ఐపీఎల్ 2023: పరుగుల వర్షం, రికార్డుల మోత... చరిత్రలో నిలిచిపోయేలా లక్నోVs. పంజాబ్ మ్యాచ్

ఫొటో సోర్స్, ANI
- రచయిత, అభిజీత్ శ్రీవాస్తవ
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఐపీఎల్ 2023: శుక్రవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాళ్లు రికార్డుల మోత మోగించారు. దీంతో ఐపీఎల్ టోర్నమెంట్ చరిత్రలోనే 257 పరుగులతో రెండో అత్యధిక స్కోర్‌ను నమోదు చేసింది లక్నో సూపర్ జెయింట్స్.
లక్నో నిర్దేశించిన ఈ భారీ లక్ష్యాన్ని చేధించలేక, పంజాబ్ కింగ్స్ టీమ్ 56 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
సరిగ్గా పదేళ్ల క్రితం అంటే 2013లో ఐపీఎల్‌లో ఇలాంటి ఇన్నింగ్సే నమోదయ్యాయి.
ఆ ఇన్నింగ్స్ ఇంకా ఐపీఎల్ రికార్డు బుక్‌లలో చెక్కు చెదరని స్థానాన్ని పదిలం చేసుకున్నాయి.
క్రిస్ గేల్ ఇన్నింగ్స్ 175 నాటౌట్ మీకు గుర్తుండే ఉంటుంది.
ఆ మ్యాచ్‌లో క్రిస్ గేల్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ఇండివిడ్యువల్ స్కోర్ చేయడమే కాకుండా, ఆయన ఏకంగా 17 సిక్స్‌లను కొట్టారు. ఇన్నింగ్స్‌లో ఒక బ్యాటర్ అత్యధిక సిక్స్‌లను కొట్టిన ఘనత ఇంకా క్రిస్ గేల్‌కే ఉంది.
ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా సెంచరీని పూర్తి చేసిన పేరును కూడా గేల్ ఆ సమయంలో దక్కించుకున్నారు.
30 బాల్స్‌లోనే గేల్ సెంచరీ కొట్టడంతో ఐపీఎల్ రికార్డు బుక్స్‌లో ఇంకా ఆయన పేరు మారు మోగుతోంది.
గేల్, డీ విలియర్స్ చెలరేగడంతో ఆ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 263 పరుగుల స్కోర్ చేసింది.
ఐపీఎల్ ఇదే అత్యధిక స్కోర్ రికార్డు. పదేళ్లుగా ఈ స్కోర్‌ను ఏ టీమ్ చేధించలేకపోయింది.
మొహాలిలో రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఎలా అయితే చెలరేగిందో, అదే మాదిరే కేఎల్ రాహుల్ టీమ్ కూడా ఆడింది.
లక్నో బ్యాటర్లు ఊహించని స్థాయిలో పరుగులు చేశారు. లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్ సమయంలో ప్రతి ఓవర్‌లో సుమారు 12 పరుగులు చేసి, ఇటు బౌలర్లకు, అటు ఫీల్డర్లకు చుక్కలు చూపించారు.
ఇక కామెంటరీ బాక్స్‌లో ఉన్న వ్యాఖ్యాతలు ఆశ్చర్యపోయేలా, పరుగుల సునామీ సృష్టించారు లక్నో బ్యాటర్లు.
ఇప్పటి వరకున్న ఐపీఎల్ రికార్డులేంటి?
ఐపీఎల్ మ్యాచ్‌లు 2008లో ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు వెయ్యికి పైగా మ్యాచ్‌లు ఆడారు.
కానీ, నిన్న జరిగిన ఈ మ్యాచ్ ఎన్నో ఏళ్ల పాటు గుర్తుండిపోతుంది. ఈ మ్యాచ్‌లో ఐపీఎల్ చరిత్రలో అరుదుగా కనిపించే రికార్డులను నెలకొల్పారు ఆటగాళ్లు.
తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింగ్స్ 257 పరుగులు చేసింది. ఈ ఐపీఎల్ సీజన్‌లో ఇదే అత్యధిక స్కోర్. ఐపీఎల్ చరిత్రలో ఇది రెండో అతిపెద్ద స్కోర్.
2013లో పూణే వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లి నాయకత్వంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 263 పరుగులతో అత్యధిక స్కోర్ రికార్డును సంపాదించింది.
కేవలం ఆరు పరుగుల తేడాతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోర్‌ను ప్రస్తుతం లక్నో సూపర్ జెయింట్స్ మిస్ చేసుకుంది.
ఈ మ్యాచ్‌లో ఓటమి పాలైన పంజాబ్ టీమ్ కూడా 201 పరుగులు చేసింది. రెండు జట్లు కలిపి 458 పరుగులు చేశాయి.
ఒకే మ్యాచ్‌లో ఇరు టీమ్‌లు కలుపుకుని నమోదు చేసిన పరుగులు, ఐపీఎల్ చరిత్రలో మూడో అత్యధిక స్కోర్‌గా నిలిచాయి.
రెండు టీమ్‌లు కలుపుకుని అత్యధిక స్కోర్ చేసిన ఘనత 2010లో రికార్డయింది. రాజస్తాన్ రాయిల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ రికార్డును నెలకొల్పాయి.
ఈ సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ 246 పరుగులు చేస్తే, వారికి కౌంటర్‌గా రాజస్తాన్ రాయల్స్ 223 పరుగులు చేసింది.
ఈ రెండు జట్ల స్కోర్‌ను కలుపుకుంటే మొత్తంగా 469 పరుగులయ్యాయి.
ఆ తర్వాత పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్‌కి 2018లో జరిగిన మ్యాచ్‌లో ఇరు టీమ్‌ల స్కోర్ 459గా రికార్డయింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
లక్నో సూపర్ జెయింట్స్ Vs. పంజాబ్ కింగ్స్ రికార్డులు
లక్నో సూపర్ జెయింట్స్: 257/5
పంజాబ్ కింగ్స్: 201/10
ఈ సీజన్‌లో అత్యధిక స్కోర్ చేసిన టీమ్‌గా లక్నో
ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యధిక స్కోర్ లక్నోదే.
మ్యాచ్‌లో మొత్తంగా 45 ఫోర్లు, 22 సిక్స్‌లు కొట్టిన ఆటగాళ్లు
ఇరు టీమ్‌లు కలుపుకుని 458 పరుగుల రికార్డు
ఐపీఎల్ చరిత్రలో సింగిల్ మ్యాచ్‌లో మూడో అత్యధిక స్కోర్
ఈ మ్యాచ్‌లో 9 మంది బౌలర్లను దించిన లక్నో

ఫొటో సోర్స్, Getty Images
తన రికార్డును బ్రేక్ చేసుకున్న స్టాయినిస్
మార్కస్ స్టాయినిస్ ఈ మ్యాచ్‌లో కేవలం 40 బంతుల్లోనే 72 పరుగులు చేశారు. అలాగే, బౌలింగ్ చేసే సమయంలో శిఖర్ ధావన్ ను అవుట్ చేశారు.
స్టాయినిస్‌కి ఈ మ్యాచ్‌లో అతిపెద్ద ఇండివిడ్యువల్ స్కోర్ చేయడం మాత్రమే కాక, ఐపీఎల్ కెరీర్‌లో ఇదే అతిపెద్ద ఇన్నింగ్స్ కూడా.
స్టాయినిస్ ఆడిన ఏడు ఇన్నింగ్స్‌లో ఐదింట్లో 21 లేదా అంతకంటే తక్కువనే పరుగులు చేశారు.
కానీ, ఎప్పుడైతే జట్టుకు తన అవసరం ఉందనిపిస్తుందో అప్పుడు స్టాయినిస్ తన బ్యాటింగ్‌తో చెలరేగిపోతారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 213 పరుగులను విజయవంతంగా చేధించేందుకు, స్టాయినిస్ 30 బంతుల్లో 65 పరుగులు చేశారు. అంటే నిన్న ఆడిన ఆటలో స్టాయినిస్ తన ఐపీఎల్ అత్యధిక ఇండివిడ్యువల్ స్కోర్‌ను కూడా అధిగమించారు.
19 ఏళ్లకే క్రికెట్‌లోకి అడుగు పెట్టిన స్టాయినిస్, ఆస్ట్రేలియా నేషనల్ టీమ్ తరఫున ఎన్నో మర్చిపోలేని ఇన్నింగ్స్‌ను ఆడారు.
నెంబర్ 7 బ్యాటర్‌గా పడిపోయినప్పటికీ, వన్డేలలో, టీ20లలో కంగారు జట్టులో శాశ్వత ఆటగానిగా స్టాయినిస్ స్థానం దక్కించుకున్నారు.
మిడిల్ ఆర్డర్‌లో వివిధ రకాల్లో బ్యాటింగ్ చేసిన అనుభవం స్టాయినిస్‌కి ఉంది.
24కి పైగా టీమ్‌లతో స్టాయినిస్ ఆడారు. 2021లో జరిగిన టీ20 వరల్డ్ టీమ్‌లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అత్యంత కీలక ఆటగాడిగా నిలిచారు.
అదే ఏడాది ఆస్ట్రేలియా జట్టు వరల్డ్ కప్‌ను సొంతం చేసుకుంది.

ఫొటో సోర్స్, Getty Images
లక్నో సూపర్ జెయింట్స్
ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే, స్టాయినిస్ ఆల్-రౌండర్‌గా ఆడటంతో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ను దక్కించుకున్నారు.
ఆయనతో పాటు, కైల్ మేయర్స్ కూడా అద్భుతమైన ఆటతో మంచి పేరును సంపాదించుకున్నారు.
ఈ వెస్టిండీస్ బ్యాట్స్‌మాన్ ప్రారంభంలోనే చెలరేగిపోయారు. 12 కంటే తక్కువకి అసలు రన్ రేటుని పడిపోనివ్వలేదు. మ్యాచ్ రెండో ఓవర్‌లో, మేయర్స్ 4 ఫోర్స్ కొట్టారు.
ఐదో ఓవర్‌లో సికందర్ రజా బౌలింగ్‌కి వచ్చినప్పుడు, ఆయన బౌలింగ్‌లో సిక్స్, ఫోర్, సిక్స్‌తో అదరగొట్టారు మేయర్స్.
పవర్ ప్లేలో ఇంకా ఒక్క బాల్ ఉందనగా 54 పరుగులు చేసి బయటికి వచ్చారు. అప్పటికి వారు స్కోర్ కార్డులో కేవలం 72 పరుగులే ఉన్నాయి.
అదే సమయంలో, స్టాయినిస్ పిచ్‌పై ఉన్నారు. ఆయుష్ బదోని, నికోలస్ పూరన్‌లు కూడా పంజాబ్ కింగ్స్ బౌలర్లకు అసలు ఊపిరి సలపనివ్వలేదు.

ఫొటో సోర్స్, Getty Images
పంజాబ్ కింగ్స్ చేసిన తప్పులు
ఈ మ్యాచ్‌లో తొలుత బౌల్ చేయాలని శిఖర్ ధావన్ తీసుకున్న నిర్ణయం తప్పుగా తేలింది. బౌలర్లు చాలా పరుగులను వేస్ట్ చేశారని ధావన్ అన్నారు.
శిఖర్ ధావన్ అదనపు ఫాస్ట్ బౌలర్‌కి ఆడే అవకాశం ఇచ్చారు. లక్నో సూపర్ జెయింట్స్ తన టీమ్‌లో అడిషినల్ స్పిన్నర్‌ను చేర్చుకుంది.
క్యాచ్ మిస్సింగ్‌తో మ్యాచ్ ప్రారంభమైంది. గుర్నూర్ బ్రార్ వేసిన బాల్‌కి కేఎల్ రాహుల్ క్యాచ్‌ను అథర్వ తైదే మిస్ చేశారు.
క్యాచ్‌ను అందుకున్న తర్వాత తన కాలిని బౌండరీకి తాకించడంతో లివింగ్‌స్టోన్‌తో పాటు మొత్తం టీమ్ నష్టపోవాల్సి వచ్చింది. ఈ క్యాచ్‌నే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా మార్కస్ స్టాయినిస్‌ని నిర్ణయించింది. ఆ సమయానికి స్టాయినిస్ 22 పరుగులకు 38 పరుగులు చేశారు. ఆ తర్వాత 18 బాల్స్‌లో మరో 34 పరుగులు చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
నిరాశపర్చిన పంజాబ్ బౌలర్లు
అర్ష్‌దీప్ సింగ్, కగిసో రబాడాలు తమ దేశ జట్లకు సూపర్ స్టార్లు. పంజాబ్ కింగ్స్ టీమ్ కోసం బౌలింగ్ చేసినప్పుడు, ఈ ఇద్దరు కూడా తమ ఫోర్ ఓవర్స్‌లో 50కి పైగా పరుగులకి అవకాశం ఇచ్చారు.
లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ త్వరగానే బయటికి వచ్చినప్పటికీ, కైల్ మేయర్స్ మాత్రం ఈ ఇద్దరి బౌలింగ్‌లో విరుచుకుపడ్డారు.
అంతేకాక సికందర్ రజా బౌలింగ్‌లో కూడా మేయర్స్ మెరిశారు. దీంతో మరోసారి బాల్ వేసే అవకాశాన్ని సికందర్ కోల్పోయారు.
శిఖర్ ధావన్ ఏడు బాల్స్ కోసం ప్రయత్నించారు.
పంజాబ్ టీమ్ బ్యాటింగ్ చేయడానికి వచ్చినప్పుడు, కేఎల్ రాహుల్ తన జట్టులోని 9 మంది బౌలర్లను వాడుకున్నారు.
కైల్ మేయర్స్ తన ఓవర్‌లో కేవలం నాలుగు పరుగులకే అవకాశం ఇచ్చారు.

ఫొటో సోర్స్, ANI
ఓడినా మనసులు గెలుచుకున్న పంజాబ్ కింగ్స్
ఈ మ్యాచ్‌లో పంజాబ్ ఓడినా కూడా కొన్ని మెచ్చుకోదగ్గ విషయాలున్నాయి.
టాస్ గెలుచుకున్న తర్వాత, పంజాబ్ కింగ్స్ టీమ్ ప్రతి దాంట్లో వెనుకబడింది. లక్నో సూపర్ జెయింట్స్ అనూహ్యమైన స్కోరును తన ముందు ఉంచింది.
ఈ భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్, 200 మార్క్‌ను అధిగమించే వరకు తీవ్రంగా ప్రయత్నించింది.
22 ఏళ్ల గుర్నూర్ బ్రార్ బౌలింగ్‌తో ప్రారంభమైన మ్యాచ్, తన తొలి ఓవర్‌లో కేవలం రెండు పరుగులకే అనుమతి ఇచ్చారు.
తన తొలి బాల్‌లో క్యాచ్ మిస్ కాకుండా ఉంటే, ఈ స్కోరు, ఫలితం మరోలా ఉండేదేమో.
మరోవైపు కెప్టెన్‌తో పాటు ఓపెనర్లు ఇద్దరూ కూడా పవర్ ప్లేలోనే పెవిలియన్‌కి వెళ్లడంతో, 23 ఏళ్ల ఎడమ చేతి ఆటగాడు అథర్వ పంజాబ్ టీమ్‌కి ప్రత్యేకంగా నిలిచారు.
అథర్వ్ ఈ మధ్యనే 23 ఏళ్ల వయసును పూర్తి చేసుకున్నారు. అత్యంత ఒత్తిడికర సమయంలో అథర్వ పిచ్‌పైకి వచ్చారు. ఆయన ఫీల్డ్‌లో ఉన్నంత సేపు పంజాబ్ కింగ్స్ ఆశలు పెరుగుతూనే ఉన్నాయి.
ఐపీఎల్‌లో ఇంత భారీ స్కోర్‌ను చేధించడం అంత తేలికైన విషయం కాదని ప్రతి ఒక్కరికీ తెలుసు.
వేగంగా పరుగులు చేస్తూ స్కోర్ కార్డును నింపేందుకు ప్రయత్నించిన అథర్వ్ తైదే, రవి బిష్ణోయ్ చేతిలో అవుట్ కావాల్సి వచ్చింది.
కేవలం 36 బాల్స్‌లో 66 పరుగులు చేశారు. ఈ మ్యాచ్‌లో అథర్వ్ ప్రతి ఒక్కరి మనసులను గెలుచుకుని, తనకు తదుపరి అవకాశాన్ని మరింత తేలిక పరుచుకున్నారు.
ఇవి కూడా చదవండి:
- ‘కొత్త లోకం ఎప్పుడు సృష్టిస్తావు, నీ దగ్గరకు ఎప్పుడు రమ్మంటావు?’’ – ఏమిటీ కల్ట్స్, ప్రజలు వీటిలో ఎందుకు చేరుతున్నారు?
- ట్రాన్స్‌జెండర్ జంట: బిడ్డకు జన్మనిచ్చిన కేరళ కపుల్
- నరేంద్ర మోదీ- సత్యపాల్ మలిక్: రిలయన్స్ కాంట్రాక్ట్‌ను ఈ మాజీ గవర్నర్ అప్పట్లో ఎందుకు రద్దు చేశారు?
- మూల కణాల మార్పిడి: క్యాన్సర్‌తోపాటు హెచ్ఐవీ నుంచి కోలుకున్న అమెరికన్ కథ
- 'చివరి లాటరీ టికెట్'తో రెండున్నర కోట్లు గెలుచుకున్న 89 ఏళ్ల రిక్షావాలా
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














