కోరమండల్ ఎక్స్‌ప్రెస్: ఒడిశా రైలు ప్రమాదంలో 288 మందికి పైగా మృతి- ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్తున్నారంటే

కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం

ఫొటో సోర్స్, ANI

    • రచయిత, జరోస్లావ్ లుకివ్, జార్జ్ రైట్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

ఒడిశాలోని బాలాసోర్‌ స్టేషన్ సమీపంలో జరిగిన రైల్వే ప్రమాదంలో 261కి పైగా మృతి చెందారు.

900 మందికి గాయాలయ్యాయని ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ జెనా తెలిపారు.

ప్రమాద స్థలానికి 200కి పైగా అంబులెన్స్‌లను పంపినట్లు చెప్పారు.

భారత్‌లో ఈ శతాబ్దంలో జరిగిన అత్యంత ఘోర రైల్వే ప్రమాదాలలో ఇదొకటి.

ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

రైలు ప్రమాదం
పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

కోరమండల్ ఎక్స్‌ప్రెస్, హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌, మరో గూడ్స్ రైలుకి ఈ ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదంలో గాయపడిన వారికి చికిత్స అందించేందుకు అదనంగా 100 మందికి పైగా డాక్టర్లను అక్కడికి తరలించారు.

ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

‘‘రైల్వే ప్రమాదం జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో గాయపడిన, ప్రభావితమైన వారికి అవసరమైన సహాయమంతా అందిస్తాం’’ అని మోదీ ట్వీట్ చేశారు.

రైలు ప్రమాదం
పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

‘‘ప్రమాదం జరిగినప్పుడు నాపై 10 నుంచి 15 మంది పడిపోయారు. ఒక్కసారిగా పరిస్థితి అంతా అల్లకల్లోలంగా మారిపోయింది. ’’ అని ఈ ప్రమాదం నుంచి బయటపడిన ఒక వ్యక్తి చెప్పారు.

‘‘నా చేతికి గాయమైంది. అలాగే, నా మెడ వెనుకవైపు దెబ్బతింది. నేను ట్రైన్ నుంచి బయటికి వచ్చినప్పుడు, కొందరు చేతులు కోల్పోవడం, కొందరికి కాళ్లు పోవడం చూశాను. కొందరికి ముఖం ఛిద్రమైంది’’అని ఈ ప్రమాదం నుంచి బయట పడిన ఒక వ్యక్తి ఏఎన్ఐ న్యూస్ ఏజెన్సీకి చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 3

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 4

శుక్రవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశిస్తున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.

‘‘ఈ ప్రమాదం దురదృష్టకరం. ప్రమాదం జరిగినట్లు తెలిసిన వెంటనే సహాయ చర్యలు ప్రారంభించాం’’ అని మంత్రి అశ్విని వైష్ణవ్ ఏఎన్ఐకి తెలిపారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 5
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 5

ఈ ప్రమాదంలో గాయపడిన కొందరికి బాలాసోర్‌లోని ఫకీర్ మోహన్ మెడికల్ కాలేజీలో, కొందరిని కటక్‌లోని ఎస్‌సీబీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఒడిశా ప్రభుత్వం ఇవాల్టి అన్ని రాష్ట్ర ప్రభుత్వ వేడుకలను రద్దు చేసినట్లు ప్రకటించింది.

ఒడిశాలో ఈ ఘోర రైల్వే ప్రమాదం జరిగిన నేపథ్యంలో గోవా-ముంబై వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కొంకణ్ రైల్వే అధికారులు తెలిపారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 6
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 6

1981లో 800 మంది చనిపోయారు

ప్రపంచంలో అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్ కలిగి ఉన్న దేశాలలో భారత్ ఒకటి.

మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వాలు లక్షల కొద్ది డాలర్లను పెట్టుబడిగా పెట్టినప్పటికీ, ప్రమాదాలను మాత్రం ఆపలేకపోతున్నాయని బీబీసీ సౌత్ ఏసియా రీజనల్ ఎడిటర్ అన్బరసన్ ఎతిరాజన్ చెప్పారు.

భారత్‌లో అత్యంత ఘోర రైల్వే ప్రమాదం 1981లో జరిగింది. బిహార్ రాష్ట్రంలో సైక్లోన్‌ తీవ్రత అధికంగా ఉన్నప్పుడు, ప్రయాణికులతో రద్దీగా వెళ్తున్న ఒక ప్యాసెంజర్ ట్రైన్ పట్టాలు తప్పి, నదిలోకి పడిపోయింది. ఈ సమయంలో సుమారు 800 మంది మరణించారు.

వీడియో క్యాప్షన్, తీగలు తెంపినట్లుగా రైళ్లు నుజ్జునుజ్జయ్యాయి, అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే...

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)