ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు, మంత్రిగా పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం

చంద్రబాబు, పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, మంత్రిగా కొణిదెల పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. వారితో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు.

గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్కులో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు.

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, విశ్రాంత చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సినీ నటులు చిరంజీవి, రజనీకాంత్ సహా అనేక మంది ప్రముఖులు వచ్చారు.

పవన్‌ కల్యాణ్‌తో పాటు మరో 23 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

మంత్రులు వీరే..

  • నారా లోకేశ్
  • కింజరాపు అచ్చెన్నాయుడు
  • కొల్లు రవీంద్ర
  • నాదెండ్ల మనోహర్
  • పొంగూరు నారాయణ
  • అనిత వంగలపూడి
  • సత్యకుమార్ యాదవ్
  • డాక్టర్ నిమ్మల రామానాయుడు
  • ఎన్‌ఎండీ ఫరూఖ్
  • ఆనం రామనారాయణ రెడ్డి
  • పయ్యావుల కేశవ్
  • అనగాని సత్యప్రసాద్
  • కొలుసు పార్థసారథి
  • డాక్టర్ డోలా బాల వీరాంజనేయస్వామి
  • గొట్టిపాటి రవికుమార్
  • కందుల దుర్గేష్
  • గుమ్మడి సంధ్యారాణి
  • బీసీ జనార్థన రెడ్డి
  • టీ.జీ. భరత్
  • ఎస్. సవిత
  • వాసంశెట్టి సుభాష్
  • కొండపల్లి శ్రీనివాస్
  • మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
వాట్సాప్ చానల్