ఇజ్రాయెల్ మీద ఇరాన్‌ దాడికి దిగుతుందా... ఆ రెండు దేశాలకు వెళ్ళవద్దంటూ అమెరికా, భారత్ వంటి దేశాలు ఎందుకు తమ పౌరుల్ని హెచ్చరిస్తున్నాయి?

ఇజ్రాయెల్ గాజా

ఫొటో సోర్స్, REUTERS/IBRAHEEM ABU MUSTAFA/FILE PHOTO

    • రచయిత, క్రిస్టీ కూనీ
    • హోదా, బీబీసీ న్యూస్

సిరియాలోని ఇరాన్ దౌత్య కార్యాలయంపై దాడి తర్వాత టెహ్రాన్ ఏ క్షణంలోనైనా ఇజ్రాయెల్‌పై దాడి చేస్తుందనే సంకేతాల నేపథ్యంలో భారత్, అమెరికాతో పాటు ఇతర యూరప్ దేశాలు తమ పౌరులకు ప్రయాణ హెచ్చరికలు జారీ చేశాయి.

తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంతవరకు ఇరాన్, ఇజ్రాయెల్‌ దేశాలకు వెళ్లొద్దని భారత పౌరులను విదేశీ మంత్రిత్వ శాఖ కోరింది.

‘‘ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా, తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంతవరకు భారత పౌరులు ఇరాన్, ఇజ్రాయెల్‌ దేశాలకు ప్రయాణించకూడదు’’ అని భారత విదేశీ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనను విడుదల చేసింది.

‘‘ఇప్పటికే ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల్లో ఉన్న భారతీయులు అక్కడి భారత దౌత్య కార్యాలయాన్ని సంప్రదించి, తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవాలి. భద్రతను దృష్టిలో పెట్టుకొని, సాధ్యమైనంత మేరకు బయటకు రావడం తగ్గించుకోవాలి’’ అని ప్రకటనలో విజ్ఞప్తి చేసింది.

ఇజ్రాయెల్‌లో ఉన్న భారత ఎంబసీ కూడా ఈ పరిస్థితుల్లో అనవసర ప్రయాణాలు చేయొద్దంటూ భారతీయులకు సూచించింది.

అమెరికా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇజ్రాయెల్‌పై దాడి చేయొద్దంటూ ఇరాన్‌ను జో బైడెన్ హెచ్చరించారు

అమెరికా ఏం చెప్పింది?

అమెరికా కూడా ఇజ్రాయెల్‌లో ఉన్న తమ దౌత్యవేత్తలకు ప్రయాణ ఆంక్షలు విధించింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా జెరూసలేం, టెల్ అవీవ్, బీర్‌షోబా ప్రాంతాల వెలుపల ప్రయాణించవద్దని తమ దౌత్యవేత్తలను కోరినట్లు అమెరికా ఎంబసీ వెల్లడించింది.

సిరియా రాజధాని దమాస్కస్‌లోని తమ దేశ దౌత్య కార్యాలయంపై ఇజ్రాయెల్ చేసిన దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఏప్రిల్ 1న ఇరాన్ హెచ్చరించింది.

ఈ దాడిలో ఇరాన్ సీనియర్ కమాండర్‌తో పాటు 13 మంది చనిపోయారు. త్వరలోనే ఇరాన్ ప్రతిదాడి చేసే అవకాశం ఉందని సీబీఎస్ న్యూస్‌తో ఇద్దరు అమెరికా అధికారులు అన్నారు.

తమకు అందిన సమాచారం ప్రకారం, 100 కన్నా ఎక్కువ డ్రోన్లు, డజన్ల కొద్ది క్రూయిజ్ క్షిపణులు, ఇంకా చెప్పాలంటే బాలిస్టిక్ క్షిపణులతో ఇరాన్ దాడి చేసే అవకాశం ఉందని అమెరికా అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.

ఇజ్రాయెల్‌లోని సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ ఈ ఆయుధాలను ఉపయోగించవచ్చని అమెరికా అధికారులు అభిప్రాయపడ్డారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

హమాస్, హిజ్బొల్లా

దమాస్కస్‌లోని ఇరాన్ దౌత్యకార్యాలయంపై ఏప్రిల్ 1న జరిగిన దాడికి ఇజ్రాయెల్ బాధ్యత వహించలేదు. అయితే, ఈ దాడి వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉందని చెబుతున్నారు.

ఇరాన్‌ను హమాస్‌కు మద్దతుదారుగా పరిగణిస్తారు. గాజాలో ఇజ్రాయెల్‌తో పోరాడుతోన్న పాలస్తీనా సాయుధ సమూహం హమాస్.

గాజాలో హమాస్, లెబనాన్‌లో హిజ్బొల్లా వంటి సాయుధ సమూహాలు ఇజ్రాయెల్ స్థావరాల మీద తరచుగా దాడులు చేస్తుంటాయి.

ఇరాన్ దౌత్యకార్యాలయంపై జరిగిన దాడిలో మరణించిన వారిలో సిరియా, లెబనాన్‌లోని ఇరాన్‌ ఎలైట్ ఖుద్స్ ఫోర్స్‌కు చెందిన ఒక సీనియర్ కమాండర్‌తో పాటు ఇతర సైనికాధికారులు కూడా ఉన్నారు.

గాజా యుద్ధం మధ్యప్రాచ్యం అంతటికీ వ్యాపించకుండా ప్రపంచస్థాయిలో దౌత్య ప్రయత్నాలు జరుగుతున్న వేళ ఇరాన్ కాన్సులేట్ మీద ఈ దాడి జరిగింది.

ఇరాన్ ఒక పెద్ద దాడి చేస్తామంటూ బెదిరిస్తోందని బుధవారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు. ఏ పరిస్థితుల్లోనైనా ఇజ్రాయెల్ వెంటే ఉంటామని ఆయన స్పష్టం చేశారు.

ఇజ్రాయెల్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, దమాస్కస్‌లో జరిగిన దాడికి ఇజ్రాయెల్ బాధ్యత వహించలేదు

అమెరికా అధికారి ఇజ్రాయెల్ పర్యటన

ఎలాంటి భద్రతా సవాలునైనా ఎదుర్కొనేందుకు తమ ప్రభుత్వం పూర్తి సన్నద్ధతతో ఉందని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు అన్నారు.

ఇజ్రాయెల్‌ను బాధపెట్టేవారికి తగు రీతిలో సమాధానం చెబుతామని ఆయన హెచ్చరించారు.

మధ్యప్రాచ్యంలో అమెరికా కార్యకలాపాల ఇన్‌చార్జ్ కమాండర్ ఎరిక్ కరెలా ఇటీవల ఇజ్రాయెల్‌లో పర్యటించి భద్రతా ముప్పుపై చర్చలు జరిపారు.

ఇజ్రాయెల్‌లో ఎరిక్ కరెలా పర్యటన షెడ్యూల్ గతంలోనే నిర్ణయమైందని, తాజా పరిస్థితుల రీత్యా రీషెడ్యూల్ చేసి, అనుకున్నసమయం కంటే ముందే పర్యటనను పూర్తి చేసినట్లు అమెరికా వెల్లడించింది.

బ్రిటన్ విదేశాంగ మంత్రి డేవిడ్ కామెరూన్

ఫొటో సోర్స్, REUTERS/YVES HERMAN

బ్రిటన్ ఫోన్

మరోవైపు, బ్రిటన్ విదేశీ మంత్రి డేవిడ్ కామెరూన్, ఇరాన్ విదేశీ మంత్రి హొస్సేన్ అమీర్ అబ్దుల్లాహియాన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. తాజా ఉద్రిక్తతలను తగ్గించాలని ఇరాన్‌ను కోరారు.

మధ్యప్రాచ్యాన్ని సంఘర్షణలోకి నెట్టడాన్ని మానుకోవాలని ఇరాన్‌కు స్పష్టం చేసినట్లు డేవిడ్ కామెరూన్ చెప్పారు. పరిస్థితిని సరిగ్గా విశ్లేషించకపోవడం మరింత హింసకు దారి తీస్తుందని అన్నారు.

మరింత ఉద్రిక్తతల వల్ల ఎవరికీ లాభం కలగదని చైనా, సౌదీఅరేబియా, తుర్కియే విదేశీ మంత్రులతో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ అన్నారు.

మధ్యప్రాచ్యంలో అమెరికా నిర్మాణాత్మక పాత్రను పోషించాలని చైనా కోరింది.

దమాస్కస్‌లోని ఇరాన్ దౌత్య కార్యాలయంపై దాడిని చైనా ఖండించింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

ఫ్రాన్స్ నిషేధం

ఫ్రాన్స్ విదేశాంగ శాఖ ట్విటర్‌లో తమ పౌరుల కోసం మార్గదర్శకాలను జారీ చేసింది. రాబోయే రోజుల్లో ఇరాన్, లెబనాన్, ఇజ్రాయెల్‌, పాలస్తీనాల్లో ప్రయాణించవద్దని తమ పౌరులను కోరింది.

ఇరాన్‌లో పనిచేస్తోన్న దౌత్యవేత్తల బంధువులు ఫ్రాన్స్‌కు తిరిగి రావాలని కోరింది.

అలాగే ఈ దేశాలకు ఫ్రాన్స్ దౌత్యవేత్తలు వెళ్లొద్దంటూ నిషేధించింది.

వీడియో క్యాప్షన్, ఇరాన్ విదేశాంగమంత్రితో యూరోపియన్ దేశాల నేతల ఫోన్ మంతనాలు

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)