లండన్‌: భారత హైకమిషన్‌లో త్రివర్ణ పతాకాన్ని తొలగించేందుకు యత్నించిన అనుమానితుడి అరెస్ట్

భారత జాతీయ పతాకం

ఫొటో సోర్స్, Getty Images

బ్రిటన్ రాజధాని లండన్‌లో ఉన్న భారత హైకమిషన్ ప్రాంగణంలో గలాటా సృష్టించినందుకు గానూ ఒక అనుమానితుడిని అరెస్ట్ చేశారు.

దీనికంటే ముందు, ఖలిస్థాన్ జెండాలను పట్టుకున్న గుంపులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అందులోని ఒక వీడియోలో భారత హైకమిషన్ ప్రాంగణంలో ఉన్న భారత జాతీయ పతాకాన్ని ఒక వ్యక్తి కిందకు లాగేయడం కనిపిస్తోంది.

వెంటనే, అక్కడికి వచ్చిన భారత భద్రతా సిబ్బంది ఒకరు జెండా కింద పడకుండా చేతిలోకి లాక్కోవడం కూడా వీడియోల్లో చూడొచ్చు.

త్రివర్ణ పతాకాన్ని ఖలిస్థాన్ మద్దతుదారులు, వేర్పాటువాదులు తొలగించడానికి యత్నిస్తున్నట్లు చూపించే అనేక వీడియోలు బయటకు వచ్చాయి.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

ఈ ఘటన పట్ల భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

దిల్లీలోని బ్రిటిష్ సీనియర్ దౌత్యవేత్తకు ఈ మేరకు భారత్ సమన్లు పంపించింది.

లండన్‌లోని భారత హైకమిషన్ కార్యాలయానికి భద్రత లేకపోవడం గురించి ప్రశ్నిస్తూ ఆదివారం రాత్రి బ్రిటిష్ దౌత్యవేత్తకు భారత ప్రభుత్వం సమన్లు పంపించినట్లు వార్తా సంస్థ పీటీఐ తెలిపింది.

లండన్‌లోని భారత హైకమిషన్

ఫొటో సోర్స్, Google

భారత ఎంబసీ ప్రాంగణం, అక్కడ పనిచేస్తున్న వారి భద్రత పట్ల బ్రిటన్ ప్రభుత్వం ఉదాశీనంగా వ్యవహరించిందని, ఇది ఆమోదయోగ్యం కాదని భారత విదేశీ వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

భారత్‌లోని బ్రిటిష్ హై కమిషనర్ అలెక్స్ ఎలిస్ ప్రస్తుతం దిల్లీలో లేకపోవడంతో, డిప్యూటీ హై కమిషనర్ క్రిస్టియాన్ స్కాట్‌కు భారత విదేశీ వ్యవహారాల శాఖ నోటీసులు పంపినట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పీటీఐ తెలిపింది.

‘‘లండన్‌లోని భారత హైకమిషన్‌ పట్ల వేర్పాటువాదుల చర్యకు వ్యతిరేకంగా తీవ్ర నిరసనను తెలియజేస్తూ దిల్లీలో ఉన్న బ్రిటన్ హైకమిషనర్‌కు ఆదివారం రాత్రి నోటీసులు పంపించాం’’ అని విదేశాంగ కార్యాలయం ప్రకటనలో చెప్పింది.

భారత విదేశీ వ్యవహారాల శాఖ ఇచ్చిన నోటీసు

భారత హైకమిషన్‌కు తగిన భద్రతను కల్పించకపోవడం గురించి వివరణ ఇవ్వాలని యూకేను కోరినట్లు ఆ ప్రకటనలో తెలిపారు.

ఈ ఘటనలో ప్రమేయం ఉన్న వ్యక్తులను గుర్తించి, అరెస్ట్ చేయాలని కూడా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ డిమాండ్ చేసింది.

జనాలు పోగుకావడం చూసి లండన్‌లోని ఆల్డ్‌విచ్‌ ప్రాంతంలో ఆదివారం పోలీసులను మోహరించారు.

ఈ ఘటనలో ఇద్దరు భద్రతా సిబ్బంది గాయపడ్డారని, దీనిపై విచారణను ప్రారంభించామని మెట్రోపాలిటన్ పోలీసులు తెలిపారు.

వేర్పాటువాద సిక్కు గ్రూప్ అయిన ‘ఖలిస్థాన్’‌ మద్దతుదారులే భారత హైకమిషన్ వద్ద భారత జెండాను తొలగించడానికి ప్రయత్నించినట్లు వార్తా ఏజెన్సీ పీఏ చెప్పింది.

భారత కాలమానం ప్రకారం, ఆదివారం రాత్రి 7:30 గంటల సమయంలో అధికారులను భారత హైకమిషన్‌కు పిలిచారు.

‘‘భారత హైకమిషన్‌ కార్యాలయంలోని కిటికీలను విరగ్గొట్టారు. ఇద్దరు భద్రతా సిబ్బందికి స్వల్ప గాయాలు అయ్యాయి’’ అని ఒక పోలీస్ ప్రతినిధి చెప్పారు.

ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.

ఈ ఘటనను ఖండించిన లండన్ మేయర్ సాదిక్ ఖాన్, తమ నగరంలో ఇలాంటి చర్యలకు తావు లేదన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

అదే సమయంలో దిల్లీలోని బ్రిటిష్ హై కమిషనర్ అలెక్స్ ఎలిస్ కూడా ఒక ట్వీట్‌లో ఈ ఘటనను ఖండించారు.

ఇది ఒక అవమానకరమైన చర్య, దీన్ని ఏమాత్రం ఆమోదించలేమని వ్యాఖ్యానించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 3

యూకే మంత్రి తారిక్ అహ్మద్ కూడా మాట్లాడుతూ, ఈ ఘటనతో తనలో భయాన్ని కలిగించిందన్నారు. భారత హైకమిషన్ భద్రతను ప్రభుత్వం సీరియస్ అంశంగా తీసుకుంటుందని ఆశిస్తున్నానని చెప్పారు.

భారత హైకమిషన్, దాని సిబ్బంది పట్ల ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాని చర్య అని ఆయన వ్యాఖ్యానించారు.

వీడియో క్యాప్షన్, గురు గ్రంథ్ సాహిబ్‌లో ఏం ఉంటుంది? అది చదివేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)