మధ్యధరా సముద్రం: ‘‘ చేపల కోసం వల వేస్తే మనుషుల శవాలు వస్తున్నాయి’’

చేపలు పడుతున్న మత్స్యకారుడు
ఫొటో క్యాప్షన్, చేపలు పడుతున్న మత్స్యకారుడు
    • రచయిత, మైక్ థామ్సన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఐరోపాకు మధ్యధరా సముద్రం మీదుగా వలసదారుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ ఆ సముద్రంలో మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది.

ఓవైపు వలసలను అరికట్టడానికి యూరోపియన్ యూనియన్ అధికారులు ప్రయత్నిస్తుండగా మరోవైపు పేదరికం, హింస నుంచి పారిపోతున్న వారి దుస్థితి ట్యునీషియా తీరంలో విషాదాన్ని మిగులుస్తోంది.

ఇలాంటి విషాదాలకు ప్రత్యక్ష సాక్షిగా నిలుస్తున్నారు మత్స్యకారుడు ఉస్సామా డబ్బేబీ.

ప్రతి రోజూ సాయంత్రం అయ్యేసరికి తాను విసిరిన విలలను లాగి చేపలను బోటులోకి ఎక్కిస్తుంటారు ఉస్సామా.

అయితే, ఇటీవల కాలంలో ఆయనకు తన వలలను లాగాలంటే భయమేస్తోంది. ఎందుకంటే ఆయన వలకు ప్రతీసారి చేపలు మాత్రమే చిక్కలేదు.

"చేపలకు బదులు వలకు ఒక్కోసారి మృతదేహాలు దొరుకుతాయి. మొట్టమొదట భయపడ్డాను. ఆ తర్వాత అలవాటు పడ్డాను. చేపను పడేసినట్లే నా వలలోంచి మృతదేహాన్ని బయటకు తీసేవాడిని" అని అన్నారు ఉస్సామా.

తన వలకు మూడు రోజుల వ్యవధిలో 15 మృతదేహాలు వచ్చినట్లు ఈ 30 ఏళ్ల జాలరి చెప్పారు. ఇవన్నీ వలసదారులవే.

"ఒకసారి శిశువు మృతదేహాన్ని కనిపించింది. ఆ శిశువు చేసిన పాపమేంటి ? నాకు ఏడుపొచ్చింది. సరే పెద్దవాళ్లంటే ఇప్పటి వరకు జీవితాన్నిచూశారు. కానీ, ఈ చిన్నారికి ఏమీ తెలియదు కదా" అని అన్నారు.

ఉస్సామా తన 10 సంవత్సరాల వయస్సు నుంచి ట్యునీషియా రెండో పెద్ద నగరం స్ఫాక్స్‌ సమీపంలోని చేపలు పడుతూ పెరిగారు.

తన చిన్నతనంలో కూడా అక్కడ అనేకమంది చేపలు పడుతుండే వారు. కానీ, వారిలో ఇప్పుడు చాలామంది తమ పడవలను స్మగ్లర్లకు భారీ మొత్తాలకు అమ్మేశారని చెప్పారు.

"చాలాసార్లు స్మగ్లర్లు నా పడవను కొనడానికి నేనే నమ్మలేనంత రేటు చెప్పారు. కానీ, కాదన్నాను. ఎందుకంటే వాళ్లు నా పడవను ఉపయోగించినప్పుడు, దానికేమైనా అయ్యి మునిగిపోతే ఆ పాపభారం నేను మోయలేను. " అని అన్నారు.

వలసలు

ఫొటో సోర్స్, PA Media

ఫొటో క్యాప్షన్, ఇటీవలి కాలంలో ట్యునీషియా నుంచి వలసలు పెరిగాయి.
విషాదాన్ని మిగుల్చుతున్న 'లిబియా మార్గం'

2011లో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి సంఘర్షణ, అస్థిరమైన వాతావరణం, ఆహార అభద్రత కారణంగా దక్షిణ సూడాన్ దెబ్బతింది.

వలసకు బయలురేడానికి సిద్ధంగా ఉన్న ఒక గ్రూప్ అక్కడికి కొద్దిదూరంలో ఉంది. ఓడరేవు నుంచి దూరంగా వెళుతున్నారు. వీరందరి లక్ష్యం బ్రిటన్ చేరుకోవడం.

పడవ రద్దీ, అధ్వాన్నమైన వాతావరణం కారణంగా వారు ఇటలీకి వెళ్లే ప్రయత్నాన్ని విరమించుకున్నారని ఆ బృందంలోని ఒక వ్యక్తి చెప్పారు.

"చాలామందిమి ఉన్నాం. పడవ చాలా చిన్నది. మేం ఇంకా ఎక్కడానికి వెళుతున్నాం. కానీ, బలంగా వీచిన గాలులకు ఒడ్డు నుంచి దూరంగా రావాల్సి వచ్చింది" అని ఆ వ్యక్తి అన్నారు.

ట్యునీషియా నేషనల్ గార్డ్ ప్రకారం ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో స్ఫాక్స్ సమీపంలోని పడవల్లో రద్దీ ఎక్కువగా ఉండటంతో దాదాపు 13,000 మంది వలసదారులు విధిలేక ఒడ్డుకు రావాల్సి వచ్చింది.

ఐక్యరాజ్యసమితి శరణార్థి ఏజెన్సీ ప్రకారం ఈ సంవత్సరం జనవరి, ఏప్రిల్ మధ్య దాదాపు 24,000 మంది ప్రజలు చిన్న పడవల్లో ట్యునీషియా తీరం నుంచి ఇటలీకి చేరుకున్నారు.

ఐరోపాకు చేరుకోవాలనుకునే వలసదారులకు దేశం ఇప్పుడు అతిపెద్ద 'వీడ్కోలు కేంద్రం'గా మారింది.

ఇంతకుముందు లిబియాలో ఇలాంటి పరిస్థితి ఉండేది. అయితే వలసదారులపై హింస, క్రిమినల్ ముఠాల అపహరణలు ఎక్కువ కావడంతో వారు యూరప్‌కు వెళ్లే క్రమంలో ముందు ట్యునీషియాకు వెళ్లడం మొదలు పెట్టారు.

లిబియా నుంచి బయలుదేరిన పడవ గ్రీక్ తీరంలో గతవారం ‘ప్రమాదానికి’ గురైంది. ఈ ఘటనలో కనీసం 78 మంది మరణించారని, మరో 500 మంది తప్పిపోయినట్లు అంచనా.

ప్రమాదాల తర్వాత ఒడ్డుకు చేరిన చెడిపోయిన పడవలు
ఫొటో క్యాప్షన్, ప్రమాదాల తర్వాత ఒడ్డుకు చేరిన చెడిపోయిన పడవలు

సమాధులు ఎదురుచూస్తున్నాయి..

వారి చాలా బోట్లు తుప్పు పట్టి, పాడైపోయి, నీళ్లలో సగం మునిగి కనిపిస్తాయి. లేదంటే స్ఫాక్స్ పోర్టులో కుప్పలుగా పడి ఉంటాయి.

ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన వలస మార్గమిది. ఆ విషయం నగరం శివార్లలోని స్మశాన వాటికను చూస్తే స్పష్టంగా కనిపిస్తుంది.

ఇలాగే మరో 'సముద్ర విపత్తు' సంభవిస్తే, ఖననాల కోసం స్మశానంలో తవ్విన గుంటలు వరసగా కనిపిస్తుంటాయి.

అయితే, అవి ఏ మాత్రం సరిపోవు. కేవలం వలసదారుల కోసం ఒక కొత్త స్మశానవాటికను ఇప్పుడు ప్లాన్ చేస్తున్నారు.

ఈ ఏడాది ప్రారంభంలో కేవలం రెండువారాల వ్యవధిలోనే సముద్రం నుంచి 200 మందికి పైగా వలసదారుల మృతదేహాలను వెలికితీశారు.

మధ్యధరా సముద్రం మీదుగా 2014 నుంచి ఐరోపాకు చేరుకోవడానికి ప్రయత్నించి 27,000 మందికి పైగా మరణించినట్లు తెలిసింది.

ఈ విషాద ఘటనలు నగరానికి తీవ్ర ఇబ్బందులను కలిగిస్తోంది.

మృతదేహాల సంఖ్య పెరుగుతుండటంతో ఆసుపత్రుల సామర్థ్యం సరిపోవడం లేదని రీజనల్ హెల్త్ అథారిటీ డైరెక్టర్ డాక్టర్ హాటెమ్ చెరిఫ్ అంటున్నారు.

"ఆసుపత్రి మార్చురీ సామర్థ్యం గరిష్టంగా 35 నుంచి 40 వరకు ఉంటుంది. అయితే మృతదేహాల ప్రవాహం పెరగడంతో పరిస్థితి దిగజారుతోంది. ఇక్కడ ఆసుపత్రి సామర్ధ్యానికి మంచి మృతదేహాలు వస్తున్నాయి" అని అన్నారు.

ఇటీవల 250 మృతదేహాలను మార్చురీకి తీసుకొచ్చారు.

చాలావరకు చల్లగా ఉన్న పక్కనే ఉన్న గదిలో ఉంచవలసి ఉంటుంది. దానిలో ఒకదానికి "విపత్తుల చాంబర " అని పేరు పెట్టారు.

అందరినీ వేర్వేరు సమాధులలో ఖననం చేస్తారని చెబుతున్నారు చెరిఫ్.

మరణించిన వారిలో చాలామంది గుర్తించలేదు, కాబట్టి డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తారు. ఆ ఫలితాలను భద్రపరచాల్సి ఉంటుంది.

బంధువులు వారి డీఎన్ఏలతో మృతదేహాల డీఎన్‌ఏలు పోల్చుకుని, వారిని ఇక్కడ ఖననం చేశారా లేదా అని తెలుసుకునేలా చేయడానికే ఈ ఏర్పాటు.

వలసలు

దేశ అధ్యక్షుడి ప్రసంగంతో రోడ్డున పడ్డ జీవితాలు

సెంట్రల్ ట్యూనిస్‌లోని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ కార్యాలయాల వెలుపల ట్యునీషియా నల్లజాతి మైనారిటీకి చెందిన వందలాదిమంది చిన్న గుడారాలలో ఉన్నారు.

స్ఫాక్స్‌ నుంచి అక్కడికి వాయువ్యంగా 3 గంటల ప్రయాణం.

ఫిబ్రవరిలో ఆ దేశ అధ్యక్షుడు కైస్ సైద్ చేసిన జాత్యహంకార ప్రసంగం తర్వాత చాలామంది నల్లజాతి మైనారిటీలను ఇళ్ల నుంచి బయటికి వెళ్లగొట్టారు. ఉద్యోగాల నుంచి తొలగించారు.

జనాభాను మార్చే నేరపూరిత ప్రణాళికలో భాగంగా దేశంలోకి అక్రమ వలసదారుల గుంపులు ప్రవేశిస్తున్నాయని ఆయన ఆరోపించారు.

ఈ వ్యాఖ్యలు ఆ దేశం ఆర్థిక సంక్షోభానికి వారిని బలిపశువులను చేసే ప్రయత్నంగా పలువురు భావించారు. ఇది ట్యునీషియన్లను వలసదారులుగా మార్చడానికి దారితీసింది.

2002లో ముగిసిన క్రూరమైన అంతర్యుద్ధం నుంచి తేరుకుంటున్న సియెర్రా లియోన్‌కు చెందిన ఒక యువకుడు తన చేతిపై కత్తిపోటును చూపాడు.

అధ్యక్షుడి ప్రసంగం తర్వాత కత్తి పట్టుకున్న స్థానిక యువకులు ఇక్కడ చాలామందిపై దాడి చేశారని అతను చెప్పాడు.

"కొందరు అరబ్ కుర్రాళ్లు మాపై దాడి చేయడానికి ఇక్కడకు వచ్చారు. మేం ఇక్కడే ఉంటే మమ్మల్ని సురక్షితంగా చూసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. మేం ఈ ప్రాంతం నుంచి బయటికి వెళితే సురక్షితంగా ఉండకపోవచ్చు" అని అన్నారు.

ఈ ఏడాది ఇప్పటివరకు 47,000 మంది కంటే ఎక్కువ వలసదారులు ఇటలీకి వచ్చారు. గతేడాది కంటే ఇది మూడు రెట్లు పెరిగింది. దీంతో ఏదో ఒకటి చేయాలనే డిమాండ్ పెరిగింది.

ఈ నెల ప్రారంభంలో యూరోపియన్ కమిషన్ చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఇక్కడి పర్యటన సందర్భంగా దాదాపు రూ. 82 వేల కోట్ల ఆర్థిక సహాయ ప్యాకేజీని వాగ్దానం చేసింది.

వీడియో క్యాప్షన్, గ్రీస్ తీరంలో శరణార్థులతో వెళ్తున్న పడవ మునక

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)