పిల్లల కోసం బైక్‌నే లైబ్రరీగా మార్చేశారు
రోజులో ఎక్కువ సమయం మెబైల్ ఫోన్లకే అతుక్కుపోతున్న నేటి తరానికి తిరిగి పుస్తకాన్ని పరిచయం చేయడానికంటూ విజయనగరం జిల్లాలో మొబైల్ లైబ్రరీ నిర్వహిస్తున్నారు రెడ్డి రమణ.
తన బైక్‌నే లైబ్రరీగా మార్చేసి, ఊరురా తిరుగుతూ పిల్లలకు, పెద్దలకు వివిధ అంశాలకు చెందిన పుస్తకాలను ఇస్తారు. వాటిని వారితో చదివించి, అందులోని అంశాలను వివరిస్తుంటారు.
ఆశయ యూత్ అసోసియేషన్ పేరుతో ఇలా వారానికి రెండు రోజులు బైక్ లైబ్రరీతో వివిధ గ్రామాల్లో పర్యటనలు చేస్తుంటారు రెడ్డి రమణ.
ఒక ప్రైవేటు కాలేజ్‌లో రికార్డ్ అసిస్టెంట్ గా పని చేస్తున్న రెడ్డి రమణ 2005లో చీపురుపల్లిలో
ఒక చిన్న గ్రంధాలయాన్ని ప్రారంభించారు.
కొద్ది కాలానికి మొబైల్ వినియోగం పెరగడంతో, గ్రంథాలయాలకు ఆదరణ తగ్గుతూ వచ్చింది.
దీంతో ఈ మొబైల్ బైక్ లైబ్రరీని ప్రారంభించారు.
ప్రస్తుతం చాలా గ్రామాల్లో లైబ్రరీలు లేవు.

ఇవి కూడా చదవండి:
- చంద్రబాబు కేబినెట్లో పవన్ కల్యాణ్, నారా లోకేశ్, ఇంకా ఎవరెవరు అంటే..
- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు, మంత్రిగా పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం
- టీడీపీ, వైసీపీ మధ్య ఓట్ల తేడా ఎంత? అది ఫలితాలను ఎలా మార్చేసింది?
- ఆంధ్రప్రదేశ్ మంత్రి పవన్ కల్యాణ్: రాష్ట్ర రాజకీయాలను ఎలా మలుపు తిప్పారంటే..
- భాష తెలియని మహిళను మానసిక రోగి అనుకుని 12 ఏళ్లు అమెరికాలోని ఆసుపత్రిలో ఉంచేశారు, బయటపడ్డాక నష్టపరిహారం వస్తే అదీ దోచేశారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















