ఒకప్పుడు సైకిల్ తొక్కేందుకే భయపడిన మహిళ ఇప్పుడు జేసీబీ నడుపుతున్నారు

వీడియో క్యాప్షన్, మెరుగైన జీవితం కోసం పోరాటంలో భాగం

అంగల ఈశ్వరి.. ఒకప్పుడు సైకిల్ తొక్కాలంటేనే ఈమె భయపడేవారు.

బైకు మీద రోడ్డు దాటాలన్నా కంగారుపడేవారు. కానీ ఇప్పుడు అలవోకగా జేసీబీ నడుపుతున్నారు.

‘‘దీన్ని మొదటిసారి చెన్నైలో చూశాను. మొదట్లో దాని దగ్గరకు వెళ్లొద్దని చెప్పేవారు. దూరంగా ఉండి అదెలా పని చేస్తుందో చూసేదాన్ని. తర్వాత ట్రైనింగ్ తీసుకున్నాను. మెషీన్ ఆపరేట్ చేసేటపుడు జాగ్రత్తగా ఉండాలని చెప్పేవాళ్లు. వాళ్లు నాకు నేర్పిన మొదటి పాఠం ఇదే. జేసీబీని బయటి నుంచి చూస్తున్నపుడు భయమేసేది. కానీ డ్రైవర్ సీటులో కూర్చున్నాక నాలో ఉన్న ఆసక్తి ఆ భయాన్ని పోగొట్టింది’’ అన్నారు ఈశ్వరి

అంగల ఈశ్వరి

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)