పోలీసుల తనిఖీలలో ఫ్రిజ్‌లలో దొరికిన బీఫ్.. మరుసటి రోజు 11 ఇళ్లు కూల్చేసిన అధికారులు

వీడియో క్యాప్షన్, పోలీసులు తనిఖీలు చేసిన మరుసటి రోజే 11 ఇళ్లు బుల్డోజర్లతో కూల్చేశారు ఎందుకు?

మధ్యప్రదేశ్‌లోని భైంస్వాహీలోని ఆ చిన్న కాలనీలో 30 ఇళ్లుంటాయి.

అందులో 11 ఇళ్లను అధికారులు బుల్డోజర్లతో కూల్చేశారు.

అలా కూల్చేయడానికి ముందు రోజు అక్కడ పోలీసులు తనిఖీలు చేశారు.

‘మేం చాలా ఇళ్లలో చాలా చోట్ల తనిఖీలు చేశాం. లోపల ఫ్రిజ్‌లలో గోమాంసం గుర్తించాం. ఆవులను చంపడానికి ఉపయోగించే కత్తులు లాంటివి ఉన్నాయి, వెనక గదుల్లో ఆవులను కట్టేసి ఉన్నాయి. మేం ఎఫ్ఐఆర్ నమోదు చేసిన 11 ఇళ్లలో వెనుక దాదాపు 150 ఆవులు కట్టేసి ఉన్నాయి. వాటికి తోడు మాకు ఆవుల ఎముకల గుట్టలు, ఆవుల చర్మాలు కూడా దొరికాయి. ఆవు కొవ్వు నింపిన చాలా డబ్బాలు కూడా మేం స్వాధీనం చేసుకున్నాం’ అని మండ్లా ఎస్పీ రజత్ సిన్హా చెప్పారు.

జూన్ 15న పోలీసులు తనిఖీలు చేపట్టగా తర్వాత రోజే ఈ కాలనీలోని 11 ఇళ్లను బుల్డోజర్‌లతో కూల్చేశారు. అయితే కూల్చివేతల గురించి తమకు ముందస్తు సమాచారం ఏదీ ఇవ్వలేదని స్థానికులు చెబుతున్నారు.

ఈ ప్రాంతంలో ఆవుల అక్రమ రవాణా, గోమాంస విక్రయం వ్యాపారం ఎన్నో దశాబ్దాలుగా జరుగుతోందని స్థానిక అధికారులు చెబుతున్నారు. భైంస్‌వాహీలో కొన్నేళ్ల క్రితం ఒక పోలీస్‌ను హత్య కూడా చేశారు. అది కూడా గోవుల స్మగ్లర్ల పనేనని పోలీసులు ఆరోపిస్తున్నారు.

కూల్చేసిన ఇల్లు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)