర్ట్‌ను పూర్తి చేస్తారు. రిపోర్ట్ వచ్చిన తర్వాత అన్ని వివరాలు తెలుస్తాయి. ఈ ఘోర ప్రమాదానికి గల అసలు కారణాన్ని ప్రస్తుతం కనుగొన్నాం’’ అని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  17. బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు జాతీయ, అంతర్జాతీయ వార్తలను ఎప్పటికప్పుడు అందించే బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.