జొమాటో: డెలివరీ బాయ్స్‌కు ఆకుపచ్చ రంగు యూనిఫామ్ ఎందుకు ఇచ్చారు, ఎందుకు తీసేశారు?

ఫొటో సోర్స్, @DEEPIGOYAL
శాకాహారం మాత్రమే కోరుకునే వారి కోసం ప్యూర్ వెజిటేరియన్ మోడ్ ప్రారంభిస్తున్నట్టు ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో ప్రకటించింది. కానీ కొన్ని గంటల్లోనే అందులో మార్పులు చేస్తున్నట్టు వెల్లడించింది.
ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో ప్యూర్ వెజిటేరియన్ మోడ్ లో మార్పులు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఆ సంస్థ సీఈఓ దీపేంద్ర గోయల్ ఓ ప్రకటన చేశారు.
అంతకుముందు శాకాహారుల కోసం కొత్త తరహా సేవలకు శ్రీకారం చుట్టినట్టు జొమాటో ప్రకటించింది. శాకాహారాన్ని మాత్రమే తీసుకునే కస్టమర్ల అభిరుచి మేరకు ఈ విధానాన్ని అమల్లోకి తీసుకువస్తున్నట్టు ప్రకటించింది. ఈ కస్టమర్లకు పూర్తి శాకాహార హోటళ్ళ నుంచి మాత్రమే ఆహారాన్ని అందిస్తామని కంపెనీ తెలిపింది.
అలాగే శాకాహారాన్ని అందించే డెలివరీ బాయ్స్ కూడా తమ సంప్రదాయ రెడ్ యూనిఫామ్ కు బదులుగా గ్రీన్ యూనిఫామ్ ధరిస్తారని ప్రకటించింది.
అయితే దీనిపై సామాజిక మాధ్యమాలలో విమర్శలు పెరగడంతో గ్రీన్ కలర్ యూనిఫామ్ ఆలోచనను వెనక్కు తీసుకుంటున్నట్టు ప్రకటించింది.
జొమాటో సహ వ్యవస్థాపకుడు, సీఈఓ దీపేంద్ర గోయల్ తొలుత తమ ‘ప్యూర్ వెజిటేరియన్ మోడ్’కు మంచి స్పందన వస్తోందని ప్రకటించారు. కానీ కేవలం 11 గంటల వ్యవధిలోనే ఇందులో మార్పులు చేస్తున్నట్టు తెలిపారు.
‘‘శాకాహారం డెలివరీ చేయడానికి ప్రత్యేకంగా జొమాటో డెలివరీ బాయ్స్‌ను కొనసాగిస్తాం. కానీ వారు గ్రీన్ యూనిఫామ్ కాకుండా జొమాటో సంప్రదాయ రెడ్ యూనిఫామ్ నే ధరిస్తారు. మా రెగ్యులర్, వెజిటేరియన్ డెలీవరీ బాయ్స్ అందరూ రెడ్ యూనిఫామే ధరిస్తారు అని దీపేంద్ర గోయల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
‘‘క్షేత్రస్థాయిలో వెజిటేరియన్ డెలివరీ ఏజెంట్స్ మిగతా డెలివరీ ఏజెంట్ల నుంచి వేరుగా కనిపించరు. కానీ ఖాతాదారుడికి మాత్రం తన యాప్‌లో తాను ఆర్డర్ చేసిన శాకాహారాన్ని డెలీవరీ చేస్తున్నది ‘ప్యూర్ వెజిటేరియన్ డెలివరీ బాయ్ ’ అనే విషయం తెలుస్తుంది.
‘‘మేము మా రైడర్ల భద్రతకు ప్రాధాన్యమిస్తాం. రెడ్ యూనిఫామ్ వేసుకున్న బాయ్స్ అందరూ నాన్ వెజ్ ఫుడ్‌ను డెలివరీ చేయరు. కాబట్టి వారిని ప్రత్యేక రోజులలో అపార్ట్‌మెంట్స్, సొసైటీల్లో అడ్డుకోకూడదు’’ అని తెలిపారు.
ప్రత్యేక యూనిఫామ్ కారణంగా మా ఏజెంట్లకు కూడా ప్రమాదమనే విషయాన్ని అర్థం చేసుకున్నామని ఆయన తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
గతంలోనూ వివాదాలు
ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్ బేస్డ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ (ఐఎఫ్ఏటి) అధ్యక్షుడు షేక్ సలాఉద్దీన్ ఇండియన్ ఎక్స్ ప్రెస్‌తో మాట్లాడుతూ ‘‘కిందటి సారి ఓ వ్యక్తి ఓ ప్రత్యేక మతానికి చెందిన వ్యక్తులను మాత్రమే ఫుడ్ డెలివరీకి పంపాలని జొమాటోను కోరితే, దానిపై దీపేంద్ర గోయల్ స్పందిస్తూ ఆహారానికి మతం లేదని జవాబు ఇచ్చారని, కానీ ఇప్పుడు ఆయన ఆ విషయంలో పునరాలోచనలో పడినట్టుగా కనిపిస్తోందని చెప్పారు. నేను గోయల్ ను సూటిగా ఒకటే అడగదలుచుకున్నాను. కులం, మతం ఆధారంగా జొమాటో తన డెలిరీ భాగస్వాములను విభజించాలనుకుంటోందా?’’అని ప్రశ్నించారు.
గతంలో కూడా జొమాటో ఒక యాడ్ విషయంలో వివాదంలో చిక్కుకుంది. ఈ ప్రకటనలో కచరా అనే దళితపాత్రను అవమానకరంగా చూపించారంటూ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ నోటీసులు కూడా జారీ చేసింది. తరువాత జొమాటో ఆ ప్రకటనను ఉపసంహరించుకుని, క్షమాపణలు చెప్పింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
సోషల్ మీడియాలో చర్చ
శాకాహారాన్ని మాత్రమే ఆర్డర్ చేసే జొమాటో ఖాతాదారుల కోసం ‘ప్యూర్ వెజిటేరియన్ మోడ్’ తీసుకువస్తున్నట్టు మంగళవారం ఆ సంస్థ సీఈఓ దీపేంద్ర గోయల్ ప్రకటించారు.
ఈ మోడ్‌లో ఆహారాన్ని అర్డర్ చేసేవారికి తమ యాప్‌లోని నాన్ వెజ్ రెస్టారెంట్లు కనిపించవని చెప్పారు.
‘‘పూర్తి శాకాహారాన్ని డెలివరీ చేసే బాయ్స్ ను కూడా మేం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నాం. వారు గ్రీన్ యూనిఫామ్ లో ఉంటారు. వారే ఈ ఆర్డర్లను తీసుకుని డెలివరీ చేస్తారు. ఇందుకోసం మేం ప్రత్యేకంగా గ్రీన్ కలర్ బాక్సులు ఏర్పాటు చేస్తున్నాం. దీనివల్ల ఒకే బాక్సులో నాన్ వెజ్, వెజిటేరియన్ ఫుడ్ డెలివరీ జరగదు. ’’ అని తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
అయితే దీనిపై సామాజిక మాధ్యమాలలో విమర్శలు వెల్లువెత్తాయి. శాకాహారులకు ‘ప్యూర్’ అనే ముద్ర వేయడం ద్వారా జొమాటో వివక్ష చూపుతోందంటూ నెటిజిన్లు విమర్శించారు.
ఈ నేపథ్యంలో గ్రీన్ యూనిఫామ్ ఆలోచన విరమించుకున్నట్టు జొమాటో చేసిన ప్రకటనపై ప్రశంసలు, విమర్శలు కూడా వచ్చాయి.
‘‘ఇలాంటి వివక్షను ఆపండి. ఈ పేరుతో ఇప్పటికే చాలా జరుగుతోంది. నేను పూర్తి మాంసాహారిని. శాకాహార ఆధిపత్య ఆలోచనను మానుకోండి’’ అంటూ రష్మిలత అనే యూజర్ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
ఆకాష్ షా అనే మరో యూజర్ స్పందిస్తూ ‘‘చాలామంది శాకాహారులు ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేయరు. ఇది వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. తన ఖాతాదారుల ఆలోచలను మన్నించే జొమాటోకు అభినందనలు’’ అని రాశారు.
మూడుసార్లు గ్రామీ అవార్డు గెలుచుకున్న రికీ కేజ్ గ్రీన్ యూనిఫామ్ ను ఉపసంహరించుకోవాలనే జొమాటో నిర్ణయాన్ని కొనియాడారు.
‘‘గ్రీన్ యూనిఫామ్‌ను ఉపసంహరించుకోవాలనే ఆలోచన మంచిది. కానీ వెజిటేరియన్ మోడ్ కొనసాగించాలి. ఇది చాలా ముఖ్యమైన ప్రశంసించదగ్గ సేవ.’’ అని రాశారు.
జొమాటో గ్రీన్ యూనిఫామ్ ఆలోచనను ఉపసంహరించుకుంది. కానీ ప్యూర్ వెజ్ మోడ్ మాత్రం కొనసాగుతుంది. అయితే దీనిపై చర్చ మాత్రం ఇంకా కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి:
- మనిషి మెదడులోకి పురుగులు ఎలా వస్తాయి?
- ఫ్రామౌరో: మతం కాదు, సైన్స్ ఆధారంగా తొలి ప్రపంచ పటాన్ని చిత్రించిన సన్యాసి... గడప దాటకుండానే ఆయన ఈ అధ్భుతాన్ని ఎలా సాధించారు?
- 'కలుపు దెయ్యాల'ను 141 ఏళ్ల కిందట భూమిలో పాతిపెట్టినా చావలేదు... అవి ఇలాఎంతకాలం జీవిస్తాయి?
- జింకల్లో కొత్త జాతి గుర్తింపు.. ఇది ఎక్కడ ఉంది?
- సీఏఏ: పౌరసత్వ సవరణ చట్టం అమలుకు నిబంధనలను విడుదల చేసిన కేంద్రం, దీనివల్ల ఏం జరుగుతుంది?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














