రామ్మోహన్ నాయుడికి పౌర విమానయానం, కిషన్ రెడ్డికి గనులు-బొగ్గు శాఖ.. మోదీ మంత్రివర్గంలో ఎవరికి ఏ శాఖ అంటే

ఫొటో సోర్స్, facebook
ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గంలో చోటు సంపాదించుకున్న తెలుగు నేతలకు శాఖలు కేటాయించారు.
వారితో పాటు మోదీ టీంలోని కేబినెట్ మంత్రులు, సహాయ మంత్రులు అందరికీ శాఖలు కేటాయించారు.
ఆదివారం మోదీ సహా మొత్తం 72 మంది రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రమాణం చేశారరు.
బీజేపీతో పాటు ఎన్డీయేలోని ఇతర పార్టీలకు చెందిన నాయకులకూ మంత్రి పదవులు దక్కాయి.
తాజాగా జరిపిన శాఖల కేటాయింపులో కీలక మంత్రిత్వ శాఖలు బీజేపీ మంత్రులకే కేటాయించారు.


ఫొటో సోర్స్, ANI
క్యాబినెట్ మంత్రుల శాఖలు
- అమిత్ షా - హోం శాఖ
- రాజ్‌నాథ్ సింగ్ - రక్షణ శాఖ
- నితిన్ గడ్కరీ - రోడ్డు రవాణా, జాతీయ రహదారులు
- జేపీ నడ్డా - ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం
- నిర్మలా సీతారామన్ - ఆర్థిక శాఖ
- ఎస్.జైశంకర్ - విదేశీ వ్యవహారాల శాఖ
- శివరాజ్‌సింగ్ చౌహాన్ – వ్యవసాయం, రైతుల సంక్షేమం, గ్రామీణాభివృద్ధి
- మనోహర్‌లాల్ ఖట్టర్ - విద్యుత్, గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాలు
- హెచ్‌డీ కుమారస్వామి - ఉక్కు, భారీ పరిశ్రమలు
- పీయూష్ గోయల్ - పరిశ్రమలు, వాణిజ్యం
- ధర్మేంద్ర ప్రదాన్ - విద్యాశాఖ
- జీతన్ రామ్ మాంఝీ - సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు
- రాజీవ్ రంజన్ సింగ్ (లలన్ సింగ్) - పంచాయతీరాజ్, మత్స్య, పశుసంవర్థక, డెయిరీ
- సర్వానంద సోనోవాల్ - ఓడరేవులు, షిప్పింగ్
- డాక్టర్ వీరేంద్ర కుమార్ - సామాజిక న్యాయం, సాధికారత
- కింజరాపు రామ్మోహన్ నాయుడు - పౌర విమానయానం
- ప్రహ్లాద్ జోషి - వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, పౌరసరఫరాలు, పునరుత్పాదక ఇంధన వనరులు
- జుయెల్ ఒరామ్ - గిరిజన వ్యవహారాలు
- గిరిరాజ్ సింగ్ - టెక్స్‌టైల్స్
- అశ్విని వైష్ణవ్ - రైల్వే, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్
- జ్యోతిరాదిత్య సింధియా - కమ్యూనికేషన్స్, ఈశాన్య రాష్ట్ర వ్యవహారాలు
- అన్నపూర్ణ దేవి - మహిళా, శిశుసంక్షేమం
- గజేంద్రసింగ్ షెకావత్ - సాంస్కృతిక, పర్యటక
- కిరెన్ రిజిజు - పార్లమెంటరీ వ్యవహారాలు
- భూపేందర్ యాదవ్ - పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పులు
- హర్దీప్ సింగ్ పూరి - పెట్రోలియం, నేచురల్ గ్యాస్
- జి.కిషన్ రెడ్డి - బొగ్గు, గనులు
- డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ - ఉపాధి, కార్మిక, యువజన వ్యవహారాలు, క్రీడలు
- చిరాగ్ పాశ్వాన్ - ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్
- సీఆర్ పాటిల్ - జలశక్తి

ఫొటో సోర్స్, Arjun Ram Meghwal/facebook
కేంద్ర సహాయ మంత్రి (స్వతంత్ర హోదా)
- ఇంద్రజీత్ సింగ్ - స్టాటిస్టిక్స్, ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ; ప్రణాళికా శాఖ; సాంస్కృతిక (సహాయ) శాఖ.
- డాక్టర్ జితేందర్ సింగ్ - సైన్స్ అండ్ టెక్నాలజీ; ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ ; సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు మంత్రిత్వ (సహాయ) శాఖ; అటామిక్ ఎనర్జీ శాఖ; అంతరిక్ష శాఖ, ప్రధాన మంత్రి కార్యాలయం.
- అర్జున్‌రామ్ మేఘ్‌వాల్ – చట్టం, న్యాయ మంత్రిత్వ శాఖ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ (సహాయ) శాఖ.
- ప్రతాప్‌రావ్ గణపతిరావ్ జాదవ్ – ఆయుష్ మంత్రిత్వ శాఖ ; ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ (సహాయ) శాఖ.
- జయంత్ చౌధురి – నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ; విద్యా మంత్రిత్వ (సహాయ) శాఖ.

ఫొటో సోర్స్, pemmasani chandrasekhar
సహాయ మంత్రులు
- చంద్రశేఖర్ పెమ్మసాని – గ్రామీణాభివృద్ధి; కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ.
- భూపతిరాజు శ్రీనివాస వర్మ - ఉక్కు, భారీ పరిశ్రమలు.
- బండి సంజయ్ కుమార్ – హోం మంత్రిత్వ శాఖ
- జితిన్ ప్రసాద్ – పరిశ్రమలు, వాణిజ్యం; ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
- శ్రీపాద్ నాయక్ - విద్యుత్; పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ
- పంకజ్ చౌధురి - ఆర్థిక
- క్రిషన్ పాల్ - సహకార
- రాందాస్ అఠౌలే - సామాజిక న్యాయం, సాధికారత.
- రామ్‌నాథ్ ఠాకూర్ - వ్యవసాయం , రైతుల సంక్షేమం.
- నిత్యానంద్ రాయ్ - హోం మంత్రిత్వ శాఖ
- అనుప్రియా పటేల్ - ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం; రసాయనాలు, ఎరువులు
- వి.సోమన్న – జల శక్తి, రైల్వేలు
- ఎస్పీ సింగ్ బఘేల్ -ఫిషరీస్, పశుసంవర్థక, పాడి పరిశ్రమ; పంచాయితీ రాజ్
- శోభా కరంద్‌లాజె - సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు; కార్మిక, ఉపాధి
- కీర్తివర్ధన్ సింగ్ - పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పులు ; విదేశీ వ్యవహారాలు
- బీఎల్ వర్మ - వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, పౌర సరఫరాలు ; సామాజిక న్యాయం, సాధికారత
- శంతను ఠాకూర్ - ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాలు.
- సురేశ్ గోపీ – పెట్రోలియం, సహజ వాయువు ; టూరిజం
- డాక్టర్ ఎల్ మురుగన్ – సమాచార ప్రసార శాఖ, ; పార్లమెంటరీ వ్యవహారాలు
- అజయ్ టంటా - రోడ్డు రవాణా, రహదారులు
- కమలేశ్ పాశ్వాన్ - గ్రామీణాభివృద్ధి.
- భాగీరథ్ చౌధురి - వ్యవసాయం, రైతుల సంక్షేమం
- సతీశ్‌చంద్ర దూబే - బొగ్గు; గనులు
- సంజయ్ సేథ్ - రక్షణ
- రవ్‌నీత్ సింగ్ బిట్టు - ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ; రైల్వేలు
- దుర్గా దాస్ ఉయికే - గిరిజన వ్యవహారాలు
- రక్షా నిఖిల్ ఖడ్సే - యువజన వ్యవహారాలు, క్రీడలు
- సుకాంత్ మజుందార్ – ఎడ్యుకేషన్ ; ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి
- సావిత్రి ఠాకూర్ – స్త్రీ, శిశు సంక్షేమ
- తోఖన్ సాహు - గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాలు
- డాక్టర్ రాజ్‌భూషణ్ చౌధురి - జల శక్తి
- హర్ష్ మల్హోత్రా - కార్పొరేట్ వ్యవహారాలు ; రోడ్డు రవాణా, రహదారులు
- నీమూబెన్ - వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, పౌర సరఫరాలు
- మురళీధర్ మోహోల్ – సహకారం, పౌర విమానయాన
- జార్జి కురియన్ - మైనారిటీ వ్యవహారాలు ; ఫిషరీస్, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ
- పవిత్ర మార్గరిటా - విదేశీ వ్యవహారాలు ; జౌళి మంత్రిత్వ శాఖ
ఇవి కూడా చదవండి:
- 2024 ఎన్నికలు: తీహార్ జైలు ఖైదీ ఒక రాష్ట్ర మాజీ సీఎంను ఓడించారు... ఇలాంటి విశేషాలు ఇంకా ఎన్నంటే...
- ఆంధ్రప్రదేశ్: చంద్రబాబు, పవన్, జగన్‌ల కంటే భారీ మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరంటే..
- తెలంగాణ: ఒక్క సీటూ గెలవని బీఆర్ఎస్, ఎన్నికలకు ముందే ఆశలు వదిలేశారా
- కంగనాపై దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ మహిళా జవాన్ ఎవరు, ఎయిర్ పోర్టులో అసలేం జరిగింది?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










