మొక్కలు, పూలు, కుండీల మాటున వచ్చే జంతువులతో ఎంత ప్రమాదమో తెలుసా?

పాములు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, యూరప్ ప్రధాన భూభాగంలో తరలించిన అలంకరణ మొక్కలలో కనిపించిన పాము
    • రచయిత, హెలెన్ బ్రిగ్స్
    • హోదా, బీబీసీ పర్యావరణ ప్రతినిధి

కప్పలు, బల్లులు, పాములు, సాలెపురుగులు, ఇతర క్రిమి కీటకాలను కోసిన పూలు, చిన్నచిన్న కుండీల్లో పెంచే చెట్ల ద్వారా ప్రపంచవ్యాప్తంగా రవాణా అవుతున్నాయని, వీటివల్ల ప్రకృతికి హాని కలుగుతుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు.

ఇలా తరలివస్తున్న జీవులలో...షెఫీల్డ్‌లోని ఒక పూల దుకాణంలో గులాబీ పూల నుంచి బయటపడ్డ కప్ప, యూరప్ ప్రధాన భూభాగంలో అలంకరణకు ఉపయోగించే ఆలివ్ మొక్కలలో పాములు దొరికాయి.

ఇలా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలివచ్చే జంతువులు, కీటకాలతో పంటలకు, గ్రామీణ ప్రాంతాల్లోని భూభాగానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పరిశోధకులు చెప్పారు.

మొక్కలకు, దుంపలకు, పూలకు ప్రపంచ మార్కెట్లలో బాగా డిమాండ్ ఉన్న సమయంలో, రవాణా ప్రమాణాలను తక్షణం మెరుగుపర్చాల్సిన అవసరం ఉందని వారు కోరుతున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
కప్పలు

ఫొటో సోర్స్, Els Fransen Ravon

ఫొటో క్యాప్షన్, నెదర్లాండ్స్‌కు తరలించిన మొక్కల కుండీలో ఇటాలియన్ వాల్ లిజార్డ్‌ను కనుగొన్నారు.

''ఇలా తరలి వచ్చే జీవుల్లో పాములు, బల్లులు కేవలం చిన్న భాగం మాత్రమే'' అని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ విల్లియం సదర్లాండ్ చెప్పారు. ఇవే ఇలా ఒకదేశం నుంచి మరో దేశానికి రాగలుగుతున్నప్పుడు ఇక చిన్నచిన్న కీటకాలు, ఫంగీలను గుర్తించే అవకాశం ఎంత?- అవి నిజంగా సమస్యలకు కారణం కావా? అని ప్రశ్నించారు.

భౌగోళికంగా ముఖ్యంగా తూర్పు ఆఫ్రికా, దక్షిణ అమెరికాలో అలంకరణ మొక్కల ఉత్పత్తి చాలా వేగంగా విస్తరించింది.

చట్టాలు, సరిహద్దుల్లో తనిఖీలు ఉంటున్నప్పటికీ..పెద్ద ఎత్తున సాగే పూలు, అలంకరణ మొక్కల వాణిజ్యంతో దాని ద్వారా వచ్చే క్రిమి కీటకాలను, వ్యాధులను అడ్డుకోవడం చాలా కష్టమని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ సిల్వియు పెట్రోవాన్ చెప్పారు.

కుండీల్లో మొక్కలు

ఫొటో సోర్స్, University of Cambridge

ఫొటో క్యాప్షన్, నెదర్లాండ్స్‌లో దిగుమతైన అలంకరణ మొక్కలలో యూరోప్‌లో తిరిగే పాములు, బల్లులను గుర్తించారు.

షెఫీల్డ్‌లో ఒక పూల దుకాణంలో బతికున్న కప్పను గుర్తించాలని ఒకసారి క్షీరదాల నిపుణుడిని పిలిచారు.

ఆయన దాన్ని ఫ్రాంక్ అనుకున్నారు. కానీ, నిజంగానే ఈక్వెడార్ మీదుగా కొలంబియా నుంచి వచ్చిన గులాబీల్లో ట్రీ-ఫ్రాగ్ (ఎక్కువ కాలం చెట్లపై పెరిగే కప్ప)ను గుర్తించి తాను షాకైనట్లు సదరు నిపుణుడు తెలిపారు.

బ్రిటన్‌లో కప్పలు, బల్లులు, క్రిమి కీటకాలు ప్రధానంగా ట్రాన్స్‌పోర్ట్ అవుతున్నాయి. యూరప్‌లో, ఎన్నో అరుదైన సరీసృపాలు, ఉభయచర జీవులు దొరుకుతున్నాయి.

కుండీల్లో పెంచే ఆలీవ్ మొక్కలలో గుర్తిస్తున్న జీవులు, జంతువులు..

  • బల్లులు, యూరోపియన్ భూభాగంలో ఉండే పలు రకాల పాములు
  • కప్పలు, కప్పలు మాదిరి ఉండే జీవులు
  • పెద్ద సంఖ్యలో క్రిమి కీటకాలు
బల్లులు

ఫొటో సోర్స్, Felix Verschoor Ravon

బయోసైన్స్ జర్నల్‌లో ప్రచురితమైన ఒక రీసర్చ్ పేపర్‌లో, 2017-18 మధ్య కాలంలో నెదర్లాండ్స్‌లో కస్టమ్ అధికారుల తనిఖీల్లో అలంకరణ మొక్కల్లో దొరికిన కీటకాల రికార్డులను ఒక టీమ్ పరిశీలించింది.

తమ పరిశీలనలను 2021-23లో యూకేలోని పర్యావరణం, ఆహారం, గ్రామీణ వ్యవహారాల విభాగానికి రిపోర్టు చేసింది.

ఉత్పత్తి ప్రమాణాలను మెరుగుపర్చాలని, వాణిజ్యంలో ఉన్న నిర్దిష్ట ప్రమాదాల డేటాను సేకరించి,షేర్ చేయాలని వారు కోరారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)