దర్శి బస్సు ప్రమాదం - ప్రకాశం: సాగర్ కాలువలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ పెళ్లి బస్సు, ఏడుగురు మృతి.. ఈ ఘటన ఎలా జరిగింది?

దర్శి బస్సు ప్రమాదం
    • రచయిత, వడిశెట్టి శంకర్
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా దర్శి సమీపంలో ఓ పెళ్లి బస్సు నాగార్జున సాగర్ కాలువలోకి దూసుకెళ్లడంతో ఏడుగురు చనిపోయారు. వీరిలో ఒకరు ఆరేళ్ల చిన్నారి.

12 మంది గాయాలపాలయ్యారు.

ఇది ఏపీఎస్ఆర్టీసీకి చెందిన బస్సు.

సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ప్రమాదం జరిగింది.

ఘటనా సమయంలో బస్సులో 40 మంది పెళ్లివారు ఉన్నట్టు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.

దర్శి బస్సు ప్రమాదం

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, ప్రమాద స్థలంలో బస్సు
దర్శి బస్సుప్రమాదం

ఫొటో సోర్స్, UGC

కాకినాడకు పెళ్లి రిసెప్షన్‌కు వెళ్తుండగా...

ప్రకాశం జిల్లా పొదిలికి చెందిన కొందరు కాకినాడలో పెళ్లి రిసెప్షన్ కోసం ఆర్టీసీ బస్సును అద్దెకు తీసుకున్నారు.

బయలుదేరిన కొద్దిసేపటికే బస్సు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లినట్టు స్థానికులు చెబుతున్నారు.

మృతుల్లో అబ్దుల్ అజీజ్, అబ్దుల్ హనీ, షేక్ రమీజ్, నూర్జహాన్, జానీ బేగం, సబీనాతోపాటు ఆరేళ్ల హీనా ఉన్నారు.

గాయపడ్డ వారిని ఒంగోలు ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణాలపై విచారిస్తున్నామని బీబీసీకి దర్శి పోలీసులు చెప్పారు.

దర్శి బస్సు ప్రమాదం

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, ప్రకాశం జిల్లా దర్శిలో జరిగిన బస్సు ప్రమాద సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్న జిల్లా ఎస్పీ మల్లిక గర్గ్

బస్సు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి

ఆర్టీసీ పెళ్లి బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.

పొదిలి నుంచి కాకినాడకు పెళ్లిబృందంతో వెళ్తున్న బస్సు ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి పక్కనే ఉన్న ఎన్‌సీపీ కాల్వలో పడిపోయిందని, ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు.

ప్రమాదం జరిగిన స్థలానికి పోలీసు సిబ్బంది, ఇతర అధికారులు వెళ్లారని, సహాయ చర్యలు చేపట్టారని, క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించినట్లు అధికారులు వివరించారు.

ఈ ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్యసేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. మృతుల కుటుంబాలకు తోడుగా నిలవాలన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

దర్శి బస్సు ప్రమాదం
దర్శి బస్సు ప్రమాదం
దర్శి బస్సు ప్రమాదం
దర్శి బస్సు ప్రమాదం
దర్శి బస్సు ప్రమాదం

ఫొటో సోర్స్, UGC

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)