టైటానిక్ ఓడ మునిగిన ప్రాంతంలో శిథిలాల ఆనవాళ్లను గుర్తించామన్న రెస్క్యూ బృందం

అయితే అవి దేనికి సంబంధించినవో ఇంకా తెలియదని యూఎస్ కోస్ట్ గార్డ్ వెల్లడించింది.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    బీబీసీ తెలుగు లైవ్ పేజ్ ఇంతటితో సమాప్తం. మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం....గుడ్ నైట్

  2. టైటానిక్ ఓడ మునిగిన ప్రాంతంలో శిథిలాల ఆనవాళ్లను గుర్తించామన్న రెస్క్యూ బృందం

    ప్రతీకాత్మక చిత్రం

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

    అట్లాంటిక్ సముద్రంలో టైటానిక్ ఓడను చూడటానికి వెళ్లి గల్లంతైన టైటాన్ సబ్‌మెర్సిబుల్‌‌ సెర్చ్ ఆపరేషన్‌లో కొన్ని శిథిలాల ఆనవాళ్లను గుర్తించామని యూఎస్ కోస్ట్‌గార్డ్ వెల్లడించింది.

    అయితే, అవి టైటాన్‌కు సంబంధించినవా కాదా అన్నది ఇప్పుడే చెప్పలేమని కోస్ట్ గార్డ్ తెలిపింది.

    టైటానిక్ ఓడ మునిగిన ప్రాంతంలో హారిజోన్ ఆర్కిటిక్ ఆర్‌ఓవీ (రిమోట్‌గా పనిచేసే వాహనం) ఈ శిథిలాల ఆనవాళ్లను గుర్తించిందని కోస్ట్‌గార్డ్ వెల్లడించింది.

    దీనికి సంబంధించి పూర్తి వివరాలు క్రోఢీకరించి అధికారిక ప్రకటన చేస్తామని రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్న అధికారులు తెలిపారు.

    యూఎస్ కోస్ట్ గార్డ్

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, యూఎస్ కోస్ట్ గార్డ్
  3. మోదీ అమెరికా పర్యటన : ‘అఫీషియల్ స్టేట్ విజిట్’ అంటే ఏంటి, దాని ప్రోటోకాల్ ఎలా ఉంటుంది?

  4. అట్లాంటిక్: వలసదారుల పడవ మునక, 30 మందికి పైగా గల్లంతు

    పడవ మునక

    ఫొటో సోర్స్, EPA

    కానరీ దీవులకు సమీపంలోని అట్లాంటిక్ మహాసముద్రంలో పడవ మునిగిపోవడంతో 30 మందికి పైగా వలసదారులు మునిగిపోయి ఉండవచ్చని రెండు స్వచ్ఛంద సంస్థలు తెలిపాయి.

    బోటులో దాదాపు 60 మంది ప్రయాణిస్తున్నట్లు వాకింగ్ బోర్డర్స్, అలారం ఫోన్‌ అనే ఈ స్వచ్ఛంద సంస్థలు చెప్పాయి.

    ఒక మైనర్‌తోపాటు, ఒక వ్యక్తి మృతదేహాన్ని రెస్క్యూ వర్కర్లు కనుగొన్నారని, మరో 24 మందిని రక్షించినట్లు స్పానిష్ అధికారులు తెలిపారు. అయితే పడవలో ఎంత మంది ఉన్నారో తెలియలేదన్నారు.

    నలుగురు మహిళలు, ఒక చిన్నారి సహా 39 మంది మునిగిపోయారని వాకింగ్ బోర్డర్స్‌కు చెందిన హెలెనా మలెనో గార్జోన్ చెప్పారు.

    అదే సమయంలో అలారం ఫోన్ సంస్థ 35 మంది తప్పిపోయినట్లు తెలిపింది. రెండు సంస్థలు వలస పడవలను పర్యవేక్షిస్తాయి.

  5. మోదీ అమెరికా పర్యటన: వైట్‌హౌస్‌కు చేరుకున్న ప్రధాని, స్వాగతం పలికిన బైడెన్ దంపతులు

    నరేంద్రమోదీ

    ఫొటో సోర్స్, ANI

    వైట్‌హౌస్‌కు చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, ఆయన భార్య జిల్ బైడెన్‌లు స్వాగతం పలికారు.

    మోదీని స్వాగతిస్తూ, రెండు దేశాల రాజ్యాంగాలలో మొదటి మూడు పదాలు ఒకటేనని, ఇవి రెండు దేశాల మధ్య భాగస్వామ్య ప్రాధాన్యతను ప్రతిబింబిస్తున్నాయని బైడెన్ అన్నారు.

    "మన బంధంలో స్పష్టత, పరస్పర విశ్వాసం ఉన్నాయి" అని బైడెన్ అన్నారు.

    "ఈ రోజు భారత అమెరికాలు తీసుకునే నిర్ణయాలు రేపు ప్రపంచ భవిష్యత్తుపై ప్రభావం చూపబోతున్నాయి’’ అని బైడెన్ వ్యాఖ్యానించారు.

    అమెరికా అధ్యక్షుడు ఇస్తున్న ఈ ఆతిథ్యానికి తానెంతో కృతజ్ఞుడినని ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  6. టైటాన్ సబ్ మెర్సిబుల్: ఆక్సీజన్ తగ్గినా, స్పృహ కోల్పోయినా యాత్రికులను బతికించవచ్చా?

  7. అమెరికా నుంచి భారత్ రూ.25 వేల కోట్లు పెట్టి కొనాలనుకుంటున్న ఎంక్యూ-9 సిరీస్ డ్రోన్లు ఎలా పని చేస్తాయి?

  8. సముద్రగర్భంలో 1600 అడుగుల లోతున 76 గంటల పాటు చిక్కుకున్న ఇద్దరు నావికుల కథ.. 12 నిమిషాలలో ఆక్సిజన్ అయిపోతుందనగా ఎలా బయటపడ్డారంటే

  9. టైటానిక్ మునిగిపోయిన చోట సముద్రం ఎందుకంత ప్రమాదకరంగా ఉంటుంది?

  10. బైడెన్, మోదీకి ఇచ్చిన విందులో ఏమేమి పదార్థాలు ఉన్నాయంటే..

    మోదీకి ఇచ్చిన విందు

    ఫొటో సోర్స్, EPA-EFE/REX/Shutterstock

    ప్రధాని నరేంద్ర మోదీ కోసం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆయన భార్య జిల్ బైడెన్ వైట్ హౌస్‌లో నిన్న రాత్రి ప్రత్యేక విందు ఏర్పాటుచేశారు.

    భారత జాతీయ పక్షి నెమలి థీమ్‌తో విందు ఏర్పాట్లు చేసినట్టు వైట్ హౌస్ తెలిపింది.

    చిరుధాన్యాలను ప్రోత్సహించాలనే ప్రధాని మోదీ పిలుపుతో విందులో మిల్లెట్స్‌తో చేసిన పదార్థాలను జతచేశారు. పూర్తి శాకాహార విందును సిద్ధంచేశారు.

    స్టార్టర్స్‌లో మారినేటెడ్ మిల్లెట్స్, గ్రిల్డ్ కార్న్ కెర్నల్ సలాడ్, కంప్రెస్డ్ వాటర్ మెలన్, ట్యాంగీ అవోకాడో సాస్ ఉన్నాయి.

    మెయిన్ కోర్స్‌లో స్టఫ్డ్ పోర్టోబెలో మష్రూమ్, క్రీమీ సాఫ్రన్-ఇన్ఫ్యూజ్డ్ రిసోటో, సుమాక్-రోస్టెడ్ సీ బాస్, లెమన్-డిల్ యోగర్ట్ సాస్, క్రిస్పీ మిల్లెట్ కేక్, సమ్మర్ స్క్వాష్ ఉన్నాయి.

    డెజర్ట్‌లో గులాబీలు, ఏలకులతో కూడిన స్ట్రాబెర్రీ షార్ట్‌కేక్ పెట్టారు.

    ప్రముఖ షెఫ్ నీనా కర్టిస్‌

    ఫొటో సోర్స్, EPA-EFE/REX/Shutterstock

    ఈ ప్రత్యేక విందును తయారుచేసే బాధ్యతలను ప్రముఖ షెఫ్ నీనా కర్టిస్‌కు అప్పగించినట్లు జిల్ బైడెన్ తెలిపారు.

    భారతీయ సంగీతాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక సంగీత కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు.

  11. ‘ఆక్సిజన్ అయిపోతుంటే కార్బన్ డయాక్సైడ్ రక్తంలో చేరి హైపర్‌కాప్నియాతో స్పృహ కోల్పోతారు’

  12. టైటానిక్: 111 ఏళ్ల కిందట మునిగిపోయిన ఈ ఓడలోని 700 మంది ప్రాణాలను ఆ రేడియో ఎలా కాపాడిందంటే...

  13. తెలంగాణ: కేసీఆర్ లక్ష్యం మారిందా? బీజేపీని వదిలి కాంగ్రెస్‌పై విమర్శలు చేయడం వెనుక కారణం ఏమిటి

  14. తెలంగాణ ‘అమరుల’ స్మారకం: 3 ఎకరాల ప్రాంగణంలో ‘త్యాగాల దివ్వె’.. 150 అడుగుల స్మారకం, 26 అడుగుల దీపం

  15. చైనాలో ఎల్‌పీజీ గ్యాస్ లీక్ కారణంగా భారీ పేలుడు... 31 మంది మృతి

    షీ జిన్‌పింగ్

    ఫొటో సోర్స్, ReutersCopyright

    చైనాలో వాయువ్య ప్రాంతంలో ఉన్న నింగాషియా నగరంలో బుధవారం రాత్రి భారీ గ్యాస్ పేలుడు సంభవించింది. ఇందులో ఇప్పటివరకు 31 మంది మరణించినట్లు రిపోర్టులు వస్తున్నాయి.

    ఒక బార్బిక్యూ రెస్టారెంట్‌లో ఈ ఘటన జరిగినట్లు రాయిటర్స్ తెలిపింది.

    చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఈ ఘటనపై స్పందిస్తూ, రెస్టారెంట్ల వంటి ప్రదేశాల్లో భద్రతా ఏర్పాట్లు మరింత కట్టుదిట్టంగా ఉండాలని ఆదేశించినట్లు చైనా ప్రభుత్వ మీడియా షిన్‌హువా న్యూస్ ఏజెన్సీ తెలిపిందని రాయిటర్స్ పేర్కొంది.

    ఎల్‌పీజీ గ్యాస్ ట్యాంక్‌లో లీకేజీ కారణంగా పేలుడు జరిగిందని షిన్‌హువా తెలిపింది. ఈ పేలుడులో ఏడుగురికి గాయాలయ్యాయి. వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

  16. వాషింగ్టన్ చేరుకున్న ప్రధాని మోదీ.. నేడు బైడెన్‌తో సమావేశం

    వాషింగ్టన్ చేరుకున్న ప్రధాని మోదీ

    ఫొటో సోర్స్, EPA-EFE/REX/Shutterstock

    భారత ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా వాషింగ్టన్ చేరుకున్నారు. అక్కడ ఆయనకు గౌరవసూచకంగా గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చారు.

    దీని తరువాత, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆయన భార్య జిల్ బైడెన్ వైట్ హౌస్‌లో విందును ఏర్పాటు చేశారు.

    మోదీకి ఇది తొలి అధికారిక పర్యటన. నేడు మోదీ, బైడెన్‌ల సమావేశం ఉంటుంది. అలాగే, మోదీ అమెరికా పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

    నిన్న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు.

    ఈ కార్యక్రమంలో ఐరాస అధికారులు, దౌత్యవేత్తలు సహా చాలామంది ప్రముఖులు పాల్గొన్నారు.

  17. పారిస్‌లో పేలుడు.. సుమారు 40 మందికి గాయాలు

    పారిస్‌లో పేలుడు

    ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో రూ సెయింట్-జాక్వెస్‌లో ఉన్న ఒక డిజైన్ స్కూల్, క్యాథలిక్ విద్యా వ్యవస్థ ప్రధాన కార్యాలయం ఉన్న భవనంలో పేలుడు జరిగింది.

    సుమారు 40 మంది గాయపడ్డారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.

    ఇద్దరి ఆచూకీ తెలియడంలేదు. సహాయక సిబ్బంది వారి కోసం భవనం శిథిలాల మధ్య గాలిస్తున్నారు.

    పేలుడుకు ముందు గ్యాస్ వాసన బాగా వచ్చిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు.

    పేలుడుకు కారణాలు ఇంకా తెలియలేదని, మంటలను అదుపులోకి తెచ్చామని అధికారులు తెలిపారు.

  18. అమెరికా : ఇందిరాగాంధీని రిచర్డ్ నిక్సన్ ‘ముసలి మంత్రగత్తె’ అని ఎందుకు కామెంట్ చేశారు?