చిరంజీవి: నేను క్యాన్సర్‌తో బాధపడినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు

కొలోన్ టెస్ట్ చేయించుకోవడం వల్ల నాన్ క్యాన్సరస్ పాలిప్స్‌ని డిటెక్ట్ చేశారని, ముందుగా టెస్ట్ చేయించుకోకుండా ఉండి ఉంటే అది క్యాన్సర్ కింద మారేదేమో అని మాత్రమే అన్నానని ఆయన అన్నారు.

లైవ్ కవరేజీ

  1. LGBT లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్‌... ఈ పదాలకు అర్థం ఏంటి?

  2. ధన్యవాదాలు

    బీబీసీ తెలుగు లైవ్ పేజ్‌ ఇంతటితో సమాప్తం. మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం...గుడ్ నైట్

  3. చిరంజీవి: నేను క్యాన్సర్‌తో బాధపడినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు

    చిరంజీవి

    నేను క్యాన్సర్‌తో బాధపడ్డానంటూ కొన్ని మీడియా సంస్థల్లో వచ్చిన వార్తలు అవాస్తవమని హీరో చిరంజీవి తెలిపారు.

    తనకు క్యాన్సర్ వచ్చినట్లు చెప్పలేదని, కొన్ని మీడియా సంస్థలు తన మాటలను సరిగ్గా అర్థం చేసుకోకుండా కథనాలు రాశాయని చిరంజీవి అన్నారు.

    కొలోన్ టెస్ట్ చేయించుకోవడం వల్ల నాన్ క్యాన్సరస్ పాలిప్స్‌ని డిటెక్ట్ చేశారని, ముందుగా టెస్ట్ చేయించుకోకుండా ఉండి ఉంటే అది క్యాన్సర్ కింద మారేదేమో అని మాత్రమే అన్నానని ఆయన స్పష్టం చేశారు.

    విషయాన్ని అర్థం చేసుకోకుండా, అవగాహన రాహిత్యంతో రాయొద్దంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.

    ''కొద్ది సేపటి క్రితం నేనొక క్యాన్సర్ సెంటర్‌ని ప్రారంభించిన సందర్భంగా క్యాన్సర్ పట్ల అవగాహన పెరగాల్సిన అవసరం గురించి మాట్లాడాను. నేను అలర్ట్‌గా ఉండి కొలోన్ స్కోప్ టెస్ట్ చేయించుకున్నాను. అందులో non - cancerous polyps ని డిటెక్ట్ చేసి తీసేశారు అని చెప్పాను. 'అలా ముందుగా టెస్ట్ చేయించుకోకపోయివుంటే అది క్యాన్సర్ కింద మారేదేమో' అని మాత్రమే అన్నాను.

    కొన్ని మీడియా సంస్థలు సరిగ్గా అర్థం చేసుకోకుండా, అవగాహనా రాహిత్యం తో 'నేను క్యాన్సర్ బారిన పడ్డాను' అని 'చికిత్స వల్ల బతికాను' అని స్క్రోలింగ్‌లు, వెబ్ ఆర్టికల్స్ మొదలుపెట్టాయి. దీని వల్ల అనవసరమైన కన్ఫ్యూజన్ ఏర్పడింది. అనేక మంది వెల్ విషర్స్ నా ఆరోగ్యం గురించి మెసేజ్‌లు పంపిస్తున్నారు. వారందరి కోసం ఈ క్లారిఫికేషన్.'' ఒక ట్వీట్‌లో చిరంజీవి రాశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  4. రాహుల్ గాంధీ: భారతీయ నేతలపై ప్రవాస భారతీయులకు ఎందుకంత ఆసక్తి?

  5. కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం: ఆ మూడు రైళ్లు ఎలా ఢీకొన్నాయంటే...

  6. ఒడిశా రైలు ప్రమాదం: బాధ్యులను కఠినంగా శిక్షిస్తామన్న ప్రధాని మోదీ

    ఒడిశా రైలు ప్రమాదానికి కారణమైన బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పినట్లు ఏఎన్‌ఐ వార్తా సంస్థ తెలిపింది.

    ''ఇదో విషాదకర ఘటన. ప్రమాదంలో గాయపడిన వారికి ప్రభుత్వం మెరుగైన వైద్యం అందిస్తుంది. ఈ ఘటనపై అన్ని కోణాల్లో విచారణ జరపాలని ఆదేశించాం. ఈ ప్రమాదానికి కారణమని తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. ప్రమాదంలో గాయపడిన వారిని కలిశాను.'' అని మోదీ అన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    మధ్యాహ్నం ప్రత్యేక హెలికాప్టర్‌లో ప్రధాన మంత్రి మోదీ ఒడిశాలోని బాలాసోర్‌ సమీపంలో రైలు ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకుని అక్కడి పరిస్థితిపై సమీక్షించారు.

    కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, ధర్మేంద్ర ప్రదాన్ ప్రమాదానికి సంబంధించిన వివరాలను ప్రధాని మోదీకి వివరించారు.

    అనంతరం బాలాసోర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రైలు ప్రమాద బాధితులను ప్రధాని పరామర్శించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

  7. కోరమండల్ ఎక్స్‌ప్రెస్: ‘కవచ్’ అంటే ఏంటి, ఈ ఘోర ప్రమాదాన్ని అది ఆపగలిగేదా?

  8. కోరమండల్ ఎక్స్‌ప్రెస్: ఒడిశా రైలు ప్రమాదంలో 288 మందికి పైగా మృతి- ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్తున్నారంటే

  9. ఒడిశా రైలు ప్రమాదం: ప్రయాణికుల కుటుంబ సభ్యుల కోసం చెన్నై నుంచి రైలు

    ఒడిశా రైలు ప్రమాదం

    ఒడిశాలో ప్రమాదానికి గురైన కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణికుల కుటుంబ సభ్యుల కోసం రైల్వే శాఖ ఈరోజు సాయంత్రం చెన్నై నుంచి ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు తమిళనాడు రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ జయంత్ చెప్పినట్లు ఏఎన్‌ఐ వార్తా సంస్థ తెలిపింది.

    ఈ రైలు ప్రమాదంలో చాలా మంది చనిపోయారని, అయితే మృతుల్లో తమిళనాడుకు చెందిన ప్రయాణికులు ఉన్నట్లు ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం అందలేదని ఆయన చెప్పారు.

    ప్రమాదానికి గురైన రైళ్లలో ప్రయాణిస్తూ, ఇప్పటి వరకూ అందుబాటులోకి రాని ప్రయాణికుల కుటుంబ సభ్యులు చెన్నై నుంచి సాయంత్రం బయలుదేరనున్న రైలులో భద్రక్ చేరుకోవచ్చని కుమార్ జయంత్ తెలిపారని ఏఎన్‌ఐ పేర్కొంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  10. అనారోగ్యంతో ఉన్న భార్యను చూసేందుకు జైలు నుంచి ఇంటికొచ్చిన సిసోడియా

    మనీశ్ సిసోడియా

    ఫొటో సోర్స్, ANI

    అనారోగ్యంతో ఉన్న భార్యను చూసేందుకు ఆప్ నేత, దిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు జైలు నుంచి తన నివాసానికి వచ్చారు.

    దిల్లీ హైకోర్టు అనుమతి ఇవ్వడంతో, ఆయన శనివారం తన ఇంటికి చేరుకున్నారు.

    ఇవాళ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలో అనారోగ్యంతో ఉన్న తన భార్య దగ్గర ఉండేందుకు మనీశ్ సిసోడియాకు దిల్లీ హైకోర్టు శుక్రవారం అనుమతిచ్చింది.

    తన భార్య అనారోగ్యంతో ఉండటంతో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ సిసోడియా కోర్టుకి వెళ్లారు.

    ఈ సమయంలో సిసోడియా మీడియాతో మాట్లాడేందుకు వీలు లేదని, మొబైల్ ఫోన్ లేదా ఇంటర్నెట్ వాడొద్దని జస్టిస్ దినేష్ కుమార్ శర్మ నేతృత్వంలోని బెంచ్ ఆదేశించింది.

  11. బాలాసోర్ రైలు ప్రమాదం: ‘తల్లిదండ్రులు చనిపోవడంతో పిల్లాడు ఏడ్చిఏడ్చి ప్రాణాలొదిలాడు’

  12. హైదరాబాద్‌లో వైసీపీ ఐటీ విభాగం సదస్సు

    ఏపీలోని పాలక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులతో సమావేశం నిర్వహించింది.

    ఆ పార్టీ ఐటీ విభాగం అధ్య‌క్షుడు సునీల్ కుమార్ రెడ్డి పోసింరెడ్డి నేతృత్వంలో నిర్వహించిన ఈ సమావేశంలో వివిధ తీర్మానాలు చేశారు.

    పార్టీ సోషల్ మీడియా విభాగం, ఐటీ విభాగాలను పటిష్టం చేసేందుకు తీర్మానాలు చేశారు.

    ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు.

    ఐటీ విభాగం సదస్సు

    ఫొటో సోర్స్, ycp

  13. ఒడిశా రైలు ప్రమాదం: కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌కు ఆ పేరు ఎలా వచ్చింది?

  14. ట్రైన్ శబ్దంలో తేడాను గుర్తించి యాక్సిడెంట్ జరగబోతుందని ఊహించి చైన్ లాగి రైలు ఆపిన ఇంజినీర్

  15. కోరమండల్ రైలు ప్రమాదంపై సంతాపం వ్యక్తం చేస్తోన్న విదేశీ నేతలు

    ఆస్ట్రేలియా, శ్రీలంక విదేశాంగ మంత్రులు

    ఫొటో సోర్స్, ANI

    బాలాసోర్ సమీపంలో జరిగిన రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి బాధితులకు విదేశీ నేతలు సంతాపం తెలియజేస్తున్నారు.

    బాధిత కుటుంబాలకు భారత్‌లోని రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

    ఈ ప్రమాదంలో 238 మంది మరణించగా, 900 మందికి గాయాలయ్యాయి.

    చనిపోయిన వారికి నివాళి అర్పిస్తూ ఆస్ట్రేలియా, శ్రీలంక విదేశాంగ మంత్రులు కూడా ప్రకటన విడుదల చేశారు.

    ఈ ప్రమాదంలో గాయాలు పాలైన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు శ్రీలంక విదేశాంగ మంత్రి అలీ సబ్రీ ట్వీట్ చేశారు. ఈ క్లిష్ట సమయంలో భారత్‌కి శ్రీలంక తోడుగా నిలుస్తుందన్నారు.

    తైవాన్ అధ్యక్షురాలు సాయ్ ఇంగ్-వెన్ కూడా బాధిత కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు.

    ‘‘భారత్‌లో జరిగిన ఈ రైలు ప్రమాదంలో ప్రభావితమైన వారందరి కోసం ప్రార్థిస్తున్నాను. బాధితులకు, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. సహాయక చర్యలు అవసరమైన వారిని కాపాడతాయని ఆశిస్తున్నాను’’ అని తెలుపుతూ సాయ్ ట్వీట్ చేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    ఈ రైలు ప్రమాదంపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కూడా ట్వీట్ చేశారు.

    ‘‘ఒడిశాలోని రైలు ప్రమాదానికి చెందిన ఫోటోలు, రిపోర్ట్‌లు నా హృదయాన్ని ముక్కలు చేశాయి. ఈ ప్రమాదంలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయాలు పాలైన వారు త్వరగా కోలుకోవాలని వేడుకుంటున్నా. ఈ కష్ట సమయంలో కెనడా ప్రజలు భారత్‌కు తోడుగా నిలుస్తారు’’ అని చెప్పారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

  16. ఒడిశా రైలు ప్రమాదం: సంఘటన స్థలానికి వెళ్లనున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

    ప్రధాని నరేంద్ర మోదీ

    ఫొటో సోర్స్, ANI

    కోరమండల్ రైలు ప్రమాద నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ ఒడిశా వెళ్లనున్నారు.

    తొలుత ప్రమాదం జరిగిన బాలాసోర్ ప్రాంతాన్ని మోదీ సందర్శించనున్నారు.

    ఆ తర్వాత కటక్‌లోని ఆస్పత్రికి వెళ్లి, గాయాలు పాలైన వారిని పరామర్శించనున్నారని న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ ట్వీట్ చేసింది.

    సహాయక చర్యలపై ఉన్నతాధికారులతో కూడా ప్రధాని మోదీ సమీక్ష నిర్వహించనున్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  17. ఒడిశా ఘోర రైల్వే ప్రమాదం ఫొటోలలో..

  18. కోరమండల్: 218 మంది విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రిలో దిగాల్సి ఉంది

    పట్టాలు తప్పిన కోరమండల్ రైలు

    ప్రమాదానికి గురైన కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లో ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ స్టేషన్లలో దిగాల్సిన ప్రయాణికులు ఉన్నారు.

    విజయవాడలో 137 మంది, ఏలూరులో 14, తాడేపల్లిగూడెంలో 12, రాజమండ్రిలో 55 మంది దిగాల్సి ఉందని విజయవాడ డివిజన్ రైల్వే అధికారులు తెలిపారు.

    విశాఖపట్నంలో దిగాల్సిన ప్రయాణికుల సంఖ్య ఇంకా తెలియలేదు.

  19. రైల్వే ప్రమాదం: విశాఖ సహా ఒడిశా సరిహద్దుల్లోని ఆస్పత్రులను సిద్ధంగా ఉంచాలన్న ఏపీ సీఎం

    ఒడిశా రైల్వే ప్రమాదం

    ఫొటో సోర్స్, Getty Images

    ఒడిశా రైలు ప్రమాద ఘటనపై ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

    పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ నేతృత్వంలో ముగ్గురు ఐఏఎస్‌ల బృందాన్ని ప్రమాదం జరిగిన బాలాసోర్‌ ప్రాంతానికి పంపించాలని సీఎం ఆదేశించారు.

    అవసరమైన పక్షంలో సంఘటనా స్థలానికి అంబులెన్స్‌లను పంపించేందుకు సన్నద్ధం చేశారు.

    క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించడానికి విశాఖ సహా ఒడిశా సరిహద్దుల్లోని ఆస్పత్రులను సన్నద్ధంగా ఉంచాలని కూడా సీఎం అధికారులను ఆదేశించారు.

    ప్రమాద ఘటనకు సంబంధించిన తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు తనకు నివేదించాలన్నారు.

    ప్రతి జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల్లో కూడా ఎంక్వైరీ విభాగాలను ఏర్పాటుచేయాలని ఆదేశించామని అధికారులు తెలిపారు.

    రైల్వే అధికారుల నుంచి అందిన సమాచారం మేరకు ప్రయాణికుల పరిస్థితులపై ఆరాతీయడానికి, అలాగే ఎవరైనా ప్రయాణికుల బంధువులు, వారి సంబంధీకుల నుంచి సమాచారం వస్తే వెంటనే స్పందించేలా ఈ ఎంక్వైరీ విభాగాలు పనిచేయాలని సీఎం ఆదేశించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  20. ఒడిశా, కోరమండల్ ఎక్స్‌ప్రెస్ : భారత్‌లో ఘోర రైలు ప్రమాదాలు ఇవే