న్యూయార్క్-నరేంద్రమోదీ: ‘‘యోగాకు కాపీరైట్స్ లేవు. ఎవరైనా చేయవచ్చు’’

ఒకేసారి అనేక జాతుల ప్రజలు కలిసి చేసిన అతి పెద్ద యోగా కార్యక్రమంగా ఈ ప్రోగ్రాం గిన్నిస్ రికార్డులకెక్కింది.

లైవ్ కవరేజీ

  1. తెలంగాణ ‘అమరుల’ స్మారకం: 3 ఎకరాల ప్రాంగణంలో ‘త్యాగాల దివ్వె’.. 150 అడుగుల స్మారకం, 26 అడుగుల దీపం

  2. ధన్యవాదాలు

    బీబీసీ తెలుగు లైవ్ పేజ్ ఇంతటితో సమాప్తం. మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం....గుడ్ నైట్

  3. మణిపుర్: వందల చర్చిలను ధ్వంసం చేశారని క్రైస్తవ సంఘాల ఆరోపణ

  4. న్యూయార్క్-నరేంద్రమోదీ: ‘‘యోగాకు కాపీరైట్స్ లేవు. ఎవరైనా చేయవచ్చు’’

    నరేంద్రమోదీ యోగా

    ఫొటో సోర్స్, ANI

    ఫొటో క్యాప్షన్, నరేంద్ర మోదీ

    న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం వద్ద బుధవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్రమోదీ హాజరయ్యారు.

    ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన వందలాది మంది ఈ యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు.

    ఈ సందర్భంగా ప్రధాని మోదీ "యోగా భారతదేశం నుంచి వచ్చింది. అన్ని ప్రాచీన భారతీయ సంప్రదాయాల మాదిరిగానే ఇది సజీవంగా, చైతన్యవంతంగా ఉంటుంది. యోగా అనేది ఒక జీవన విధానం" అని తెలిపారు.

    ''యోగా అనేది మీ ఆలోచనలు, చర్యలల్లో శ్రద్ధ వహించడానికి, మీతో, ఇతరులతో, ప్రకృతితో సామరస్యంగా జీవించడానికి ఒక మార్గం'' అని చెప్పారు.

    ఒకేసారి అనేక జాతుల ప్రజలు కలిసి చేసిన యోగా కార్యక్రమంగా ఈ ప్రోగ్రాం గిన్నిస్ రికార్డులకెక్కింది. ఈ మేరకు గిన్నిస్ సంస్థ ప్రతినిధులు సర్టిఫికెట్‌ ప్రదర్శించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  5. టైటాన్ సబ్ మెర్సిబుల్: టాయిలెట్‌కు తలుపులు కూడా లేని ఈ నౌకలోకి ఐదుగురిని పంపి 17 బోల్ట్‌లు బిగించి నీళ్లలోకి దింపారు....ఎందుకు?

  6. సోయం బాపూరావు - ఎంపీల్యాడ్స్: ఈ నిధులతో ఎంపీలు సొంత ఇల్లు కట్టుకోవచ్చా? 9 సందేహాలు, సమాధానాలు

  7. హోండురాస్‌: మహిళా జైలులో ఖైదీల మధ్య ఘర్షణ, 41 మంది మృతి

    హోండురాస్ జైలు

    ఫొటో సోర్స్, Reuters

    హోండురాస్‌లోని మహిళా జైలులో మంగళవారం జరిగిన ఘర్షణలో 41 మంది మరణించారు. గ్యాంగ్‌ల మధ్య గొడవ జరిగిందని, ఆ తర్వాత అందులోని ఒక ముఠా జైలులోని సెల్‌‌కు నిప్పు పెట్టిందని తెలుస్తోంది.

    అగ్నిప్రమాదం వల్ల ఎక్కువ మంది మరణించారని, అయితే కొంతమంది బాధితులను కాల్చిచంపారని అధికారులు తెలిపారు.

    ఆ దేశ డిప్యూటీ సెక్యూరిటీ మినిస్టర్ జూలిస్సా విల్లానువా ఎమర్జెన్సీని ప్రకటించారు. ఆందోళనను అణిచివేస్తామని హామీ ఇచ్చారు.

    అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, మిలిటరీ రంగంలోకి దిగాయి. "మనుషుల ప్రాణాలు పోవడాన్ని సహించలేం" అని విల్లానువా అన్నారు.

    జైలు దాదాపు పూర్తిగా ధ్వంసమయిందని జైలు ఒక ఖైదీకి బంధువైన వ్యక్తి ఒకరు స్థానిక మీడియాకు వెల్లడించారు.

    సోషల్ మీడియాలో కనిపిస్తున్న వీడియోలలో జైలు ప్రాంతం భారీ ఎత్తున పొగతో నిండి ఉన్నట్లు కనిపిస్తోంది.

    జైలులో ఉన్న మహిళలు ఇలా చనిపోవడం అత్యంత బాధాకరమైన విషయమని ఆ దేశ అధ్యక్షుడు షియోమరా క్యాస్ట్రో అన్నారు.

  8. భారత్, అమెరికాలు మాట్లాడుకోని ఆ ఒక్క విషయం

  9. మోదీకి బైడెన్ ఆహ్వానం వెనుక అసలు సంగతి ఇదేనా

  10. కోతి పిల్లలను చిత్రహింసలు పెడుతూ వీడియోలు తీసి అమ్ముకుంటున్నారు.. బీబీసీ ఇన్వెస్టిగేషన్‌లో బయపడిన దారుణమైన ఇంటర్నేషనల్ బిజినెస్

  11. బొబ్బిలి అంటే వీరత్వమే కాదు వీణ కూడా.. తంజావూరు తరువాత ఈ తెలుగు వీణకే పట్టం

  12. హైదరాబాద్‌లో కుప్పకూలిన ఫ్లైఓవర్ శ్లాబ్.. 9 మందికి గాయాలు

    కుప్పకూలిన ఫ్లైఓవర్

    ఫొటో సోర్స్, UGC

    హైదరాబాద్ సాగర్ రింగ్ రోడ్డు బైరామల్ గూడ దగ్గర కొత్తగా కడుతోన్న ఫ్లైఓవర్ శ్లాబ్ కూలింది.

    ఇక్కడ రెండు స్తంభాల మధ్య ఐరన్ నిర్మాణం కూలిడంతో 9 మంది కార్మికులకు గాయాలు అయ్యాయి.

    కుప్పకూలిన ఫ్లైఓవర్

    ఫొటో సోర్స్, UGC

    ప్రస్తుతం శిథిలాలను తొలగించారు. గాయపడ్డ వారంతా ఇతర రాష్ట్రాలకు చెందిన వారు. గాయపడిన వారిలో ఒక స్థానిక ఇంజినీర్ కూడా ఉన్నారు. వారికి చికిత్స జరుగుతోంది.

    జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు, స్థానిక ఎమ్మెల్యే ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

  13. ‘‘నేను మోదీ అభిమానిని’’ – ఎలాన్ మస్క్ ఇంకా ఏమన్నారు?

    నరేంద్ర మోదీ, ఎలాన్ మస్క్

    ఫొటో సోర్స్, @DDNEWSLIVE

    వచ్చే ఏడాది భారత్‌లో పర్యటించాలని ప్రణాళికలు రచిస్తున్నట్లు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసిన తర్వాత టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ చెప్పారు.

    ‘‘భారత్‌లో టెస్లా సేవలు మొదలుపెడతాం. వీలైనంత త్వరగా సేవలు మొదలుపెట్టేందుకు మేం కృషి చేస్తున్నాం. ఈ విషయంలో మద్దతు ఇస్తున్నందుకు ప్రధాని నరేంద్ర మోదీకి నేను ధన్యవాదాలు చెబుతున్నాను. ఆయనతో చర్చ అద్భుతంగా సాగింది. భారత్‌లో మా పెట్టుబడులు గణనీయంగా ఉండబోతున్నాయి’’ అని మస్క్ అన్నారు.

    నరేంద్ర మోదీ ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అక్కడి ప్రముఖ సీఈవోలతో మోదీ భేటీ అవుతున్నారు. దీనిలో భాగంగానే ఎలాన్ మస్క్‌ను కూడా కలిశారు.

    ‘‘నేను మోదీకి అభిమానిని’’అని మోదీని కలిసిన తర్వాత ఎలాన్ మస్క్ చెప్పారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2